Sunday, 28 Jun, 2026

అది భోజన సమయమేనా?

చాలా మంది రాత్రి భోజనాన్ని చాలా లేట్ గా చేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ తాజా అధ్యయనంలో రెండు వేలమంది స్త్రీ ,పురుషుల ఆహారంను అలవాట్ల పై చేసిన అధ్యయనంలో వీరిలో సగం మందికి పైగా రాత్రి పది గంటలు ,ఇంకా లేట్ గా భోజనం చేపే అలవాటుంది.20 శాతం మందికి తొమ్మిది గంటలకు ముందే భోజనం చేసే అలవాటు […]

అపురూపమైన కానుక

మంచి అమ్మాలు, మంచి కొడుకులు ఎప్పుడు ఉన్నారు. బెంగాళూరులో ఉండే కృష్ణ కుమార్ ఏ తల్లి అయినా కోరుకునే కొడుకు .పల్లెటూరులో భర్త పోయాక వంటరిగా నివశిస్తున్న తల్లి తీర్ధయాత్రలు చేయాలని ఉంది అన్నదట మాటవరసకి. కానీ కొడుకు దీన్ని సీరియస్ గా తీసుకొన్నారు. మాతృసేవా సంకల్పయాత్ర తలపెట్టాడు. తన స్కూటర్ కు వాళ్ళమ్మ సుఖంగా కూర్చోనేలా సీటు ఏర్పాటు చేసి ఆవిడను తీసుకొని మొత్తం పాతికవేల మైళ్ళు ప్రయాణం చేసి ఏడు రాష్ట్రల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ […]

ఇది ఆచారమట ?

ఈ రోజుల్లో కూడా ఇలాంటి అచారం ఉందంటే ఆశ్చర్యంగా దిగులుగా ఉంటుంది.నెలసరి ,ప్రసవం ఏది జరిగిన ఆడవాళ్ళు ఇంట్లోకి వచ్చే వీలుండదు. కొన్ని ఊర్లలో ఇది అరిస్టం. అంచేత ప్రసవం అయినా మొదటి ఐదురోజులూ నెలసరి వచ్చిన ఐదురోజులు,లేదా మూడు రోజులు ఊరి బయట ప్రత్యేకంగా వేసిన గుడిసెల్లో కాలక్షేపం చేయవలసిందే. ఈ గుడిసెలను మట్టు గుడిసెలు అంటారు. ఇందులో ఉన్నన్ని రోజులు వండుకు తినేందుకు బియ్యం కొన్ని సరుకులు ఉంటాయి. స్త్రీలు ఎవ్వరికి కనిపించకుండా వంటరిగా […]

టేస్టీ జ్యూవెలరీ

చిన్న పిల్లలు పుట్టిన రోజులో వాళ్ళకీ,పెద్ద వాళ్ళకీ సంతోషం ఇచ్చేవే. కొత్తగా పిల్లలు సంతోషపడేలా,మంచి ఫుడ్ ఎంజాయ్ చేసేలా పెద్దవాళ్ళు చాలా ప్లాన్ చేస్తారు. ఎన్నో ఈవెంట్స్ గురించి ఆలోచిస్తారు. బెలున్లూ,టోపీలు రోజులు పోయాయి. ఇప్పుడు కొత్త ప్రయత్నాలు అలా పుట్టుకొచ్చాయి.తినే కుకీలు,బిస్కెట్లు,డోనట్స్ తో నెక్లెస్ లు ,పెండెంట్లు తయారు చేయటం. పిండిని రకరకాల మేల్ట్ ల్లో పెట్టి చేక్ చేసి వాటిపైన తినే గ్లిటర్ తో మెరుపుల పూసలు రత్నాలు అంటించి పిల్లల మెడల్లో హారాలు,లాకేట్స్ […]

ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్

భారత దేశంలో విమానయాన ఫైర్ ఫైటర్ గా 29 ఏళ్ళ తానియా సన్యాల్ ఎంపికైంది. ఇప్పటివరకు పురుషులే ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 3,310 మంది ఫైర్ ఫైటర్స్ పని చేస్తూ ఉండగా కలకత్తాకు చెందిన తానియా సన్యాల్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని కలకత్తా ఎయిర్ ఫోర్ట్ లో బాధ్యతలు స్వీకరించింది.విధి నిర్వహణలో భాగంగా 161 మందితో కూడిన పురుషబృందంతో జూనియర్ అసిస్టెంట్ గా పని చేయటంతో పాటు కలకత్తా సమీపంలోని నారాయనపూర్ లో […]

