August 2018
పండ్ల తోక్కల్లో శక్తి
నీటి కాలుష్యంతోనే సగం అనారోగ్యాలు .నీటిని శుభ్ర పరిచేందుకు ఎన్నోన్నో ప్రయోగాలు చేస్తారు. శాస్త్రవేత్తలు .డికిన్ సన్ కాలేజీ శాస్త్రవేత్తలు తాము ఎన్నో ఏళ్ళుగా గుమ్మడి విత్తనాలు మొదలుకొని అరటి తోక్కల వరకు ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశామని ,నీళ్ళలో మాత్రం రంగులు లోహాల వంటి కాలుష్యాలు తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగ పడతాయని పరిశోధనల్లో తేలిందన్నారు. కాయగూరలు ,పండ్ల తొక్కలు నీటిలో ఉడకబెట్టి ,ఆ తరువాత ఆరబెట్టి పొడిచేశామని ఈ పొడితో కాలుష్యాలు పోయాయన్నారు. నిమ్మ […]
ఎంతో జుట్టు
ఆరునెలల పాపాయి చాంకోకి ఇన్ స్ట్రాగ్రామ్ లో 72వేల మంది అభిమానలు ఉన్నారు.ఆ వయసులో ఈ పాపాయికి ఉన్నా జుట్టు ఈమెకి అభిమానులను తెచ్చిపెట్టింది. చాంకో వెంట్రుకలు రెండు మూడేళ్ళ పిల్లలకు పెరిగినట్లు ఉంటాయి. చూట్టానికి ఎంతో బావుండటం ,బుల్లి పాపాయి తలకి అంత జుట్టు కిరిటంలా అమరి ఉండటంతో చాంకో కి ఎందరో అభిమానులైయ్యారు. పాపాయి ఫోటోలు చూస్తే ఈమె సెలబ్రీటీఎలా అయిందో తెలిసిపోతుంది.
మెరుపే మెరిసే
నగల్లో కొత్త డిజైన్స్ ఎప్పటికప్సుడు మార్కెట్ లో విడుదల అవుతునే ఉంటాయి. రెడీ మెడ్ చెయిన్ లలో ఇప్పడు ఇటాలియన్ చెయిన్ ఫ్యాషన్ 18 క్యారెట్ల బంగారంతో తయారయ్యే ఈ సిగిల్ చెయిన్ లో జిగ్ జాగ్ గా మెరిసి పోతుంటాయి. మిరుమిట్లు గొలిపే ఈ హారాలు ఏ మాత్రం పాడైనా తిరిగి రిపేర్లు కుదరవు ,కానీ గొలుసు మాత్రం పగలు రాత్రి అని చూడక్కర్లేదు చమక్ మని మెరుపులే మెరుపులు. ఇమెజెస్ లో ఎన్నో డిజైన్లు […]
ఓన్లీ లేడీస్
ఆడవాళ్ళకు మాత్రమే ఒక ద్వీపం ఉంది. 84 ఎకరాల ఈ ద్వీపంలో సూర్యుడు ఎప్పుడు సముద్రంలోంచి వస్తున్నట్లే ఉంటుంది. ఇంత అందమైన ద్వీపానికి ఓనర్ క్రిస్టియానా రోత్ ,ఫిన్లాండ్ లో ఉన్న ఐలాండ్ కోసం సూపర్ షీ ని నిర్మించారు. ఆడవాళ్ళకి కూడా ఓ ఫ్రైవేట్ స్పేస్ ఉండాలని క్రిష్టియానా రూత్ ఉద్దేశ్యం. జూన్ 28వ తేదీ నుంచి ఎంట్రీలు మొదలయ్యాయి. ఇప్పటికే 84వేల మంది మెంబర్ షిప్ తీసేసుకున్నారు. ఆన్ లైన్ లో సూపర్ షీ […]
షారూక్ గారమ్మాయి
ఆగస్ట్ 2018 ఓగ్ కవర్ పేజీపైన షారూక్ ఖాన్ ,గౌరీఖాన్ ల గారాల బిడ్డ సుహానాఖాన్ అందంగా కనిపించింది. ఓగ్ మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటో షూట్ జరిగినందుకు షారూక్ అంతులేని ఆనందం వ్యక్తం చేస్తూ ఓగ్ కు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో తన పితృప్రేమను వ్యక్తం చేశాడు. గౌరీఖాన్ కూడా ఎంతో ఆనందపడి ,డిజైనర్ అనితా అడ్జానియ డిజైన్ చేసిన అందమైన డ్రెస్ లతో సుహానాఖాన్ ఫోటోలు ట్విట్టర్ లో పోస్టు చేసిందట. మొత్తానికి […]
మీకే మంచిది
రోజు చేసే వ్యాయామం ఎంత సమయం అని అమెరికా సంస్థ ఒకటి అధ్యయనం చేస్తే 18 నుంచి 64 ఏళ్ళ మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలు కొంచెం తీవ్రత ఉండే గుండే సంబంధిత వ్యాయామాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేల్చింది. ఈ ఒక మోస్తరు వ్యాయామంలో వేగంగా నడవటం ఎత్తు పల్లాలు లేని చోట సైక్లింగ్ ,టెన్నిస్ ఆడటం,జాగింగ్ పరగులు ,ఈత ,బాస్కెట్ బాల్ వీటితో పాటు శక్తి నింపే కొన్ని వ్యాయామాలు […]
