August 2018
కోపిష్ఠిని
ఆ.ఆ లో నేను నటించిన నాగవల్లి క్యారెక్టర్ లాగే కోపం వస్తే మారిపోతా …మనం కరెక్ట్ గా అన్ని పనులు చేస్తాం,ఇతరులు చేయకపోతే అందరికీ నష్టం కదా.అలాంటప్పుడు నాకు విపరితమైన కోపం వస్తుంది.ఇంకెందుకు చెప్పటం. నిజానికి ఆ కోపమే నా మైనస్ అంటోంది అనుపమ పరమేశ్వరన్ . నేను చాలా సెన్సిటివ్ చాలా కూల్ గా ఉంటాను .ఎవ్వరినీ పల్లెత్తు మాట అని బాధపెట్టటం నిజంగా ఇష్టం లేదు. కానీ ఒక్కోసారి కోపం ఇవన్ని డామినేట్ చేస్తుంది. […]
అపురూపమైన నగలు
ఎన్నో అందమైన నగలోస్తున్నాయి. కానీ ఇంకో అధ్భుతమైన నగ మార్కెట్లోకి వచ్చింది . అది బిఎమ్ జ్యువెలరీ. తెలుగులో తల్లిపాలతో చేసే ఆభరణం సహాజంగా ఒక సెంటిమెంట్ ఈ ఆభరణాన్ని ఒకే అనమంటుంది.ఆర్డర్ ఇచ్చిన అమ్మ దగ్గర నుంచి పాలు సేకరిస్తారు. వాటిని టెస్ట్ ట్యూబ్ లో సిరప్ బాటిల్స్ లో పంపుతారు.పాలను స్టెరిలైజ్ చేసి వారం రోజుల పాటు ఆటోక్లేవ్ లో భద్రపరుస్తారు. పాలు ముద్దగా అవుతాయి. అందులోంచి కొవ్వు తీసేసి కొన్ని కెమికల్స్ కలిపి […]
అసాధ్యం కాదు
లారీగురూ …లారీలకు లారీలను లోడ్ కోసం బుక్ చేసుకోనే ఒక సంస్థ తిరుపతికి చెందిన ఎ.ఆర్ మంజూష ఈ లారీ ట్రాన్స్ ఫోర్ట్ వ్యాపారం చేస్తోంది. ఆన్ లైన్ లో కిరాయి లారీలను బుక్ చేసేందుకు మంజూరష లారీ గురు పేరుతో వెబ్ సైట్ ఓపెన్ చేసింది. డ్రైవర్లు ,లారీ యజమానుల వివరాలు ఇందులో ఉంటాయి. చిత్తూరు జిల్లా నగరిలో ఆఫీస్,కాల్ సెంటర్ నడుస్తుంది. 20 వేల మంది లారీ యజమానులు ఈ వెబ్ సైట్ లో […]
నిషేధాలు అంతరిస్తున్నాయి
ప్రపంచం చాలా మారిపోయింది. మహిళలపై సమాజం విధించిన ఎన్నో నిషేధాలు చెదిరిపోతున్నాయి. ఈ విషయం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కర్మకాండాల సందర్భంగా ప్రపంచం అన్ని టీవీల్లో వాజ్ పేయి పెంపుడు కూతురు నమిత కౌల్ భట్టాఛార్య ఆయిన చితికి నిప్పు పెట్టటం, తర్వాత ఆయన అస్థికలు నిమజ్జనం చేయటం అందరూ చూశారు. సామాజిక పోకడల పరిశోధకులు దీన్ని గొప్ప మార్పుగా అభివర్ణించారు. తల కొరివిపెట్టటం, స్మశానానికి వెళ్ళటం ఇతర క్రియలు ఏవి […]
ఇదోక వేడుక
షేస్ బుక్ లో ఎన్నో చిత్రమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. గ్రూప్ లు ఉండటం ,ఎన్నో విషయాలు ఫేర్ చేయటం వల్ల కొన్ని విశేషాలు కూడా బయటకు వస్తాయి.యూఎస్ లోని అరిజోనా రాష్ట్రంలోని మెసాపట్టణంలో బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్ ఐసియులో సేవలు అందిస్తున్నా మొత్తం 16 మంది నర్సులు గర్భిణులే నన్నా సంగతి ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా బయటకి వచ్చింది. నర్స్ లు ఒకరికోకరు షేర్ చేసుకొంటున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది […]
ఈ పరుగుల రాణి వయసు 102
