Sunday, 28 Jun, 2026

ఆ కాల్షీట్లు ఇంటికే

పండగలు, పుట్టినరోజులు,శుభ కార్యాలు నేను షూటింగ్ లో ఉన్నప్పుడు వస్తే ఏడుపు ఆగదు అంటుంది కాజల్,షూటింగ్ కోసం ఇంటికి దూరంగా ఉండవలసి వస్తే కష్టమే, అమ్మ,నాన్నా నాతో వస్తూ ఉంటారు. అయితే ఒంటరిగా విదేశాల్లో ఉండవలసి వచ్చినప్పుడు-సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేయవలిసి వచ్చినప్పుడు ఏమి అనిపించదు అలవాటైపోయింది కాని మరీ షూటింగ్ ల్లో పండగ వస్తే ఇబ్బంది అంటుంది కాజల్.దాదాపుగా పండగా రోజులన్ని ఇంటికే కేటాయిస్తాను,ఇంట్లో అందరి మధ్య ఉండే సంతోషం ఎప్పుడు పోగోట్టుకోను శుభకార్యాల్లోనే కదా […]

పెళ్లి తో ఆరోగ్యం

వైవాహిక జీవతం గుండె జబ్బుల పై ప్రభావం చూపిస్తుందని యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భార్యతోనూ, తల్లితోనూ ఎంతో అనుబంధం ఉంచుకొనే వారి ఆరోగ్యం ఎంతో మెరుగైనదని బాడీ మాన్ ఇండెక్స్ మొదలు కొలెస్ట్రాల్ , రక్త పోటు వంటి సమస్యలు తగ్గిపోగా గుండె జబ్బుల విషయంలో మరింత మెరుగుదల నమోదైందని అంటున్నారు . గతంలో జరిగిన ఎన్నో అధ్యయనాలు పెళ్లికి ఆరోగ్యానికి సంబంధం ఉందని తేల్చాయని ఇప్పుడు 620 మందిపై జరిపిన ఈ ఆధ్యయనంలో […]

వేసవి వస్తోంది

వాతావరణం వెచ్చబడుతుంది వేసవి రాబోతుందన్నమాట . మరి అమ్మాయిలు మేకప్ లో కొంత మార్పులు తేవాలి. ముఖ్యమైన సూత్రం వీలైనంత సింపుల్ గా ఉండటం . రాత్రి మేకప్ ప్రధానం ఫౌండేషన్ సింపుల్ లేయర్లు అప్లై చేసుకోవాలి. సరైన ఫౌండేషన్ ఎంచుకుని కరెక్టగా అప్లై చేస్తే మేకప్ అవసరం ఉండదు. మచ్చల్ని కవరు చేయడానికి కొంచెం ఫౌండేషన్ చాలు. కన్షీలర్ విషయంలో కూడా ఇంతే. చర్మం ఆయిల్ గా ఉంటే లిక్విడ్ ఫౌండేషన్ సూటవుతుంది. చర్మం పొడిగా […]

అమ్మకో యాప్

కాబోయే తల్లుల కోసం క్రియేట్ చేశారు బేబీ బంప్ ప్రెగ్నేన్సీ ప్రో యాప్ . ఈ యాప్ తో కడుపుతో ఉన్నవారి కోసం అనేక సహాయాలు దోరుకుతాయి.  పుట్టబోయే బిడ్డకు పెట్టలనుకునే పేర్లు , వాళ్లకు అవసరమైన వస్తువులు , పిల్లల విషయంలో తల్లి అనుసరించి తాను తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఇందులో పొందుపరచారు. ఇందులో అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సభ్యులందరు గర్భిణులు, పిల్లలున్నవాళ్లు అందరి అభిప్రాయాలు , సూచనలు షేరు చేసుకోవచ్చు . తీసుకొనే […]

ఇది ఖరీదైన జాబ్

ప్యాడ్ మ్యాన్ లో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఇందులోని పాత్రకు అక్షయ్ తప్ప ఇంకేవరు న్యాయం చేయలేరు అంటుంది రాధిక ఆప్టే . సినిమా సెన్షేషన్ హిట్ కావడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉంది. అన్నీ భాషాల్లో కలిపి పది చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. హీరోయిన్ అనేది ఓ ఖరీదైన జాబ్ . కథానాయికలు బోలెడంత సంపాదిస్తారని అనుకుంటారు కానీ అదే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. అందం కాపాడుకొనే విషయం దగ్గరి నుంచి […]

