Tuesday, 28 Jul, 2026

నిద్ర ఇచ్చే క్యాండిల్

అరోమా క్యాండిల్స్ తో ఒత్తిడి మాయం అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు మేరీ క్యాండిల్ మానసిక అలసటను దూరం చేస్తుంది. యూకలిప్టస్  స్పెయర్ మింట్ సెంటెడ్ క్యాండిల్ ఉత్తేజపరిస్తే వెనిలా క్యాండిల్ అలసట మాయం చేస్తుంది. లావెండర్ సెంటడ్ క్యాండిల్స్ ఒత్తిడి  మాయం చేసి చక్కని నిద్ర ఇస్తాయి.సి బ్రీజ్ రిలాక్సింగ్ క్యాండిల్ వెలిగిస్తే సముద్రపు ఒడ్డున కూర్చున్న అనుభూతి వస్తుంది. చామంతి సెంటెడ్ క్యాండిల్ విశ్రాంతి ఇస్తుంది. ప్రతిరోజు ఇంట్లో వెలిగించుకొనే క్యాండిల్స్ ఇవన్నీ.

ఆర్థికవేత్త అను అయ్యంగార్

వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన వంద మంది ఆర్థికవేత్తల జాబితాలో అను అయ్యంగార్ కూడా ఉన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి పెట్టుబడుల బ్యాంక్ లో ఒకటైన జెపీ మోర్గాన్ ఛేజ్‌ లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ అధిపతి అను అయ్యంగార్. ఆమె స్వస్థలం కేరళ చదువు నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టి జాత్యహంకారాన్ని లింగ వర్ణ వివక్ష ను అడుగడుగునా ఎదుర్కొన్నారు అను. తన ప్రతిభతో వాటిని దాటి ఎమ్ అండ్ ఏ విభాగంలో సుమారు 500 వేల […]

ఈజీగా ఇంట్లోనే

రసాయనాలు లేని లిప్ బామ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్.దీని తయారీకి టేబుల్ స్పూన్ చొప్పున షియా బటర్,బీస్ వాక్స్, రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి బాగా కరిగే వరకు ఈ మిశ్రమం గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత కిందికి దించి చల్లార్చి గాజు గిన్నెలో పోసుకొని చల్లారనివ్వాలి. సువాసన కోసం రెండు చుక్కల రోజు ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది నేచురల్ లిప్ బామ్.

సరి కొత్త ఫ్యాషన్ ట్రెండ్ కప్తాన్

ప్రకృతి రావు స్థాపించిన కఫ్తాన్ లాంజ్ వేర్ ఒక్క ఫ్యాషన్ బ్రాండ్.ఇది ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొనే డ్రెస్. నైటీలు పైజామాల్లాగా ఇది కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కాటన్,లెనిన్ వస్త్రశ్రేణి లో ఈ కఫ్తాన్ లాంజ్ వేర్ మోడరన్ లైఫ్ స్టయిల్ లో ఒక భాగం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అమ్మాయిలు ఈ కప్తాన్ లు బాగా వాడుతున్నారు. లూజ్ గా ఉండే ఈ కప్తాన్ లు ఇప్పుడు ట్రెండ్.ఈ కప్తాన్ లు మార్కెట్ చేసేందుకు […]

మంచి పరిష్కారం

ఈ ఎండల్లో మొహం జిడ్డుగా మొటిమలు బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా తయారవుతుంది. టర్మరిక్ క్యూట్స్ తో ఈ సమస్య గట్టెక్కొచ్చు   స్పూన్ పసుపు,టీ స్పూన్ కమలా తొక్కల పొడి, కప్పు రోజు వాటర్, కొబ్బరి పాలు, నిమ్మ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లో పోసి గడ్డకట్టించాలి. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖం తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక […]

సరికొత్త డిజైన్లు

ఇండియన్ ట్రైబల్ డిజైన్స్ ఇప్పుడు ప్రతి ఔట్ ఫిట్ తో జ్యువలరీ లో కనిపించి కనువిందు చేస్తున్నాయి.ప్లేయిన్ డ్రెస్ పైన చిన్న ట్రైబల్ డిజైన్ చాలు ఎంతో ప్రత్యేకం ఎంబ్రాయిడరీ దుస్తులు ఆభరణాలు చాలా ప్రత్యేకం. కొండకోనల్లో నివసించే వారి ఆహార్యం ఇవ్వాళ  పట్టణాల్లో ఉండే అమ్మాయిల వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. నగర డిజైనర్లు ఈ అడవి బిడ్డల ప్రత్యేకమైన డ్రెస్ తరహాలను నేర్చుకుని మరీ కొత్త రూపంలోకి తెస్తున్నారు.ఇది ఇండియన్ ట్రైబల్ డిజైన్ల ట్రెండ్.

