Sunday, 28 Jun, 2026

చెత్తలోంచి కొత్త బ్రాండ్

డూడ్ లేజ్ బ్రాండ్ తో పరిశ్రమల నుంచి వృధాగా వదిలేసిన వస్త్రంతో ఆధునికమైన ట్రెండీగా కనిపించే డిజైన్ లతో బ్రాండ్ స్టోర్స్ లో దొరికే దుస్తులకు ధీటుగా అద్భుతమైన డ్రెస్ తయారు చేసి లక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించింది కృతీ తుల. పెద్ద సంస్థల్లో ప్రింట్ లో తప్పులు వచ్చినా లేదా రంధ్రాలున్నా కటింగ్స్ లో తేడాలున్నా ఆ వస్త్రాలను పక్కన పెడతారు. అలా నిరుపయోగంగా పేరుకుపోయిన  వస్తువులను సేకరించి ఒక మంచి వ్యాపారం ప్రారంభించింది కృతి తుల. […]

భయం వేస్తోంది

ఒక నిశ్శబ్దం బద్దలైంది. లైంగిక వేధింపుల గురించి అందరు పెదవి విప్పుతున్నారు తమ ఆవేదన కోపం బలంగా చెపుతున్నారు. మళయాలం తెలుగు,తమిళ్ ,తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానం పొందిన మంజిమా మోహన్ కుడా తన అభిప్రాయం చెప్పింది. ఒంటరిగా ప్రయాణాలు చేస్తావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని పెప్పర్ స్ప్రే బ్యాగ్ లో పెట్టుకోమని నా సోదరుడు పోరుతు ఉంటాడు. నేను ఒకప్పుడు దాన్ని కొట్టి పారేశాను. కాని ఈ మధ్య కొన్ని సంఘటనలు చూశాక పెప్పర్ […]

సుగుణాల పూదిన

ఘాటైన వాసన కమ్మని రుచి గల పూదినలో ఔషధగుణాలు అన్నీఇన్నికావు. టూత్ఛ పేస్ట్ ,చూయింగ గమ్ ,పిప్పర్ మెంట్స్ లో పూదినా వాడటం ఈ కారణం వల్లనే, జ్ణాపకశక్తికి సంబంధించిన సమస్య ఉంటే పూదిన మంచి ఔషధమే. పూదిన రసాన్ని నీటిలో కలిపి పుక్కిటపడితే నోటి దుర్వాస దంత సమస్యలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో పసుపు, పూదిన ఆకులు వేసి మంరిగించిన టీ తాగితే మంచిది. పూదిన నుంచి తయారు చేసిన మెంథాల్ ,కర్పూరం, […]

ముందస్తు జాగ్రత్త

పెరున్న కంపెనీ క్రీమ్, లోషన్ లేదా ఫేషియల్ ముఖాన్ని పూర్తిగా మార్చేస్తాయి అనుకుంటే తప్పే. చర్మం పైన శ్రద్ద చక్కగా నిగనిగలాడే రంగు ఉండాలని కోరుకుంటే క్రమం తప్పకుండా చర్మ వైద్య నిపుణులు, బ్యూటీ ప్రోఫెషనల్స్ ను కలుస్తూ ఉండాలి. ముఖం పైన పెదాల పైన గీతలు కనిపిస్తే ఆ వృద్దాప్యపు లక్షణాలు పోయేలా చికిత్స తీసుకోవాలి. శిరోజాల పరిరక్షణ ,సిపుల్ ఫేస్ వాష్ , మాయిశ్చరైజర్ ,క్రీమ్ ఇవన్ని చర్మానికి సరిపడతాయా లేదా ఎక్స్ పర్ట్ […]

నేర్చుకోనివ్వండి

మనుషులలో ఎదుగుదల, మెదడు చైతన్యంగా ఉండటం జ్ణాపకశక్తి మొదలైనవి నిరంతర ప్రక్రియలు. పిల్లల వయసుతో పాటు ఇవన్ని పెరుగుతాయి. కనుక వారికి ఊహాశక్తిని పెంచే బొమ్మలు ఇవ్వాలి. లెక్కలు, భాషా నైపుణ్యాన్ని పెంచుకునే చార్ట్ లు, పరికరాలు అందుబాటులో ఉంచాలి. పెద్దవాళ్లు పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. ఆల్ఫబెట్స్ ఈజీగా నేర్చుకోగలిగే ఫజిల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తాయి. వాళ్లు ముందుగా బొమ్మలతో ఆ తర్వాత తమ తోటి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యేలా ఈ బొమ్మలు […]

