May 2019
ఒక రాజకుమారి
కాన్సెప్ట్ తో ఫోటోలు తీస్తాడు ఇంగ్లండ్ ఫోటో గ్రాఫర్ ఆడామ్ బర్ట్. ఈ ఫోటోలో బ్యూటీ అండ్ బీస్ట్ నవల్లో డిస్ని రాజకుమార్తె బెల్. బీస్టీ నుంచి తన తండ్రిని విడిపించటానికి వస్తుంది. అతను చెడ్డవాడు కాదని తెలుసుకొంటుంది. అతన్ని ప్రేమిస్తుంది. అతనో రాజకుమారుడని శాప వశాత్తు కృర మృగంగా మారాడని తెలుసుకొంటుంది. ఆ నవల్లో పాత్రని ఆడమ్ బర్ట్ ఇలా ఫోటో తీశాడు.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? నా యిచ్చయే గాక నా కేటి వెరపు ? ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రసిద్ద కవిత. ఆకులో ఆకునై,పూవులో పూవునై అంటూ కవిత్వంలో పరవశించిన కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వాన్ని ప్రచారం చేశారు . భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సినిమాలకు ప్రణయ విరహగీతాలను రాశారు. మల్లీశ్వరి పాటలు ఇప్పటికీ సంగీతసాహిత్యాలను ఇష్టపడే వారినోట వినబడుతూనే ఉంటాయి. ఆయన రాసిన కృష్ణపక్షము నుంచి… ‘కాలవిహంగమ పక్షముల […]
ఇవి మూడేళ్ళు వాడచ్చు
బెంగళూరుకు చెందిన అనురాధా రావ్ భారత్ లో తొలి పర్యావరణ మిత్ర డైపర్ బ్రాండ్ ‘బంపడం’ ప్రారంభించారు. ఒక్కసారి కొంటే వీటిని మూడేళ్ళ పాటు వాడుకోవచ్చు. ఉతుక్కుని మళ్ళీ వాడకానికి పనికోచ్చేలా వస్త్రంతో తయారు చేసిన వాటర్ ఫ్రూఫ్ డైపర్లు పిల్లలకి ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. పర్యావరణానికి హాని చేయని ఇలాంటి వస్తువులను ప్రోత్సహించటం ఎంతైనా అవసరం.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ
రాగి జావా ఆరోగ్యం
చిరు ధాన్యాల్లో రాగులను పోషక ధాన్యాలు అంటారు. కాల్షియం ,ఐరన్ ఇతర ఖనిజాలు విటమిన్ బి1,బి2 మొదలైనవి ఉంటాయి కనుక బలవర్ధకం. ప్రోటీన్లు ,ఎమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వేసవి ఎండతాపాన్ని తట్టుకోనేందుకు రాగి జావా అంబలి తాగుతారు. ఫైబర్ చాలా ఎక్కువ.రాగులు ఏ రూపంలో తీసుకొన్న ఆరోగ్యమే. రాగి జావా చేయటం చాలా ఈజీ కూడా.70 గ్రాముల రాగి పిండిని తీసుకొని ముందుగా గిన్నెలో నీళ్ళు వేడిచేసుకొని మరిగే నీళ్ళతో కలుపుతూ ఉండలుకట్టకుండా పోసి ,ఐదారు […]
వేస్ట్ చేశారా?
