Sunday, 28 Jun, 2026

దాణ గుణం పెరుగుతుంది

మొదటి బిడ్డను చూసుకున్న ఆనందంలో తల్లిదండ్రుల్లో దాణం చేసే గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. పసికందు అల్లరిలో కుటుంభం యావత్తు ఆనంద డోలికల్లో ఒలలాడుతుంది. తొలో సంతానంగా మగ బిడ్డ పుడితే తల్లిదండ్రుల్లో దాణగుణం అధికంగా ఉంటుంది.ఇద్దరు ముగ్గురు బిడ్దలున్న తల్లిదండ్రుల్లో దయాగుణం పెరుగుతుంది. ఈ ఆలోచనకు పరాకాష్ట జూకర్ బర్గ్ సంపాదన మొత్తన్ని పేద ప్రజల శ్రేయస్సు కోసం సమాజం కోసం ఇచ్చేశాడు. బిల్ గేట్స్ , వారెన్ బఫెట్ లను అవతల పెడితే పిల్లల్ని కన్న […]

మిస్ క్రిమినల్ పోటీలు

అందాల పోటీలు సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో గల్లీలోను జరిగిపొతున్నాయి.  మిస్ హైదరాబాద్, మిస్ గుంటూరు లు పుట్టుకొస్తున్నాయి. అంతే కాక పెంపుడు జంతువులు , మిస్ విలేజ్ ,మిస్ కంట్రీ ఇలాగా ఎన్నో ఊన్నాయి కాని వాటి మధ్య ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి మిస్ క్రిమిఅనల్ పోటీలు.  బ్రెజిల్ రాజధాని రియా డిజెనిరోలో మిస్ క్రిమినల్ పోటీలు జరిగాయి. మహిళా జైల్లో జరిగిన ఈ పోటీల్లో ఎన్నో నేరాలు […]

పొట్టి సుందరి

ఇది వరకు విఠాలచార్య సినిమాలో మాంత్రగాడి పక్కన ఒక పొట్టివాడు తప్పక కనిపించేవాళ్ళు, అలగే సర్కస్ కంపెనీల్లో ఎన్నో విన్యాసాలు చేసేవాళ్లు ఉన్నారు. అవన్ని పోయి ఇప్పుడు ప్రతి వాళ్ళు టాలెంట్ ఉంటే చాలు ఏదో రంగంలో తమ ప్రత్యేకత నిరూపించుకుంటున్నారు. కరీనా లెమోస్ అనే నాలుగు అడుగుల మూడు అంగుళాల ఎత్తైన ఆమె ప్రపంచ సెక్సీయస్ట్ డ్యార్ఫ్ గా సంచలనం సృష్టించింది. యోగాలు, డైట్ లు చేసి తాన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటుందో ఈమె ఫోటోలు […]

స్త్రీలలోనే సమస్య

స్త్రీలలో కంటే పురుషుల్లోనే గుండే జబ్బులు ఎక్కువ అంటారు కాని విడాకులు తీసుకున్న స్త్రీ,పురుషుల్లో స్త్రీలే గుండె జబ్బు బారిన ఎక్కువ పడుతున్నారని కొత్త రిపోర్ట్. 16వేల మంది స్త్రీ, పురుషుల పైన 18 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యాయనంలో విడాకులు తీసుకున్న వారిలో స్త్రీలు మానసికంగా తీవ్ర సంక్షోభానికి లోనవుతారని, అదే పురుషుల్లో పెద్ద ముప్పు ఉండదని కనుగొన్నారు, తీవ్రమైన ఒత్తిడికి గురైన స్త్రీలలో రక్తపోటు అధికమై గుండెపోటు గుండె నోప్పి వచ్చే అవకాశాలు […]

నవ్వులు రువ్వమ్మా

ప్రేమించే వాళ్ళ కోసం, భగవంతుడికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాళ్ళకి ఇష్టంగా గులాబీల బొకె ఇస్తుంటారు. ఒక్కో రంగు గులాబీ ఒక్కో విషయానికి ప్రతీక.ఎర్ర గులాబీ ప్రేమ వ్యక్తం చేస్తుంది. పసుపు గులాబీ స్నేహానికి ప్రతీక, పింక్ గులాబీ ధన్యవాదాలు తెలుపుతుంది, తెల్ల గులాబీ శాంతికి సంకేతం నారింజ రంగు గులాబీ శక్తికి అభివృద్దికి గుర్తు, బావోద్వేగాలను చెప్పేస్తుంది. ప్రేమ వ్యక్తం చేసేందుకు చిరు నవ్వులు స్నేహ పూరిత వాతవరణం ఇవ్వగల రంగు గులాబీనే. ఈ రంగుల్లో […]