ఆమెకు 102 సంవత్సరాలు. పేరు మన్ కౌర్ కెనడాలోని వాంకోవర్ నగరంలో వంద మీటర్ల రన్నింగ్ ట్రాక్ లో ఒకటిన్నర నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారామే. ఆమె తో పాటు పోటీ పడిన వాళ్ళు డెబ్బై ,ఎనభై ఏళ్ళ వాళ్ళున్నారు. అందులో నూరేళ్ళు దాటిన మనిషి మన్ కౌర్ ఒక్కరు. ఆమె కొడుకు గురుదేవ్ సింగ్ కు 78 ఏళ్ళు .గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఆమె పేరు నమోదు అయింది.తల్లీ […]
ఏది అత్యంత సువాసన
సువాసన గల పెర్ఫ్యూమ్ కొనాలి అనుకొంటాం .వరుసగా ఎన్నో బ్రాండ్స్ ,ఏన్నో రకాల ఆకారాలతో అందమైన సీసాలు ఏది కొనాలి,ఏ పరిమళం ,ఎంతసేపు చెడిపోకుండా ఉంటుందో అర్ధం కాదు. ఫ్యూర్ పర్ ఫ్యూమ్,ఓద పర్ ఫ్యూమ్ ,ఓద టాయ్ లెట్ అన్ని సెంట్ లలో రకాలుంటాయి. సెంట్ తయారైన తీరు వాటిలో గాఢతను తెలిసే పేర్లు ఇవి. సెంట్ తయారీలో సింథటెక్ నూనెలకు ఆల్కహాల్ కలుపుతారు. ఈ రెండింటి కొలతలకు సంబందించి సెంట్ ఘాట్ నిర్ణయించుకోవాలి. ఫ్యూర్ […]
బంగారు వెండి నగలే మ్యాచింగ్
ఎన్నో శుభకార్యాలు ,ప్రత్యేక రోజులు ,సరదాగా ఈవినింగ్ షికార్లు ,పార్టీలకు రకరకాల చీరెలు ,నగలు ఉంటాయి. ఎలాంటి దుస్తులకు ఏం నగలు ఎంచుకోవాలో ఎప్పుడు సమస్యే .ఏ ఆభరణాలకు ఏ రంగులు నప్పుతాయి. బ్లాక్ అండ్ వైట్ బంగారానికి పర్ ఫెక్ట్ మ్యాచింగ్ ,బంగారు నగలకు ఈ కాంభినేషన్ బావుంటుంది. సాయంత్రం వేళల్లో డీప్ బ్లూ వంటి గాఢమైన రంగులకు బంగారు నగలే అందం ఇస్తాయి. ఇక నలుపు ఎప్పుడూ తిరుగులేని ఫ్యాషన్ .సిల్వర్ ఆభరణాలు,బంగారు ఆభరణాలు […]
కొంచెం మృదువుగా
ఉదయం వేళ సాధరణంగా ఇడ్లీ,దోసె తింటాం కానీ ఎప్పుడు అదే కాకుండా రెండు మూడు రకాలతో శక్తి,పోషకాలు అందేలా చూసుకోవచ్చు.ఓట్స్ ఇవి మంచి అల్పాహారం. ఇందులో బీట గ్లూకోన్ ఉంటుంది.శరీరంలో కొవ్వును తగ్గించగలదు. మాంసకృత్తులు ఉండాలనుకుంటే పాలలో ఉడికించి తీసుకోవచ్చు.లేదా ఉదయాన్నే ఓట్స్ ను పెరుగు ,ఇడ్లి రవ్వతో కలిపి ఇడ్లీగా వేసుకుని తినవచ్చు.జతగా ఉడికించిన గుడ్డు చీజ్ వంటివి పండ్ల ముక్కలు తీసుకున్న మంచి ఆహారం అవుతుంది.పండ్లలో ఎన్నో పోషకాలు పొటాషియం,పీచు ఉంటాయి.ఉదయపు ఆహారంలో పండ్లు […]
పెడిక్యూర్ ఇంట్లోనే
కాస్త శ్రద్ద పెడితే ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. దీనివల్ల పాదాలు ఆరోగ్యం బావుంటుంది.పగుళ్ళు పోతాయి. ఒక టబ్ నీళ్ళలో ఎసెన్షియల్ ఆయిల్ కాస్త షాంపూ గులాబీ బంతిపూల పొడివేసి అందులో పాదాలను ఓ అరగంట నాననివ్వాలి. తర్వాత ప్యూమిస్ రాయితో కాళ్ళను రుద్దితే మృతకణాలు పోతాయి. పంచదార,తేనె,శనగ పిండి మిశ్రమం పాదాలకు పట్టించి నూనె రాసుకున్న చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత నీళ్ళలో కడిగేస్తే సరి. పాదాలు చక్కగా మురికి లేకుండా మృదువుగా కనిపిస్తాయి. గోళ్ళు […]
