Thursday, 06 Aug, 2026

ధనాల కోట వనజ

ధనాల కోట వనజ చేర్యాల కు చెందిన కళాకారిణి. 30 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉంటే ఖాదీ కాన్వాస్ పై పురాణ ఇతిహాసాలు కాల పురాణాలు చిత్రించ గలదు. పులివేషాలు, పోతురాజుల మాస్క్ లు తయారు చేయగలదు సహజమైన రంగులను ఉపయోగించి ఆమె వేసే పెయింటింగ్స్ కు ఎంతోమంది అభిమానులు ప్రోత్సహిస్తున్నారు. 2014లో తెలంగాణ హస్తకళ తరపున రాష్ట్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నది. ధనాల కోట వనజ. కాల పురాణ పాఠాలు మాస్క్ బొమ్మల […]

అవని లేఖారా

చక్రాల కుర్చీలో కూర్చొనే పారా ఒలింపిక్స్ లో పాల్గొని ఒకేసారి రెండు పథకాలు గెల్చుకొన్నది. తొలి భారత యువతిగా చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల అవని లేఖారా ఏడేళ్ళ వయసులో ఒక ఆక్సిడెంట్ లో అవని వెన్నెముక దెబ్బతిని నడుము కింది భాగం చచ్చు పడిపోయింది. ఆటలన్నా, నృత్యం అన్నా ఇష్టపడే అవని చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాక అభినవ్ బింద్రా ఆత్మకథ ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’ చదివి ఆ స్ఫూర్తితో తుపాకీ పట్టుకొని జైపూర్ […]

ప్రేమ్ ఇల్లమ్

వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితం అయినా ఇందిరా ప్రేమ్ ఇల్లమ్ పేరుతో షెల్టర్ హోం నడుపుతూ ఎంతో మంది పిల్లలను ఆదరిస్తోంది. అయిదేళ్ల వయసులో పోలియో తో 90 శాతం వైకల్యానికి గురైన ఇందిరా అన్నయ్య సెల్విన్ సహకారంతో  ఎం.సి.ఎ చదివింది. సెల్విన్ స్థాపించిన ప్రేమ్ ఇల్లమ్ నే సొంతం చేసుకోని 2017 నుంచి సేవలందిస్తోంది. అక్కడ పిల్లలకు చదువు చెప్పటం కోసం ఇందిరా స్పెషల్ ఎడ్యుకేషన్ లో బి.ఇడి చేసింది. సమాజ హితం కోరి […]

నా పుస్తకం వల్లనే గుర్తింపు

నేను రాసిన పుస్తకం రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవటం లో కీలక పాత్ర పోషించింది అంటారు డాక్టర్ చూడామణి నందగోపాల్. ఆ పుస్తకం పేరు రామప్ప టెంపుల్, ది క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ కాకతీయ అండ్ ఆర్కిటెక్టర్. ఆ కాలంలో నిర్మించిన అన్ని దేవాలయాల్లో కెల్లా అద్భుతమైనది. నృత్యం చేసే ఆరు అంగుళాల సూక్ష్మ శిల్పాల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న భారీ శిల్పాలు 600 వరకు ఉన్నాయి. ఈ పుస్తకం యునెస్కో దృష్టిని ఆకర్షించటం […]

బుల్లి రచయిత్రి

బెంగళూరు లోని జే.పి నగర్ లోని ఏక్వా  పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల జియా గంగాధర్ బుల్లి రచయిత్రిగా అరుదైన రికార్డ్ సాధించింది. లాక్ డౌన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఎల్ ఫర్ లాక్ డౌన్, జియాస్ జర్నల్ ఆఫ్ లాక్ డౌన్ లైసెన్స్ అనే పుస్తకం గా రాసింది జియా. ఢిల్లీకి చెందిన బ్లూ రోడ్ పబ్లిషర్ ఈ పుస్తకాన్ని ముద్రించి అమెజాన్ లో ఉంచింది.