ఎన్నో ప్రయోజనాలు

క్రమం తప్పకుండా యాలకులు ఆహారంలో భాగంగా వాడితే అవి డిప్రెషన్ దూరం చేస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఒక యాలకు పలుకుతో నోట్లో తాజా శ్వాస వస్తుంది. ఇంత చిన్న ప్రయోజనంతో పాటు యాలకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఆస్తమాకు యాలకులు మంచి వైద్యం వేడిపాలతో యాలకు పొడి కలిపి తాగితే అవి ఊపిరితిత్తుల్లోకి ఇన్ ఫ్లమేషన్ ను నివారిస్తాయి. డయాబెటీస్ ని ఆలస్యం చేయటంలో లేదా నివారించటంలో కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక […]

ఆహారం,వ్యాయామం రెండూ అవసరం

ఫిట్ నెస్ విషయంలో శ్రధ్ధ పెరిగాక వ్యాయమాలు విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు యువతులు.ఏరోబిక్స్ వంటి వ్యాయామం ఇక గంట పాటు చేస్తే మూడు నుంచి నాలుగు వందల కేలరీలు ఖర్చవుతాయి. జిమ్ లో గంట పాటు శ్రమ పడ్డాక నేరుగా ఆఫీస్ పనులకు లేదా ఇంటి పనుల్లో మునిగిపోతే సరైన ఆహారం అందకపోతే అలసట రావటం ఖాయం .చక్కని ఆహారం ,వ్యాయామం రెండూ సమాంతరంగా సాగాలి. అరటి యాపిల్ వంటి పండ్లు ఖర్జూరం లేదా ఎండుద్రాక్ష […]

డిజైనర్ బెల్ట్ అందం

అనార్కలీ,లాంగ్ కుర్తీలో ఎప్పుడూ బావుంటాయి. వీటికి చున్నీలు తప్పని సరిగా వేసుకొంటూ ఉంటారు. ఆ చున్ని ఎటూ కదలకుండా డ్రెస్ తో పాటు మ్యాచింగ్ బెల్ట్ ఇప్పుడూ ఫ్యాషన్. ఈ డిజైన్ చేసిన బెల్ట్ నడుము దగ్గర పెట్టుకొని అందులో చున్నీని బంధిస్తే అది కదలకుండా కంఫర్ట్ గా ఉంటుంది. పెద్దవాళ్ళ ఫ్రాకులు కుర్తీలు ఇలా డిజైనర్ బెల్టులు ఫ్యాషన్ ట్రెండ్. ఈ బెల్ట్ అందంగా మెరుస్తూ అందమైన బంగారు వడ్డానం పెట్టుకొన్నంత అందంగా ఉన్నాయి.లాంగ్ గౌన్స్ […]

పది నిమిషాలు చాలు

ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే కాసేపు పార్లర్ లో ఫేషియల్ చేయిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఉద్యోగ జీవితం మొదలయ్యాక ఆ అవకాశం ,సమయం ఉండదు. మరి పగలంతా ఆఫీస్ లో గడిపీ సాయంత్రం ఏ ఫంక్షన్ కో రెడీ అవ్వలంటే పదినిమిషాల్లో మొహం ఫేషియల్ చేసిన అందం రావాలంటే ఫేస్ షీట్ మాస్కులు మార్కెట్లో కొచ్చాయి. ఏ చర్మం తీరు అయినా పర్లేదు. పల్చని ఫైబర్ షీటుని ముఖాకృతిలో కత్తిరిచ్చి దానికి సిరమ్ ,ఫ్లోలర్ సెంట్ విటమిన్లు ,న్యూట్రియంట్లతో […]

మంటో సినిమా చూశారా ?

