పోషకాలు మాయం
ఖర్జూర గింజలను పొడి చేయటంతో బ్రౌన్ డేట్స్ పౌడర్ తయారు చేస్తారు. ఇది సహజ సిద్ధమైన స్వీటెనర్ అంటున్నారు నిపుణులు. కాఫీ టీ లలో వాడరు కానీ బేకరీ చాక్లెట్లు స్నాక్స్ లో ఉపయోగిస్తారు. ఇది చక్కెర కు ప్రత్యామ్నాయం పీచు ఆంటీ ఆక్సిడెంట్ల ఖనిజ లవణాలు ఉంటాయి కనుక దీన్ని వాడటం వల్ల శరీరం శక్తితో ఉంటుంది. ఈ వేసవిలో డేట్స్ పౌడర్ ను పెరుగు,యోగర్ట్ పండ్ల మొక్కల పైన వాడుకోవచ్చు.
ధ్వని వల్లనే బి.పి
శబ్ద కాలుష్యం వల్లనే బి.పి పెరుగుతుందని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపైన నిరంతరాయంగా హారన్లు ఇంజన్ల మోతలు వినటం వల్ల బి.పి విపరీతంగా పెరుగుతుందట. తాజాగా ఒక పరిశోధన, ట్రాఫిక్ లో ఉండే వాళ్లలో కూడా బి.పి ఎక్కువగా ఉందని గుర్తించారు. సాధ్యమైనంత వరకు తక్కువ శబ్దాలున్న చోట ఉండమంటున్నారు నిపుణులు. పెద్ద శబ్దంతో టీవీ వినటం ముఖ్యంగా ఇయర్ ఫోన్లు వాడటం తగ్గించమంటున్నారు.
గోల్ ఇన్ శారీ
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్జీవో తో కలిసి గోల్డ్ ఇన్ శారీ పేరుతో ఫుట్ బాల్ పోటీలను నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా ఆడాయి.వీళ్లంతా చిరు వ్యాపారులు,గృహిణులు 20 నుంచి 72 ఏళ్ల వాళ్ళు దాదాపు వంద మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు రంగు రంగుల చీరెలతో విల్లు పాల్గొన్న ఈ పోటీ క్రీడల్లో మహిళల సామర్థ్యానికి నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
బాక్సింగ్ లో ఛాంపియన్
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖిత జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది 13 ఏళ్ల వయసులోనే బరిలోకి దిగింది జరీన్. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ కు చెందిన జరీన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీ కోమ్ తర్వాత ఎక్కువ స్వర్ణాలు గెలిచింది జరీన్ ఈ స్వర్ణ విజేత ఎంతో మందికి ఆదర్శం.
తొలి మహిళా మంత్రి
నాగాలాండ్ మహిళ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సెల్ హౌతు వోనునో క్రూసే 60 మంది శాసనసభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో కాలు పెట్టిన తొలి మహిళ ఈమె గత పాతికేళ్లుగా అంగామీ ఉమెన్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలిగా అంగామీ పబ్లిక్ ఆర్గనైజేషన్ బోర్డ్ సభ్యురాలిగా పనిచేశారు.
పూలల్లో రాణి
పియోనీ మొక్క ఇంట్లో ఉంటే సంతోషం ప్రశాంతత ఉంటుందని నమ్ముతారు జపనీయులు.చైనా చక్రవర్తులు ఈ పియోనీ పూలను శుభ సూచకంగా భావించేవారు. క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ గా పిలిచే ఈ పియోనీ పూలు గుబురుగా పురి విప్పుకొన్నట్లు వికసిస్తాయి. ఈ పియోనీ లో 40 రకాల జాతులున్నాయి కానీ గులాబీ రంగు పూలు పూసే మొక్క మటుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇంట్లో పెంచుకునే మొక్క.ఈ ముళ్ళ మొక్కను డ్రాయింగ్ రూమ్ డెకరేషన్ గా వాడతారు.
