May 2019
రామ్ పరివార్ నగలు
పెళ్ళిళ్ళలో ఇతర సంప్రదాయ వేడుకలలో రామ్ పరివార్ నగలు ఇప్పుడు లే టెస్ట్ ట్రెండ్. సీతా రామ లక్ష్మణ మూర్తులతో తయారయ్యే ఈ నగులు పూర్తిగా మేలు జాతి రాళ్ళతో తయారు చేస్తారు. ఎమరాల్ట్ ,రుచీలు, ముత్యాలు, గుట్టపూసలు బంగారు పూసల వరసలతో విభిన్న డిజైన్ లతో దొరికే ఈ నగలు అన్ని వయసుల వారిగా బావుంటాయి.
సరికొత్త లుక్
పట్టు పరికిణిలు ఇష్టమైతే కొన్ని కాంబినేషన్స్ ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. ఎంచుకొనే ఓణీ,లెహాంగా కలర్ కు కాంట్రాస్ట్ గా ఉండాలి. అలాగే లెహంగా బోర్డర్ ఎక్కువ వెడల్పు ఉంటేనే చక్కగా ఉంటుంది. మెరిసే లంగా పైకి ఇంకా తణుక్కుమనే అద్దాలు కుట్టిన బ్లౌజ్ లు బావుంటాయి. ఇక ప్రింటెండ్ లెహంగాల వేసుకోంటే చక్కని టెంపుల్ జ్యువెలరీ పెట్టుకొంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక జరీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కు లెహంగా అయితే ప్రత్యేకమైన లుక్ తో మెరిసిపోవచ్చు.
చర్మాన్ని మెరిపించే తాటి బెల్లం
నల్లని రంగులో మూతకగా ఉంటుంది కానీ ప్రకృతి సహజంగా తయారయ్యే తాటి బెల్లం ఆరోగ్యాన్నిస్తుంది. ఇందులో ఆ స్కారిక్ట్ ఆమ్లం, ఐరన్, కాల్షియలం,మెగ్నిషియం ,ఫాస్పారస్ ,పోటాషియం ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ తో నిండిన ఈ తాటి బెల్లం తింటే ఎముకలకు గుండెకు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలోని హానికరమైన ప్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. గర్భిణిలకు ఎంతో మేలు చేస్తుంది.చర్మానికి వెలుగునిస్తుంది. ముడతలుపడదు మొటిమలు మచ్చల సమస్య పోతుంది.
గాలిని శుద్ది చేసే మొక్కలు
అరుదుగా పూసే పూలలో అందమైన ఆకులున్న చక్కని మొక్కలను ఇంట్లో పెంచుకోనేవి ఎంచుకోంటే ఈ వేసవిలో చల్లదనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను నాసా గాలిని శుధ్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. పడక గది కిటికీల పక్కగా ఎండతగిలే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకొని వీటికి తోడుగా వట్టి వేళ్ళ తడికలను కార్టిన్ లుగా వాడితే ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు.
భార్య సంపాదిస్తే కష్టమే
భార్య సంపాదనతో కొంత కాలం బతికినా సరే ఆ చర్యలకు బోలెడన్ని జబ్బులు వస్తున్నాయని ఒక అధ్యాయనం చెబుతుంది. అమెరికాలోని రెట్గర్సే విశ్వవిద్యాలయం పరిశోధనలో పురుషుల ఆలోచన విధానంలో ఏ మాత్రం మార్పు రాలేదని పురుషులే కుటుంబానికి ఆధారంగా నిలవాలని ఇప్పటికి ఆలోచిస్తారని భార్య సంపాదన పై జీవిస్తే ఆందోళన కారణంగా హుద్రోగాలు,పక్షవాతం,మధుమేహం కాలేయ సమస్యలు వంటివి వ్యాధులకు గురయ్యారని తేలింది. 30 ఏళ్ళుగా రెండువేల జంటల పై జరిగిన సుదీర్ఘమైన అద్యాయనంలో ఈ విషయం వెల్లడైంది.