సాదత్ హాసన్ మంటో కేవలం స్త్రీల గురించి మాత్రమే ,అందునా వేశ్య వాటికలో ఎన్నో హింసలకు గురయ్యే స్త్రీల గురించి గొప్ప కథలు రాశారు. ఆయన రాసిన అద్భుతమైన కథలు ,భోల్ దో ,టాబా ,టేక్ సింగ్,ఠండా ఘోష్ కథలన్ని కలపి మంటో పేరుతో సినిమా తీశారు నందితా దాస్. రచయిత సాదత్ మంటో పైన గౌరవంతో ,ప్రేమతో ఆయన పాత్రలో నటించిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం తీసుకొన్నడట. […]

డార్క్ అండ్ లవ్ లీ

కెనడా నుంచి జైనాబ్ అన్వర్ అనే నటి డార్క్ అండ్ లవ్లీ పేరుతో పోస్ట్ చేసిన ఒక ఫోటోని లక్షల మంది అభినందిస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన చిత్రకారిణి వసే కా నహర్ చామన చాయతో ఉన్న ఒక యువతి చిత్రాన్ని గీసి ఆ యువతి చేతిలో డార్క్ అండ్ లవ్ లీ పేరుతో ఉన్న ఒక బ్యూటీ క్రీం ట్యాబ్ ను ఉంచింది. నల్లగా ఉన్న అది కూడా గొప్ప అందమేనని చెప్పేందుకే నేను ఆ […]

ఇంటికి అందం

ఇల్లంత పూల కుండీలు పచ్చ పచ్చగా మొక్కలు ఉంటే చాలా బావుంటుంది. ఆ కుండీలు ఇంటి అందాన్ని పెంచేలా ఉండాలి. అందులో పచ్చని మొక్కలు మరింత సొగసుగా ఉండాలి.అప్పుడు మినీ కుండీలు వాటిలో పెరిగే సక్రులెంట్లు కనిపెట్టారు. ఇంటీరియర్ డెకొరేటర్లు బుల్లు బుల్లి కుండీలు జంతువులు,పక్షులు,పువ్వులు,గవ్వలు,కప్పలు ఆకృతిలో ముచ్చటగా ఉంటే వాటిలో పెరిగే సక్యులెంట్ ప్లాంట్స్ మరింత అందంగా ఉన్నాయి. ఇందులో చక్కని కుండీలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఇమేజ్ చూసి […]

పరిశ్రమ అన్ని ఇచ్చింది

ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొంటే నేను చేసిన ప్రయాణం అద్భుతం .ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇక్కడకు అడుగుపెట్టాను. నటిగా ,నిర్మాతగా నిలదొక్కుకున్నాను .ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన చిత్రపరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నాను అంటోంది అనుష్కశర్మ. ఆమె నటించిన సూయీధాగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు నేను వ్వక్తిత్వం ఉన్నా మనిషిగా నిలబడ్డాను అంటే చిత్రపరిశ్రమే కారణం .నువ్వు సరిగ్గా ఏది కోరుకంటే అదే ఇస్తుంది. పరిశ్రమ కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వదు అంటోంది […]

అలా ప్రతిసారి జరగదు

ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ఒక అద్భుతం. ప్రతి సారి ప్రతి సినిమాతో అలాంటి అద్భుతాలు సాధిస్తామా అంటే అసాధ్యం. అసలు అన్నీ సృష్టించ లేము కూడా. మహానటి నా జీవితంలో జరిగిన ఒక మిరకిల్. నేను నటించాను అంతటి కీర్తి ప్రతిసారి రాదు అంటోంది కీర్తి సురేష్ . సహజంగా ఒక గొప్ప చిత్రం చేసిన తర్వాత ఒత్తిడి నాపైన అంచనాలు కూడా ఉంటాయి. ఎలాంటి కథా? ఎలాంటి పాత్ర అని కాస్త గందరగోళం వస్తుంది. […]

ఎప్పుడైనా తాగవచ్చు

బ్రేక్ ఫాస్ట్ తర్వాత పాలు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుందా? పెరుగుతుందా అని చేసిన పరిశోధనలో తృణ ధాన్యాలు,బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొన్నాక పాలు తాగితే రక్తం చక్కెర నిల్వలు తగ్గయని రుజువైంది.ఇది మధుమేహ రోగులకు ఉపయోగపడే రిసెర్చ్.షుగర్ పేషంట్ల పాలు తాగటం మంచిది కాదని అభిప్రాయం ఉంది. కానీ ఈ తాజా పరిశోధన తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ,మధ్యాహ్నాం భోజనం తర్వాత కూడా పాలు తాగినా మంచిదే నంటున్నారు పరిశోధకులు.అధిక ప్రోటీన్లు […]

