June 2019
మన ప్రసాదాలు-“దత్త ప్రసాదం”
జై గురు దత్త దత్తాత్రేయ స్వామి వారి రుపం పరబ్రహ్మ స్వరూపం.ఆయన వద్ద సేవ చేసే శునకాలే చతుర్వేదాలుగా,గోమాత పవిత్రతను,మెడలో ధరించే రుద్రాక్షలు శాంతికి,త్రిశూలానికి రౌద్రం సంకేతాలు. గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం 16సార్లు పఠనం ఎంతో మంచిది.దత్తాత్రేయ స్మరణం పరమ పవిత్రం.భక్తుల మనసులో భావాన్ని,కోరికని ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా తీరుస్తానని అభయం ఇచ్చే దేవుడు.నిర్మలమైన ప్రేమతో అందరి కోరికలను మనస్పర్తిగా మన్నిస్తాడు. ఇష్టమైన రంగు:తెలుపు, కాషాయం ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన […]
అది మరీ నష్టం
కాస్త వినికిడి తగ్గితే హియరింగ్ ఎయిడ్ వాడటం చాలా అవసరం అంటున్నాయి అద్యాయనాలు. వినికిది లోపంతో జ్ఞాపకశక్తి,ఎటన్షన్ వంటివి తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళు మాట్లడే విషయాలు అర్ధం చేసుకోనేందుకు వినికిడి శక్తి లోపిస్తే ఎక్కువగా మెదడు పై భారం వేస్తారు.దీని వల్ల జ్ఞాపక శక్తికి సంభందించిన సామార్ధ్యాలు తగ్గిపోతాయని విస్తృత అద్యాయనాల్లో వెల్లడైంది. అదే హియరింగ్ ఎయిడ్ వాడితే ఎదుటి వాళ్లతో ఇరుగు పొరుగు వాళ్లతో కాంటాక్ట్ లో ఉండటం వల్ల మానవ సంబంధాలు క్షీణించవు మెదడు ఎప్పటిలాగే అలసిపోకుండా […]
ఈ వివాదాలు మాకు అలవాటే
ఏ రకంగా చూసిన నేను నుస్రత్ ఖాన్ ధరించిన దుస్తులు అమర్యదగా లేవు.మగవాళ్ళు టీషర్టులు ధరించి పార్లమెంట్ కు వస్తే లేని అభ్యంతరం మా విషయంలో పార్లమెంట్ మర్యాద మంటగలిపామని ఎందుకు దూషించారు. సహజంగా ఉన్నం మేము అన్నది మిమి చక్రవర్తి. ఈ వివదాలు నాకు లెక్కలేదు. నా నియోజక వర్గ ప్రజల జీవితాల్లో మార్సు తీసుకురావటం బాధ్యతగా నేను పని చేస్తాను అన్నది సుస్రిత్ జహాన్.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీ మణులు […]
జీవితాన్ని గెలిచింది
నా జీవితం కల్లోల సమయంలో నేనో నిర్ణయం తీసుకొన్నాను ఎంతో అనారోగ్యంతో స్టెరాయిడ్స్ తప్పని సరిగా తీసుకోవలసిన సమయంలో దానికి ఎదురు నిలిచి యోగా,జిమ్నాస్టిక్ ను మొదలు పెట్టాను. నన్ను కుంగ దీసిన నా ఆ నారోగ్యం నా దేహాలంలో అడ్రినల్ గ్రంథి కార్టిసోల్ ను ఉత్పత్తి చేయకపోవటం, మనిషి ఆరోగ్యానికి కీలకమైన ఈ కార్గిసోల్ హార్మోన్ ఉత్పాత్తి లేకపోవటంతో డాక్టర్స్ స్టెరాయిడ్స్ తప్పవన్నారు. కానీ యోగా నాకు పూర్తి ఆరోగ్యం ఇచ్చింది అంటటోంది విశ్వసుందరి సుస్మితా […]
కెఫిన్ ప్రభావం
కప్పు కాఫీతో మంచి మూడ్ వచ్చే మాట వాస్తవం.ఉదయం నిద్ర లేవగానే శరీరంలో చురుకు దనం కాస్త తక్కువగా ఉంటుంది. మెడదులో సంకేతాలను రవాణా చేసే జీవ రసాయనం ఎడినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తుంది. అప్పుడు ఓ కప్పు కాఫీలోని కెఫిన్ ప్రభావంతో ఆమత్తు వదులుతోంది. అలాగే ఈ కెఫిన్ ఎడ్రినల్ గ్రంథి పైన ప్రభావం చూపించి ఎడ్రినల్ ఉత్పత్తిని పెంచుతోంది. ఫలితంగా కళ్ళు తేటగా అయి దృష్టిలో స్పష్టత వస్తుంది. కాఫీ తాగిన పదిహేను నిమిషాల్లో […]
రాత్రి వేళల్లో వద్దు
ఏ సీజన్ లో అయినా అత్యంత చౌకగా,అందరికి అందుబాటులో ఉంటుంది అరటి పండు ,రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయటంలో అరటిపండు కీలకం. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం ,సహాజ యాంటాసిడ్ గా పని చేసేగుణం కలిగింది. దీన్ని మధ్యాహ్నా సమయంలో తింటే మంచిది. ఉదయం ఖాళీ కడుపులో తినకూడదు . రాత్రి వేళ తింటే ఊపిరి తిత్తుల్లో మ్యాకస్ ఏర్పడి జలుబు చేసే అవకాశం చాలా ఎక్కువ..
