September 2018
రెస్టారెంట్ భోజనమా ?
రెస్టారెంట్ లో భోజనం చేసేటప్పుడు ఫుడ్ చాయిస్ లో కొన్ని చిట్కాలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. రెస్టారెంట్ ఎంచుకునే ముందర వెబ్ సైట్ వెతికి పదార్ధాలు ప్లాన్ చేసుకోవాలి. పోషకాహరం సమాచారం చేసుకోవాలి. అరోగ్యవంతమైన ఆప్షన్లు లేకపోయినా కళ్ళకు నచ్చకపోయినా మరోక దాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రోటీన్లు తగు మాత్రంగా ఉండాలి. గ్రిల్,స్టీమ్ బాయిల్ చేసినవి బావుంటాయి. వేయించిన వాటితో పోలిస్తే వీటిలో కొవ్వు అదనపు క్యాలరీలు చాలా తక్కువ. బంగాళా దుంపలు,వైట్ రైస్ కంటే స్టీమ్ […]
పాటకు ఎంత శక్తి
పాటలు మనసు పై బావోద్రేక ప్రభావం చూపెడతాయి. ఏదో ఒక పాట ఎలా వస్తే అలా హమ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అంటారు ఎక్స్ పర్ట్స్. పాటలతో పూర్తి స్థాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసారా పాడుకుంటే పోని ఇష్టమైన పాటలు వింటు గడిపినా ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని అద్యాయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు రావు ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.ఇక పాటలు వినడం ఐతే ఆ రిథమ్ శరీరంలోని ముఖ్యమైన నరాల పైన పాజిటివ్ […]
స్విట్జర్లాండ్ లో శ్రీదేవి విగ్రహం
జగదేక సుందరి శ్రీదేవికి ఒక అపురూపమైన గౌరవం దక్కనుంది. సౌందర్య స్వరూపిణి అయిన శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పుతామని స్విట్జర్లాండ్ అధికారులు సన్నాహలు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన చాందిని మూవీ ఇక్కడే తెరకెక్కించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్న పర్యటనగా ఇక్కడ శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2016లో యాశ్ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈయన సినిమాలు ఎక్కువగా స్విట్జర్లాండ్ లోనే తెరకెక్కాయి.ఆ సినిమాలు కారణంగా స్విస్ అందాలు ప్రపంచవ్యాప్తమై ఇక్కడకు వచ్చే టూరిస్టుల […]
ఆ మెరుపు నా సంతోషం
నా జీవితంలో సినిమాలు ఒక్కటే కాదు ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఇష్టమైన పని చేసేటప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. నాకు నచ్చిన పాత్రాలు వేసేటప్పుడు మనసులో కలిగిన సంతోషం నా ముఖంపై అందరూ చూస్తారు. నా కళ్ళలో ఉండే మెరుపు నా సంతోషం. అది సహజంగా నా మనసులో నుంచి వస్తుంది. అందులో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది అంటుంది నిత్యామీనన్. రెండు నెలల విరామం తర్వాత గీతాగోవిందం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నిత్యామీనన్. ఇక […]
రోజుకో గ్లాస్ తాగితే చాలు
ఎర్రని దానిమ్మ గింజల్లో ఆరోగ్యానికి చేసే మేలు చెప్పలేనంతగా ఉంటుంది. రోజుకో గ్లాస్ దానిమ్మ రసం తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుండెకు రక్త సరఫరా తక్కువగా ఉన్నా స్త్రీ పురుషులు ప్రతిరోజు దానిమ్మ రసం తాగితే వెంటనే ప్రయోజనం తెలుస్తుంది అంటున్నారు. దానిమ్మలో ఆర్డర్ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయని ఈ లక్షణాలే గుండే కి మేలు చేస్తాయంటున్నారు. విటమిన్ సీ,ఏలో పోలిక్ యాసిడ్ లభిస్తుంది. ప్రీ […]
నాకు తప్పలేదు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాని మొహమాటం లేకుండా చెప్పేసింది యామిని భాస్కర్.నర్తనశాల సినిమాలో సత్యభామ గా నటించింది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవనడం చాలా అన్యాయం. పాత్రకు సరిపోతారు అనిపిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటుంది యామిని. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు మనకు పోటీదార్లు అనే అనుకుంటాను. ఎఫ్పుడు తెలుగు అమ్మాయిలను డామినేట్ చేస్తారు అని నాకు అనిపించదు అంటుంది యామిని.
