Sunday, 28 Jun, 2026

అందమైన పెదవులు

నవ్వే పెదవులకు లిప్ స్టిక్ చక్కని అందాన్ని ఇస్తుంది. అయితే ఆ లిప్ స్టిక్ వాడే విషయంలో కొంత శ్రద్ధ,జాగ్రత్త తీసుకోవాలి. పెదవులకు ముదురు రంగు లిప్ స్టిక్ వాడితే చిన్నగా కనిపిస్తాయి .సహాజమైన పెదవులు రంగులు ఉండాలి అనుకొంటే న్యూర్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్ స్టిక్ ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు దిద్దుకొన్నాక పైన కాంతి ఇచ్చే ఫైనీ ఫినిస్ తో టచప్ ఇవ్వాలి. లిప్ స్టిక్ వేసే ముందర పెదవులపైన మృతకణాలు లేకుండా […]

కీటకాలు పరార్

వర్షకాలంలో తడితడిగా ఉంటుంది కనుక ఈగలు,దోమలు,బొద్దింకలు ఎక్కవ కనిపిస్తాయి. రసాయనాలు నిండిన ఇన్ ఫెస్టిసైడ్ వాడితే అనారోగ్యాలు తప్పవు. ఇంట్లో తయారు చేసే ఈ మందులు విజయవంతంగా కీటకాల్నీ నిర్మూలిస్తాయి. దోమలు పోవాలంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ,యూకలిప్టస్ ఆయిల్ ,సిట్రోనెల్లా ఎసెస్షియల్ ఆయిల్ నీళ్ళు కలిపి స్ర్పేయర్ లో నింపి అవసరం అయినప్పుడు వాడుకోవాలి. దాల్చిన చెక్క వెల్లుల్లి ముక్కలు గోడ మూలన ఉంచితే చీమలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల నీళ్ళలో వేసి మరగబెట్టి […]

నెక్లెస్ వడ్డాణం

ముందు లక్ష్మీ దేవి బోమ్మతో కనబడే వడ్డాణాలే ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. ఇప్పటికీ చక్కని దేవత స్వరూపాలు చెక్కిన నక్ష బంగారం వడ్డాణాలు లేటేస్ట్ ఫ్యాషనే. మాసిపోయిన డల్ ఫినిషింగ్ తో చక్కని పనితం కనిపిస్తుంది.గోల్డ్ ఫినిషింగ్ అంటే ఇలాంటి యాంటెక్ వడ్డాణాలే బావుంటాయి కూడా. అయితే కొన్నీ రకాల వడ్డాణాలు రెండు రకాలుగా వాడుకొనేలా వస్తున్నాయి. హారంలాగా ,వడ్డాణం లాగా రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇవి పూర్తి బంగారంలోనూ ,అన్ కట్ డైమాండ్స్ తో […]

అది అనారోగ్యం

చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే బరువు పెరిగిపోతారు. ఇక టీనేజ్ లోకి వస్తున్నా బరువు పెరగడమే అవుతుంది. స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్, జామ్ మొదలైన వాటితో బరువు పెరిగే అవకాశం ఎక్కువే. వాటిలో ఉండే ఫుడ్ కలర్స్ తో కిడ్నీలు ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కూల్ డ్రింక్స్ కు కూడా పిల్లలను దూరంగా ఉంచవలిసిందే. ఫిజ్జాలు, బర్గర్లు,కేక్ లు వంటి బేకరీ ఉత్పాదనలు పిల్లల్లో మరింత బరువును పెంచుతాయి. అనారోగ్య […]

పనులు చెప్పండి

ఎప్పుడూ చదువుకో మార్కులు తెచ్చుకో నీ ఫ్యూచర్ ను గురించి ఆలోచించుకో వంటి మాటలు చెబుతారు కాని పిల్లలకి ఇంటిపనులు చెప్పరు. అలా చెబితే వాళ్ళు అలసిపోతారనో టైమ్ వేస్ట్ అవుతుందనో చదువుకునే సమయం తగ్గిపోతుందనో భావిస్తారు కాని వాళ్ళను ఇంటి పనుల్ల్లో భాగస్వాములుగా ఉంచరు. తల్లిదండ్రులు చేసే తప్పిదం ఇదే. ఇలా చేస్తే పిల్లలకు బాధ్యత తెలియదు. ఇది అలవాటై పెరిగే కొద్ది ఏ పని చెప్పిన చేయాలన్న ధ్యాస ఆసక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ […]

