టీ ఇలాగే
అతి తక్కువ పాలతో చక్కెర లేకుండా దాల్చిన చెక్క,యాలుకల పొడి జోడించి టీ తాగమంటున్నారు ఎక్సపర్ట్స్.ఉప్పుతో కూడిన స్నాక్స్ బదులుగా బాదం,వాల్ నట్స్ తిని టీ తాగితే క్యాలరీలు పెరగవు. పాలతో ఎక్కువ సమయం టీ పొడి కలిపి వేడి చేస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉన్నది. టీ లో పాలు బిస్కెట్లు చక్కెర వేసిన స్నాక్స్ అసలు తినద్దు. చక్కెర కలపని టీ తాగితేనే ఆరోగ్యం.
థైరాయిడ్ సమస్య?
థైరాయిడ్ సమస్య ఉంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలు చిరుధాన్యాలు ఉండాలి. ఎక్కువ భాగం ఆహారంలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండాలి. తగినంత నిద్ర మితాహారం వేళకు వైద్యులు సూచించిన మందులతో థైరాయిడ్ సమస్య అదుపులో ఉంచుకోవచ్చు.
హెయిర్ లైన్ సమస్య ?
వయసు పెరిగే కొద్దీ మహిళల్లో హెయిర్ లైన్ వెనక్కి పోతు ఉంటుంది. ఈ లైన్ వాడకం మానేసి హెయిర్ బ్రష్ తో దువ్వుకుంటే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. నుదుటి దగ్గర జుట్టు ముందుకు వెనకో దువ్వుకుంటే వెంట్రుకలు వత్తుగా అనిపించి నుదుటి వైశాల్యం తగ్గుతుంది. నుదుటి దగ్గర వెంట్రుకలు లేయర్ లు గా కత్తిరించుకొన్న కూడా చూసేందుకు హెయిర్ లైన్ కవర్ అయిపోయి చక్కగా కనిపిస్తుంది.
అంతా సహజమే
రాధేశ్యామ్ సినిమాతో మళ్లీ వెండితెర ప్రవేశం చేసిన భాగ్యశ్రీ వయసు 54 ఏళ్ళు. ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మలేనంత అందంగా ఉంటారామె. అందం రహస్యం మాత్రం న్యూట్రిషన్ ఫిట్ నెస్ కోర్స్ లు చేసి సహజమైన ఆహారం వైపే దృష్టి పెట్టటం వల్లనే అందాన్ని కాపాడుకో గలిగాను అంటుంది భాగ్యశ్రీ. పాలు,తేనె, కలబంద, పెరుగు తో ఫేస్ ప్యాక్ లు కాయగూరలు వ్యాయామం తోనే యవ్వనం సాధ్యమే అంటుంది భాగ్యశ్రీ.
ఇష్టం తోనే జీవితం
ఆకాంక్ష మోంగ ట్రావెల్ బ్లాగర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ లో పనిచేసింది.ఉద్యోగం వదిలేసి కంటెంట్ క్రియేటర్ గా మారిన ఆకాంక్ష 12 దేశాలు తిరిగింది. ఆరుగురు సభ్యులతో ఆమె ఏర్పాటు చేసిన ‘ట్రావెల్ ఏ మోర్’ ఎంతో మందిని ఇన్ స్పయిర్ చేసింది.మనకు ఏ విషయం పైన పాషన్ ఉంటే దానితోనే జీవించాలి శ్వాసగా అంటుంది ఆకాంక్ష మోంగ.
ప్రిన్సెస్ ఫ్రొమ్ ది స్లమ్స్
లివ్ యువర్ ఫెయిరీ టేల్ షార్ట్ ఫిలిం లో నటించిన మలీషా ఖర్వార్ ముంబై ధారావి లోని మురికివాడ లో పుట్టింది మలీషా ను అమెరికన్ నటుడు రాబర్ట్ హోప్ మ్యాన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్స్ పేరుతో ప్రజాదరణ పొందిన మలీషా ప్రఖ్యాత స్కిన్ కేర్ కంపెనీ ఫ్యాషన్ ఎసెన్షియల్స్ కు ప్రమోటర్ గో ఫ్రెండ్ మీ అనే అకౌంట్ లో మురికివాడ ముచ్చట్లు తన ఆశలు చెప్పే మలీషా కు […]
పేడ బొమ్మలు
ఈ ప్రపంచంలో ఏ వస్తువు నిరూపయోగం కాదు ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు సమీపంలోని రాజన్ పూర్ గ్రామంలో ప్రైమరీ టీచర్ పూజా గంగ్వార్ ఆవు పేడ తో అందమైన కళాకృతులు చేస్తుంది పూజ. బొప్పాయి పాలు అవిసె గింజల నూనెతో పాలిష్ చేసే ఈ కళాకృతులు ఐదారేళ్ళ పాటు చక్కగా ఉంటాయి.వాల్ హ్యాంగింగ్స్, నేమ్ ప్లేట్స్, పెన్ హోల్డర్స్ ముఖ్యంగా ఆధ్యాత్మిక చిహ్నాలు బాగా అమ్ముడవుతాయి. ఇప్పుడీ ఆవు పేడ బొమ్మల తయారీలో […]
పాత కాగితాల బొమ్మలు
బోన్ డిసీస్ తో నడవలేని రాధిక పాత న్యూస్ పేపర్ల తో మెటల్ వైర్లతో ఎన్నో అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. సంగీత కారులు,దేవతలు, నవ దంపతులు ఇలా రకరకాల బొమ్మలు సోషల్ మీడియాలో చూపెట్టి అమ్మేస్తోంది.వేరే ప్రచారం అంటూ లేకపోయినా సోషల్ మీడియా పోస్టులే ఆర్డర్ లు తెచ్చి పెడతాయి. రాధిక మోటివేషనల్ స్పీకర్ కూడా తన స్ఫూర్తి దాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది రాధిక. ఈమెది తమిళనాడులోని కోయంబత్తూరు.