గ్రీన్ టీ గురించి అందరికీ తెలుసు. కానీ గ్రీన్ కాఫీ ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అసలీ గ్రీన్ కాఫీ ఏమిటీ? ఎలా చేస్తారు అంటే రోస్ట్ చేయని కాఫీ గింజలని నానబెట్టి వాటి నుంచి ఈ కాఫీ తయారు చేస్తారు. దీనిలో ఉండే క్లోర్ జెనిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్ ని బాగా కరిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే ఇన్సులిన్ ఉత్సత్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని అదుపు చేస్తుంది.బరువు పెరుగుతారనే అనుమానం అక్కర్లేదు. ఈ గ్రీన్ కాఫీలోని లక్షణాలతో […]
కాలుష్య నివారిణి విటమిన్ బి
వాయు కాలుష్యం శరీరంలోని ఎన్నో అవయవాలపైన ప్రభావం చూపెడుతోంది అంటారు అధ్యయనకారులు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్న ప్రయోజనం శూన్యం అయితే విటమిన్ బి తో ఈ కాలుష్య ప్రభావం నుంచి తప్పిచుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు. కొన్ని వందల మందితో జరిపిన ఈ పరిశోధనలో బి2 తీసుకొన్న వారిలో వాయు కాలుష్య ప్రభావం ఏమీ కనిపించ లేదు.ఇది మొదటి సారిగా రుజువైంది.ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
ఈ జ్ఞాన దేవత రవి వర్మ సృష్టి
1896లో ప్రముఖ చిత్రకారుడు రవి వర్మ గీసిన ఈ వీణాపాణి సరస్వతి చిత్రం. గుజరాత్ మ్యూజియంలో ఉంది. ఈ జ్ఞాన దేవత సరస్వతి నది ఒడ్డున కూర్చోని వీణా వాయిస్తోంది. ఈ వీణా సంగీత సాహిత్యాలకు ప్రతీక.చేతిలో ఉన్నా రుద్రాక్షమాల శంఖం భక్తికి,ముక్తికి చిహ్నాలు. నెమలి సత్యాన్ని చూసిస్తుంది. పట్టు పీతాంబరాలు చూపులో దివ్యత్వం . ఈ గొప్ప చిత్రం ఎందరో పూజా మందిరాల్లో పూజలందుకోంది. దేవతామూర్తులను చిత్రంచటం రవి వర్మకే చెల్లింది.
లైట్ మేకప్ ప్రధానం
వేసవికి సింపుల్ మేకప్ వేసుకోండి అంటారు ఎక్స్ పర్ట్స్. ఫౌండేషన్ ,సింపుల్ లేయర్లు అప్లైయ్ చేసుకోవాలి. సరైన షేడ్ ఫౌండేషన్ ఎంచుకొని కరెక్ట్ గా అప్లైయ్ చేస్తే ఎక్కువ మేకప్ అవసరం ఉండదు. కాంప్లెక్షన్ సమంగా ఉండేందుకు లేదా మచ్చల్ని కవర్ చేసేందుకు కొద్ది పాటి ఫౌండేషన్ చాలు. చర్మం ఆయిలీగా ఉంటే లిక్విడ్ ఫౌండేషన్ సూటవుతుంది. పొడిగా సాధరణ చర్మం గలవారు క్రీమీ షౌండేషన్ ఉపయోగించాలి. ఫౌండేషన్ లోని ఆయిల్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
వంద మొహాల్లో ఒకే భావం
ఇటలీకి చెందిన అలేస్సియో అల్బి అనే ఫోటో గ్రాఫర్ సృజన ఇది. డిజిటల్ ఫోటో గ్రఫీని తీసిపాడేసేలాగా ఉండవు ఈ ఫోటోలు ఎంతో ఓపిక సృజన అవసరం . ఇతని ఫోటోలు యూరోపియన్ మేగజైన్ కవర్ పేజీలుగా కనిపిస్తాయి. ఫ్యాషన్ ఫోటో గ్రఫీలో నిష్ణాతుడు.అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఇతనికి పోటీనే లేదు.
గట్టిగా వార్నింగ్ ఇస్తా
తనను విమర్శిస్తే అస్సలు ఊరుకోను అంటోంది కంగనా రనౌత్. ఈ విషయం గురించి చెబుతూ సద్వివిమర్శలు ఎవరైనా స్వీకరిస్తారు,అంగీకరిస్తారు. కానీ అర్ధం పర్ధం లేని మాటలను ఎందుకు ఓర్చుకొంటారు. అసలు అలాంటి విమర్శలకు నాకు వెంటనే కోపం వస్తుంది. పని కట్టుకొని అవాకులు చెవాకులు పేలే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నోరు మూయించాలి కదా నేనదే చేస్తాను అలా అంటే నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు మరి అంటోంది కంగనా రనౌత్.