చీరెల్లోనే స్టైల్
చాలా కాలంపాటు అలవాటుగా డ్రెస్ లు వేసుకున్న కాస్త పెద్దయ్యాక చీరెలు కడితే బావుండనిపిస్తుంది.కనీసం కొన్ని ప్రత్యేక సందర్భాలలో కట్టుకునేందుకు చేనేత రకాల చీరెలు ఎంచుకోవచ్చు. బ్లౌజ్,కాలర్ నెక్ తో ఇకాత్,కలంకారీ వస్త్రశ్రేణి ఎంచుకుంటే చాలా బావుంటుంది. చీరె ప్రింట్ అయితే బ్లవుజ్ సాదాగా కాస్త ప్రత్యేకంగా ఉండాలంటె సాదా చీరెకు బారీ ఎంబ్రాయిడరీ బ్ల్లవుజ్ అయితే ఇంకాస్త బావుంటుంది. లేత రంగుల్లో పట్టు ఫ్యాన్సీ చీరెలు బావుంటాయి. సాయంత్రం వరకు నలిగిపోకుండా ఉండాలంటే సిల్క్,జార్జెట్ తరహా […]
పండగ శోభతో
పూజలు,వ్రతాలు,పిలుపుల్లో కుంకుమ భరణి ఉండాల్సిందే.బంగారం,వెండితో చేసిన గుండ్రనివో లేదా పొడుగ్గా డబ్బలాగా ఉండేవో పూర్వం ఉండేవి. ఇప్పుడు రూపురేఖలు మారిపొయాయి. బంగారు కుంకుమ భరిణెలు,ముత్యాలు ,పచ్చల కెంపులతో ఎన్నెన్నో ఆకృతులలో పండగ శోభను కనబడేలా చేస్తున్నాయి. దేవతా రూపాలు,ఏనుగులు,నెమళ్ళు ఇలా ఎన్నో చక్కని డిజైన్లు కనిపిస్తున్నాయి.వెండి,బంగారం మాత్రమే కాదు వన్ గ్రామ్ గోల్డ్ కుంకుమ భరణి లకైతే ఎంతో డిమాండ్ కూడా ఉంది.ఈ పండగ రోజుల్లో కుంకుమ భరిణలు కానుకగా ఇస్తారు కదా.
ఎంతో విలువైన పువ్వు
తామర గింజలు తామర కాడ లోపల భాగాల కోసం వేళ్ళ లోని దుంప కోసం చైనాలో వేల ఎకరాల్లో తామరను పెంచుతారట. వేయించిన తామర గింజల్నీ కూరలుగా వండుతారు.పిండిలో,కేక్ లలో ఐస్ క్రీమ్స్ లో వాడతారు. తామర మన దృష్టిలో అందమైన పువ్వు ఇందులో ఉండే పోషకాలకు అంతులేదు. ఈ పూ రేకులను గ్రీన్ టీలా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఫుడ్ డెకరేషన్లో వంటల్లో తామర పూలు కాడలు వాడతారు. దుంపలు,కాడలు ఉడికించి తింటె మంచిది. […]
ఆహారమే ఔషధం
ఎన్నో మనసుని బాధించే విషయాలు మెనోపాజ్,పరీక్షల ఒత్తిడి లాంటి సమస్యలతో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు.ఈ సమస్యకు మందులు వద్దు మంచి ఆరోగ్యకరమైన ఆహారంతో పరిష్కారం ఉంది అంటున్నాయి అద్యాయనాలు. స్వీట్లు,ప్రాసెస్ డ్ పదార్ధాలు మానేసి చక్కని పోషకాహారం తీసుకుంటె డిప్రెషన్ తగ్గుతుంది.శరీరంలో సెలీనియం తగ్గితే డిప్రెషన్ లక్షణాలు వస్తాయి.ముడి ధాన్యాలు సీ ఫుడ్ తో ఈ సమస్య పోతుంది అంటున్నారు.విటమిన్ డీ లోపం వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతిరోజు ఎండలో […]
అంత టైమ్ ఇవ్వలేను
హాలీవుడ్ లో నటించమనే ఆఫర్లు ఎఫ్పుడు ఉన్నాయి కానీ అక్కడ బల్క్ డేట్స్ ఇవ్వాలి. రెండు మూడు నెలల పాటు కాల్షీట్లు మొత్తం ఇవ్వాలి.అవి ఒప్పుకుంటె ఇక్కడ చిత్రాలు చేయలేను. అందుకే ఆ సినిమాలకు దూరంగా ఉన్నా అంటుంది ఐశ్వర్య రాయ్.చాలా విషయాల్లో నేను అదృష్టవంతురాలిని మంచి పారితోషికం చక్కని సినిమాలు నన్ను చాలా త్వరగా ఫీల్డ్ లో నిలబెట్టాయి.మోడలింగ్ రోజుల నుంచి పారితోషికం విషయంలో నాకు ఎలాంటి సమస్య రాలేదు. నేను పెద్దగా జిమ్ కి […]