ఈ సీజన్ కు ఇవే
వర్షకాలంతో పాటు వాతావరణంలో సూక్ష్మ క్రిములు ,జల కాలుష్యంతో దోమలు వంటి కీటకాలు పెరుగుతాయి కనుక నీల్లు మరిగించి చల్లార్చి తాగటం మంచింది అంటున్నారు వైద్యులు. వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడి సూప్ లు శోంఠి,మిరియాల పొడి కలిపి తాగితే మంచిదని బియ్యం,గోధుమలు,కొర్రలు,బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి తింటే ఆరోగ్యమని ప్రతి వండే ఆహారంలోనూ డ్రైఫ్రూట్స్ ,గుమ్మడి గింజలు ,దోస గింజలు కలుపుకొంటే మంచిదని చెపుతున్నారు. పంచదారకు బదులు బెల్లం,నెయ్యి తినటం ఆరోగ్యమని వంటికి నూనె […]
సౌందర్యం ఇచ్చే స్క్రబ్
కప్పుకాఫీ తోనే తెల్లవారుతోంది ఈ ప్రపంచంలో సగం జనాభాకి ,ఒట్టిగా తాగేందుకే కాదు ఈ కాఫీపొడి చక్కని స్క్రబ్ .దీనితో7 చర్మం మృదువుగా అందంగా అయిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాఫీ పొడి ,చక్కెర ,ఆలివ్ నూనె ,విటమిన్ ఇ మాత్రల నూనె కలిపి ఒళ్లంతా పట్టించి మర్ధన చేస్తే మృతకణాలు పోతాయి. ఓ పావుగంట అలా వదిలేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చర్మం ఎంతో కాంతి వంతంగా మృదువుగా ఉంటుంది. ఇందులో ఏ రసాయనాలు […]
ఉపయోగం
ఎనిమిది నెలల వయస్సు ఉన్న పిల్లలకు ప్రతిరోజు ఏదైనా కథ చదివి వినిపిస్తూ ఉంటే వాళ్ళకు 18 నెలలు వచ్చే సరికి నలభై శాతం కొత్త పదాలు నేర్చుకొన్నారని అధ్యయనాలు గుర్తించాయి. ఏదీ చదవి వినిపింంచని పిల్లల్లో 16 శాతం పదాలు మాత్రమే నేర్చుకోగలిగారు. రంగు రంగుల బొమ్మలపై పుస్తకాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండాలన్నమాట. చిన్న వయసులో ఏర్పడ్డ ఆసక్తి చదవటాన్ని ఒక అలవాటుగా పరిచయం చేస్తుందన్నమాట. పిల్లలు క్రమంగా చదివే అలవాటు పెంచుకొంటూ ఉంటే వాళ్ళలో […]
మనుషులుండాలి
వంటరితనం ఎప్పుడూ ఆరోగ్యకరం కాదు అంటున్నాయి అధ్యయనాలు. అసలు మనిషి ఆలోచించే విధానంలో పది మందితో కలిసి జీవించే పద్ధతి ఉంది. మనిషికి స్నేహం కావాలి. ఆదరణతో నిండిన పలకరింపు కావాలి. ఊరటనిచ్చే మానవ స్పర్శ కావాలి. అసలు చుట్టు మనుషులే ఉండాలి. రకరకాల వయస్సుల్లో ఉన్న 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో వాళ్ళ ఆరోగ్యంపైన ఒంటరి తనం ప్రభావం పైన సర్వే నిర్వహిస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నప్పటికీ ఆరుదుగా […]
మార్పు అవసరం
ఇరవై ఏళ్ళ వయసులోనూ 30 ఏళ్ళదాటినా ఒకే రకం మేకప్ ,హెయిర్ స్టైల్ అలవాటుగా వాడే దుస్తులు బావుండవు. అన్ని వయసుకు తగ్గట్లు మార్చేయాలి. యవ్వనంగా ఉండాలి,పెద్ద మార్పు తెలియకూడదు అనుకొంటే ముందు హెయిర్ స్టైల్ మారాలి. కొత్త హెయిర్ స్టైల్ సందేహాం లేకుండా వయసు దాచేస్తుంది. అలాగే బ్రైట్ కేర్ ,బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ తో ఆపేసి పింక్ కచ్ కి మారమంటున్నారు .కంటి మేకప్ గురించి ఎక్స్ పర్ట్ సలహా తీసుకొంటే మంచిది.రౌండ్ […]