గాఢమైన యాసిడ్స్ ప్రమాదం

నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఏడువేల మంది మహిళల పైన ఒక అధ్యాయనం చేశారు. చాలా మంది ఊపిరితిత్తుల సమస్యతో భాధపడుతున్నారు. ఎందువల్ల అని పరిశోధనల్లో తేలింది ఏంటంటే వాళ్లు ప్రతిరోజు యాసిడ్స్, డిటర్జంట్ల తో ఇల్లు, వంటిల్లు, బాత్ రూమ్ లు శుభ్రం చేయటం. ఇలా చేయటం ఊపిరితిత్తుల పైన పోగ తాగడంతో సమానమైన హాని కలుగుతుందని చెబుతున్నారు. ఇంటిలో గచ్చు, మొండి మరకలు, వంట గదిలో నూనె నిండిన అరుగుల్ని […]

మెంటర్ గా రకుల్

ఎఫ్ బిబి కలర్ ఫెమీనా మిస్ ఇండియా 2018 కి రకుల్ ప్రీత్ సింగ్ మెంటర్ గా వ్యవహరించనుంది. ఈ విషయం గురించి చెబుతూ నేను ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టానో మళ్లీ ఇక్కడికే చేరాను. 2011లో మిస్ ఇండియాలో పోటీదారుగా ఉన్నాను, ఇప్పుడు మళ్లీ మెంటర్ గా వస్తున్నా అంది. ఆ వయసులో నాకు ఆ వేదిక చాలా బాగా ఉపయోగపడింది. సినిమాల్లోకి వచ్చాను ఎంతో మందితో పరిచయం అయింది. అప్పటి నూమ్చి జీవితం […]

అంచల్ సంచలనం

ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంచలన క్రీడాకారిణిగా వెలుగులోకి వచ్చించి అంచల్ ఠాకూర్. భారతీయులకు అంతగా పరిచయం లేని స్కీయింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతాకం గెల్చుకుంది అంచల్.  అంచల్ పుట్టింది మనాలి ప్రాంతంలోని బువ గ్రామం, మంచుకొండల్లో సాధన ప్రదేశం. పసితనం నుంచి తాను ఆడుకునే ప్రదేశం మంచుకొండలే. అలా ఎదిగిన అంచల్ జనవరిలో జరిగిన ఆల్ఫిన్ ఎజ్డెర్ 3200 కప్ లో అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో గెలిచిన తొలి భారాతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. ఇంతవరకు భారతీయ […]

ఎన్నో కన్నీళ్ళ కష్టం

బాలీవుడ్ వారు హాలీవుడ్ స్థాయికి ఎదిగి ఐదో సారి వరల్డ్ సెక్సీయస్ట్ ఏషియన్ ఉమెన్ గా ఎంపికై రెండేళ్లుగా విజయ పరంపర సృస్టిస్తున్న ప్రియాంకచోప్రా ఇదంతా చాల కష్టమైన ప్రయాణం అంటుంది. ఎన్నో గంటల పని స్వేదం ఎన్నో కన్నీళ్ళు విజయం వెనక ఉన్నాయంటుంది. ఒక భారతీయ నటికి ప్రపంచ తారా గా గుర్తింపు వచ్చిందంటే అదంతా నేను మనదేశంలో నేర్చుకున్న దానికి ప్రతిబింబం. నేను ఎప్పుడు నేల పైంఏ ఉన్నా నేనిక్కడ ఎంజాయ్ చేసిన పోజీషన్ […]

బద్దకాన్ని వాయిదా వేస్తేనే

నిహారికా, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మనం రోజును ఎలా ప్రారంభిస్తామో దాని ప్రభావం మిగతా దినచర్య పైన తప్పనిసరిగా ఉంటుంది. అలారం పెట్టుకుని అది మోగగానే లేస్తామా ? దానిని కాసేపు ఆపుతూ బద్దకంగా మరో పది నిమిషాలు పోడిగిస్తాం. నిద్ర లేవటం అలా బద్దకంగా మొదలు పెడితే అది రోజంతా ప్రతి పనిని కాసేపు ఆపుతూ పోతుంది.   అందుకే సాధ్యమైనంత తోందరగా పడుకుని ఉదయం లేవగానే మనసులో హుషారు పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకోవాలి. రోజంతా ఎలా […]