ఎంత కష్టం

మా పైన పూవ్వులు, రాళ్లు ఏవి పడిన భరించవలసిందే అంటుంది హీరోయిన్ తమన్నా. ఈ మధ్య ఒక షో రూమ్ ప్రారంభోత్సవానికి వెళితే ఒక ఆకతాయి చెప్పు విసిరిన విషయం ప్రస్తావిస్తూ తమన్నా , ఈ మధ్య హీరోయిన్స్ పబ్లిక్ అప్పిరియన్స్ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులు వస్తున్నాయి, అసభ్య ప్రవర్తనా,కామెంట్స్ ఇరిటేట్ చేస్తాయి కానీ మేం ఏం చేయలేము. మేం యాక్టర్స్ ఇష్టాన్ని, ద్వేషాన్ని ఒకేలా స్వీకరించాలి అంటుంది తమన్నా. మనుషుల పైన ప్రేమను పాదరక్షలతోనో,తిట్ల […]

పుస్తకాలే సర్వస్వం

కేవలం ఆరునిమిషాల పాటు పుస్తకాలు చదివినట్లయితే , సంగీతం వినటంలో కంటే , వాకింగ్ చేయటం వల్ల అయితేనేం తగ్గే వత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడి తగ్గుతోందని కొత్త రిపోర్ట్ చెపుతుంది.  పుస్తక పఠనం మెదడుకు మంచి వ్యాయం వంటిదని యు.కె పరిశోధకులు చెబుతున్నారు.  పనులు చేయడంకంటే పుస్తకాలు చదవడం మెదడును చురగ్గా మార్చుతోంది. చిన్నతనం నుంచి ఒక రోజు వారి ప్రణాళికలాగా పుస్తకాలు చదవుతుంటే మెదడు చురుగ్గా రెస్పాండ్ అవుతుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండ అరికట్టడంలో […]

సోయాపాలే బెస్ట్

సోయాపాలు ,ఆవు పాలలాగే మేలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గింజల నుంచి తయారు చేసే పాలన్నింటిలో కనిసించే పోషకాలను విశ్లేషించి వారు ఈ నిర్ణయానికి వచ్చమంటున్నారు.అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉన్నాయని , సోయపాలలోని ఐసోప్లేవిన్స్ అనే రసాయనాలు క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తాయని గతంలోనే రుజువైంది. అంతేకాదు ఈ పాలలో బియ్యంలోంచి తీసిన పాల కంటె పోషకాలు అధికంగా ఉన్నయన్నారు. అలాగే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువే కాని అవి శరీరంలో చేరిన చెడు కొలెస్ట్రాల్ […]

మనకి నచ్చినట్లు మనం

నిహారికా,మనందరికీ మన గురించి ఇతరులు ఎమనుకుంటున్నారో అని ఆలోచన ఉంటుంది.అందుకే ఎప్పుడు ఇతరులను మెప్పించేలా మాట్లాడటం ,ప్రవర్తించడం చేస్తాం.కానీ మనల్ని మనం పోగోట్టుకుంటే నష్టం కదా. ఎవరి అంగీకార,ఆమోదాల కోసం చూస్తామో వాళ్ల లోనూ లోపాలు ఉంటాయి. ఇతరల ఆలోచనలతో మనకు నిమిత్తం లేదు.వాళ్లు మన గురించి ఎమనుకుంటున్నారో నిజంగానే మనకి అనవసరం.మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో,ఎలా జీవిస్తున్నామో అది కేవలం మన ఇష్టం,మన వ్యక్తిగతం .ఎదుటివాళ్లను మనం నియంత్రించలేము […]

ఆవిరి తో వండాలి

కొన్ని పదార్థాలలో అద్భుతమైన పోషకాలుంటాయి.కానీ వాటిని సరైనా విధంగా వాడకపోతే ఆ పోషకాలు శరీరానికి దక్కవు.ఉదాహరణకు ఆకు కూరలు లేత కాడల్లో కాల్షియం ఉంటుంది.ఆకులతో పాటు కాడలు తరుక్కోవాలి, నెమ్మదిగా ఆవిరిపై ఉడికేలా గిన్నెపైన మూత పెట్టి ఉడించుకోవాలి లేక పోతే పోషకాలు ఆవిరై పోతాయి.పప్పు తొందరగా ఉడకాలని దాంట్లో సోడా ఉప్పు వేస్తారు దీని వల్ల విటమిన్ -B పోతుంది. కొన్నింటిని  పులిసేలాగా నిలవచేసి  పోషకాలు పోకుండా స్టీమ్ కుక్కర్లలో ఉడికించుకోవాలి.ఎన్నో రకాల కూరగాయలు రుచి […]

నలుపులో పోషకాలు

పండ్లు,కూరగాయాలు కేవలం నలుపు రంగులోనే వస్తున్నాయి. ఈ కృష్ణ వర్ణపు వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటోలు,ముల్లంగి, క్యాప్సికామ్‌,మిరపకాయలు చివరకు బంగారు రంగుతో కనువిందు చేసే మొక్క జొన్న పొత్తులతో సహా అన్ని నల్లనివే. మన దేశంలోని మణిపూర్ లో నల్లని బియ్యం పండుతున్నాయి. ఇండోనేషియా,ఆఫ్రికా దేశాల్లో ఈ నల్లని వర్ణపు కూరగాయలు ,పండ్లు పండిస్తున్నారు.ఈ రంగే కాదు,వీటి లోని పోషకాలు అద్భుతమే.

