March 2018
ఆనందమానందమాయే
క్రయేథెరపీ ఇప్పుడు బ్యూటీ ట్రీట్ మెంట్ లో భాగం అయింది. క్యాన్సర్లు, ట్యూమర్లు రిమూవ్ చేసే వైద్యంలో భాగంగా ఇచ్చే క్రియోథెరపీ ఇప్పుడు చక్కని చర్మంకోసం, ఫ్యాట్ ట్రీట్ మెంట్ లోనూ ఉపయోగిస్తున్నారు. మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలో స్పాలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ థెరపి ఇస్తున్నారు. సంతోషాన్ని ఇచ్చే సెరటోనిక్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుందట. ఈ గడ్డ గట్టే చలి అంటే పూర్తి సంతోషంతో మనిషి మారిపోతారన్న మాట ఈ […]
ఓ కొత్త ప్రయాణం
కొత్త సినిమా అనగానే ముందు భయం వేస్తుంది. ఆ పాత్రలో నేను ఒదిగి పొగలనా చుట్టు సహ నటులతో ఎలా కలిసి పోతాను. ముందు మనసు నిండా ఆ పాత్ర నిండిపోయి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ భయమే మరిన్నీ ఫీట్స్ చేసేందుకు కారణం అవుతుంది అంటోంది పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ అందరి సరసనా ఆమె నాయిక. రంగస్థలం సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో ఎంతో బావుందని యూనిట్ చెపుతున్నారు. వరస అవకాశాలతో దూసుకు […]
సంతానలేమితో
సంతానం లేని మహిళలు మిగిలిన వాళ్లతో పోలిస్తే త్వరగా మరణిస్తున్నారని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనలు చెపుతున్నాయి. వీళ్ళలో కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనంటున్నారు. అండాశయ ,గర్భాశయ క్యాన్సర్ల కన్నా రోమ్ము క్యాన్సర్ ఎక్కువ సోకినట్లు గుర్తించారు. ఇందు కోసం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు చెందిన మహిళల జాబితాలు కూడా పరిశోధనలోకి తీసుకొన్నారు. దీర్ఘకాలం సాగిన ఈ పరిశోధన సంతానం లేమి మహిళల్లో ఆయుష్షు తగ్గిపోతుందని నిపుణులు అభిప్రాయాపడ్డారు.
తిరగబడాలి
కాస్టింగ్ కౌచ్ నిజమే అంటుంది ఏ మంత్రంవేశావే హీరోయిన్ శివాని సింగ్ . లేడీ ఆర్టిస్టులంటే కొంత చులకన ,ఆడపిల్లలు కాస్త భయంగా ,బెదురుగా కనిపిస్తే ఏడిపించేస్తారు. అదే తిరగబడితే తోక ముడుస్తారు. అన్నీ రంగాల్లో మహిళలకు అన్యాయమే .గతంలో కన్నా ఇప్పుడు అవకాశాలు పెరిగాయి నిజమే స్త్రీ పురుషులు సమానం అంటారు కానీ అవి చేతల వరకు రాలేదు. మనకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకొని బాధపడినా ప్రయోజనం శూన్యం. మనమే తిరగబడి మన సమస్యను […]
ఆర్మీ ఆఫీసర్ ప్రియ
ఆర్మీలో పని చేసిన తొలి మహిళగా చరిత్రలో తన పేరును సగర్వంగా రాసుకుంది ప్రియాజంగాన్. నాకు సైన్యంలో పని చేయాలని ఉందని ఉత్తరం రాసింది ప్రియ. ఆ ఉత్తరం సైనిక వ్యవస్థలో కొంత కదలిక వచ్చి ఆ తర్వాత ఆమెను కెడెట్ 001గా చెన్నైఅకాడమిలో శిక్షణకు పంపించారు. ఇలాంటి ఉద్యోగం కారు తుపాకి నాకు ఇవ్వడి నేను శత్రువులతో పోరాడతానని అడిగింది ప్రియ. ఆమెకు న్యాయశాస్త్రంలో పట్టా ఉంది కనుక జడ్జీ అడ్వకెట్ జనరల్ జాబ్ ఇచ్చారు […]