ఎదురు చూస్తున్నా

డైరక్టర్ ప్రియదర్శన్ ,లిజాల గారాల బిడ్డ కల్యాణి కి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కోరిక. హలో సినిమాతో టాలివుడ్ కు పరిచయమైన కల్యాణి తన టాలెంట్ నిరుపించుకుంది. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. మా నాన్న పెద్ద దర్శకుడు కాబట్టి అదేం కష్టం కాదు అనుకుంటారు కాని సినీ కుటుంభం నుంచి వచ్చినంత మాత్రనా అన్ని అలా అయిపోవు. హీరోయిన్ అవ్వాలని నాన్నకి చెపితే చిత్రరంగంలో నువ్వేమిటో నిరుపించుకో అప్పుడు నీతో సినిమా తీస్తా అని […]

డాక్టర్ పాత్ర కావాలి

నాకో ప్రధానమైన కొరిక ఉంది ఉంటుంది ప్రణీత.ఈ మధ్య రెస్టారెంట్ బిజినెస్ లో దిగిన ప్రణీత ఆతిధ్యరంగ మంటే మొదటి నుంచి ఆసక్తి అని చెపుతుంది.  బాపు బొమ్మ అనే పేరు సొంతం చేసుకున్న ప్రణీత గ్లామార్ లోనూ మంచి మార్కులు దక్కాయి. తెలుగు, తమిళ్ , కన్నడ భాషాల్లో నటించిన ప్రణీత డాక్టర్ పాత్ర చేయాలని ఎంతో కొరిక ఉంది అని అంది.  అమ్మ,నాన్న ఇద్దరు డాక్టర్లు దీంతో సహజంగానే నన్ను అలా చూడలనుకుంటారు. నిజంగా […]

పాట కోసం ఫీట్

నేను గాలిలో ఎగరగలనని నాకు నమ్మకం వచ్చింది అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది కత్రినా కైఫ్. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో ఒక పాట కోసం ఎంతో కష్టమైన స్టెప్స్ వేస్తు అమీర్ ఖాన్, కత్రినా , ఫాతిమా సనా షేక్ లతో కలిసి అలుపు లేని ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అయ్యాయి. మూడు కోట్ల మంది ఆ వీడియో చూసి మురిసిపోయారు.  ఒక సినిమా సక్సెస్ వెనక […]

పువ్వుల్లో దీపాలు

నగరాలు అందంగా ముస్తాబు చేరసుకుంటున్న రోజులు. అందంగా కనించేవి చెట్లు, లైట్లు, మంచి వీధులు రోడ్డు పక్కన డిజైన్ చేసిన పూల తోటలు, కానీ ఇజ్రయిల్ లోని జెరుసలెంలో మాత్రం వీధిలైట్లు చాలా స్పెషల్ . జెరుసలెంలోని వాలెరో స్క్యేర్ సమీపంలోని హెల్ క్యూ ఆర్నెలెక్ట్ సంస్థ అద్భుతమైన వీధి దీపాలను ఏర్పాటు చేసింది. చీకట్లో కూడా బాగా కనించేందుకు తొమ్మిది అడుగుల ఎత్తులో వాటిని ఏర్పాటు చేశారు. ఎవరైనా వాటి దగ్గరకు వెలితే అవి పువ్వుల్లా […]

ఆకలిని పెంచే చైనీస్ సూప్

ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెన్ హెన్ యాంగ్యాగ్ టాంగ్ అనే సూప్ చైనా లో సంప్రదాయబద్ధంగా 12 మూలకాలతోతయారు చేస్తారు. వెయిట్ లాస్ ,థైరాయిడ్ ,వీపు నొప్పి ,క్యాన్సర్ మొదలైన అనరోగ్య సమస్యలున్నవారికి ఈ సూప్ దివ్య ఔషధం అని పరిశోధనలు తెలుపుతున్నాయి. సూప్ ని రెండు నుంచి మూడు వారాల పాటు రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం పొందవచ్చునంటున్నారు పరిశోధకులు.ఇది అనారోగ్యానికి మందు కాదు కానీ ఆకలిని పెంచే ఆరోగ్యవంతమైన జౌషధాలతో […]