దశావతరాల నగలు

నగల్లో ఇప్పుడు థీమ్ డిజైన్ నగలోచ్చాయి. నగల్లో భక్తిని జోడిస్తున్నారు. దేవుళ్ళు ఫ్యాషన్ కలిపేస్తే దశావతరాల నగలయ్యాయి. ఆభరణాల్లో లక్ష్మీ రూపాలు, వెంకటేశ్వరస్వాములు జత పరచడం కొత్త కాదు, కానీ దేవత రూపాలను మరింత అందంగా ట్రెండీగా నగల్లో పొందికగా పేరుస్తూ హారాలు,వడ్డాణాలు,గాజులు,జుంకీలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా దశావతరాల నగలు థీమ్ డిజైన్ గా వచ్చాయి. పచ్చలు ,కెంపులు ,వజ్రాలు పొదిగిన నగలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ.

మా డ్రెస్,మా ఇష్టం

ఇప్పటికీ అమ్మాయిల,కథనాయికల వస్త్రధారణ గురించి సమాజంలో చర్చలు జరగడం నాకెంతో ఆశ్చర్యంగా ఉందంటుంది రకుల్ ప్రీత్ సింగ్.ఫలానా ఇలాంటి దుస్తులే వేసుకోవాలని నిర్ణయించేందుకు ఎవరిది అధికారం ? మా అమ్మాయిలకు కోన్ని ఇష్టాలుంటాయి. చిట్టివో పోట్టివో చీరెలు,చుడిదారులో మా యిష్టం.మేం ఎంతో పద్ధతిగా అలంకరించుకోవాలో మాకే తెలుసు.ఈ ఆలోచన ధోరణి మారాలి.అమ్మాయిలపై ఆంక్షలు విధించడం ఏమిటి? కొందరైతే అత్యాచారాలు అమ్మాయిల వస్త్రధారణ కారణంగానే అన్నట్లు మాట్లాడుతుంటారు.తప్పు వెనకేసుకొస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే.కాస్తా ధోరణి మార్చుకోండి అంటుంది రకుల్ ,అంతే […]

ఎలాగోలా తింటే తప్పే

ప్రతి పనీ ఎలాగోలా చేద్దామనుకుంటే ఒక్కోసారి చాలా నష్టం . ఆఫీసుకు లంచ్ బాక్సు తీసుకుపోయి దాన్ని అటు ఇటుతిరుగుతూ,నడుస్తూ,మాట్లాడుతూ ఖాళీ చేస్తారు.పొట్టలోకి ఎలా వెళితేనేం తినటం ముఖ్యంగానీ అంటే అది పొరపాటే. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోని తినాలి.పదార్ధాల రుచి ఆస్వాధించాలి.అసలేం తింటున్నామో తెలుసుకోవాలి. ఇలా అయితేనే ఆరోగ్యం.మనం తినే ఆహారం అన్నావాహిక లోంచి ఉదరంలోకి చేరుతుంది.నడుస్తు తింటే ప్రకియలో తేడా వస్తుంది. ఆహారం జీర్ణం కాక సమస్యలు వస్తాయి. శరీరానికి శక్తిని ఆరోగ్యానికి ఇచ్చే […]

ఇచ్చుటలో ఉన్న హాయి

సంతోషంగా వుండాలి కరెక్టే మరి ఆ సంతోషపు చిరునామా ఎక్కడ? సన్మార్గంలో వెళితే మనస్స్ సంతోషంగా శాంతిగా ఉంటుంది.ఇప్పుడో పరిశోధన ఫలితం ఉదార బుద్ధి సంతోషాన్ని ఇవ్వడంలో ముందుంటుందని తెలిసింది. స్వార్థంలో ఉండేవారి కంటే ఉదారంగా ప్రవర్తించే వారు సంతోసంగా ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు పరిశోధకులు.ఔదార్యనైజం మొదడులోని ఆల్ట్రాస్టిక్ ప్రదేశాన్ని చైతన్య వంతం చేయడమే ఇందుకు కారణమని ,ఆ ప్రదేశానికి సంతోషానికి నడుమ అనుసంధానం ఉందన్నాయి పరిశోధనలు.ఎవరికైనా ఏదైనా ఇవ్వటంలో దొరికే సంతోషం ఎల్లలు లేనిదన్నారు.