ఆమె పేరు నిలబెడతా
మానవత్వం కరుణ దయా వంటి మంచి భావనలతో మంచి వ్యక్తిగా ఉన్నవాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారు.వినయం,కృతజ్ణత మనల్ని ఎదిగేలా చేస్తాయి అనేది అమ్మ. ఆ మాటాలను ఎప్పుడు నేను మరిచిపోను అంటుంది జాన్వీ కపూర్. ధడక్ సక్సెస్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తబ్త్ లో నటిస్తుంది ఆమె. మా అమ్మ గొప్ప సెలబ్రిటీ అయినా తను మా కోసం ఎన్నో పనులు మాములు గృహిణి లాగ అమ్మలాగా చేసేది. మాకు జుట్టుకు నూనె మసాజ్ లు […]
గోడంత దేవుడు
పండగ వస్తే చిన్న రాతి బొమ్మనో ,వెండి బొమ్మనో లేదా చక్కని దేవుడి ఫోటోనో పెట్టేసి ఏ మల్లెల దండనో చేమంతుల దండో వేస్తే ఇంటికే అందం వచ్చేది. ఇప్పుడు కథ మారింది. పండగకు ఇల్లే దేవాలయం అయిపోతుంది. ఫోటోలకు బదులుగా అందమైన వాల్ పేపర్లు వచ్చాయి.అచ్చంగా దేవుడే మనల్ని చూసి నవ్వుతున్నట్లు త్రీడీ బొమ్మలు వచ్చాయి.ఈ నెలలో వరలక్షీ వ్రతం, కొద్ది రోజుల్లో వినాయక చతుర్ధి ఈ పండగల కోసం అందమైన అలంకారాలలో వాల్ పేపర్లు […]
ఇద్దరికీ ఆరోగ్యం
ఇప్పటికీ ఇళ్ళలో బాలింతల ఆహరం గురించి ఎన్నో నమ్మకాలున్నాయి. ఆపరేషన్ అయితే కుట్లు చీము పడతాయని పప్పు తినొద్దని పెరుగు,పండ్లు తింటే బిడ్డకు జలుబు చేస్తుందని బాలింతలు కారంపొడి తినాలని పెద్దవాళ్ళు చెబుతారు. కాని డాక్టర్లు బాలింతకు 600 కేలరీల శక్తి అవసరం అంటారు. తల్లిపాల ద్వారానే బిడ్డ శారీరకంగా మానసికంగా ఎదుగుతుంది. తల్లి పౌష్టిక ఆహారం తప్పక తినాలి. ఆహారంలో అన్నం పప్పు అన్ని రాకాల కూరగాయలు,మాంసా హారులైతే మాంసం తీసుకుంటేనే తల్లి త్వరగా తేరుకుంటుంది. […]
పిల్లలకు నచ్చేలా
ఇంట్లో వండినవి పిల్లలకు నచ్చటం లేదు. ఏం చేసిన బోర్ అంటారు చాలా మంది తల్లులు. కాలం వేగంగా మారుతుంది. ఆ కాలానికి తగ్గట్లు పిల్లలతో పాటు తల్లులు మారాలి. ఇప్పుడు టీవీల్లో ప్రతి రోజు ప్రతి చానల్ లో వంటల ప్రోగ్రాంలు వస్తూంటాయి. ఎక్స్ పర్ట్స్ వండుతారు.వెంటనే ఆ గిన్నెలు, పెనాలు అవతలపెట్టి ఆ ఆహారాన్ని అందంగా డెకరేట్ చేసి మరి చూపెడతారు,కూరగాయలతో పువ్వులు,పక్షులు తయారు చేసి ఆహార పదార్ధాల పైన అలంకరణ కోసం పెట్టి […]
నీళ్ళ వ్యాపారం
లీటర్ బాటల్ నీళ్ళధర రూ 65లక్షలు.కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ నీళ్ళను తయారు చేస్తున్నారు. అక్కడి పర్వత శిఖరాల పై నుంచి జారిపడే నీళ్ళను చాలా అతి జాగ్రత్తగా పట్టి విటమిన్లు ఖనిజాలు కలిపి తయారు చేసే ఈ నీళ్ళు చాలా రుచిగా ఉంటాయట. ఈ నీళ్ళ సీసా కూడా ప్రత్యేకం .ఈ బాటిల్ మూత అచ్చమైన బంగారం ,చుట్టు తెల్లని వజ్రాలు పొదిగి ఉంటాయట. ఇవే కాదు ఖరీదైన నీళ్ళు అమ్మే సంస్థలు ఇంకా […]