ఆర్థికవేత్త

సోనాల్ దేశాయ్ ఆర్థికవేత్త పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు 2009 లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్   లో చేరిన ఆమె 2018 లో ఈ సంస్థ గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ కు ముఖ్య పెట్టుబడుల అధికారి గా నియమితులయ్యారు. ఫ్రాంక్లిన్ మున్సిపల్ కార్పొరేట్ క్రెడిట్, ఫ్లోటింగ్ రేట్ మల్టీ సెక్టార్, గ్లోబల్ మనీ మార్కెట్ ఫిక్సిడ్ ఇన్ కామ్ టీమ్ ల బాధ్యత సోనాల్ దే. వాల్ స్ట్రీట్ జర్నల్ […]

కన్నీటి ఉప్పెన

బలగం సినిమాలో తోడుగా మా తోడుండి పాట పాడిన కొమరమ్మ బుడగ జంగాల గాయకురాలు.భర్త మొగిలయ్యతో తో కలిసి తంబురా దిమ్మెస వాయిస్తూ పాటలు పాడుతోంది.చావులు,దినాలకు ప్రత్యేక పాటలు పాడే కొమరమ్మ పాట తెలుగు ప్రేక్షకులను కదిలించి కంటి తడి పెట్టించింది.కుటుంబ అనుబంధాలు విలువలు గుర్తుతెచ్చే పాటలను అప్పటికప్పుడు కూర్చి పాడుతుంది కొమరమ్మ.

అందరి నోట ఈ పాట

దసరా సినిమాలో చమ్కీల అంగీ లేసి పాటతో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. దీక్షిత వెంకటేశన్.’దీ’ గా సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన తమిళ అమ్మాయి తండ్రి సంతోష్ నారాయణ తో పాటు ఏ.ఆర్ రెహమాన్ తో కలిసి పనిచేస్తుంది. దీక్షిత పూర్తిగా తెలంగాణ యాసతో సాగే ఈ ఒక్క పాటతో దీక్షిత తెలుగు జానపద గీతానికి ఒక కొత్త సొగసు తెచ్చింది.

తుదిశ్వాస వరకు…

ఒడిశా కు చెందిన అలక్ నందా కథక్ నృత్య కళాకారిణి. ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ పాకింది. కీమోథెరపీ లు చేయించుకుంటూ వైద్యం తీసుకుంటున్న ఆమె నృత్యం మానలేదు. గురువు గా ఆమెకు మంచి పేరుంది. మహాభారతంలోని గాధలను కథ రూపకాలుగా ప్రదర్శిస్తుంది. ద్రౌపతి పాత్ర లోని స్త్రీ వారి కోణాన్ని ప్రదర్శించే ఆమె తలపైన ఒక్క వెంట్రుక కూడా లేకుండా కథక్ ప్రదర్శన ఇస్తూ నా పోరాటం క్యాన్సర్ తో నా నృత్యం నృత్యమే. జబ్బు నా […]

అందమైన పుస్తకాలు

బెంగళూరుకు చెందిన రచయిత్రి బిజల్ వచ్చే రజని పర్యావరణం పైన పిల్లల పుస్తకాలు చాలా అందంగా రాస్తారు కథను. క్వారీ రేచర్ల  రూపంలో గీసి వాటి చుట్టూ కథ అల్లుతుంది రజిని. ఆమె రాసిన ‘ఎ క్లౌడ్ కాల్డ్ బూర’, కిటెన్ ట్రబుల్, ఎ బెండ్ ఇన్ టైమ్, ది గ్రేట్ ఇండియన్ నేచర్ ట్రయల్ విత్ అంకుల్ బిల్కి వంటి రచనలు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు. సావీ అండ్ ది మెమొరీ కీపర్ పుస్తకం బాల […]

చిన్ని పిట్టకు ప్రచారం

తమిళనాడు  తిరునల్వేలి కి చెందిన విద్యా సుందర్ బెంగళూరులో ఉంటారు గృహిణిగా అందరికీ ఉండే పనులే ఆమెకు ఉన్నాయి.కానీ ఆమె బర్డ్ వాచింగ్ హాబీగా తీసుకుంది. ఈ బర్డ్ అనే గ్లోబల్ ఇంటర్ నెట్ ప్లాట్ ఫామ్ లో వేలాదిమంది బర్డ్ వాచర్స్ సభ్యులుగా ఉన్నారు. విద్యా సుందర్ ఈ గ్రూప్ మెంబర్.తనకు బాగా నచ్చిన ముగ్గులతో పిట్టలను గురించి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేస్తారామే. ప్రతిరోజు ఇంటి ముందు అందమైన పిట్ట బొమ్మ […]

శక్తినిచ్చే సన్ ఫ్లవర్ సీడ్స్

పొద్దుతిరుగుడు గింజల తో ఎన్నో ప్రయోజనాలున్నాయి.శరీరం లోని ఇన్ఫెక్షన్ లతో పోరాడగలిగే విటమిన్-36, మ్యాంగనీస్,ఫాస్పరస్, జింక్, సెలీనియం  మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.వీటిలో ఉండే  సోడియం,మెగ్నీషియం,పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గింజల్లో ఉన్నాయి. రోజు కొన్ని తింటే శరీరం డిటాక్స్ అవుతుంది.