ఉల్లి ఫేస్ ప్యాక్

ఉల్లిపాయ వాసన కాసేపు అవతల పెడితే అవి సహజ క్లెన్సర్లు గా పని చేస్తాయి . దీన్నీ క్లెన్సర్ గా టోనర్లుగా ఎక్కేవగా వాడుకోవచ్చు. వీటిలోని యాంటీ-ఆక్సీడెంట్స్ చర్మం లోని మలినాలను బయటికి తెస్తాయి. అందువల్ల చర్మం మృదువుగా అందంగా కనిపిస్తుంది. ఒక టీ స్ఫూన్ ఉల్లి రసంలో శనగపిండి ,పాలమీగడ కలిసి ఫేస్ వాస్ చేసి ఓ అరగంట తర్వాత కడిగెస్తే చర్మం కాంతి పెరుగుతుంది. ఉల్లి పాయలలో ఉండే సహజమైన బ్లీచ్ చేసే గుణం […]

యవ్వన రహస్యం

కొంత మందిలో వయస్సు కనించదు. ఎన్నెళ్లు వచ్చినా వృద్ధాప్య ఛాయలుంవు. ఇలా ఉండటానికి కారణం వాళ్ల శారీరాన్ని చురుకుగా ఉంచుకోవడమేనంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. సాధారణంగా క్రోమోజోములు అందులో ఉండే టెలోమర్ల కారణంగానే వృద్ధాప్యం మీదపడుతు ఉంటుంది. కదలకుండా సుఖంగా ఉన్నాం అనుకొనే వాళ్ల కంటే ఎక్కువ కదిలే వాళ్లు శారీరకంగా చుకుగ్గా ఉంటారని , ఆల కదలడం , రెగ్యులర్‌గా చేసే వ్యాయామం కావచ్చు , నడిచే అలవాటు , కష్టపడే తత్వం కావచ్చునని వారిలో టెలోమర్లు […]

ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి

ఒంటరిగా వుంటే గ్రెల్లిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుందట. అందువల్లే ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతోంది అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. అలాగే ఒత్తిడిగా ఉన్న దాన్ని దూరం చేసుకొనేందుకు ఏదో ఒకటి తినడం మొదలుపెడుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ముందు మనస్సును తిండి వైపుగా పోనివ్వకుండా జాగ్రత్త పడమంటున్నారు. అలాగే ఆహారంలో కూడా ఆరోగ్యవంతమైనా మార్పును తెచ్చుకోవాలి. చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టాలి. విభిన్న రకాల కూరగాయాలతో నిండిన సలాడ్ తో రోజులో […]

అందమైన తులసి కోట

అందమైన తులసి కోటల్లో వస్తున్న డిజైన్స్ ని గృహాలంకారణ  నిలయాలు, ఇటు ఆధునిక సంప్రాదాయం కలగలిసి రూపొందిస్తున్నారు . చెక్క, పాలరాయి, టెర్రకోటల నిర్మాణ శైలిలో అయినా, ఇప్పుడు తులసి కోట ప్రతి ఇంటా ప్రత్యేక్షం. తులసి కేవలం పూజాజనీయకమైనాదే  కాదు, జౌషధపరంగానూ విలువైందే ఇంట్లో పెంచుకోనే మొక్కలు రాత్రి వేళల్లో ఆక్సిజన్ పీల్చుకోని పగటి వేళల్లో ప్రాణవాయువును విదుడల చేస్తాయి.  కానీ రాత్రింబవాళ్లు ఆక్సిజన్ విడుదల చేస్తానంటుంది తులసి.  ఆరోజుల్లో ఉండే యూజనల్ అనే రంగు […]

హై బీట్స్ తో ఉత్సహం

అన్ని విధాలా అధ్బుతమే అని చెప్పుకొంటారు కానీ వ్యాయమాలు వర్కవుట్స్ అలసట తెప్పిస్తాయి. ఎప్పుడు బ్రేక్ పడుతోనే ఉంటుంది. అయితే సంగీతం వింటూ వర్కవుట్స్ చేస్తుంటే అలసట తెలియకుండా లక్ష్యం సాధించేందుకు వీలవుతోంది. వర్కవుట్ మ్యూజిక్ శారీరకంగా అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ ను 20 శాతం వరకు పెంచుతోందని అధ్యయనాలు గుర్తించాయి. సంగీతం నొప్పుల మీదకు దృష్టి పోనివ్వదు. హై బీట్స్ , ఫాస్ట్ టెంపో మ్యూజిక్ మరింత ప్రభావం చూపిస్తుందని అధ్యయనకారులు […]