చేదనుకోవద్దు
ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే రుచికోసం చూడకూడదు.ఉదాహరణకు చేదుగా ఉండే కాకర కాయలు మంచి ఆరోగ్యం ఇస్తాయి.రక్తంలోని చెక్కర నిల్వలు తగ్గిస్తాయి. అధిక బరువు తగ్గించుకోవచ్చు మధుమేహం ఉండేవారికివచ్చే అధిక రక్తపోటు తగ్గుతుంది. బిటాకెరోటిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యల పై పోరాడేందుకు కాకరకాయ వరప్రసాదం.కాలేయంలో ఉండే వ్యర్ధాలను తొలగిస్తుంది సోరియాసిస్ అథ్లెట్ ఫుట్ వంటి చర్మ వ్యాధులు తగ్గించగలుగుతుంది. ఫంగస్ వల్ల వచ్చే అంటు వ్యాధులు తగ్గిపోతాయి.వారంలో రెండు సార్లయినా కాకరకాయని భోజనంలో చేర్చుకోవాలి.
త్వరగా కోలుకునేందుకు
ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకునేందుకు అంటే శరీరానికి ఉపశమనం ఇచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. ఆపరేషన్ తర్వాత ఇచ్చే మందులతో జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. శరీరంలో అధికంగా ఉండే ప్రోటిన్ కొలాజెన్ కు దెభ్బతిన్న కణజాలలను కలిపే శక్తి ఉంటుంది. ఈ ప్రోటీన్ కోసం చిక్కుడు,గుడ్డు,చేప తీసుకోవచ్చు. ఆపరేషన్ ఒత్తిడిని తగ్గించే పీచు పదార్దాలు మంచి బ్యాక్టీరియా కోసం మజ్జిగ,పెరుగు,బీటా కెరోటిన్ కలిగిన క్యారెట్, ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరలు కొల్లాజన్ ఉత్పత్తి పెంచి విటమిన్ సీ అందించే […]
కార్ రేసింగ్ లో మహిళలు
జె.కె టైర్ల సంస్థ జాతీయస్థాయిలో రేసింగ్ ఛాంపియన్ షిప్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బరిలో ప్రత్యేకంగా మహళా బృందాన్ని జె.కె టైర్ల సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన ఆరుగురు అమ్మాయిల్లో ఇంటర్ మొదటి సంవత్పరం చదువుతున్నా పదహారేళ్ళ హిన్సుజా కూడా ఉంది. ప్రియం వదా సారథి జుంచా శిక్షకులు. 2019 నుంచి మోటర్ స్పార్ట్స్ లో ఇమెకు అనుభవం ఉంది. మనిషా కేల్కర్ అనే మరాఠీ నటి మిగతా ముగ్గురు ,లేదర్న,రోష్మి,మెగా సామాన్య కుటుంబాల […]
వర్ణ రంజితం టస్సర్ సిల్క్
ప్రకృతిని ఆవిష్కరించినట్లు కనిపించే టస్సర్ సిల్క చీరెలు ఈ సీజన్ లో ధరించేందుకు అనువుగా ఉంటాయి. ఆందంగా కనిపించే ఈ చీరెలను అమ్మాయిలు ఇష్టపడతారంటే సందేహాం లేదు.చాలా వైవిధ్యమైన రంగులలో డిజిటల్ పూల ప్రింట్లలో ,మోటెఫ్ మెరుపులలో టస్సర్ చీరెలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. టస్సర్ చీరెల ఇమెజ్ లో చూస్తే ఇవెంత అధునాతనంగా ,డిజటల్ ప్రింట్ల హాంగులతో అందంగా హుందాగా కనిపిస్తాయో అర్ధం అవుతుంది. తేలికగా చక్కగా వర్ణాలతో కనించే టస్సర్ సిల్క్ చీరెల కోసం […]
పెళ్ళంటే ధైర్యం, భరోసా