వర్ణ సౌందర్యం

ఇప్పుడు వస్తోంది కలంకారీ ఫ్యాషన్, సారె చీరలు,కలంకారీ అంచులు సేమ్ బ్లౌజులు ఇవన్ని ఫ్యాషన్ ట్రెండ్.  కలంకారీలో మాత్రమే కనిపించే చిక్కని, చక్కని రంగులు హంసలు, నెమళ్ళు పువ్వులు, గుళ్ళు ఇవ్వన్ని అన్ని రకాల వస్త్రశ్రేణిలో ప్రత్యక్ష్యం అవుతున్నాయి. జీన్స్ ,చూడీదార్ అందమైన కలంకారీ వర్ణాలలో కనువిందు చేస్తున్నాయి.  జీన్స్ ఫ్యాంట్ పైన కలంకారీ షర్ట్ ఎంతో అందంగా అదిరిపోతుంది. జీన్స్ ,చూడీదార్ పై కలంకారీ జాకెట్ చమ్కీ కాంభినేషన్ కలంకారీ అనార్కలి సాదా లెగ్గింగ్ అలల్లో […]

ఏది వదిలేది!

నీహరికా, వదిలించుకోవల్సిన విషయాలు చాలా ఉంటాయి తెలుసా జీవితంలో అన్ని పట్టించుకోవటంలో అర్ధం లేదు. ఎప్పుడు ఏది వదిలెయ్యాలో అది వదిలెయ్యాలి.  రోజులో ఎన్ని గంటలు ఎలా గడుపుతున్నామో ఒక్క రోజు పేపర్ పైనా రాసుకుంటే వృధా చేస్తున్న సమయంఎంతో తెలుస్తుంది. టీవీ చానల్స్ మారుస్తూ, ఫోన్ లో సంభాషనలు కొనసాగుస్తూ ఇంకొంత ఫేస్ బుక్, వాట్సాప్ వీటన్నింటితో గడుపుతున్న సమయం ఎంతవీటితో పాటు సమయాని విలువగా వాడిన నిమిషాలు ఏమైనా ఉన్నాయా, మంచి పుస్తకం చదవటం, […]

ఎంతో ప్రయోజనం

హాట్ సాస్ లు ,డ్రైఫ్లీక్స్ తో పోలిస్తే తాజా విరపకాయల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో ఎ విటమిన్, బి కాంప్లెక్స్ ,పోటాషియం,మెగ్నిషియం,ఐరన్,మాంగనీస్ వంటివి ఎక్కువ ఉంటాయి. రక్తంలో షూగర్ లెవల్స్ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచి రక్త సరఫరాను క్రమబద్ధీకరిస్తుంది.హంగెరికి చెందిన పారీ రెడ్ చిల్లీ తక్కువ కారం ఉన్న మిరపకాయలు వీటినీ చికెన్ వంటకాల్లో వాడతారు.ఇటలీ, చైనాఅ,నైజీరియన్ వంటకాల్లో వంటలకు అత్యధిక రుచి ఇచ్చేవి రకరకాల మిరపకాయలు కారం అని భయపడకుండా కాస్తా ఘాటుగా […]

నీ పేరేమిటి అందమా!

అందానికి ఎంత శక్తి ఉంది అన్న విషయం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. పలు విద్యాలయల్లో పరిశోధకులు అందమైన వాళ్ళకి అధిక జీతాలుంటున్నాయని తేల్చారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకునేందుకు ఆ కంపెనీ వ్వవస్థాపకుడు కాని, ప్రచార సారధి కానీ అందంగా ఉంటే ఎక్కువ మంది విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకోస్తారని తేల్చారు. జ్యూరిచ్ విశ్వవిద్యాలయం వాళ్ళుఅందంగా ఉన్న వాళ్లని అందరు భరిస్తారని వాళ్ళమాటలకు చేతలకు అవసరానికి మించి విలువ ఇస్తారని స్పష్టంగా చెప్పారు.కార్పొరేట్ రంగంలో జరిపిన […]

పక్కింటి అమ్మాయినే

ఒక కవర్ పేజీ పైన రకుల్ ఫోటోలు చూసి ఆమెకు ఒక్క క్షణం లో హాట్ గాళ్ అని బిరుదు ఇచ్చేశారు నెటిజన్లు. దీని గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నన్ను గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ అన్నవాళ్లే ఒక్క షూట్‌తో ‘హాట్‌ గాళ్‌’ అనేశారు .తెలుగులో ఎన్నో సినిమాల్లో ఇలాంటి డ్రెస్ లో గ్లామర్ గా కనించాను .నేను ఫిట్‌నెస్‌తో అందంగా ఉంటానని నా ఫ్యాన్స్ అందరికీ ,నన్ను ఆదరించే ప్రేక్షకులకు తెలుసు . ఒక్క […]