పళ్లు తోమేస్తుంది
చివరకు ఇది కూడా వచ్చేసింది. పళ్లు తోముకోవడం కూడా బద్దకం అనుకొనే వాళ్లకోసం పూర్తి స్థాయి ఆటోమేటిక్ బ్రష్. దీనిపేరు అమా బ్రష్ మోటర్ యూనిట్. పళ్లు అదే శుభ్రంగా తోమేస్తుంది. కుత్రిమ దంతం అమర్చుకొని బ్రష్ లాంటి మౌత్ పీస్ నోట్లో పెట్టేసుకుని గుండ్రని మోటర్ యూనిట్ ను అయస్కాంతంలాగా బ్రష్ బయట భాగంలో అతికించేస్తే దంతాలన్నీ పది సెకండ్లలో శుభ్ర పడిపోతాయి. బ్రష్ కిందా మీదా అమర్చిన సిలికాన్ కుచ్చులు మృదువుగా దంతాలను అన్ని […]
చాలా కారణాలు
కొందరి జుట్టు 70 ఏళ్ళు వచ్చినా నల్లగా చక్కగా ఉంటుంది. మరికొందరికి పాతికెళ్ళు దాటుతూనే తెల్లబారిపోతుంది. ఇది జన్యువుల సమస్య అనుకుంటాం. కాని ఇంకా బోలెడు కారణాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనలు. ఒకటి పోషకాహరం కావచ్చు అలగే విటమిన్ బీ 12 లోపించడం వల్ల జుట్టు కుదుళ్ళకు అవసరమైన మెలనిన్ సరిగ్గా అందక తెల్లబడి పోవచ్చు. అలగే విటమిన్ డీ3, కాల్షీయం, పెరిటిన్ శాతం తగ్గినా తెల్లబడి పోవచ్చు. ఒత్తిడితో వెంట్రుక కుదుళ్ళలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పేరుకోవటం […]
భయపెట్టకండి
స్కూల్ చదువులో ఉండగానే రుతుక్రమం మొదలై అమ్మాయిలు చాలా కంగారు పడిపోతారు. అప్పటి వరకు పసి పిల్లల్లా ఇంట్లో ట్రీట్ చేసి వెంటనే వాళ్ళను పెద్దవాళ్ళుగా మార్చేయాలని చూస్తారు ఇంట్లో వాళ్ళు. తినే ఆహారం ,వేసుకునే డ్రెస్, మెలిగే పద్ధతులు ,వాళ్ళ స్నేహాలు అన్నింటిలోనూ ఆంక్షలోస్తాయి. ఈ పరిస్థితికి వాళ్ళు నిజంగానే ఆదుర్ధా పడతారు. శరీరంలో వస్తున్న మార్పులు పెద్దవాళ్ళ నిబంధనలు వాళ్ళను ఒత్తిడికి గురిచేస్తాయి. పెద్ద వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పి ,శరీరక పరిశుభ్రత గురించి […]
కాఫీకీ ఓ టైమ్
ప్రత్యేకంగా కొన్ని సమయాలను కాఫీ సమయంగా గుర్తించాలని పరిశోధనలు చెపుతున్నాయి. ఆ టైమ్ లో కనుక ఓ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు అంటున్నారు. అదెలాగంటే మన శరీరం చేసే పనులను నియంత్రించే కార్టిపోల్ అనే హార్మోన్ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు ,అలాగే మధ్యహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య ఎక్కువగా విడుదల అవుతుంది. ఆసమయంలో కనుక కాఫీ తాగితే శరీరం మరింత చురుగ్గా ఉంటంతో పాటు చక్కని […]
రెండు బావుండాలి
జ్ఞాపక శక్తికి బరువుకి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. అల్జీమర్స్ గురించి చేసిన ఒక పరిశోధనలో బరువు ఎక్కువ ఉన్నవారు ఏదైన విసయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేక పోతున్నారని చెపుతున్నారు. ఎత్తు ,వయసుకి సంబంధించి బరువు సరిగ్గా ఉంటే చురుకు దనం ఉంటుందంటున్నారు. ఈ పరిశోధన ఏం చెపుతుందంటే శారీరక బరువు ఎన్నో అనారోగ్యలకు, అలసటకు మూలం. శారీరక ఆరోగ్యం పైన మానసిక బలం ఆధారపడి ఉంటుంది. మానసిక శక్తి శరీరానికి అన్ని విధాల కంట్రోల్ చేయగలుగుతుంది. సరైన […]