‘యూరీ’ సంతోషాన్ని తెచ్చింది
ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు మంచి సినిమాలు రావడానికి కారణం అనుకుంటున్నాను అంటుంది యామీ గౌతమ్.యూరీ చిత్ర విజయంతో తనలో ఆత్మవిశ్వాసం నిండింది అంటుంది. ఓ నాయికగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా వారసత్వం లేకపోయినా ప్రతిభగల నటి నటులకు తప్పక గుర్తింపు వస్తుంది అంటుంది యామీ గౌతమ్. తనది సినీ నేపథ్యం కాకపోయినా నిలదొక్కుకోగలిగినందుకు మనసు ఎంతో సంతోషంగా ఉంది అంటుందామే.విజయాలు ఉన్నప్పుడే ప్రయోగాలు చేయాలు. ఇప్పుడు అవకాశం నాకు కూడా ఉంది అంటుంది యామీ గౌతమ్.
ముల్లంగితో మొటిమలు మాయం
ముల్లంగితో మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముల్లంగి మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు టీస్పూన్లు నిమ్మరసం అంతే మోతాదులో టామాటో రసం కలిపి ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తర్వాత కడిసేస్తే చాలు వారానికొకసారి ఈ ప్యాక్ వేయాలి. ముల్లంగి రసం తీసి అంతే మోతాదులో మజ్జిగ కలిపి మొహానికి పట్టించినా సరే మొటిమలు తగ్గుతాయి.ఉన్న మొటిమలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది. ప్యాక్ వేసిన గంట తర్వాత వేడి నీళ్ళలో మొహం కడుక్కోవాలి అప్పుడే […]
అంత నాన్న ఇష్టం
నా విషయంలో నాన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్క లాగే నాకు కరణ్ జోహర్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఉంది. అయితే నాన్నదే నిర్ణయం అంటుంది శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్.ఆమె సినిమాల్లో రావాడానికి సన్నాహాలు జరుగుతున్నాయినేను తొలి సినిమాలో ఎవరితో నటించాలో నాన్న నిర్ణయిస్తారు.ఇప్పుడు నటనలో శిక్షణ కోసం న్యూయార్క్ కూడా వెళుతున్నాను అని చెబుతుంది ఖుషీ. నా మొదటి సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా చూస్తున్నా అంది ఖుషీ కపూర్.
నా కష్టంతోనే సక్సెస్
కష్టపడటం తప్ప నాకు ఇంకోటి తెలీదు.నా సక్సెస్ కేవలం ఈ కష్టం వల్లే సాధ్యపడింది. నా విజయ రహస్యం ఇదే అంటుంది సమంత.మజిలీ సినిమాతో అమెకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా సినిమా కు వైవిద్యం చూపిస్తుందని విమర్శకులు మెచ్చుకున్నారు.ఈ పరిశ్రమలో ఎవరికి ఎవరు సాయం చేయరు. ప్రతిభ,నైపుణ్యం,కృషికి మాత్రమే ఇక్కడ మార్కులు పడతాయి.నా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కాని విజయం వస్తే ఎంతో సంతోషీస్తాను.వైఫల్యం ఎదురైతే అంత కుంగిపోతాను అంటుంది సమంత.
ఇది తప్పనిసరి
బాగా ఎండగా ఉంటేనే సన్ స్క్రీన్ అవసరం అనుకుంటారు సాధారణంగా కానీ ఎండగా ఉన్నా లేకపోయినా వాతావరణంలో సంబంధం లేకపోయినా ఏడాది మొత్తం సన్ స్క్రీన్ రాసుకోవల్సిందే.ఈ సన్ స్క్రీన్ ముఖ్యంగా మెడతో పాటు ఎండపడే భాగాలన్నింటికి రాసుకోవాలి.సన్ స్క్రీన్ వల్ల మొహం జిడ్డుగా అనిపిస్తే కాస్త పౌడర్ రాసుకుంటే జిడ్డు పోతుంది.ఎండలోకి వెళ్లేముందు రాసుకోవాలి.ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రాసుకుంటేనే ఎండకు చర్మం దెభ్బతినకుండా ఉంటుంది.