లేబుల్ చూస్తే చాలు
చాలా వస్తువులు వాడే ముందర అది ఆరోగ్యకరమా లేదా, నిలవ ఉన్నదా? తాజాదా అని చూసుకోవటం చాలా అవసరం .మనం కొనే ప్యాకేజ్ ఫుడ్ పాకెట్స్ పై విధిగా లేబుల్ ఉంటుంది. అది తయారు సయమం ఎక్స్పైరీ డేట్ అందులో వాడిన వస్తువులు తయారీ విధానం దాన్ని వాడుకోనే విధానం కూడా స్పష్టంగా ఉంటుంది. షుగర్ సోడియం ఫ్యాట్ పూర్తిస్థాయి ఎనర్జీ వంటిది ఏ మోతాదులో ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.ప్యాక్ పైన లేబుల్ ను బట్టి […]
కలిపితే ప్రయోజనం
రెండు కానీ అంతకంటే ఎక్కువ జత కుదిరే పదార్థాలు కలిపి తినటం వల్ల విరిగా తినటం కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందంటారు న్యూట్రిషనిస్టులు.ఉదాహారణకు క్యారెట్ బీట్ రూట్ కొబ్బరి నూనె కలిపి తీసుకొంటే చర్మం కాంతి వంతం అవుతుందంటారు బి,సి,కె వంటి విటమిన్లు , ఐరన్ కాఫర్ మెగ్నిషియం వంటి ఖనిజాలు, పీచు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎక్స ట్రావర్జిన్ కొబ్బరి నూనెలో లారిక్ ,కాప్రిలిన్ కాప్రిడ్ యాసిడ్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి తీసుకొవటంలో […]
జానపద గేయాలు- దిట్టి
– డి.సుజాతా దేవి గాలి దిట్టే కొట్టెనో ఊరి కళ్ళెర్రబడెనో వాలిపోతా వుంది సోలిపోతా ఉంది వొడిలినా పువ్వల్లె వొరిగిపడి వున్నాది!! కలలోకి రమ్మనీ కవ్వించి పోయేది మెలుకు వొచ్చింది నువ్వెవ్వరని అడిగేది!! ఎగిరివచ్చేది నా ఎదట నిలిసేది మాట సెప్పేతలికి మాయమై పోయేది!! మల్లెపూవులు సూసి మొకము సిట్లిత్తాది మామిడాకులు దూసి మనసుగా తింటాది!! మట్టి పై మనసేటో మాటాడ యిసుగేటొ పొద్దుమొక మెరగక పద్దాక నిదరేటో!!
మన ప్రసాదాలు -“రంజాన్ రంగుల సోయగం”
సలాం- వాలే కుం-సలాం భాయ్ ఔర్ బెహనో మరి రంజాన్ ముబారక్ చెప్పేసుకుని వంట షురూ…. ముస్లిం సోదరీ-సోదరులు పెద్ద ఎత్తున జరుపుకునే ఈద్.అందరు కలిసి- మెలిసి విందు-వినోదాల లో ఉత్సాహంగా పంచుకునే రంజాన్ పండుగ. పేద- గొప్ప అని భావించి మనమంతా ఒక్కటే అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు. 40 రోజులు ఎంతో నిష్ఠ గా ఉపవాసం ఉండి,క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ,ఎవరిని దూషించటం,దుర్భాషలాడటం లేకుండా సంతోషం గా గడుపుతూ ఇష్టమైన వంటకాలు అందరూ […]
జుట్టు పెరుగుతుంది?