వంటరిగా గుహలో
ఒక ఆరోగ్య ప్రయోగం లో భాగంగా స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రిజ్ ఫ్లామిని 500 రోజులు 260 అడుగులు లోతు గుహలో ఒక్కతే గడిపి బయటకు వచ్చింది.2021 నవంబర్ 21న స్పెయిన్ లోని గ్రనాడ పట్టణం సమీపంలోని ఒక గుహలో అడుగుపెట్టి ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా గడిపిన బీట్రిజ్ కదలికలు కనిపెట్టేందుకు శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగం చేశారు. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్, వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీరం మానసిక స్థితుల్లో వచ్చే మార్పు […]
సైకిల్ అమ్మ
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ కు చెందిన జ్యోత్స్న కాగల్ ను సైకిల్ అమ్మాయి అంటారు. ఆమె వయసు ఇప్పుడు 74 ఏళ్లు 1968 నుంచి ఆమె సైకిల్ తొక్కుతోంది. మెరుపు వేగంతో సైకిల్ పై వెళుతూ ఆమె గోకర్ణ లోని మహాబలేశ్వర్ లో కో ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనులు చక్కబెట్టుకునేది. ఇప్పుడు ఆమె శరవేగంగా సైకిల్ పై వెళుతూ వీధుల్లో కనిపిస్తుంది. సైకిల్ సవారీ నా ఆరోగ్యం నా సక్సెస్ అని చెప్పే […]
హెల్లో మీరా (తెలుగు సినిమా)
గార్గేయి ఎల్లాప్రగడ ఒక్కతే ఈ సినిమాలో నటించిన యాక్టర్. ఒక గంటన్నర కారు ప్రయాణంలో ఆమె ఇతరులతో చేసిన సంభాషణ ఈ చిత్రం. డైరెక్టర్ శ్రీనివాస్ కాకర్ల ఇదొక ప్రయోగాత్మక చిత్రం అతి తక్కువ బడ్జెట్ కూడా.కథ పరంగా బలంగా ఉంటే, ఒకే ఒక్క నటి తో సినిమా తీయొచ్చు అని నిరూపించాడు డైరెక్టర్ శ్రీనివాస్. తెల్లవారితే పెళ్లి ఐటీ ఎంప్లాయి మీరా తన పెళ్లి బట్టలు తీసుకునేందుకు టైలర్ దగ్గరకు వెళ్ళింది. ఆమెకు హైదరాబాద్ పోలీస్ […]
జ్ఞాపకం శాశ్వతం
రెజిన్ ఆర్ట్ బై షెల్లీ పేరుతో ప్రేమ కానుకలను జ్ఞాపిక లుగా భద్రపరిచి ఇస్తోంది.హైదరాబాద్ కు చెందిన షెల్లీ ప్రేమకు గుర్తుగా అందిన గులాబీలు, ప్రసవం అయ్యాక మిగిలిన బొడ్డుతాడు వంటిది చిన్న పెండెంట్ లుగా మార్చి ఇస్తుంది షెల్లీ.వధూవరుల పూలమాలను వాల్ క్లాక్స్ గా, కాఫీ టేబుల్ బుక్ గా మర్చి ఇస్తుంది జీవితం లో మధుర క్షణాలను శాశ్వతం చేసుకోగలిగేది ఈలాగే అంటుంది షెల్లీ.
ఆపిల్ తొక్కతో వస్త్రాలు
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు అంజనా. అమెరికాలో చదువుకున్న అంజనా పర్యావరణ రహిత ఫ్యాషన్ ఉత్పత్తులు తయారు చేస్తారు.ఆపిల్ తొక్కతో మెత్తటి లెదర్ మెటీరియల్, తర్వాత అనాసతో ఫైబర్ తీయటం ప్రారంభించారు. ఈ మెటీరియల్ తో ఆమె తయారు చేసిన దుస్తులకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది.
