April 2018
పచ్చివే మంచివి
రా ఫుడ్ ఆరోగ్యమేనా అని చాలా మందికి డౌట్, శరీరం పచ్చి కూరగాయలు, జ్యూస్ లు తీసుకుని ఆరోగ్యంగా ఉంచగలరా అని సందేహం. కాని శరీరంలోని జీవక్రియ సంభందిత కార్యకలాపాల్లో రా ఫుడ్స్ చురుకైన పాత్ర పోషిస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎంజైమ్స్ లేకుండా శరీరం ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బో హైడ్రెడ్స్ , విటమిన్లను ఎముకలు, శిరోజాలు, చర్మ కండరాలు హార్మోన్లను ఉపయోగించుకోలేవు. పైగా రిఫైండ్ పదార్ధాల్లోని సింథటిక్ విటమిన్ల కంటే తాజా పచ్చి పదార్ధాల్లో లభించే విటమిన్లు,ఖనిజాలను శరీరం […]
సుషి చేసే అద్భుతం
జపాన్ వాళ్ళకి దాదాపు అందరికీ అందమైన దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. వాళ్ళలో దాదాపు ఎవరికీ బట్టతల ఉండదు. వాళ్ళు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 150 మైక్రోగ్రాముల సుషి అనే సముద్రంలో పెరిగే మొక్కను చేపలు ,రోయ్యలతో కలిపి తీసుకొంటారు. అలాగే జుట్టు బాగా పెరిగే పోషకపదార్థాలు కూడా తింటారు. సముద్రంలో పెరిగే సుషి అన్న కలుపు మొక్కతో శిరోజాల ఎదుగుదల బావుంటుందని వాళ్ళ నమ్మకం .ఈ మెక్కలో ఐయోడిన్ లవణాలు అధికం .ఈ కారణం వల్లనే వాళ్ళకి […]
పట్టు కుచ్చులాంటి జుట్టు
జుట్టు ఆరోగ్యంగా , తెల్లబడి పోకుండా ఉండాలంటే ఇంట్లో చేసిన ఈ మిశ్రమం వల్ల మంచి ఫలితాం ఉంటుంది. జుట్టు పొడిబారనివ్వదు కూడా. గోరింటాకు పోడిలో ఎండిన అరటి పండు , పుల్ల మజ్జిగ బాగా కలిపి ఉంచితే నానిపోయి మెత్తగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే ఇది జుట్టును ఆరోగ్యంగా పెంచేందుకు సహకరిస్తుంది. జుట్టు పొడి భారి పోకుండా పట్టులా మెరుస్తూ ఉంటుంది. ఈ ఎండలకు ఇది […]
ఊరి పేరుతో ప్రసిద్ధి
మంగళగిరి ప్రత్యేకం మంగళగిరి కాటన్స్ చీరెలతో పాటు కాటన్ కుర్తాలు ,దుపట్టాలు ప్రత్యుకమైన నేతతో అందంగా ఉంటాయి. చిన్న పాటి జరీతో అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. వైట్ ,క్రీమ్ కలర్ మంగళగిరి కాటన్స్ పైన బ్లాక్ డిజైన్ అందంగా ఉంటుంది. కాటన్ తో పాటు మంగళగిరి పీకో చీరెలు కొద్దిపాటి మెరుపుతో పట్టు చీరెలకు తీసిపోకుండా ఉంటాయి. ఎ వయసు వారికైనా బావుండే ఈ కాటన్ ప్రకృతి అందాలు అందమైన నెమళ్ళ, తీగలు, పువ్వులతో మీకు […]
పెదవులు నలుపా?