మొదటి అడుగు
హామై దేశంలో మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ (Ho mai vyara walla) చీరకట్టుతో, భుజానికి కెమెరాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హామై 1913 లో గుజరాత్ లోని పార్సీ కుటుంబంలో జన్మించిన హోమై ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఢిల్లీ లోని బ్రిటిష్ ఇన్ ఫర్మేషన్ సంస్థ లో పనిచేశారు. 50 ఏళ్ల పాటు ఆమె తీసిన ఫోటోలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. స్వతంత్రం ముందు పరిస్థితులు, దేశ రాజకీయాల్లో మార్పులు ఆమె తీసిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ పెయింటింగ్స్ చాలా రుచి
ఆర్టిస్ట్ షైఫాలీ తాంబే తాను చేసే వంటలను కాన్వాస్ గా మార్చి అందమైన కళారూపాలను ఆవిష్కరిస్తుంది. పన్నీర్ బటర్ మసాలా, దహి వడ, పాలక్ పన్నీర్ ల పైన పన్నీర్ క్రీమ్ ఫుడ్ కలర్స్ చింతపండు సాస్ ఉపయోగిస్తే వర్లీ మధుబని గోంద్ శైలి చిత్రాలు వేస్తోంది. ఇది నోటికి రుచి కాదు. కళ్ళకు విందు కూడా ఈమె పాకశాస్త్ర ప్రావీణ్యానికి, కళానైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
సాంప్రదాయ వర్ణం కోరా
తెలుగు దేశపు సాంప్రదాయ వేడుకలకు ఐవా మలయాళాల ఓనమ్ పండుగ కైనా ఆధునిక పార్టీల్లోనూ కోరా రంగు వెలిగిపోతుంది. పెళ్లి చీరెగా ఆఫ్ వైట్ శారీనే ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కోరా రంగు అందాన్ని గమనించి ప్రాసెస్డ్ కాటన్ లెనిన్ పట్టు వంటి సహజ ఫాబ్రిక్స్ తో పాటు రేయాన్,నైలాన్ జార్జెట్ నెట్ వంటివి కూడా గాగ్రాలు లాంగ్ ఫ్రాక్ లూ ఈ కోరా రంగు తోనే డిజైన్ చేసేవి బంగారు వెండి డిజైన్లు జోడించి […]
40 కోట్ల అభిమానులు
అమెరికన్ పాప సింగర్ సెలెనా ఇన్ స్టా లో అనుసరించే వారి సంఖ్య 40 కోట్లు. 2002 లో బర్నీ అండ్ ఫ్రెండ్స్ సీరియల్ తో కెరియర్ ప్రారంభించిన సెలెనా కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 లో బిల్ బోర్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన, ఆమె నటిగా, గాయనిగా, నిర్మాత వ్యాపారవేత్త గా ఎన్నో అంశాల్లో దూసుకుపోయింది. యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయింది. ఆమె కొత్త […]
ఉన్నత పురస్కారం
పాండిచ్చేరి రచయిత్రి జర్నలిస్ట్ నందిని సేన్ గుప్తా రాసిన రాణి దుర్గావతి ది ఫర్ గెటెన్ లైఫ్ ఆఫ్ ఏ వారియర్ క్వీన్ పుస్తకం బెస్ట్ నాన్ ఫిక్షనల్ విభాగంలో అట్ హర్ అవార్డు 2023 (ఇండియా) గెలుచుకున్నది కలింజార్ కోటలో పుట్టిన దుర్గావతి గోండ్వా నారాయణి గా ఉక్కు మహిళ గా పేరు తెచ్చుకున్న విధానాన్ని ఆమె పాలనాపరమైన నైపుణ్యాలను జీవితంలో ఆమె ఎదుర్కొన్న సాహస ఘటనలను ఎన్నో విషయాలను ఈ పుస్తకం లో రాశారు […]
పండుగ స్పెషల్స్
ఈ మధ్యకాలంలో వేడుకులకు ప్రత్యేకమైన నిండా నగలు ధరిస్తున్నారు అమ్మాయిలు. బంగారు ఆభరణాల్లో నక్షి నగలు టెంపుల్ డిజైన్ లో భాగం 21వ శతాబ్దానికి చెందిన ఈ నగల్లో నెక్లెస్ లు గాజులు పెండెంట్లు చెవి కమ్మలు చాలా అందంగా ఉంటాయి అలాగే కుందన్ పెండెంట్లు కూడా నిండుగా ఉంటాయి. మెడ నిండుగా కనిపించే లేయర్ జువెలరీ కూడా ఫ్యాషనే. అలాగే వీటికి జతగా లేయర్ బ్యాంగిల్స్ రాళ్లు పొదిగినవి సాదా వి టీనేజ్ అమ్మాయిలకు చక్కగా […]
ఇది అందాల పందిరి
తెలుపు,గులాబీ,ఎరుపు,పసుపు వర్ణాలతో చాలా అందమైన పూలతో వింకా రోజ్ కుండీల్లో పెరిగే మొక్క దీన్ని బిళ్ళ గన్నేరు అంటారు విత్తనాలు వేర్లు నాటిన చక్కగా బతుకుతుంది.ఎంతో ఎండను ఓర్చుకునే ఈ బిళ్ళ గన్నేరు చాలా తక్కువ నీళ్లతో చక్కగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా వేస్తే మొత్తం ఆకుల్ని కనిపించకుండా నిండుగా పువ్వులు పూస్తుందీ మొక్క బాల్కనీలో తొట్టెల్లో వేలాడదీస్తే నిండుగా పువ్వులతో చాలా బాగుంటుంది.