శిరోజాల సంరక్షణకు కొన్ని రకాల గాఢ తైలాలు తొడ్పడతాయని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. జోజోబా లావెండర్ థైమ్ వంటి నూనెల వల్ల జట్టు వేగంగా పెరుగుతోందట. పెప్పర్ మెంట్ నూనె వల్ల మరీ వేగంగా జుట్టు పెరుగుతోంది అంటున్నారు .ఇందులోని మెంథాల్ కారణంగా చర్మం లోపల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగై శిరోజాలు వేగంగా పెరుగుతాయి. చమేలా రోజ్ మేరీ, సెజ్ వంటి ఔషధ నూనెల్లో కాస్త కొబ్బరి నూనె కలిపి వాడి చూడండి. […]
ఇక వాడకండి
తెల్లవారి లేచిన దగ్గర నుంచి పాల పాకెట్ లతో మొదలుపెట్టి రాత్రి పడుకొనేవరకు మనం వాడే వస్తువులన్ని ప్లాస్టిక్ వే. కొన్ని రకాల ప్లాస్టిక్ పాకెట్లలో మైక్రోవేన్ లో వాడేందుకు సురక్షితం అని రాసి ఉంటుంది ,కానీ వాటిని వేడిచేస్తే ప్లాస్టిక్ నుంచి రసాయనాలు విడుదలై ఆహరంలో కలుస్తాయి. సాధ్యమైనంత వరకు వీటి వాడకం మానేయాలి.కూరగాయలు ఆహరపదార్ధాలు తీసుకెళ్ళేందుకు గుడ్డతో లేదా జనపనారతో కుట్టిన సంచీలు వాడుకోవాలి. సింథటింక్ ఫైబర్ తో తయారు చేసిన తివాచీలు సోఫా […]
నిద్ర పొండి చాలు
షార్ట్ మెమొరీ లాస్ ..ప్రతిచొట వినబడుతోంది. మరచి పోతున్నాను, గుర్తుండటం లేదు అంటుంటారు.ఈ షార్ట్ మెమొరీ లాస్ కాస్త కొంత కాలానికి లాంగ్ టర్మ్ మెమొరీలాస్ అయిపోకుండా సుఖంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపొమ్మంటున్నారు డాక్టర్లు. మంచి నిద్రకు జ్ఞాపక శక్తికి సంబంధం ఉంది. మంచి నిద్ర దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి సామార్ధ్యాన్ని పెంపొందిస్తుందని బెల్జియంలోని లీగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన హిప్పో కాంపస్ ఏరియా శక్తి మంతంగా పని చేయటానికి […]
అత్యంత ప్రాచీనం
ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీనమైన అపురూపమైన ప్రింటెడ్ పుస్తకం డైమాండ్ సూత్ర. బుద్దుని బోధనలు ఉంటాయి ఈ పుస్తకంలో పసుపు రంగు డై వేసిన పేపర్ పైన చక్కని బ్లాక్ తో దాన్నీ ముద్రించారు. సంస్కృతంలో రాయబడిన ఈ పుస్తకం 401 AD లో చైనా భాషలోకి అనువాదం అయింది. మార్క్ ఆరిల్ స్టీన్ అనే ఆర్కియాలజిస్ట్ చైనాలోని డాన్ హువాంగ్ దగ్గరలోని థౌజండ్ బుద్దాస్ గుహాల్లో ఈ ప్రింటెడ్ ప్రతిని సంపాదించి లండన్ కు చేర్చారు.
అలానే పడుకోండి
గర్భిణిలు వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డకు రక్త సరఫరా తగ్గుతోందని పరిశోధకులు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడో తాజా అధ్యయనం అలా వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డ చనిపోయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది. గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లికిలా పడుకొనే వారికి మృత శిశువు జననం ముప్పు 2.1 రేట్లు ఎక్కువగా ఉందంటున్నారు . మృత శిశువు జననానికి ఇతరత్రా కోణాలు ఉన్న దీన్ని పరిగణలోకి తీసుకొమంటున్నారు పరిశోధకులు.