చాలా మందికి పెదవులు,పెదవులు చుట్టు నల్లగా ఉంటాయి. అందరికీ లిప్ స్టిక్ ఇష్టం వుండదు. సహజమైన మెరుపుతో పెదవులు ఉండాలనుకుంటే రెండు పూటలా పండ్లు కూరగాయాలు నీళ్ళు అవసరమైనన్ని తీసుకొంటూ ఉంటే పెదవులు చక్కని మెరుపుతో ఉంటాయి. కాస్త సెనగ పిండిలో భాధం నూనె కలిపి పెదవుల చుట్టు రాస్తే నెమ్మదిగా నలుపు పోతుంది. తాజా కలబంద గుజ్జు రాసినా ప్రయోజనం ఉంటుంది. ఓట్స్ పిండి చేసి పెదవుల చుట్టు మసాజ్ చేసినట్లు మృదువుగా రుద్ధితే మృతకణాలు […]
ఎక్కువ అరలుండాలి
ఉద్యోగానికి వీకెండ్ ప్రయాణాలకు యుటిలిటి బ్యాగ్ ప్రాక్టికల్ గా ఆర్గానైజ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఖరీదైన బ్యాగ్ అయినంత మాత్రానా ప్రతి బ్యాగ్ యూజ్ ఫుల్ గా ఉంటుంది అనుకునే వీలులేదు. వీకెండ్ కోసం బ్యాగ్ బరువు తక్కువగా,తేలికగా ,ఎక్కువ అరలతో , కంపార్ట్ మెంట్స్ తో ఉండాలి. డీప్ బ్రౌన్, బ్లాక్ , గ్రే వంటి క్లాసిక్ కలర్స్ చాలా బావుంటాయి. ఉద్యోగం కోసం బయటటికి వెళ్ళేందుకు అన్నీ విధాలా వాడుకునేందుకు చక్కని నాణ్యమైన బ్రాండ్ […]
బాగా పని చేస్తుంది
ఆయిల్స్ ,షాంపూలు ,కండిషనర్స్ ఏవి వాడుతున్న ఈ వేసవి ఎండకు జుట్టు పొడిగా ,ఎండినట్లు అయిపోతుంది. ఈ వాతావరణానికి దుమ్ము కూడా తోడవుతుంది. ఖరీదైన ఆయిల్స్ కంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ మిశ్రమం జుట్టును చక్కగా కాపాడుతుంది. కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ నిమ్మ రసంతో జుట్టు చక్కగా మెరుపులు మెరుస్తుంది. ఈ మూడు కలిపి ఓ బౌల్ లోకి తీసుకొని, జట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని , కుదుళ్ళకు పట్టేలా ఈ మిశ్రమాన్ని పట్టించి […]
చెకింగ్ మంచిదే
ప్రతి రోజు బరువు తూచే యంత్రంపై నిలబడి బరువు చెక్ చేసుకొంటూ నోట్ చేసుకొంటూ వుంటే ఆ ఫలితాలు చెప్పలేని ఆనందం ఇచ్చి, ఎంత కష్టమైనా ఎంత నోరు కట్టేసుకుని అయినా బరువు తగ్గిపోదాం అనిపిస్తుంది అంటుంది ఒక సరికొత్త అధ్యయనం. ప్రతి రోజు బరువు చూసుకొంటు వర్కవుట్స్ చేసేందుకు తగిన ఉత్సహం వస్తుంది. బరువు తగ్గే లక్ష్యం దిశగా శ్రమ చేసేందుకు తగిన ప్రోత్సహం దోరుకుతుంది. ఎప్పుడో ఒక సారి చూసుకొంటే వచ్చే రిజల్ట్ కంటే […]
దోమలు,ఈగలు పరార్
తలస్నానానికి కుంకుడు కాయలు వాడకం ఏనాడో దూరం చేశారు. కానీ ఈ కుంకుడు రసం జుట్టుకే కాదు ఖరీదైనా పట్టు ,నేత చీరెలనూ మిలమిల మేరిసేట్టు చేస్తాయి. ఈ రసంతో ఉతికితే రంగు పోదు , కొత్త దనం కూడా మాసిపోదు. అలాగే కుంకుడు రసంతో వెనిగర్ కలిపి గాజు సామాన్లు, కిటికీల అద్దాలు తుడిస్తే మిలమిల మెరుస్తాయి. స్నానాల గదిలో కుంకుడు రసంతో బేకింగ్ సోడా, ఓ స్పూన్ బొరాక్స్ పౌడర్ కలిపి బాత్ రూమ్ […]
అందమైన టోపీలు