దక్షిణాఫ్రికా లో మహాత్ముడు

టింకా క్రిస్టఫర్ అనే శిల్పి యువకుడిగా కనిపించే గాంధీ విగ్రహాన్ని చెక్కింది. 21 ఏళ్ల పాటు ఆయన జీవించిన దక్షిణాఫ్రికా లోని జోహెనెస్ బర్గ్ లో ఈ యువ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. కోటు వేసుకుని, దానిపైన లాయర్ గౌను వేసుకున్న గాంధీజీ  నిలువెత్తు శిలా విగ్రహం ఉన్న ప్రాంతాన్ని గాంధీ స్క్వేర్ గా పిలుస్తారు. శిలా విగ్రహం కింద ఫలకం మీద ఎంకె గాంధీ, అటార్నీ ఎట్ లా అన్న అక్షరాలు ఉంటాయి రోజుకి పది […]

78 ఏళ్ల డాన్సర్

78 ఏళ్ల కృష్ణ కుమారి తివారి డాన్సింగ్ వీడియో లకు కోట్ల కొద్ది వ్యూస్ వస్తాయి. నేపాల్ లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణ కుమారి కి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు డాన్స్ చేయటం కుటుంబ బాధ్యతల వల్ల తీరలేదు. ఇప్పుడు 78 ఏళ్లు వచ్చాక ఆమె డాన్స్ వీడియో కుటుంబ సభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేశారు. రెండు కోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయట ఒక్క వీడియో కి. […]

ఎంతో నచ్చిన కెరీర్

మోటర్ హెడ్స్ పేరుతో సొంత గ్యారేజీ నడిపిస్తున్నారు అఫునిస్సా చౌదరి చెన్నైలోని నీలాంకరీ ఏరియా లో ఉన్న మోటర్ హెడ్స్ గ్యారేజ్ లో అఫునిస్సా మెకానిక్ కూడా. ఆమె అధినేత అయినా రిసెప్షనిస్ట్ గా కూడా ఒక్క సారి కష్టమర్స్ ని పలకరిస్తారు. 2020లో మల్టీ బ్రాండ్ గ్యారేజ్ ను ప్రారంభించిన ఆమె పదేళ్ల పాటు ఎన్నో గ్యారేజ్ లను పరిశీలిస్తూ ఎంతో నేర్చుకున్నారు. 40 ఏళ్ల పాటు అఫునిస్సా చౌదరి ఒక మల్టీ నేషనల్ కంపెనీ […]

చేనేతకు చేయూత

తెలంగాణ నుంచి చేనేత అభివృధి కోసం చేస్తున్న కృషికి గాను ప్రముఖ వ్యక్తి పురస్కారం అందుకున్నారు డాక్టర్ షర్మిలా నాగరాజ్. 30 ఏళ్ళ పాటు లెక్చరర్ గా విద్యార్థులకు చేనేతలు,వాటి సహజ రంగులు ప్రాచీన,ఆధినిక సాంకేతిక పద్ధతుల్లో హాండ్లూమ్స్ తయారీ గురించి పాఠాలు చెప్పిన షర్మిలా ఆరేళ్ల క్రితం కౌముది స్టూడియో ఏర్పాటు చేశారు. జాతీయ హస్తకళలు పునరుద్ధరించటం చేనేత కార్మికులను పునార్జింపచేయటం,చేనేత దుస్తుల కళను నిలుపుకోవటం లక్ష్యంగా కౌముది స్టూడియో పనిచేస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో […]

అపర్ణ రాజావత్

అతి ఎక్కువ మంది స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ యువ శిక్షణ ఇచ్చి గిన్నిస్ రికార్డు సాధించింది అపర్ణ రాజవత్. తొమ్మిది ఏళ్ళ వయసు లోనే కరాటే ఛాంపియన్ షిప్ సాధించింది. అమ్మాయిలు మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలంటే ఆత్మరక్షణ శిక్షణ అవసరం అనుకొన్న అపర్ణ పింక్ బెల్ట్ మిషన్ ఆరంభించింది. మార్షల్ ఆర్ట్స్ లో 16సార్లు అంతర్జాతీయ మెడల్ సాధించిన ఆమె జీవితాన్ని హాలీవుడ్ దర్శకుడు జాన్ మెక్ క్రైట్ ‘ది పింక్ బెల్ట్ మిషన్’ పేరుతో […]

