Sunday, 28 Jun, 2026

నీలి గోరింట- మందరపు హైమవతి

తెలుగు స్త్రీవాద కవిత్వంలో మందరపు హైమవతి తన ప్రత్యేక స్వరంతో స్త్రీల ఆర్తిని,ఆవేశాన్ని ,ఆగ్రహాన్ని ప్రేమను ప్రేమ రాహిత్యా జీవన వేదననూ ఆర్థిక సంబంధాల ప్రభావంతో చిద్రమవుతున్న స్త్రీ పురుష సంబంధాలను అపురూపంగా చిత్రించింది ఈ నీలి గోరింట కవిత సంకలనంలో 57 కవితలున్నాయి.బాధలు పాతవే కానీ గాయాలు కొత్తవి అంటూ హైమవతి మారుతున్న కాలంలో మారే అణచివేతల రూపాలను ,హింసా రూపాలను ఒకొక్కటిగా పరిచయం చేసింది ఈ నీలి గోరింట సంకలనంలో స్త్రీలు అనుభవిస్తున్న సమస్య […]

తొలి మహిళ ఈమే

క్లెయర్‌ పొల్సక్‌ ఇప్పటికే 15కు పైగా మహిళా క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా చేసిన అనుభవం ఈ ఆస్ట్రేలియన్‌ మహిళ సొంతం.నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ఏప్రిల్‌ 27న నమీబియా, ఒమన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్లెయర్‌ అంపైర్‌గా వ్యవహరించారు.దీంతో పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళ అయ్యారు. కెయర్‌ అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

నృత్యం నా భాష

నేను ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తాను. ఎవరి కోసం అన్నా వేచి చూస్తున్నప్పుడు కూడా నృత్యం చేస్తాను. నా మనస్సుని ఆవిష్కరించే అద్భుతమైన భాష నృత్యం. ఇది నా నరనరాల్లో దాగి ఉంది అంటూ చెబుతోంది తమన్నా. అంతర్జాతీయ నృత్యాదినోత్సవం సందర్భంగా ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని వివరిస్తూ అసలు మనకు ఒక కళలో ప్రావీణ్యం ఉందా లేదా అనికాదు , మనం మనల్ని వ్యక్తీకరించుకోవటానికి ఉపయోగనడిందా లేదా అనేదే చూడాలి అంటుంది తమన్నా.