బ్రిటన్ లోని రాయల్ అస్కట్ లో ప్రంపచంలోనే మేలైన రేసు గుర్రాల పోటీ జరుగుతుంది. బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 తో పాటు రాజ కుటుంబానికి చెందిన వారంతా ఈ గుర్రపు పందాలకు హాజరవుతారు. లండన్ లోని సంపన్న వర్గాలు పోటీలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమపు వింత ఏమిటంటే మహిళలు ధరించే వింత వింత టోపీలు వీటిని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీ పడతారు. రాయల్ పోటీలో గెలిచిన గుర్రానికి ఇచ్చే ఫ్రైజ్ మనీ కూడా కోట్లలోనే […]
ఇప్పుడు ఇంటికివే అందం
పాతకాలం ఇళ్ళలో గోడలు సందు లేకుండా ఇంట్లో వాళ్ళ ఫోటోలు నిండి ఉండేవి. ఇప్పుడు ఆనవాయితీ తప్పింది. గోడలకు మంచి అందమైన పెయింటింగ్స్ లేదా సాదాసీదా గోడలు కనిపిస్తున్నాయి. అయితే ఇలా ఖాళీగానూ బ్రాండ్ లేదనుకున్నారో ఏమో పర్సనలైజ్ ఫోటో వాల్ స్టిక్కర్లు వస్తున్నాయి. పాత కాలంలో లాగా అందరిని కాకపోయినా మనకో,పిల్లలకో , మొత్తం ఫ్యామిలీ కలిసి ఉన్నదో మనసుకు నచ్చిన తరహాని అంటించుకోవడం ట్రెండ్. ఫీల్ ఆప్ పాప్ ఆర్ట్, కార్టున్ చిత్రాలు ఇప్పుడు […]
ఇంకో స్టైల్
ఈ ఫ్యాషన్ బాగుందే అని చేతిలోకి తీసుకుని సరిగా చూసేలోపే ఇంకో కొత్త ట్రెండ్ దిగుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో నెయిల్ ఆర్ట్ తెలిసిందే, పొడవైన గోళ్ళు లేని వారి కోసం నెయిల్ ఎక్స్ టెన్షన్లు వస్తున్నాయి. ఇది కాస్తా పాతదే . ఈ ఎక్స్ టెన్షన్లలో ఇంకొ కొత్త ఫ్యాషన్ దిగుమతి అయింది. ఆది యూనికార్న్ ఫ్యాషన్. ఐదు గోళ్ళలో ఒకటి పోడవుగా , ఇంకోటి చెమ్కి మెరుపులు, ఒకటి స్పైరల్ ఆకరం, ఇంకోటి ఇంకో వర్ణంతో […]
ఈ సమయంలో
నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చికాకు, కోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో నడుము, కీళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఏమి తినాలనిపించదు. వీటి నుంచి ఉపశమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకున్న గదిలో ఒక మూల తాజాగా వాసనలు వచ్చే పూలగుత్తిని ఉంచుకొవాలి. పరిమళాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అలగే మంచి సువాసన ఇచ్చే కొవ్వోత్తి వెలిగించిన పర్లేదు. నొప్పుల ఉపశమనానికి హీటింగ్ ప్యాక్స్ దొరుకుతాయి. వాటితో […]
ఎవరికి వారే
ఏ సినిమాలోనో , ఏ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పైనో చూసి ఒక సినీ యాక్టర్ వేసుకున్న డ్రెస్ నో, ఏ మోడల్ ధరించిన నగనో చూసి మోజు పడిపోతారు. కాని అందరికి ఒకే రకమైన శరీరాకృతి ఉండదు, ఒకళ్ళకు నచ్చినట్లు ఇంకొకళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు,బరువు ఎన్నో తేడాలుంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకొవాలి. సన్నగా,పొడుగ్గా ఉంటే అన్ని రకాల వస్త్రశ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా ఉంటే ఇంకా […]
అస్సలు చేయరు
చేస్తున్న పని కింద పడేసి ఇంకా ఇవ్వాల్టికి నేనే పని చేయను అని ఒళ్ళు మండేంత కోపం తెప్పించే సర్వే గురించి చెప్పుకొందాం. ఒక అంతార్జాతీయ సర్వేలో టర్కీ,కొరియా,నార్వే,ఇటలీ,కెనడా, జర్మనీ, అమెరికా …ఇదిగో ఇండియాతో సహా ఒక సర్వే నిర్వహించారు. పురుషులు ఇంటి పనికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇదే విషయం ఇంటి పని అంటే అది ఆడవాళ్ళ ఆస్తి హక్కులాగా నెత్తిన పెట్టుకునే బ్రహ్మాండం. అసలా పని వాళ్ళదే… అని మన దేశపు మొగాళ్ళు అనుకుంటారని […]