అద్భుతమైన ఆవిష్కరణ

నీటి సంరక్షణ కోసం ముంబైకి చెందిన నేహా బాగోరియా ( Neha Bagoria ) వినుత మైన పరిష్కారాన్ని కనిపెట్టారు Eee Traplu పేరుతో ఆమె తలపెట్టిన సాధనం చుక్కనీరు ఉపయోగించకుండా వెస్ట్రన్ టాయిలెట్ల లో దుర్వాసన అరికడుతుంది. సెన్సార్ ఆధారంగా పనిచేసే ఈ సాధనం, యాక్టివేట్ కాగానే అందులో నింపిన రసాయనం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టేస్తోంది ఒక చుక్క నీరు అవసరం ఉండదు టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్ పేరుతో […]

సినిమాకు సరిపోయే కథ

బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ పింకీ ప్రమాణిక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం ఓ పెద్ద తెర పైన కనిపించబోతుంది. పింకీ ప్రామాణిక్ పశ్చిమ బంగా  లోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది  స్ప్రింటర్ గా అంతర్జాతీయ పోటీను  ఎన్నో బంగారు వెండి పతకాలు గెల్చుకొంది. ఆమెతో నివశించే ఒకమ్మాయి పింకీ అసలు అమ్మాయే కాదని తనపై అత్యాచారం చేసిందని కేస్ పెట్టటంతో పింకీ ఆటలకు,తన రైల్వే ఉద్యోగానికి దూరమైన […]

మొత్తంగా మహిళలే

ఇండోర్ లో ఇప్పుడు రెండు పింక్ బస్ లు తిరుగుతున్నాయి. బస్ డ్రైవర్ నుంచి ప్రయాణికుల దాకా అందరూ మహిళలే బోపాల్ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కారిడార్‌ లోని 11.56 కిలో మీటర్ల పరిధిలో ఈ బస్సులు తిరుగుతాయి. పాటనీ పూరా కు చెందిన 35 ఏళ్ల రితూ నర్వాల్ మొదటి డ్రైవర్ కాగా  25 ఏళ్ల అర్చన కాటారే  రెండో డ్రైవర్ ఇండోర్ లో ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ లుగా మహిళలే రాణిస్తున్నారు. 2019 […]

చక్కని సేవకు సుముచిత అవార్డ్

ఢిల్లీకి  చెందిన దేవాన్షి రంజన్,సనా మిట్టర్ ను ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. సామాజిక సేవ, మానవతా కారణాల కోసం కృషి చేసే 9-25 ఏళ్ల యువత యువకులకు ఇచ్చే డయానా అవార్డ్ ఈ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చింది. లేడీ శ్రీ రామ్ కాలేజీ లో చదువుతున్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ మానసిక ఆరోగ్యం బాలబాలికల విద్య పై కృషి చేస్తోంది. కరోనా సమయంలో సనా మిట్టర్ 150 మంది వలం టీచర్లతో డిజిటల్ కంపెయిన్ […]

స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా

స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా గా మలబార్ గోల్డ్ విడుదల చేసిన యాడ్ కు విశేష స్పందన లభిస్తోంది. 21 ఏళ్ళ ధన్య శోధన ప్రస్తుతం చావు తో పోరాడుతుంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి ఉంది. వెంట్రుకలు పూర్తిగా ఉడిపోయిన స్థితిలో నుంచి కోలుకుంటున్న ధన్య ఇడుక్కి జిల్లాలోని తోడ పూజ అన్న చిన్న టౌన్ లో పుట్టింది. కెనడా లో చదువుకుంటున్న ధన్య కు ప్రమాదకరమైన గుండె జబ్బు వచ్చింది. […]