నవ్వుల నాజుకు దేహం
నవ్వడం ఎన్ని విధాల లాభం అంటున్నాయి ఇవ్వాల్టి పరిశోధనలు.ఎప్పుడు నవ్వుతు ఉండేవాళ్ళలో ఒత్తిడి,ఆందోళన,డిప్రెషన్ వంటివి మచ్చుకు కూడా కనబడవన్న సత్యం ఇదివరలో జరిగిన అద్యాయనాల్లో తేలిన విషయమే. అయితే ఇప్పుడు కొత్త పరిశోధన ఎప్పుడు నవ్వుతూ ఉండటం వళ్ళ నాజుకైన శరీరాకృతి సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. రోజుకు కనీసం పావుగంటసేపు గట్టిగా వినబడేలా నవ్వడం వల్ల ముఖం కండరాలకు మంచి వ్యాయామమే కాకుండా శరిరంలో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయంటున్నారు.సహజసిద్దంగా శరీరాన్ని యాక్టి్ వ్ గా ఉంచుతూ […]
ఒక్క నగే చాలు
బంగారంతో చేసిన నగలు,చిన్న చిన్న రాళ్ళు ఇది ఒకప్పటి ఫ్యాషన్.కాని ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో చేసే స్టేట్మెంట్ నగలే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన ఎథ్నిక్ జ్యూలరీ సందడి చేస్తుంది.స్టేట్మేంట్ నగల్లో ముదురు రంగుల్లో ఉండే రాళ్ళు పొదిగిన చెవి దిద్దులు ఎంతో ఫ్యాషన్ పాశ్చాత్య వస్ర్రశ్రేణికి జతగాఅ ఇటువంటి కర్ణాభరణాలు పెట్టుకున్నా ఎంతో అందంగా ఉంటుంది.పైగా ఎక్కువ నగలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా.
సిగ్నల్
ప్రపంచ భాషలో ప్రసిద్దకథలు అను సృజన: రంగనాధ రామచంద్రరావు ప్రపంచదేశాల్లోని గొప్ప రచయితలు సృష్టించిన అద్భుతమైన సాహిత్యం అనువాదాలు ద్వారానే పుస్తక ప్రియులకు చేరింది.అనువాద సాహిత్యానికి చక్కని స్థానం దక్కింది.ప్రపంచ సాహిత్యాన్ని చదివితినే అక్కడి సంస్క్రతి చరిత్రను సాహిత్య రూపాన్ని వివిధప్రాంత ప్రజల అంతరంగాలను అలవాట్లను అర్ధం చేసుకోగలుగుతాం. సాహిత్యం చేసిన గొప్పపని భూమి పైన ఉండే మనుష్యులు స్వభావల్లో ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని రుజువు చేసింది.రంగనాథ్ రామచంద్రరావు తెలియజేసిన సిగ్నల్ కథా సంపుటి నిరూపించిన సత్యం […]
నొప్పిని తగ్గిస్తుంది
కాఫీ గురించి ఇంకా చక్కని అధ్యాయనం. కాఫీలో ఉండే కెఫిన్ కి నొప్పిని తగ్గించే శక్తి ఉందని అలబామా యూనివర్సిటీ అద్యాయనకారులు చెబుతున్నారు.కెఫిన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం అద్యాయనంలో తేలింది.19నుంచి 77 ఏళ్ళ వయసుగల 62 మంది పైన కాఫీ,టీ సాదా చాక్లెట్ వంటి ఇతర వినియోగాలను కెఫిన్ ప్రభావాన్ని అధ్యాయనం చేశారు.కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళ్ళిన వారిలో నొప్పిని భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు.వీరందరు సగటున […]
చర్మం తాజాగా
చర్మం పైన ఎండ ప్రభావం ఎంతో ఉంటుంది. అలాగే జుట్టు కూడా జీవం లేనట్లు అయిపోతుంది.తెనె మొహానికి పట్టించి మర్ధన చేసి ఆరిపోయిన కడిగేస్తే చర్మం తాజాగా మృదువుగా మారిపోతుంది.చర్మం ఎండవేడికి నల్లగా అయిపోతే చెంచా చొప్పున రోజ్ వాటర్,నిమ్మ రసం,కీరదోస రసం కలిపి ముఖానికి రాసి మర్ధన చేయాలి.కాసేపయ్యాక కడిగేస్తే చాలు నిమ్మరసం బ్లీచ్ లాగా పని చేసి నలుపును తొలగిస్తే కీరదోస,రోజ్ వాటర్ చర్మానికి చల్లదనం ఇస్తాయి.జుట్టు పొడిబారినట్లు ఉంటే బాగా పండిన అరటిపండు […]
డ్రై ఐ సిండ్రోమ్ ! జాగ్రత్త
ఏసీల వల్ల ఆరోగ్యహాని ఎక్కువే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏసీల చల్లదనం శరీరానికి హాయి కలిగిస్తుంది.కానీ గంటల కొద్ది సమయం ఏసీల్లో ఉంటే డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడతారని ఇటివల సర్వే చెబుతుంది. ముఖ్యంగా వేసవిలో 16 నుంచి 18 గంటలు ఏసీల్లో గడీపేవాళ్ళలో ఈ సమస్య వస్తుందని సర్వే కనిపెట్టింది.కళ్ళు పొడిబారటం కళ్ళలో మంట దురద కళ్ళలోంచి నీళ్ళు కారటం,ఎర్రబడటం వంటివి కనబడితే వెంటనే డాక్టర్ ను కలుసుకొమ్మని ఏసీల్లో ఉండే సమయం తగ్గించమనిచెబుతున్నారు.