పెళ్ళి అనేది ఆడపిల్లలకు ఒక ధైర్యం ,భరోసా ఇచ్చేదిగా ఉండాలి. కానీ వాళ్ళ కలలకు కేరీర్ కు అడ్డుపడేలా ఉండకూడదు. నా విషయంలో నాలో ఎంతో ధైర్యం నింపింది నా వివాహం. నా పని మరింత సలువువైంది అంటోంది సమంత. ఆమె నటించిన యూటర్నూ సినిమా రాబోతోంది సినిమా గురించి చెపుతూ కథ చాలా బావుంది. కథ కోసమే సినిమా చూడవచ్చు అంటోంది సమంత. నాది ఒక మంచి కుటుంబం . నాగార్జున గారి నీడలో ఉండటం […]
రసాయనాలతో ప్రమాదం
పిల్లలకు స్టిక్కర్లు , కుంకుమలు పెట్టకండి వాటిలో హాని కరమైన రసాయనాలు ఉంటున్నాయి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు .కుంకుమలో రంగు సువాసన కోసం సీసం పాదరసం, కర్పురాం ,సింథటిక్స్ జింక్ వంటివి కలుపుతారు . వీటివల్ల చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. మరీ సున్నితమైన వారికి బొబ్బలు , దద్దుర్లు కూడా రావచ్చు. సాధారణంగా ఇంట్లో కుంకుమ తయారు చేసుకోవటం తేలికే . పసుపు పొడిలో నిమ్మరసం కలిపితే కుంకుమ తయారవుతుంది. రెడ్ మార్బుల్ స్టోన్ పైన […]
మహిళల ఆర్ధికసాధికారత ప్రధానం
మహిళల ఆర్ధిక సాధికారిత దేశాభివృద్ధికి తోడ్పడుతోందని ఐశ్వర్యా రాయ్ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్ మహాజన ,రశ్మీఠాక్రే ,జుహాచావ్లా ,అమృతా రాయ్ చంద్ర ,షబనా ఆజ్మలతో పాటు ,ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధిలో మహిళల ఆర్ధిక సాధికారత ఒక ప్రధాన అంశం కావాలన్నారు ఐశ్వర్యా రాయ్.
అదే ముఖ్య కారణం
పిల్లలు గాఢ నిద్ర పోకుండా అశాంతిగా ఉంటారు ,తెల్లవాళ్ళు అదే పనిగా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇబ్బందికి ఘనాహారం అందక పోవటం అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. తల్లి పాలకే పరిమతమైన పిల్లలు వాళ్ళ శరీరానికి అవసరమైన పోషకాలున్నీ వాటి ద్వారా లభించటం లేదని ఆ కారణం చేత శరీరంలో కలిగే అశక్తత,అసహానం వాళ్ళ పూర్తిస్థాయి నిద్ర పోకపోవటానికి కారణం అవుతాయని చెపుతున్నారు. పైగా ఘనాహారం కడుపు నిండ ఉండటం వల్ల వాళ్లకు కంటినిండా నిద్ర పడుతోందని వాళ్ళు […]
ఇవే లేటెస్ట్
చెవుకు భారీ ఆభరణాలు ఎప్పుడూ అందం ఇస్తాయి. కాకపోతే బరువుకు సపోర్ట్స్ గా చెంపసరాలు పెడితే లేదా మాటీలతో కలసి ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పింజరీ జ్యువెలరీ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. పంజరం లాగా కనిస్తాయి కనుక ఈ పేరు పెట్టి ఉంటారు. ప్రెషియస్ ,సెమీ ప్రెషియస్ రాళ్ళతో కూడా ఈ జ్యువెలరీ బావుంటుంది. బుట్ట ఆ కారంలో కనించేలా కమ్మ బుట్ట రాళ్ళు పొదగటం పింజరా జుంకీల ప్రత్యేక .గోమేధాకాలు పచ్చిలు […]
ఐదు లక్షలు చెల్లించండి