ఆలోచించను
నాకు కాస్త భక్తి ఎక్కువే .దేవుడిని అదృష్టాన్ని నమ్ముతాను అంటోంది పూజాహెగ్డే. అందుకేనేమో లైఫ్ లో ఏదైన ఆటుపోట్లు వస్తే బయటికి రావాలంటే ఎవరికైన కాస్త సమయం పడుతుంది. నేనైతే పది,పదిహేను నిమిషాల్లో బయటికి వచ్చేస్తా అంటోంది పూజా. జరిగిపోయిన విషయాల గురించి ఎంతసేపు ఆలోచించినా ఏం ప్రయోజనం .ఆలోచించటమే దండగా అందుకే నేనెప్పుడు భవిస్యత్ పైనే దృష్టిపెడతాను గతాన్ని వెంటనే వదిలేస్తాను. నాకెరీర్ వెనుక కర్త, కర్మ, క్రియ నేనే .నా వెనుక గాఢ్ ఫాదర్ […]
పెద్ద కష్టం కాదు
ప్రతిపనికి ఒక పద్దతి ఉంటుంది అలా పర్ ఫెక్ట్ గా దాన్ని ఆచరణలో పెడితేనే ఫలితం కనిపిస్తుంది. సన్నబడాలంటె ఇక దీర్ఘకాలిక ప్రణాళిక వెయ్యాలి. ముందు సమతూల ఆహారం శరీరానికి కావల్సిన శక్తి పోషకాలు అందేవిగా చక్కెర కొవ్వులు పిండి పదార్ధాలు లేకుండా ఆ ఆహారం ఉండాలి. ఏ ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువ మొత్తంలో తింటే అదో ప్రమాదం. మితంగా తింటూ వ్యాయామం చేస్తూ తప్పకుండా ఉదయం వేళ అల్పాహరం తింటూ ప్రాసెష్ చేసిన పదార్ధాలు దగ్గరకు […]
స్పెషల్ లుక్
ఏదైన స్పెషల్ గా కనిపించాలంటే లెహంగా ఎంచుకుంటే చాలు పూజలు,పుట్టిన రోజులు,చిన్నప్పటి అకేషన్స్ ఏదైన సరే చక్కటి వస్త్ర శ్ర్రేణిలో లెహంగా ప్లాన్ చేసుకుని దానిపై బూటీలు,కుచ్చిళ్ళు ఉండేలా డిజైన్ చేసుకుంటే చాలు ఎక్కడలేని అందం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. కంచిపట్టు బెనారస్ లో లెహంగా పైన మగ్గం వర్క్ చేయించి దానికి జతగా జార్జెట్,సిఫాన్ ఓణిలు చాలా అందంగా మ్యాచ్ అవుతాయి. పరికిణి ఓణి బ్లౌజ్ లు ఒకే రంగులో ఉన్న మూడు మూడు రంగుల్లో […]
జస్ట్ ఒక ఐడియా
ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే కొత్తగా ఏ దైన ఇవ్వగల ఒక ఐడియా కావాలి. ఖచ్చితంగా మార్కెట్ చేయగలిగినంత విలువైన ప్రోడక్ట్ అయి ఉండాలి. ఏ స్టార్టప్ చూసినా ఈ విషయం తెలిసిపోతుంది. హైదరాబాద్ లో సిప్సీ మాంక్స్ పేరుతో షేర్స్, మాక్ టైల్స్ తయారు చేసే ఒక స్టార్టప్ మొదలు పెట్టింది సాయి దీపిక. కొబ్బరి నీళ్ళు,కొబ్బరి పాలతో సీజనల్ పండ్లు,హెర్బల్స్ కలిపి గాజు సీసాల్లో సప్లై చేస్తారు.చెక్కర,రసాయనాలు,ఫ్రిజర్వేషన్లు ఏవి ఉండవు ప్రభుత్వ ఫుడ్ సేఫ్టి […]
ఇవీ నగలే
బంగారం,వజ్రాలు,కెంపులు ఇవే నగలా? ఫ్యాషన్ ఒక కొత్త టర్న్ తీసుకోదా? చూడగానే ఆకట్టుకునే అందమైన నగలు మెటాల్ తోనే తయారవ్వాలా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం hand made fabric jewelry. నిజమే వస్త్రాలు,నగలు నెక్లెస్,లోలాకులు ముద్దోచ్చే ట్రూబ్ లు ,ఉంగరాలు ఏవైన సరే అందమైన ఫ్యాబ్రిక్ తో చుట్టేస్తున్నారన్నమాట. ప్రపంచంలో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగుల్లో దొరుకుతాయి కనుక మ్యాచ్ అవుతాయా లేదా అన్న సందేహమే అవసరం లేదు.