సూక్ష్మ జీవులమయం
వందలాది మంది ఉపయోగించే అవకాశం ఉన్న ఏ వస్తువును ముట్టుకున్న చేతులు శభ్రం చేసుకోవాలి అంటున్నారు పరిశోధకులు . హాస్పిటల్స్, హోటల్స్, ఇతర ప్లేసుల్లో బాత్ రూములు,వాష్ రూమ్స్ లో ఏవి ఉపయోగించిన చివరకు తలుపుల హ్యడిల్స్ పట్టుకున్న మనుషుల చర్మంలో ఉండే సూక్ష్మజీవులు స్కిన్ మైక్రోబైట్స్ అక్కడ వ్యాపించి ఉంటాయని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పరిశోధనలో అమెరికా లోని కొన్ని నగరాల్లోని ఎ.టి.ఎం సెంటర్స్ లోని ధూళిని సేకరించి పరిశోధన చేస్తే […]
తప్పకుండా ఇవ్వండి
ఏడాది లోపు పిల్లలకు ఇచ్చే ఆహారం వాళ్ల సంపూర్ణ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సాదారణంగా పిల్లలకు అరగదనే అపోహతో వాళ్లకు నీళ్ళు కలిపిన పాలు ఇవ్వటం,ఇతర ఘనాహారం కూడా సరిగా పెట్టక పోవటం చేస్తారు. కాని పాలు సంపూర్ణాహరమని, పిల్లలకు పాలతో పాటు గుడ్లు ,వేరు సెనగ పప్పులు వంటివి తప్పని సరిగా ఇవ్వాలని,అవి శుభ్రంగా అరిగిపోతాయని పైగా వాటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆరు నెలల పిల్లలకు కూడా గుడ్డు తప్పని సరిగా […]
అద్దం ముందు కూర్చొండి
ఇంట్లో అందరూ ఎవారిదారిన వాళ్ళు బిజీగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతే, అందరికీ అన్ని అమర్చి పెట్టే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోయి భోజనం కూడా ఏం తింటాలే ఒక్కదాన్ని అనుకుంటుంది. జపాన్ పరిశోధనలు ఏం చెపుతున్నయంటే ఇలా ఇంట్లో ఉండి పోయె వృద్ధులు, ఇంట్లో ఉండే ఇల్లాలు అద్దం ముందు కూర్చొని భోజనం చేయాలట. అలా అలవాటై పోతే ఒంటరిగా ఉన్నమన్న ఫీలింగ్ పోయి చక్కగా భోజనం చేస్తారట. పైగా అంతసేపు అద్దంలో ప్రతి బింబాన్ని […]
బెస్ట్ రిజల్ట్
ఈ వేసవి విసిగిస్తూనే ఉంటుంది. ఎండకు చర్మం నల్లగా కమిలి పోతుంది. పోడిగా అయిపోతుంది , బిరుసుగా అయిపోతుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి గట్టెక్కాలంటే చర్మం మెరిసి పోవాలంటే తేనె ,మీగడ కలిపిన ప్యాక్ వేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు రెండు టీ స్ఫూన్స్ తేనె, ఒక టీ స్ఫూన్ పాల మీగడ ,కొద్దిగా శనగపిండి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ఒక బౌల్ లో బాగా కలిపి అది పెస్ట్ […]
ఎన్నో ప్రయోజనాలు
కూల్ డ్రింక్ కావాలా మజ్జిగ కావాలా అంటే అబ్బే మజ్జిగ వద్దు కూల్ డ్రింక్ అంటారు కానీ ఈ సీజన్ లో మజ్జిగని మించిన పానీయం ఇంకోటి కనిపించదు . చల్లని మజ్జిగలో కరివేపాకులు, పూదీన, అల్లం, జీలకర్ర , తులసి లాంటివి కలిపితే మరిన్నీ ప్రయోజనాలు దక్కుతాయి. శారీరక ఉష్ణోగ్రతను తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుంది. వేసవి తాపాన్ని ,దాహాన్నీ తీర్చగలుగుతుంది. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు మజ్జిగ చర్మానికి, జుట్టుకు పై పూతగా […]