పసితనంలోనే పాఠాలు

ఇప్పుడు వృత్తిరిత్యా వికాసపు కోర్సులు వచ్చాయి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి బాడి లాంగ్వేజ్ ఎలా ఉండాలి నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలు నేర్పిన నాటి నుంచి నేర్పవలసిన విషయాలు ఇవి. వారికి మర్యాదపూర్వకమైన మాటలు నేర్పాలి. ఇంటికి ఎవరు వచ్చినా వారితో గౌరవంగా ఎలా మెలగాలి వాళ్ళను ఎలా పలకరించాలో నేర్పాలి. తోటి పిల్లలు, ఇరుగు పొరుగులతో బంధువులతో మర్యాదగా మెలగటం నేర్పిస్తే ఎదిగే కొద్ది వాళ్ళలో సంస్కారం కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. […]

చర్మం సాగుతోంది

స్మార్ట్ ఫోన్స్ అస్తమానం చేతిలో ఉంచుకోవడం వలన తల,మెడ,బుజాల నొప్పులు వస్తాయంటున్నాయి అధ్యయనాలు. వీటితో పాటు చర్మానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ముఖ్యంగా స్త్రీలకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్కన చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందే ముడతలు వచ్చేస్తాయి. ఇదివరకు మెడ పై చర్మానికి నలభై దాటాక ముడతలు వచ్చేవి. ఇప్పుడైతే 18 ఏళ్ళు దాటుతుండగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు అధ్యాయనకారులు. ఫోన్ లేదా టాబ్ వైపు మెడ వంచి చూస్తూనే ఉండటం వల్ల చర్మం […]

ఆర్టిఫిషియల్ ఆభరణాలతో సమస్య

అమ్మయిలకు ఫంకీ జ్యూలరీ అంటే ఇష్టం. కానీ వివిధ రకాల మెటల్స్ తో తయారయ్యే ఆర్టిఫిషియల్ ఆభరణాల వల్ల చెవి రంధ్రం వద్ద ర్యాష్ వస్తుంది. సాధరణంగా కృత్రిమమైన ఆభరణాలలో నికెల్ లోహం వుంటుంది. వీటి కారణంగా దురదలు,ఎర్రబారటం కనిపిస్తాయి. ఈ సమస్యను అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ నికెల్ అంటారు. ఈ సమస్య రాకుండా నికెల్ తో చేసిన ఆభరణాలు రింగులు, దిద్దులు శరీరం పైన ఎక్కువ సేపు ఉంచుకోవద్దు. చర్మం గనుక ఎర్రబడిన దద్దుర్లు వచ్చినా […]

కొత్త లుక్

ఒక్క రకంగానే ఉంటే అందం ఏముంటుంది. ఫ్యాషన్ ఎప్పుడు కాంభినేషన్ లో ముడిపడి ఉంటుంది. ఫ్యాషన్ వెలుగు,వెన్నెల చీకటి లాగా డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు పొట్టి లేదా పొడవు కుర్తీలు గౌన్ లు ఎప్పటి నుంచో ఫ్యాషన్. డిజైన్లలో తేడాలున్నా చిన్ని మార్పులతో కొత్త లుక్ తెచ్చేస్తారు ఫ్యాషన్ డిజైనర్స్. ఈ వర్షాలకు ఫ్యాషన్ మారిపోయింది. ముదురు లేత రంగులు కలిపి డ్రెస్ ఉ తయారు చేస్తారు. లాంగ్ టాప్ పై నుంచి కింద వరకు […]

ఏదో కారణం?

చెమటలు పోస్తుంటే వాతావరణం వేడిగా ఉండటం వల్లనే అనుకోకండి. ఇతరాత్రా ఎన్నో కారణాలున్నాయి గమనించండి అంటున్నారు వైద్యులు. థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పని చేస్తున్నా చెమటలు పట్టవచ్చు. అలాగే నరాల వ్యవస్థ దెబ్బతినటం వల్ల కూడా ఎక్కువ చమట పడుతోంది. అలాగే ఇది డయాబెటిక్ న్యూరోపతీ వల్ల కూడా అవ్వచ్చు. శరీరంలో ఇన్ ఫెక్షన్ పెరిగితే చెమటలు పోస్తాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కనుక చెమట పట్టటంలో ఎదైనా అసాధారణంగా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ […]