వీటినీ అమ్మచు

పెళ్లిళ్ల కోసం ప్రత్యేక సందర్భాల కోసం డిజైన్ చేయించుకున్న కొన్ని దుస్తులు రెగ్యులర్ గా వాడటం కష్టం. అలాగని పారేయడానికి ప్రాణం ఒప్పదు అలాటప్పుడు కొన్ని వెబ్ సైట్స్ లో వీటిని అమ్మేకే అవకాశం ఉంది ఈ టాషీ (Etashee) వెబ్ సైట్ లో క్లాసిక్ డిజైనర్ దుస్తుల నుంచి క్యాజువల్ వరకు మనం వాడిన దుస్తుల్ని అమ్మకానికి పెట్టచ్చు. అలాగే స్పాయ్ల్(Spoyl), వింటేజ్ దేశీ (Vintage Desi ), కూట్ టాట్ (Cout Loot), కియాబ్జా […]

ఉత్తమ ఉపాధ్యాయురాలు

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హాసనగర్ తాలూకా మల్లి గిరి లో పనిచేసే రేఖ కులాల్ తన స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తారు. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండేలా ఆమె ఆ డబ్బు బాండ్ రూపంలో స్థానిక కెనరా బ్యాంక్ లో పొదుపు చేస్తారు పదేళ్ల తరువాత వడ్డీతో సహా ఆ డబ్బు పిల్లలు తీసుకోవచ్చు. ఈ చిన్న ప్రయత్నం తో స్కూలు విద్యార్థులు పెరిగారు. డబ్బుతో పాటు […]

వీధి గోడలే విద్యాలయాలు

పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజ్జనం భాగ్యలక్ష్మి ఆ గ్రామంలోని ఇల్లు భవనాలు గోడలపై రంగుల తో పాఠ్యాంశాలు రాసి పిల్లల తో చదివిస్తున్నారు. ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు చాలా దూరంలో ఉన్నారు టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రభుత్వ పాఠాలు బోధించిన అవి పిల్లలకు చేరటం లేదు దానితో భాగ్యలక్ష్మి గ్రామం లోని గోడల పై తెలుగు ఇంగ్లీష్ వర్ణమాల గణిత అంశాలు పదబంధాలు స్వయంగా […]

అరుదైన మ్యూజియం

జానపద కళలు సంస్కృతి సాంప్రదాయం ఇష్టపడే వాళ్ళు కేరళ రాష్ట్రం లోని కొచ్చి లో గల కేరళ ఫోక్ లోర్ మ్యూజియం చూసి తీరాలి దీన్ని దివంగత జార్జ్ థాలియాత్ అతని భార్య అన్నీ జార్జ్ స్థాపించారు. 150 సంవత్సరాల నాటి వుడ్ కార్వింగ్ మెట్లు,పురాతన సీలింగ్ లు ప్రాచీన చర్చి లు, మసీదుల నుంచి సేకరించిన నగిషీల తలుపులు దేవతామూర్తుల విగ్రహాలు. కథాకలి థెయ్యం నాట్యాల్లో ఉపయోగించిన మాస్క్ లు షీల్డ్ లు కత్తులు సంగీత […]

మహారాణి తారాబాయి సాహెబ్

భారతదేశంలో రాచరికపు వ్యవస్థ ఉన్నంతకాలం మహారాజులు మహారాణులు ఎన్నో కళల్లో ఆరితేరిన వారు. రాచరికపు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు ప్రఖ్యాతి చెందిన చిత్రాలు చూసి తీరాలి అలాంటి వాటిలో మహారాణి తారాబాయి సాహెబ్ ఒకరు. యువరాజ్ శంభాజీ చత్రపతి ఆమె గౌరవార్థం ఈమె పెయింటింగ్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈమె భారతదేశంలో అత్యున్నతమైన గౌరవనీయమైన మహిళా చత్రపతి శివాజీ మహారాజ్ కోడలు చత్రపతి రాజా రామ్ మహారాజు భార్య మేఘాలయా లలో […]