పాత్రలో నేను కనిపిస్తే ఓకె
అందరి అవకాశాలు పరిస్థితులు ఒక్కలా ఉండవు.మొదట దంగల్ సినిమా ఒప్పుకొన్నాను ఎంతో పేరు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో నేను నటించాకే నా పైన నాకు నమ్మకం కలగింది. ఇప్పుడు అవకాశాలు బాగానే ఉన్నాయి అంటుంది ఫాతిమా సనాషేక్. ఎప్పుడు నా తోటి వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు నేను ఏం ఒప్పుకోవాలి అని చాలా తికమకగా ఉండేది. దంగల్ తర్వాత మాత్రం ఎంపిక గురించి మరచిపోయాను నేను ఆ పాత్రలో […]
బ్యూటీకి బ్లాక్ సాల్ట్
బ్లాక్ సాల్ట్ ని చల్లని ఉప్పు అని కూడా పిలుచుకొవచ్చు అంటారు వైద్యులు. ఈ వేసవిలో బ్లాక్ సాల్ట్ పదార్థాలలో ఉపయోగించటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పైకి నల్లగా ఉండి పొడి చేయగానే లేత గులాబీ రంగులోకి మారిపోతుంది.ఐరన్ తో పాటు ఇతర ఖనిజా లవణాలు పోషకాలు ఉన్నాయి. సలాడ్స్ లో కలిపితే మంచి రుచి వస్తుంది. వేసవిలో వచ్చే చమట పొక్కుల నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే గొరు వెచ్చని నీళ్ళలో చిటికెడు నల్ల […]
మంజుమణి కుట్టన్ కు పురస్కారం
కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబదూరుకు చెందిన మంజు మణి కుట్టన్ ను ఈ ఏడాది నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం . ఉపాధి కోసం సౌదీకి వచ్చి కాంట్రాక్టర్ల చేతిలో పాస్ పోర్ట్ ఇరుక్కుపోయి మాతృభూమి చేరలేక బాధలు పడుతున్న వారికి సౌదీ లోని మన రాష్ట్ర రాయబార కార్యాలయం అధికారుల ద్వారా వెయ్యి మందికి పైగా బాధితులను మన దేశానికి పంపిచిన కారణంగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.
ఈ డిజైన్ తో స్పెషల్ లుక్
ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాలోనూ ఆఫ్ షోల్డర్ వేసుకోన్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. బుజాలు తీర్చి దిద్దనట్లు చక్కగా కనిపిస్తాయి. ఈ ఆఫ్ షోల్డర్ దుస్తుల్లో చిన్న చిన్న వేడుకలకు కాటన్ తో చేసిన ఆఫ్ షోల్డర్ ఫ్రాక్ వేసుకొంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఎంబ్రాయిడరీ పనితనం ఇంకోంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ డ్రెస్ కు జతగ పొడవాటి ఇయర్ రింగ్స్ బావుంటాయి. పార్టీల్లో ఇకత్ కాలంకారీ ఆఫ్ షోల్డర్ కు జతగా సిల్వర్ నగలు చాలా చక్కగా […]