బెస్ట్ పద్ధతి

మాంసాహారం ఉడికించే ముందు కొన్ని హెర్బ్సె కలిపి నాన బెడతారు. ఉప్పు,కారం ,మసాలాలు ముక్కలకు పట్టి రుచిగా ఉంటాయని ఇలా చేస్తారు .కానీ ఇలా మేరినేట్ చేయటం వల్ల ఇంకా మంచి ప్రయోజనం ఉంది. హెర్బ్స్ స్పైస్ లలో మాంసాన్ని నానబెడితే గ్రిల్ చేశారో వాటిలోని కార్సినోజన్ల ప్రభావం తగ్గిపోతుంది.గ్రిల్ మీట్ లో హెటెరో సైక్లిక్ ఎమైన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది.అయితే మాంసాన్ని రోజ్ మేరీ ,వెల్లుల్లి, అల్లం మొదలైన వాటిని నాన బెట్టి గ్రిల్ […]

బొమ్మల ఊరు

ఒక గ్రామంలో వందకుపైగా కళాకారుల కుటుంబాలు ఉన్నాయి.  వీరంతా 12వ శతాబ్ధం నాటి పత్తచిత్ర కళకు ప్రాణం పోస్తారు.  ఒరిస్సాలోని రఘురాజాపురం గ్రామం ఇది.  పూరీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ చిన్న గ్రామంలోని ఇళ్ల గోడల నిండా  రామాయణం, మహాభారతాల్లోని  సన్నివేశాలు అద్భుతంగా చిత్రించి ఉంటాయి.  పత్త చిత్రం అంటే వస్త్రంపైన వేసే బొమ్మలో  కాటన్ లేదా తుస్సార్‌ సిల్కు వస్త్రాల్ని పొరలుపొరలుగా అంటించి చిత్రాల్ని వేసే కాన్వాస్ లో తయారు చేస్తారు.  రంగును […]

లాలి జో పాపాయి

అమ్మకు ఎన్నో పనులుంటాయి. మరి పాపాయి కూడా అమ్మనే  జో కొట్టమంటుంది.  నిద్రపుచ్చమంటుంది.  అమ్మకు ఈ సమయంలో సాయం చేస్తోంది  ‘స్నూ స్మార్ట్‌ స్లీపర్‌’ . బుట్టలాంటి  ఈ ఊయల్లో  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులలో  బిడ్డని చుట్టి  ఊయల్లో ఉంచి చిన్న బటన్‌  నొక్కితే  చాలు.  పాపాయి ఏడుపు ఆపేంతవరకు అమ్మ చేతుల్లో పెట్టి ఊపినట్లు ఊపుతోంది.  ఏడుపు పెంచితే ఇంకాస్తా జో కొట్టినట్లు ఉంటుంది.  ఇక పాపాయి నిద్ర పోయాక నిద్ర మధ్యలో కదిలి […]

కళల వల్ల లాభం

సమాజ సంక్షేమ కార్యక్రమాలు ,కళలు మనుషులకు అద్భుతమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయని ఒక అధ్యయనం చెపుతోంది . ముఖ్యంగా డ్రాయింగ్ ,పెయింటింగ్, రచన మొదలైన కళలలో నిమగ్నమైన వారిలో డెమెన్షియా బాధించదట. ఈ మధ్య కాలంలో వెయ్యి మంది వృద్ధులపై    8 ఏళ్లుగా జరిపిన పరిశోధనలో డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్స్ లో నిమగ్నమైన వాళ్లు జ్ఞాపక శక్తి దానికి సంబంధించిన సమస్యలతో బాధపడలేదని తేలింది.  వృద్ధాప్యంలో వచ్చే చిన్న పెద్ద అనారోగ్యాలు సహజంగానే వచ్చిన వారిలో జ్ఞాపక […]

ఇవి చాలు

నీళ్లు మంచివని ఎక్కడకు పోయినా వెంట వాటర్ బాటిల్ తెచ్చుకొంటుంటారు .  ఒక కొత్త పరిశోధన ఏం చెపుతుందంటే మరీ నీళ్ల విషయంలో అంత పర్టిక్యులర్ గా ఉండక్కర్లేదు.  మనం తినే ఆహరంలోని పండ్లు, కూరగాయాలు, కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి కూడా హైడ్రేడ్ చేస్తాయి. మంచి పండ్లు ముఖ్యంగా వాటర్ మిలన్ లూ, కర్భూజా వంటివి కూడా శరీరానికి శక్తినీ, పోషకాలను ఇస్తాయని పైగా వాటిలో శరీరానికి కావలసిన నీరు పరోక్షంగా అందుతుందన్నారు ఎక్స్ ఫర్ట్స్. […]