స్ఫూర్తి ప్రదాత

బొటానికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన తొలి మహిళ గా జానకి చరిత్ర సృష్టించింది.కేరళలోని తలస్సేరి లో 1897 లో జన్మించిన జానికి అమ్మాళ్ అమెరికా కు చెందిన ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్’ స్కాలర్ షిప్ కు ఎంపిక అయ్యారు.అమెరికా లో చదువుకున్నారు చెరుకు మొక్కల జీవ పరిణామ క్రమం పై ఆమె రాసిన క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఒక ప్రామాణిక పుస్తకం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కోల్ కతా) కు […]

సుభద్ర కు పద్మశ్రీ

మధుబని కళాకారిణి సేలంపూర్ గ్రామానికి చెందిన సుభద్రా దేవి కి పద్మశ్రీ పురస్కారం లభించింది. కాగితపు గుజ్జు మనోహరమైన ఆకృతులను సృష్టించే సుభద్ర చిత్రించిన రాధాకృష్ణులు పెయింటింగ్‌ బ్రిటిష్ మ్యూజియంలోకొలువు’తీరింది కళల వ్యాప్తికి కృషి చేసిన ఆమెను 1980 లో రాష్ట్ర ప్రభుత్వం 1991 లో కేంద్ర ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించాయి. ఆమె నైపుణ్యానికి దేశ విదేశాల్లో గుర్తింపు లభించింది.

తాజా పువ్వులు

ఫ్లవర్ వాజ్ లో పువ్వులుంచి డ్రాయింగ్ రూమ్ లో పెడితే ఇంటికో తాజాదనం వస్తుంది. పూలు వాడిపోకుండా ఉండాలంటే పూల కొమ్మలను కాండాన్ని రెండు ఇంచులు 45 డిగ్రీల కోణంలో కట్ చేయాలి. పువ్వుల పైన సిట్రిక్ యాసిడ్ చక్కెర నీళ్లు స్ప్రే చేయాలి. వీటిని ఫ్లవర్ ఫుడ్స్ అంటారు. వెనిగర్ చక్కెర నిమ్మరసం సమపాళ్లలో కలిపి పూల పైన చిలకరించిన పూలు తాజాగా ఉంటాయి.

దాహం తీర్చే పానీయాలు

ఈ వేసవి దాహం తీరేందుకు పుచ్చ,కర్బుజా,నారింజ, బత్తాయి రసాలు తాగాలి.అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు,సబ్జా నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటుంది.పండ్ల రసాల్లో చక్కెర వేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తాగాలి.

రిలాక్స్ నిచ్చే టీ

రోజు కరివేపాకు టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు కరివేపాకు నీటిలో మరిగించి వడగట్టి పటిక బెల్లం వేసుకొని తాగాలి. ఈ ఆకుల వాసన రిలాక్స్ చేస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు కంటి చూపు మెరుగు పరుస్తాయి.డయాబెటిస్ ఉన్నవాళ్లు తాగితే చక్కెర నిల్వలు సమతుల్యం అవుతాయి.

సృజనకు సోపానం

అంజలీ సూద్ విమియో సంస్థ సిఈఓ ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న విమియో సంస్థ ను నేడు గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. 2015 లో మార్కెటింగ్ విభాగంలో చేరిన అంజలి రెండేళ్లలో సి ఈ ఓ అయింది. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో  పవర్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా నిలిచి సత్తా నిరూపించుకుంది. చిరు వ్యాపార సంస్థలు తమ ప్రకటనలో చక్కని వీడియోలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. విమియో […]

పోషకాలు మాయం

ఖర్జూర గింజలను పొడి చేయటంతో బ్రౌన్ డేట్స్ పౌడర్ తయారు చేస్తారు. ఇది సహజ సిద్ధమైన స్వీటెనర్ అంటున్నారు నిపుణులు. కాఫీ టీ లలో వాడరు కానీ బేకరీ చాక్లెట్లు స్నాక్స్ లో ఉపయోగిస్తారు. ఇది చక్కెర కు ప్రత్యామ్నాయం పీచు ఆంటీ ఆక్సిడెంట్ల ఖనిజ లవణాలు ఉంటాయి కనుక దీన్ని వాడటం వల్ల శరీరం శక్తితో ఉంటుంది. ఈ వేసవిలో డేట్స్ పౌడర్ ను పెరుగు,యోగర్ట్ పండ్ల మొక్కల పైన వాడుకోవచ్చు.