దివ్వంగా తల్లి ఆరోగ్యం

బిడ్డ పుట్టిన ఐదు నెలలు, అంతకుమించి వారికి పాలిచ్చిన తల్లుల ఆరోగ్యం చాలా బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి.బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు35 శాతం తగ్గినట్లు ఒక రిపోర్ట్ చెపుతుతోంది. పుట్టిన బిడ్డకు పాలివ్వటం ద్వారా స్త్రీలు ప్రసవ సమయంలో పెరిగె బరువును తగ్గించుకోవచ్చని ,అంతే గాకుండా హార్మోన్ ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీరు చెబుతున్నారు. ఈ స్ట్రోజన్ హార్మోన్ పని తీరు తో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల రోమ్ము క్యాన్సర్ వచ్చే […]

కార్బో హైడ్రెడ్స్ అవసరం

ఇప్పుడు చాలా మంది కార్బహైడ్రెడ్స్ ఉండే డైట్ తీపుకోవటం మానేశారు,బరువు పెరుగుతామనే భయంతో పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ లాసెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయన కారులు సుదీర్ఘకాలం అధ్యయనాలు నిర్వహించారు. 50నుంచి 55 ఏళ్ళ వయసు వారి ఆహారపు అలవాట్లపైన జరిపిన అధ్యయనంలో కార్బో హైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారిలో 68 శాతం అకాల మృత్యువుకు దగ్గరయ్యారని కనుగొన్నారు. కార్బోహైడ్రెట్స్ తీసుకొన్న వారి శరీరం ,ఎముకులు ఆరోగ్యంగా చక్కగా ఉందని పాస్తా,బ్రెడ్ ,బంగాళదుంపలు తరుచూ తినే […]

రాగి ఇత్తడి పాత్రలు ఆరోగ్యం

రాగి,ఇత్తడి పాత్రలు వాడండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. రాగి పాత్రల్లో మూడు గంటల పాటు నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయట. దీనితో ఆ నీరు పరిశుభ్రంగా మారుతోంది. అలాగే ఇత్తడి బిందెలు జింక్ ,రాగి మిశ్రమంతో తయారు అవుతాయి.జింక్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఇత్తడి పాత్రల్లో నీరూ ఆరోగ్యం,అలాగే వంటచేకొన్న ఆరోగ్యమే .రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల అసిడిటీ,అజీర్ణం ,డయేరియా కీళ్ళ నొప్పులు […]

ఆస్కార్ కు అస్సామీ చిత్రం

దర్శకురాలు రీమాదాస్ ,రచయితగా నిర్మాతగా ,ఎడిటర్ గా ఛాయా గ్రహకురాలుగా అన్ని తానే అయి నిర్మించిన విలేజ్ రాక్ స్టార్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అ అస్సామీ చిత్రం విలేజ్ రాక్ స్టార్ పోటీల్లో నిలబడనున్నది.ఒక నిరుపేద బాలిక రాక్ బ్యాండ్ నడపాలన్న తన కోరిక నెరవేర్చుకొనేందుకు ఎంత తపించిందో ఈ చిత్రం […]

ముఖంపై ముడతలా?

ముఖంపైన ముడతలు అనిస్తుంటే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు గుర్తించమంటున్నాయి అధ్యయనాలు. సాధారణంగా వృద్ధాప్యంలో మొహం,మెడ,చేతులపై ముడతలు కనిపిస్తాయి అవి సహజమే కానీ మధ్య వయసులో 40నుంచి50ఏళ్ళ వయసులో మొహాంపైన ముడతలు వస్తే మాత్రం గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయని గుర్తించి డాక్టర్ ను కలుసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.శరీరంపై ఏర్పడే ప్రతి చిన్న మార్పు ఏదో ఒక విషయానికి సంకేతంగా భావించాలి. ముఖంపై ముదతలు అనిపించగానే ఏ ఫేషియల్ కు లేదా యాంటీ ఏ జింగ్ క్రీముల కోసం […]