ట్యూషన్ లే వ్యాపారం
బి-జీనియస్ స్థాపించి ట్యూషన్ పాటలు చెబుతోంది త్రినా దాస్ 2013 లో ప్రారంభం అయిన ఈ స్టార్టప్ ప్రపంచ వ్యాప్తంగా 130 సెంటర్లు లక్షల మంది విద్యార్థులతో కొనసాగుతోంది బరాక్ ఒబామా మెప్పునూ గ్రాంట్ నూ అందుకుంది అనుబంధంగా టాలెంట్ ల్యాబ్స్ ప్రారంభించింది. త్రినా దాస్.ఆరో హెచ్ ఆర్ సంస్థ మేనేజర్ నుంచి టెక్నీషియన్ వరకు ఉద్యోగాలను అందిస్తోందీ సంస్థ ఒక ఏడాదిలో 20 కోట్ల టర్నోవర్ అందుకుందీ సంస్థ 32 ఏళ్ల త్రినా దాస్ ఫోర్బ్స్ […]
అందంగా పైథాని
పైథాని పట్టు ఎప్పుడూ అందమే మరాఠీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా మెరిసే ఈ పైథాని ఇప్పుడు ప్రపంచం మొత్తం సందడి చేస్తోంది.చీరలు,దుపట్టాలు, బ్లౌజ్ లు పిల్లల పట్టు పరికిణీలు ఒకటి కాదు అన్ని వయసుల వారికి పైథాని ఫ్యాషన్ స్టేట్ మెంట్. ముదురు రంగులతో మెరిసిపోయే ఈ పట్టు వస్త్రం పైన చిలకలు నెమళ్లు పూల డిజైన్లు చాలా అందంగా అమరిపోయాయి అమ్మాయిల వార్డ్ రోబ్ లో ఉండాల్సిన వెరైటీ ఇది.
కాటన్ ఎప్పుడూ బెస్ట్
వేసవిలో డ్రెస్ ఎంపికలో కూల్ అండ్ కంఫర్ట్ కే ప్రాధాన్యత. ఫ్యాబ్రిక్స్ కాటన్స్ ముందుంటాయి. నైట్ ఫంక్షన్స్ లో సిల్వర్ కలర్ డ్రెస్ లు ఈ సీజన్లో అగ్రస్థానంలో ఉంటాయి. గోల్డ్ కలర్ తర్వాత స్నానం స్లిట్స్ ఉన్న డ్రెస్సులు సౌకర్యం డెనిమ్ ప్రతి సీజన్ కు ప్రత్యేకంగా ఉంటాయి కార్గో పాంట్స్, షర్ట్స్ వాటికి తగిన కార్పెట్ టాప్స్ ఈ వేసవికి సౌకర్యం కాటిల్ డ్రెస్సులు కూడా పగలు, నైట్ ఫంక్షన్లకు న్యూ లుక్ ఇస్తాయి.
ఎంతో ప్రత్యేకం
టీనా రహీమి ప్రపంచంలోనే మొదటి హిజాబ్ బాక్సర్ కామన్ వెల్త్ క్రీడల్లో హిజాబ్ తో బాక్సింగ్ చేసిన మొదటి మహిళ కూడా సిడ్నీలో స్థిరపడిన ఆస్ట్రేలియన్ జాతీయత స్వీకరించిన మహిళ ముందుగా మేకప్ ఉమెన్ గా కెరీర్ మొదలు పెట్టింది. 2017 లో సరదాగా మొదలుపెట్టిన బాక్సింగ్ 2018 నాటికి క్వాలిఫైడ్ బాక్సర్ గా మారింది. ఆమెకు గత సంవత్సరం స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది.
కాల్పనిక లోకం
సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ షెల్మ సహాయం రాసిన ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా జెనిసిస్ గోల్డెన్ బుక్ అవార్డు (ఉరుగ్వే) అందుకున్నది అలాగే గ్లోబల్ పబ్లిషింగ్ హౌస్ ఎక్స్ సెల్లర్, ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా) కు ఎంపికైంది ఆమె రాసిన తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల ఇది అచ్చమైన జానపద కథ అంటున్నారు పాఠకులు అద్భుతమైన మాంత్రిక ప్రపంచాన్ని దర్శించాలనుకుంటే నవల చదవాలి.
ఆమె ఒక్కరే
చారువి అగర్వాల్ యానిమేషన్ ఫిల్మ్ మేకర్ పురుషాధిపత్య రంగం గా పేరున్న ఈ ప్రపంచంలో చారువి అగర్వాల్ యాని మేటర్ గా శిల్పిగా పెయింటర్ గా తనలోని సృజనాత్మకత తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. కెనడా లో కంప్యూటర్స్ యానిమేషన్ లో మాస్టర్స్ చేసిన అగర్వాల్ గురుగ్రామ్ కేంద్రంగా చారువి డిజైన్ ల్యాబ్స్ (సి డి ఎల్) మొదలు పెట్టింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది చారువి.
తియ్యని అద్భుతం
పూణే కి చెందిన ప్రముఖ బేకింగ్ నిపుణురాలు ప్రాచీ దేబ్ 100 కేజీల రాయల్ ఐసింగ్ షుగర్ తో 1500 తినే విడి భాగాలతో మిలన్ కేథడ్రల్ చార్ట్ నకలును తయారు చేసింది ఇటలీలోని ఈ చార్ట్ నిర్మాణానికి ఆరు దశాబ్దాలు పట్టింది. సృజనకి ప్రతిరూపం గా భావిస్తారు. ఈ చార్ట్ అందాన్ని నెల రోజులు కష్టపడి ఈ చార్ట్ ప్రతిరూపాన్ని తయారు చేసింది ప్రాచీ దేబ్. ఈ కేక్ ప్రపంచ రికార్డును బద్దలు చేసింది. గతంలో […]