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిఫార్స్ ను పరిగణలోకి తీసుకొవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్ రెండవ తేదీ నుంచి అత్యచార బాధితురాలికి ఐదు లక్షల రూపాయలు ,సామూహిక అత్యాచార బాధితురాలికి ఐదు లక్షలు తప్పని సరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏదో కొంత నామ మాత్రంగా కొన్నీ సార్లు బాధితులకు కాస్త ధనం ఇస్తున్నప్పటికీ కొన్నీ రాష్ట్రాల్లో అసలు ఏ చెల్లింపులు లేక పోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని దేశం మొత్తం […]
జుట్టు వరకే
బ్రిటన్ కు చెందిన హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ కొబ్బరి నూనె తాగటం ,ఆహారంలో కలిపి అంటే వంటల్లో వాడటం చాలా ప్రమాదం అంటున్నారు.కొబ్బరి నూనె కారణంగా శరీరంలో కొలెస్ట్రాలు ఒక్క సారిగా పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నూనె జుట్టుకు ఆరోగ్యం ఇవ్వగలదేమో కానీ ఆహారంగా పనికి రాదని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని వంటలలో ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు తగ్గి పోతుందని ,ఆధిక బరువును తేలిగ్గా పోగొట్టవచ్చని ,ఆహరంలో భాగంగా దీన్ని కొంత […]
వేగంగానే బెస్ట్
నడక మంచిదే కానీ ఎలా నడిస్తే మేలు అన్న విషయంలో ఇప్పటికీ అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఫిట్ నెస్ పట్ల క్రేజ్ పెరిగాక ఈ అధ్యయనాలు మరీ ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. నడక నిస్సందేహంగా మంచిదే .ఎంత వేగంగా నడిస్తే అంత ఎక్కువ ఫలితాలు ఉంటాయని గతంలో రిపోర్ట్స్ చెప్పాయి. ఇప్పటి తాజా రిపోర్ట్ కూడా బ్రిస్క్ పేస్ వల్ల అధోక ప్రయోజనం అంటున్నారు .స్లో వాకింగ్ ఎంత దూరం అయితే నడుస్తారో ,బ్రిస్క్ వాకింగ్ లో అంతే […]
ఇవి ఫ్యాషన్ లో భాగం
ఫ్యాషన్ లో చెప్పులకు కూడా చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. కొన్ని డ్రెస్ లకు చెప్పులే అందం కూడా. జీన్స్ మినీ స్కర్టులు వేసుకుంటే బ్యాల్ వంటివి బావుంటాయి,చాలా సౌకర్యం కూడా. వాటితో పాటు స్ట్రాపీ సాండిల్స్, కిచెన్ హీల్స్ వంటివి కొన్ని సందర్భాల్లో డ్రెస్ లను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.ప్రతి సందర్భానికి హీల్స్ బావుంటాయి అనుకుంటారు కాని అన్ని దుస్తులకు ఇవి మ్యాచ్ కావు. మినీ గౌన్లు,స్కర్టుల మీదకు కూడా కాస్త ఎత్తు రకాలు బాగానే […]
ఇవన్ని నాకెంతో ఇష్టం
సినిమాల్లో టీచర్ పాత్ర ధరిస్తే ఎలా ఉండేదో కాని నిజ జీవితంలో రంగారెడ్డి జిల్లా స్కూల్లల్లో పాఠాలు చెప్పేందుకు సిద్దమైపోయింది రకుల్ ప్రీత్ సింగ్. టీచ్ ఫర్ ఇండియా స్వచ్చంద సంస్థ 100 పాఠశాలలు దత్తత తీసుకుంది. ఆ స్కూళ్ళలో రకుల్ పాఠాలు చెప్పేందుకు ఒప్పుకుంది. భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోంటుంది. ఇలాంటప్పుడు పిల్లల మధ్య చాలా సామన్యంగా ఉండటం నాకు ఇష్టం. నా సెలబ్రిటి వ్యవహారం పిల్లలకు దగ్గరగా తీసుకురాను. వాళ్ళ […]