ఇది చరిత్రే
ఈస్ట్ సెంట్రల్ రైల్వే విభాగంలో పాట్నాకు సమీపంలో దానాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఏటూహో యార్డ్ వరకు ముగ్గురు అమ్మాయిలు సోనీకుమారి,విభా కుమారి,స్వాతి స్వరూప్ తో కలిసి గూడ్స్ బండి నడిపి చరిత్రలో నిలబడ్డారు. సాధరణ రైలు కంటే గూడ్స్ నడపటం చాలా కష్టం అందుకే వీళ్ళు వార్తల్లో వ్యక్తులయ్యారు. సోనీ కుమారి,విభా కుమారి లోకో పైలెట్ లుగా స్వాతి స్వరూప గార్డుగా పని చేశారు.
ఇది నా వంతు సాయం
చాలా మంది హీరోయిన్లకు అందంతో పాటు అంతకంటే అందమైన మనసుందని నిరూపించుకుంటాను. హిమాచల్ ప్రదేశ్ కు చేందిన యామీ గౌతమ్ తన దేశంలో ప్రక్తి పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. షూటింగ్ లేనప్పుడు సొంత ఊరు వెలుతుందామె. అసలా ప్రదేశమే సుందరమైంది.పచ్చని అడువులు మంచుతో కప్పిన పర్వతాలు పువ్వులతో నిండిన లోయలు ఎంతో అందమైన ప్రదేశం. ఆ రాష్టంలో రసాయన కాలుష్యానికి గురవుతున్న కూరల సాగును రక్షించే ప్రయత్నంలో ఉంది యామీ గౌతమ్. కొండ […]
ఉదయం తింటే మేలు
జీవ క్రియలను మెరుగుపరుచుకోవటంలో ఓట్ మీల్ కీలకమైన చిటే ఉంటుంది. ఉదయాన్నే ఒక గిన్నెడు ఓట్ మిల్ ఒక ఆరోగ్యపూరితమైన ఆప్షన్. ఓట్ మీల్ మెటబాలిక్ రేటు పెంచుతుంది.ఇందులో పీచు శాతం ఎక్కువే. జీర్ణశక్తి కి ఎంతో ఉపకరిస్తుంది.ప్రోటీన్స్ ఎక్కువ ఉండి కండరాలు,ఎముకలు బలంగా ఉంటాయి.క్యాలరీలు,కోవ్వు చాలా తక్కువే.వీటిలో ఉండే బి,బి5,బి6,ఇ విటమిన్లు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.ఓట్ మీల్ లో ఖనిజాలు కూడా సమృద్దిగా దొరుకుతాయి.
వద్దంటున్నారు
చాలా మందికి ప్రతి విషయంలోనూ నమ్మకాలు,జాతకాలు అంకెలు,ఘడియలు నమ్ముతారు. చివరకు ఆపరేషన్లు కూడా ఒక తేదీ సమయం నిర్ణయించుకుని సరిగ్గా ఆ సమయంలో చేయమని అడుగుతారు. పిల్లలు కనే విషయం కూడా ఇంతే ఈ సమయంలో శుభఘడియలు అవి వాళ్ళు పుట్టే సమయాన్ని నిర్ణయించుకుంటున్నారు. ఇవి నమ్మని హేతువాదులు నవ్వుతారు. కానీ ఒక పక్ష పత్రిక రిపోర్టు ప్రకారం నాడీ సంబంధిత ఆపరేషన్లు రాత్రి తొమ్మిది తర్వాత చేయకూడదు అంటుంది. రాత్రి తొమ్మిది గంటలు తర్వాత చేసే […]