పోల్చుకొంటేనే సమస్య
సాధ్యమైనంత వరకు సాటి ఉద్యోగులు లేదా పరిచయంతో ఉండే ఇరుగు పొరుగులతోనూ ప్రవర్తన విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ ప్రభావం తప్పకుండా మీద పడుతుందనీ చెపుతున్నారు విశ్లేషకులు. వారితో మాట్లాడటం సన్నిహితంగా ఉండటంతో ఏ సంఘటన జరిగినా ఆ ప్రభావం మనసుపైనపడి నిద్రపట్టనీయక, ఒత్తిడికి గురిచేస్తుందంటున్నారు. తోటి మసుషుల్లో ఉండే ఉద్రేకాలు ప్రవర్తన ,జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన విషయంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు మనసుపైన తప్పని సరిగా ముద్రపడి ఆందోళన కలిగిస్తుందనీ ,ఆ సందర్భాన్ని […]
అదో సమస్యా?
ఇప్పుడు రెండో సారి గర్భం దాల్చాను. క్రితం సారి లాగా ఒత్తిడితో లేను. ఈసారి సులువుగా సన్నబడి పోతాను అంటూ నటి సమీరా రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెనకో కథుంది. తీరైన శరీరాకృతిలో ఉన్న సమీరా రెడ్డి మొదటి బిడ్డకు జన్మ ఇచ్చాక 102 కేజీల బరువు పెరిగింది. జుట్టు ఊడిపోయింది, దీన్తో సమీరా బయటికి రాలేకపోయింది. దీనితో ఎన్నో వ్యాయమాలు చేసి సన్న బడిపోయింది.ఈ బరువు తగ్గించటంలో ఉన్న సులువులు ఇప్పుడు […]
కథా స్రవంతి
(పి.సత్యవతి కథలు) పి సత్యవతి ప్రముఖ నవలా కథా రచయిత్రి ,వ్యాసకర్త , కాలమిస్ట్. ఆమె రచనలలో గత 50సంవత్సరాల్లో మధ్య తరగతి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. ఈ కథ సంపుటి లో పది కథలున్నాయి. ప్రపంచీకరణ పర్యావసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పులు ఈ సంపుటిలో ఉన్నా ‘మంత్రనగరి’ కథలో కనిపిస్తాయి. వృద్ధాప్యంలో జరిగిన పెళ్ళిళ్ళూ వాటి వెనక ఉండే పలు ఆర్ధిక సామాజిక కారణాలు కొత్త ఆలోచనలతో చెప్పిన కథ ‘ఆవిడ’. […]
అడుగేసి చూస్తే మజా
ఎప్పుడు ఎదో ఒక కొత్తదనం కావాలి ఎదుటివాళ్ళు ఆశ్చర్యపోవాలి.అనుకుంటే గుమ్మాలు సోఫాలు ముందర వేసుకునే పూల్ స్టోన్స్ రగ్ కొనుక్కోచ్చేయాలి చూసేందుకు ఇవి సముద్రపు రాళ్ళ లాగా రాళ్ల ఉండల్లాగా అనిపిస్తాయిఽయితే కాళ్ళు పెట్టగానే మెత్తగా సున్నితంగా తాకితే ఈ పూల్ స్టోన్స్ ని ఉన్ని తోనే తయారు చేస్తారు.ఎగుడు దిగుడుగా ఉండే వీటి పై నడవడం వల్ల కాళ్ళకు రక్తప్రసరణ పెరుగుతుంది కూడా.
భ్రమ కాదు వాస్తవం
డైనింగ్ టేబుల్ డెకరేషన్ కు పెద్ద హడావిడి ఉండదు. హాట్ బాక్స్ లు,ప్లేట్లు మహా అయితే ఒక ఫ్లవర్ వాజ్ కానీ ఇవ్వాల్టీ టెక్నాలజీ ఈ కాన్సెప్ట్ ని మార్చేసింది.ఒక త్రిడీ టేబుల్ క్లాత్ గనుక టేబుల్ పై పరిస్తే ఆ ఎఫెక్ట్ చాలా పెద్ద పెద్ద పువ్వులు అచ్చంగా అనిపించే ఫ్రూట్స్ ,గులాబీలు ఒకటేమిటి ఏ క్లాత్ అయినా త్రీడీలో అచ్చంగా పెద్ద సైజుని అక్కడ పెట్టినట్లే అనిపిస్తాయి.