పోషకాహార లోపం

మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఏ ఉదయం నడకలోనో, నిద్రలోని కాళ్ళ పాదల కండరాలు పట్టేసి నడవనివ్వకుండా చేస్తాయి. ఇందుకు కారణం క్యాల్షియం లోపం అంటారు డాఖ్టర్లు, పోషకాహార లోపం వల్లను, నీరు తగినంత తీసుకోకపోవడం వల్ల, ఆహారం సమయానికి తీసుకోక పోవడం వల్ల శరీరంలో ద్రవాల శాతం తగ్గిపోతాయో. పోటాషీయం లోపం వస్తుంది. అరటి పండు, బంగాళదుంప, పాలకూర, నిమ్మపండు, బీన్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఈ సమస్య రాదు. అలగే కండరాల మీద అలసటకు గురి చేయకూడదు. […]

గృహ వైద్యం బెస్ట్

16 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మొహం పైన మొటిమల సమస్య ఎక్కువ అవుతూ వుంటుంది. వాటిని గిల్లినా దురద అనిపించి అస్తమానం వాటిని ముట్టుకున్న మచ్చలు పడతాయి. ఎవైనా మందులు కన్నా చిట్కా వైద్యం మచ్చల్ని తగ్గిస్తుంది. బంగాళా దుంపల పై పొట్టు రసం తీసి అమ్దులో దూదిని ముంచి మచ్చల పై జాగ్రత్తగా పూసి అరగంట తర్వాత కడిగేయాలి. వేపాకులు ముద్దగ చేసి అందులో తెనే కలిపి ప్యాక్ ల ఫేస్ కు అప్లై […]

అనుబంధం ఎక్కువే

నీహారికా,  ఒక ముఖ్యమైన రిపోర్టు వచ్చింది. ఉద్యోగం చేసే తల్లులు పిల్లలకు మధ్య ఎక్కువ అనుబంధం ఉంటుందని వారు మంచి సన్నిహితంగా మెలుగుతారని ఒక అధ్యాయనం చెపుతుంది, ఉద్యోగం చేస్తున్న తల్లులు పిల్లలతో మరి కఠినంగా ప్రవర్తించకపోవటం వాళ్ళకు కావలిసిన స్వేచ్చ ఇవ్వడం కారణంగా చెపుతున్నారు. బయట ఎక్కువ సమయం గడిపే తల్లులు పిల్లలకు తాము చూసిన తెలుసుకున్న ఆనందకరమైన జీవితాన్ని పంచి ఇస్తారని పిల్లల కోపాతాపల్ని ఎదుర్కోనే శక్తి వారిలో ఎక్కువని చెపుతున్నారు. పిల్లలతో గడిపే […]

వర్కవుట్ కేర్

సాధారణంగా వర్కవుట్ తర్వాత జుట్టు చిందరవందరగా జిడ్డుగా తయారవుతుంది. ప్రతి సింగిల్ వర్కవుట్ తర్వాత వెంటనే షాంపూ చేయ్డం తప్పు. అలా చెయ్యటం వలన వెంట్రుకలలోని సహజ నూనెలు వెలికి వచ్చి జుట్టు పొడిబారుతుంది. వారంలో మూడూ సార్ల కంటే ఎక్కువ సార్లు షాంపూ చేయోద్దు. మాడు నుంచి స్వేదాన్ని నియంత్రించేందుకు జట్టు కుదుళ్ళకు డై షాంపూ అప్లయ్ చేయాలి. అలగా సౌందర్యం కోసం జుట్టు బిగించి ఉంచకూడదు. మందంగా ఉండే కాటన్ హె్ బాండ్స్ వాడాలి. […]

పోట్టలో పోషకాలు

ఈ మధ్య కాలంలో వీట్ బ్రాన్ కు చాలా డిమాండ్ ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. గోధుమల పై ఉందే పోట్టు ఇది. గోధుమ పిండి ఆడించి ఈ పొట్టు వేరు చేస్తారు. ఇది పూరి ధాన్యపు ఉత్పత్తి. ఇందులో కరిగే , కరగని రెండు రకాల పీచు పదార్ధాలు దొరుకుతాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంచగలదు. ఎన్నో క్యాన్సర్ రిస్కులను తగ్గిస్తుంది. ఈ వీట్ బ్రాన్ లోని నియాసిన్ గుండె […]