సూపర్ మామ్
పర్ ఫెక్ట్ ఆకృతితో మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది కాజోల్. తిరిగి పూర్వపు ఆకృతి సంతరించుకోవటం నెమ్మదిగా సాగిన కచ్చితంగా వస్తుంది అంటు కొత్త అమ్మలకు పెదవులతో చెప్పని సందేశం ఇస్తోంది కాజోల్. యుగ్,నైసా ఇద్దరు సంతానం రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు బరువుగా అయిపోతుంది కాజోల్. నెమ్మదిగా ఆరోగ్యంగా తన పాత రూపం పొందింది. వర్కవుట్స్ చాలా ఎంజాయ్ చేస్తానంటోంది ఆహారం,అలవాట్ల విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటానంటోంది కాజోల్. అమ్మ కాబోయే ఎందరో యువతులకు ఆదర్శంగా ,తల్లి […]
ఇవి కొత్త ఫ్యాషన్లు
ఫ్లోరల్ ధోతి టాప్ కాలేజీ అమ్మాయిలకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ప్రెషర్స్ పార్టీ దగ్గర నుంచి కాలేజీలో జరిగే ప్రతి వేడుకలకు ఈ డ్రెస్ బావుంటుంది. జార్టెట్ ,సిఫాన్,సిల్క్ వంటి వస్త్రశ్రేణి ఈ డ్రెస్ లకు సరిగ్గా సరిపోతుంది. ఈ దుస్తులపైకి చక్కని స్టడ్స్ ,బన్ని హాంగింగ్స్ బాగా నప్సుతాయి. అలాగే పలాజోలు, స్కర్ట్స్ లు కూడా కాలేజీ అమ్మాయిలకు స్టైలిష్ లుక్ తెచ్చి పెడతాయి. ఇక మిక్స్ అండ్ మ్యాచ్ అయితే […]
మగపిల్లలకే ఇబ్బంది
అమ్మాయిల కంటే అబ్బాయిల్లో వాయు కాలుష్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు.గర్భంలో ఉన్న పిల్లలు,బాల్యదశ దాటిన పిల్లలు, ఏడేళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు,వారి అధ్యయనంలో కాలుషిత గాలిని పీల్చిన మగ పిల్లల్లో జ్ఞాపక శక్తి ఆలోచన నైపుణ్యాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అమ్మాయిల్లో ఈ సమస్య తక్కువగా కనిపించింది. హార్మోన్ తేడా వల్ల వారిలో ఈ సమస్య ఉత్పన్నం కాలేదని పరిశోధకులు చెపుతున్నారు. వాతావరణంలో ఎక్కువ వాయుకాలుష్యం తీసుకువచ్చే జబ్బుల […]
జానపద గేయాలు- ఆసికాలు
– డి.సుజాతా దేవి మల్లితో నీ ఆసికాలు వల్ల కాదురా సెల్లని మాటాడితేనే నొల్లకోనురా మావ నల్ల కోనురా!! సందమామ మొకమంటె సందమా అందమా నల్ల మచ్చలా మొకమా మల్లికి సాటి మావ మల్లికి పోటి !! సుక్కలు నా కళ్ళంటె సక్కదన మదేటి తిక్కలోడ పగటేళ సుక్కల మెరుపేడర !! సిలక పలుకులంటే గొప్ప కులుకా సంబడమా పలుకు నేర్సెనే గాని పాటలొచ్చునా సిలకకు పాట లొచ్చునా !!
మన ప్రసాదాలు- “దుర్గాదేవి ప్రసాదం”
మంగళవారం హనుమంతుడు తో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చు.సకల సౌభాగ్యాలకు మూలం దుర్గా దేవి అనుగ్రహం కలగడం.మంగళవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా కాళ్ళకి పసుపు రాసుకుని,జుట్టు ముడిచి,పూజించాలి.దుర్గ దేవి ని శ్రద్ధగా,నిష్ఠగా,నిశ్చలమైనమనసుతో ఆరాధించాలి.ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.ఇంటికి వచ్చిన వారికి పసుపు-కుంకుమ,రవిక,పూలు,పండ్లు,ఎరుపు/ ఆకు పచ్చ గాజులు,ఆకు- వక్క ఇచ్చి నమస్కరించిన అమ్మవారి కటాక్షం తథ్యం!! ఇష్టమైన రంగు:ఎరుపు ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంతో […]