సౌందర్యం ఇస్తాయి

పసుపు,వేప కలిపి వాడినా విడివిడిగా వాడినా సౌందర్య కారకాలే. పసుపును పూజల్లో ,సౌందర్య ఉత్పత్తుల్లో వంటకాల తయారీలో ఇటు ఆరోగ్య ప్రదాయినీగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఆహారంలో పసుపు తీసుకొంటే టాక్సిన్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇక వేపచెట్టు వల్ల కలిగే లాభాలకు అంతే లేదు. అసలీ చెట్ల నుంచి వచ్చేగాలి కూడా ఆరోగ్యం ఇవ్వగలదు. వేప చిగుర్లు కొబ్బరి నూనెలో వేసి మరగకాచి రాసుకుంటే దురదలు తగ్గుతాయి. వేప చిగురు,పసుపు ,మంచి నూనె కలిపి నూరి గాయాల […]

రాతిపూలు

ఈ ప్రకృతిని మించిన మెజీషియన్ ఇంకెవరూ ఉండరు.ప్రతి క్షణం వెతికిన ఎన్ని చిత్రాలు కనిపిస్తాయో. పూవ్వులు చెట్లకు కాస్తాయి. మెక్కలు రెమ్మలతో అందమైన చెట్టు దానికి పూవ్వులు చూస్తాం. కానీ లివింగ్ స్టోన్స్ అని పిలిచే రాళ్ళకు చక్కని పూలు పూస్తాయి. మొక్కలు ఆకులు ఉండవు. రాళ్ళలా ఉండే మొక్కలకు పూలు పూస్తాయన్నమాట. వీటిని శాస్త్రీయంగా అయితే లిథోప్స్ వెబెరీ అని పిలుస్తారు. ఈ రాతి పూలల్లో కూడా ఎన్నో రకాలున్నాయి. మండే ఎండల్లో,ఇసకలో కూడా లక్షణంగా […]

కొంచెం విశ్రాంతి

బాహుబలి ,రుద్రమదేవి ,భాగమతి వంటి పాత్రలతో నాకెంతో అలసట అని పించింది. కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉండాలనుకొంటున్నా .మంచి కథ వస్తే మళ్ళీ యాక్షన్ మొదలు అంటోంది అనుష్క .ఈ సినిమాలు తల్చుకుంటే ఎంతో కష్టపడ్డాను అనుకుంటా ,పాత్ర కోసం భాడీ లాంగ్వేజ్ కోసం ఎంతో కాలం ఎన్నో నేర్చుకున్నానో, కత్తి యుద్దాలతో సహా అంటుంది అనుష్క. ఆమె తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన 13సంవత్సారాలు కావోస్తుంది. సంవత్సరానికి ఐదు సినిమాలు చేసిన రోజులున్నాయి. టాలీవుడ్ లో కథనాయిక ప్రాధాన్యత […]

కేరీర్ కొనసాగిస్తా

తెలుగు సినిమా పరిశ్రమలో రాణించిన కథానాయకల్లో ముందు వరుసలో ఉంటుంది సమంత. సంవత్సరానికి నాలుగు సినిమాలు తక్కువ కాకుండా కేరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుటివరకు చేస్తూనే ఉంది సమంత. నిశ్చితార్థం పెళ్ళి జరిగిన సంవత్సరంలో కూడా రాజుగారి గది2 విడుదల అయింది. ఇక ఈ సంవత్సరం రంగస్థలం,మహానటి భారీ విజయంతో పాటు ప్రస్తుతం యూటర్న్ రీమేక్ నాగచైతన్యతో కలిసి ఇంకో చిత్రంలో ఆమె బిజీగా ఉంది. ఏడాదికి ఇన్ని సినిమాలు చేయలని ఇంకా ఎక్కువ […]

మంచితనం పెంచే పుస్తకం

రెండు మూడేళ్ళ పిల్లలకు వారి లోని భావోధ్వేగాలను నిర్వహించుకోగల సామార్ధ్యాన్ని పెంచుకొనేలా చేయలంటే పుస్తకాలు ఒక్కటే మార్గం అంటున్నారు . కోపం ,భయం ,బాధ,ఆతృత ఇలాంటి క్లిష్టమైన ఎమోషన్ లను నియంత్రించుకోవటం గురించి పుస్తకాలు చదివి వినిపిస్తూ అందులో పాత్ర ప్రవర్తన గురించి వివరంగా చెప్పాలి. స్నేహాల విలువ ,సానూభూతి దోరణులకు ఇక్కడే బీజం పడుతుంది. ఒక మంచి పని చేసేందుకు ఎంత కష్టపడతారు,ఆ కష్టం విలువ పిల్లలు తెలుసుకోవాలంటే పుస్తకం ఒక్కటే మార్గం క్షమించటం ఇవ్వటం […]