చక్కగా పెంచాలి

నిహారిక, పిల్లల పెంపకం కత్తి మీద సాము వంటిదే. నేర్చుకునే వయస్సులో వాళ్లు దేన్నైయినా అనుకరించి అనుసరిస్తారు.  అందుకే శ్రద్ధగా ప్రేమానురాగాలు పంచినట్లు మంచి లక్షణాలు ఉండేలా అన్ని నేర్పాలి. వాళ్లు దేనికైనా భయపడుతున్నారో అంటే భయానికి కారణం తెలుసుకొని దాన్ని ఎలా అదికమించవచ్చో చెప్పాలి. ఎ ప్పుడు వాళ్లను ప్రతి పని నువ్వు చేయగలవనే పాజిటివ్ ధృక్పథంతో పెంచాలి. మంచి మంచి సక్సెస్ స్టోరీస్ తో వాళ్ల విజయాలను అపజయాలను ఒకే స్థిరమైన మనస్సుతో ఎలా […]

గృహిణి పాత్ర నా డ్రీమ్

నాకు ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా చేయాలని ఉంది అంటుంది దీపికా పడుకోణె. పద్మావత్ లో రాణి పద్మావతిగా, బాజీరావు మస్తానీలో మస్తానీగా , చెన్నై ఎక్స్ ప్రెస్ లో మీనా అజ్గుసుందరంగా బాక్సాఫీస్ బ్రేక్ చేసినా ఇంకా నాకు కల మిగిలే ఉందంటుంది దీపిక. సగటు గృహిణి పాత్రలో నటించాలని నాకల. ప్రతికుటుంబంలో గృహిణి పాత్ర కీలకం. భర్త ,పిల్లలు ,అత్తమామలు,తల్లిదండ్రులతో అందరి కలను ఆమె నిజం చేసుకోవటం వెనుక ఆమె కష్టమే ఎంతో ఉంది. దానికోసం […]

తేలికైన బెనారస్ లు

బరువైన జరీ చీరలు నచ్చే రోజులు పోయాయి.ఇప్పుడు చీరలు తేలికగా ,ఫ్యాన్సీగా ఆడంబరంగా కూడా వుండాలి.అప్పుడే రిచ్ లుక్ తెచ్చి పెడుతాయి బెనారస్ చీరలు. చక్కని నేత కంటికి ఇంపైనా రంగులతో బెనారస్ లో ఎన్నో వెరైటీస్ వచ్చాయి. బెనారస్, కథక్ సిల్క్, జ్యూట్ బెనారస్ , ఫ్యాన్సీ సిల్క్ లు,బెనారస్ షిఫాన్, బెనారస్ బైలు ఫ్యాన్సీ చీరల్లో బంగారు రంగు పూతల పని తనం, గ్రాండ్ గా వుండే పైట కొంగు బార్డర్ అంచుల పై అందమైన […]

కత్తిరింపుల అందం

మనకు దగ్గరి వాళ్లకు గిఫ్ట్ ప్యాక్ లు ,గ్రీటింగ్ కార్డులు పంపేటప్పుడు అవి చూసేందుకు అందంగా,అపురూపంగా ఉండాలనుకుంటారు రంగుల కాగితాలతో,చార్టుతో గ్లిట్టర్ పేపర్ షీట్లను అందంగా రకరకాల డిజైన్ తో కత్తిరించుకొనేందుకు ఉపయోగపడే ఎన్నో మోడల్స్ తో పంచింగ్ మిషన్లు వచ్చాయి. ఈ పేపర్ డిజైన్ పంచింగ్ మిషన్ లలో తీగలు, పూవ్వులు,బార్డర్స్ లో హృదాయాకారాల్లో కట్ చేయవచ్చు. సర్కిల్ ఎడ్జ్ పంచింగ్ మిషన్లు, ఆల్ ఓవర్ ద పంచ్ మిషన్లు ఎంచుకొని ఎన్నో అందమైన ఫోటో […]

రోజ్ వాటర్ మాస్క్

ఇక వాతావరణం మారుతోంది.చాలా తొందరగా వేడి గాలి వచ్చేస్తుంది.ఈ పోడి గాలికి చర్మం పొడిగా అయిపోతుంది.రోజ్ వాటర్ లో కొన్ని కాంబినేషన్స్ కలిపి ఫేస్ ప్యాక్‌ వేసుకోండి చర్మం పొడివారదు అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. టేబల్ స్పూన్ గంధం పొడిలోకి అర టీస్పూన్ చొప్పున బాధం నూనె,కొబ్బరి నూనె కలిపి ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి మొహానికి మాస్క్ లాగా వేసి అరగంట ఆగాకా కడిగేస్తే ముఖం తేటగా ఉంటుంది. తర్వాత మాయిశ్చరైజ్ రాసుకుంటే […]