ఎప్పుడు బిజీగా ఉంటా
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. జీవిత ప్రారంభంలో అయినా ,రిటైర్మెంట్ లో అయినా ఉన్నన్నీ రోజుల ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటున్నారు సీనియర్ నటి జయసుధ. ఒక ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుంచి గ్యాప్ లేకుండా నటిస్తున్న. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చింది చీరెల డిజైనింగ్ . చీరెల ఎగ్జిబిషన్స్ పెట్టడం నాకు చాలా ఇష్టం . పన్నెండేళ్ళ క్రితం […]
దీర్ఘకాలం జీవించాలంటే
సంతోషంగా ఉంటేనే దీర్ఘాయుష్షు ,వార్ధక్య లక్షణాలకు దూరంగా ఉండటం సాధ్యం అంటున్నాయి అధ్యయనాలు .ఆందోళనతో, డిప్రెషన్ తో ఉండేవారు రుగ్మతలకు గురవుతారు అంటున్నారు. డిప్రెషన్ ,హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతుంది. ఆహార పానీయాలు, ఇతర అలవాట్లు ఎన్నీ మార్పులు తెచ్చుకొన్న ఏ డిప్రెషన్ కు లోనైనా కణాలను కాపాడే టెలోమల్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి లేక పోతేనే ఈ టెలోమల్స్ ఆశాజకమైన పని తీరును కనబరుస్తాయంటున్నారు పరిశోధకులు. అనుకోని […]
ఆడవాళ్లకు కష్టమే
30 ఏళ్ళ నుంచి బార్ అటెండర్ గా కాక్ టెయిల్స్ కలిపే ఉద్యోగంలో ఉంది శబ్ధిబసు. ఎప్పటికీ ఇది మహిళలు అడుగు పెట్టే ఉద్యోగమే కాదంటారు , కానీ కోరుకున్న చదువు చదివి ,ఇంట్లో అందరిని ఒప్పించి మరీ జాబ్లో చేరింది శబ్ధిబసు. ఎంతో కాలం అనుభవం సంపాదించి బార్ టెండర్ అకాడమీ మొదలు పెట్టింది. ఎంతో మంది నిపుణులను తయారు చేసింది. సింగపూర్ ,న్యూయర్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది. ఇప్పటికి ఇది […]
మంచి సినిమా The First Grader
మార్గ్యూ ఆఫ్రికా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన తెగకు చెందిన ఉద్యమకారుడు. 84 ఏళ్ళ వయస్సులో ఓ చెవికి పూర్తిగా వినికిడి శక్తి పోయాక, ఓ కాలు దెబ్బతిని కుంటుతు నడుస్తూ , స్కూల్ కు వెళ్ళి చదువుకోవాలనుకొంటాడు. కెన్యాలోని ఓ పల్లెటూరి స్కూల్లో , ఎందరో నిరసనల మధ్య జాయిన్ అవుతాడు. అన్నీ ఇబ్బందులు అధికమించి ఆ స్కూల్లో చదువుకొంటాడు. ఈ సినిమా The First Grader .ఇది బయోపిక్ మార్గ్యూ నిజ జీవిత […]
తెలంగాణ నుంచి ఢిల్లీకి
నల్గొండకి చెందిన సరిత ఢిల్లీలో తొలి మహిళ బస్సు డ్రైవర్ గా పని చేస్తోంది. హైదరాబాద్ లో మినీబస్ లు ,ఆటోలు నడిపి ఆ నైపుణ్యంతో భారీ వాహానాలు తోలే లైసెన్స్ పొందింది. ఢిల్లీలోని సఖీ క్యాబ్స్ లో చేరింది సరిత. అక్కడే రూట్ మ్యాప్ ని అర్ధం చేసుకుని ,ఆత్మరక్షణలో శిక్షణ తీసుకుని ఢిల్లీ రవాణా శాఖలో పని చేసే అవకాశం సంపాదించింది. మూడేళ్ళుగా ఢిల్లీలో జాబ్ చేస్తోంది సరిత.