కివిలో ఆరోగ్యం

తాజాగా తీసిన పండ్ల రసాలు చాలా రుచిగా ఉంటాయి.అయితే ఏ రసం తాగిన ఆ పండ్లలో గుజ్జు మొత్తం జ్యూస్ లో ఉండాలి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకుర్చగల కివిలో యాంటీఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు రసంలోని పాలి శాచురైడ్స్ శరీరంలో కొల్లజెస్ సింథిసిన్ ను రెండింతలు చేస్తాయి. ఇదే చర్మం ,కండరాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతోంది. చర్మం ,ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే లూటెన్ అనే యాంటి ఆక్సిడెంట్ ను ,కెరోటినాయిడ్స్ ను కివి పండు సరఫరా […]

ఉదయాన్నే తాగాలి

జీలకర్ర కూడా బరువు తగ్గిస్తుంది. జీరాలో ఉండే పొటాషియం మాంగనీస్,ఐరన్,ఫైబర్ అధికం.జీర్ణప్రకియకు జీరా ఎంతోగానే తోడ్పడుతుంది. రోజుతాగే నీళ్ళలో జీలకర్ర వేసుకుని కాచి తాగితే మంచిది.ఒక స్పూన్ జీలకర్ర ను గ్లాస్ నీళ్ళతో మరిగించి ,ఆ నీరు అరగ్లాస్ అయ్యేవరకు మరిగాక ఉదయాన్నే ఆ నీటిని తాగితే మంచిది. కడుపులో రసాయనాలు మనం తినే ఆహారాన్ని షుగర్ గా మార్చుతాయి. అలా ఎప్పుడు ఈ జీరా రసం షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. డైట్ ప్లాన్ లో […]

క్రీముల వల్లే

ముఖం ఒక్కసారి నల్లబారినట్లు అవుతోంది. కళ్ళ కింద చర్మం ఎండి పోయినట్లు అనిపిస్తుంది. ముఖానికి వేసుకొనే మెకప్ ఇతర క్రీములను అజాగ్రత్తగా వదిలి వేయటమే ఇందుకు కారణం .చర్మం సహాజమైన వర్ణాన్నీ మృదుత్వాన్నీ పోగొట్టుకొంటుంది. మేకప్ కోసం వాడినా క్రీములను కళ్ళ కింద జాగ్రత్తగా తుడిచి వెంటనే బేబీ ఆయిల్ రాయాలి. పచ్చిగా కోసినా బంగాళదుంప ,కీర దోస ముక్కలను ,కంటిరెప్పలపైన పెట్టి పదినిమిషాలు విశ్రాంతిగా ఉండాలి. తరువాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కొని నర్సింగ్ క్రీమ్ […]

జట్టుకు మెరుపు

కొత్తిమీర వేసిన చారు,పులుసు ,కమ్మని వాసన వస్తాయి. ఏ ఉప్మానో చేసి కొత్తి మీర చల్లితే నోరు ఊరుతుంది. వట్టి రుచికాదు కొత్తి మీర ఆరోగ్య ప్రదాయిని .విటమిన్ బి కాంప్లెక్స్ కు చెందిన బి1,బి2,బి3, బి4,బి5 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఈ విటమిన్లు అన్నీ వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేవే. చర్మానికి నిగారింపును ,దీర్ఘకాలం యవ్వనంగా ఉంచేందుకు కొత్తి మీర ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు జుట్టును మంచి మెరుపుతో ఉంచుతాయి. చర్మంపైన […]

ఇదే రహస్యం

క్రమబద్దమైన జీవిత విధానం సంపూర్ణ ఆయుష్షును ప్రసాదిస్తుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట ధ్యానం మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. వేళకు పోషకపదార్థాలలో కూడిన తేలికైన ఆహారం తినాలి. మితంగా తినాలి. ప్రతి రోజు వ్యాయామం తప్పని సరి .అలాగే ఏడు గంటలకు తగ్గని నిద్ర ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. సామాజిక సంబంధాలు కలిగి ఉండాలి. కుటుంబంలో ఉండే వ్యక్తులు ఒకళ్ళతో పాటు ఒకళ్ళు  ఎత్తిపోడుకుకొని  బాధించుకోవటం ,మనస్పర్ధలతో గడపటం, […]