ఆమె గణిత మేధావి
గణితంలో ఈ సంవత్సరం ఐ సి టి పి రామానుజన్ బహుమతి అందుకున్నారు సుజాత రామ్ దొరై. బెంగళూరుకు చెందిన సుజాత గణితం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ లో ఆమె పి హెచ్ డి పూర్తి చేశారు. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేశారు .రీసెర్చ్ చైర్ గా గణిత శాస్త్ర పరిశోధనలో తన వంతు పాత్ర పోషించారు.2015లో సుజాత కు క్యాన్సర్ నిర్ధారణ అయింది అయినా ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ నుంచి బయటపడి గణితంలో పిల్లలకు సులభంగా పాఠాలు నేర్పే పని మొదలుపెట్టారు .చిత్తూరు లో రామానుజన్ మఠం ఏర్పాటు చేయడంలో సుజాత పాలుపంచుకున్నారు.చిత్రలేఖనం గణితం అక్కడ సులభ పద్ధతిలో పిల్లలకు నేర్పుతారు ఆమె పరిశోధనకు గాను గణితంలో చేసిన కృషికి సుజాత రామ దొరై కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