మాయలో పడొద్దు
షాపింగ్ కు వెళుతున్నారా అయితే ఏం కొనాలో రాసుకున్నారా, ఎంత కొనాలో అంతే డబ్బు తీసుకెళుతున్నారా? మీరు ఆశ్చర్యంగా చూస్తే పొరపాటు చేస్తున్నట్లే. షాపింగ్ మాల్ అంటే అదో మాయా ప్రపంచం. ఆ మాయా ద్వీపంలోకి వెళ్ళి సరిగ్గా మనం అనుకున్నవెమో అవే కొనుక్కుని రావటం గొప్ప ఆర్టే, ఆకర్షనియంగా కనిపించే ప్యాక్ లు, ఆఫర్లు రా రమ్మని పిలుస్తాయి. చేతిలో క్రెడిట్ కార్డు ఉందా ? ఇక దభేలు మని ఆ మాయా ద్వీపంలోకి పడిపోతాం. […]
ఈ రెండు
నీళ్ళు తాగంటం వల్ల ఆకలికి అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలి వేసినప్పుడు అదేపనిగా ఆహారం తీసుకోవటం కన్నా ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు తాగమంటున్నారు. భోజనం చేసే సమయంలో కూడా నీళ్ళు ఎక్కువగా తాగితే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు పెరగకుండ ఉండటం కోసం చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అలాగే బరువు పెరగకుండా వ్యాయమం చేయటం అంటే ఒకటి నడక, రెండోది సైక్లింగ్ ఈ మధ్య ఓ మంచి రీసెర్చ్ […]
దంతాల ఆరోగ్యానికి ఛీజ్
ఆహారపదార్ధాలలోని చక్కెరతో సహజంగా పట్టే గార వల్ల దంతాలకు హాని కలుగుతుంది. చీజ్ ఈ సమస్యను తగ్గిస్తుంది అంటున్నారు డాక్టర్స్. దంతాల పైన ఉండే ఎనామిల్ పొరను కాపాడుతుంది ఛీజ్. ఇందులో ఫాస్పేట్ , క్యాసిన్ అనే హానికరం కాని రసాయనాలు ఉంటాయి. ఇవి కాల్షియం తో కలిసి దంతాల పై ఏర్పడే సూక్ష్మమైన పగుళ్లను కప్పేస్తాయి. తగు మొతాదులో ప్రతి ఒక్కరు ఛీజ్ ను ఆహారంలో తీసుకుంటే అది మనకు సంతులిత ఆహారంగా ఉండి శరీరంలోని అన్ని […]
స్కిన్ని నట్స్
తక్కువ క్యాలరీలతో అధికమైన ప్రయోజనం ఇచ్చే పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. గుప్పెడు పిస్తా పప్పులో వంద క్యాలరీలు ఉంటాయి. ఆహార నిపుణులు వీటిని స్కిన్ని నట్స్ అంటారు, ఇవి నెమ్మదిగా వలుచుకుని తినాలి కనుక పూర్తిస్థాయి క్యాలరీల సంఖ్య నలభై ఒక్క శాతానికి మించదు. వీటిలో విటమిన్ బీ6, కాఫర్ , మాంగనీస్ ,ప్రోటిన్స్, ఫైబర్ , థియామిన్ , ఫాస్పరస్ చాలా ఎక్కువ. అలాగే విభిన్న యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రిషియన్లు అత్యధికం. ఇవి […]
నిమ్మరసం చాలు
నెయిల్ కలర్స్ వల్లనో, సరిగా క్లీనింగ్ లేకపోయినా తరచూ పెయింటింగ్స్ వేయటం వల్ల నెయిల్ బాడి పై పసుపు పచ్చని మరకలు పడతాయి. వాటిని పాలిష్ ఎక్కువ చేసి కవర్ చేయాలన్న మరి పాడైపోతాయి. ఈ మరకలు తొలగించాలంటే తాజా నిమ్మరసాన్నిగోళ్ళ మరకల పై పూసి కొద్ది నిమిషాలు వదిలేసి పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిస్తే పోతాయి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే గోళ్ళు మెరుస్తూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో […]