శాఖాహార మాంసం
పర్యావరణానికి మేలు చేసేందుకు గాను ప్లాంట్ బెస్ట్ మీట్ వెంచర్, ది ఇమేజిన్ మీట్స్ ని భర్తతో కలిసి ప్రారంభించారు జెనీలియా. ప్రొటీన్లు అధికంగా ఉండే సోయాబీన్స్, పచ్చి బఠానీలు, బియ్యం,దుంపలు ఉపయోగించి తయారు చేసే ఈ మాంసం చాలా రుచిగా ఉందట.
వారసత్వ సంపద
నాగాలాండ్ మహిళలు 2012లో లిది క్రోయు అన్న ఎన్జీవో ను ప్రారంభించారు. దీని ద్వారా సాంప్రదాయ వంటలు, వస్త్రాలు, నగల తయారీ, జానపద పాటలు నృత్య రీతులు వెదురుతో అల్లికలు పిల్లలకు నేర్పుతున్నారు. స్కూళ్ళు పాఠశాలలలో కూడా తమ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి వీళ్ళతో చేతులు కలిపారు. వాళ్ళ ప్రయత్నాన్ని మన్ కి బాత్ అన్న కార్యక్రమంలో ప్రధాని ఎంతో మెచ్చుకున్నారు నాగాలాండ్ లో స్త్రీలు అక్కడ సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టుకో నిలబెట్టుకోవటం కోసం చేసే […]
పర్యావరణ హితం
వాడి పడేసే పూల వ్యర్థాలతో అగర్బత్తీలు, సబ్బులు తయారు చేసే వ్యాపారానికి పెట్టుబడి పెట్టారు ఆలియా భట్. ప్రకృతి ఆరోగ్యకరమైన జీవితానికి మధ్య సమతుల్యతను అర్థం చేసుకునేందుకు కో ఎక్సిస్ట్ అనే కార్యక్రమాన్ని బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ అనే హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఆలియా.
హెల్దీ స్నాక్
మఖానా ఫాక్స్ నట్స్ లోటస్ సీడ్స్ వంటి విత్తనాలతో పాప కార్న్ తయారు చేసుకుని స్నాక్ గా తింటే శరీరానికి అంతులేని పోషకాలు అంటున్నారు ఎక్సపర్ట్స్. క్యాలరీలు కొవ్వు సోడియం తక్కువ. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ చక్కెర అసలే తక్కువ.యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ కనుక ఈ స్నాక్ ప్రతిరోజు తినమంటున్నారు. పిల్లల లంచ్ బాక్స్ లో గుప్పెడు గింజలు ఉంచిన మంచిదే.
ఆలోచనే సంచలనం
నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ మోనిక హై అండ్ మైట్ 50 పవర్ ఫుల్ పీపుల్స్ జాబితాలో ఆమె పేరు కనిపిస్తుంది ఈ క్వీన్ ఆఫ్ కంటెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి నెట్ ఫ్లిక్స్ వరకు వెళ్ళింది. మోనిక ఎంపిక చేసిన ది ఎలిఫెంట్ విష్పర్బ్ ఆస్కార్ పురస్కారం అందుకుంది. మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసిన కాంతారా హిందీ వర్షన్ సక్సెస్ అయింది .
మొదటి అడుగు ఆమెదే
నిషా సోలంకి హర్యానా లో తోలి మహిళ అగ్రి డ్రోన్ పైలెట్ డ్రోన్ ద్వారా వేల ఎకరాల్లో సురక్షితంగా పురుగు మందులు చలాటంలో రైతులకు సహాయం చేస్తుంది.కర్నాల్ లోని మహారాజ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఫార్మా మెషనరీ పవర్ ఇంజనీరింగ్ కోర్స్ చదివింది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ కోర్స్ చేసింది. డ్రోన్ ద్వారా పురుగుమందు చెల్లితే రైతుకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. 25 కిలోల బరువైన అగ్రి డ్రోన్ తో పొలాల్లో పురుగు మందు చల్లె నిషా […]
బిడ్డకు పాలిచ్చే చోటే లేదా ?
బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉండాలని తన తొమ్మిది నెలల కొడుకు అయినా అవ్యన్ పేరుపైన కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. ఢిల్లీ వాసి న్యాయవాది నేహా రస్తోగి. ఫ్లైట్ లో తన బిడ్డకు ప్రశాంతంగా పాలిచ్చే వీలు దొరకగా పోవటంతో నేహా రస్తోగి ఈ అంశంపై పోరాటం మొదలు పెట్టింది.ఆమె వేసిన కేస్ తోనే ప్రభుత్వం ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని ప్లేస్ లో […]
