Tuesday, 28 Jul, 2026

తొలకరి తో జాగ్రత్త

తొలకరి వానలు మొదలయ్యాక జ్వరాలు, అంటు వ్యాధులు దాడి చేస్తాయి.ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలి స్ట్రీట్ ఫుడ్ అసలు తినకూడదు కాచిన నీళ్లనే తాగాలి దోమలు ఈగలు, విషయంలో అవి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

చిరుతలకే ఆవిడ తల్లి

తల్లులను కోల్పోయిన వన్యమృగాలను చిరుతలను తల్లిలాగే రక్షిస్తుంది సవిత్రమ్మ. కర్ణాటకలోని బన్నేరు ఘట్టు జంతుప్రదర్శనశాలలో పర్యవేక్షకురాలు.గత 20 ఏళ్లుగా జంతు ప్రదర్శనశాలకు తరలించిన పసికూన లైనా వన్య మృగాలను వందల సంఖ్యలో పెంచి పెద్ద చేసింది. చిరుతలు, పులులు, సింహాలు, పక్షులు, జింకలను సంరక్షించి సఫారీ కి తరలిస్తారు.

తొలి మహిళ నేనే

సిమ్రాన్ బాలా జమ్మూ కాశ్మీర్ నుంచి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ లో స్థానం సంపాదించింది ఆ ఘనత పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంది.మా గ్రామం దేశ సరిహద్దుల్లో ఉండటం వల్ల బాల్యం నుంచి తుపాకీ గుళ్ళు శబ్దాన్ని వింటూ పెరిగాను. మా తాత ముత్తాత లు సైన్యంలో చేసినవాళ్లే. దేశానికి నా వంతు సేవలు అందించాలని ఎంతో కష్టపడి రాంక్ సాధించాను అంటోంది సిమ్రాన్ బాలా.

స్టైలిష్ శారీ టాప్స్

క్యాజువల్ వేర్ గా పార్టీ వేర్ గా వంద మార్కులు సాధించే చీర శారీ టాప్స్ తో స్టైలిష్ గా మెరిసిపోతోంది. ఫ్రాక్ టైప్ టాప్ ఓవర్ కోట్ లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్ కాలర్ నెక్, రౌండ్ నెక్ డిజైన్ లతో శారీ టాప్స్ కార్పొరేట్ లుక్ ఇస్తున్నాయి. కాటన్ చీరలకు ఈ శారీ టాప్స్ సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి.

ప్రపంచాన్ని కదిలించిన పాట

ప్రధాని మోదీ నీ కలిసి ఆయనతో కలిసి చక్కని పాట రాసి,పాడి అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో దాని విడుదల చేశారు ఫల్గుణి షా.  భారతీయ అమ్మాయి ముంబైలో పుట్టి పెరిగింది. అమెరికా వెళ్లి ఇండో అమెరికన్ బ్యాండ్ కరిష్మా కు లీడ్ సింగర్ గా మారారు ఏంజలీనా జోలి తో కలిసి చేసిన ఏ ప్లేస్ టైం ఏ ప్లేస్ ఇన్ టైమ్ వంటివి ఫాల్గుణి కి అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో పేరు గుర్తింపు తెచ్చి […]

నాననిచ్చి తింటే మేలు

పొద్దున్నే వ్యాయామం చేసేవాళ్లు రాత్రుళ్ళు నానబెట్టిన కొమ్ము శనగలు తినమంటున్నారు. వీటిలో కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వీటిని నాన్న పెట్టడం వల్ల వాటిలోని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. శరీరంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువ కనుక త్వరగా ఆకలి వేయదు. ఈ సెనగల్లో ఉండే ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి తోడు పడుతుంది. వాటిని కాస్త వేయించి ఉప్పు వేసి తినొచ్చు.

పది నిమిషాలు

పని ఒత్తిడి విసిగిస్తే అతిగా ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే పది నిమిషాలు ధ్యానం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజుకి ఆ పది నిమిషాలు ధ్యానం జీవితంలో చాలా మార్పు తెస్తుంది. ఈ ధ్యానం తో మనల్ని మనమే కాదు ఎదుటివారిని చూసే కోణమూ  మారిపోతుంది. విపరీత ఆలోచనలకు బ్రేక్ పడుతుంది.నిదానం అలవాటు అవుతుంది. ఎక్కువ సంతోషంగా ఉన్న భావన కలుగుతుంది.

ఫ్రిజ్ లో పెట్టొద్దు

ప్రతి దాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తే ఫ్రెష్ గా ఉంటాయి అనుకుంటాం. కానీ బంగాళదుంపలు, కాఫీ డికాషన్, బ్రెడ్, తేనే, చాకోలెట్స్, అరటి పండ్లు, ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. వీటి వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాపిస్తాయి. అలాగే వంటల్లో వాడే రకరకాల నూనెలు కూడా ఫ్రిజ్ లో ఉంచరాదు. అతి చల్లదనానికి నూనెలో సహజమైన స్వభావం పోతుంది. గది బయట ఉష్ణోగ్రత లోనే ఇవి చక్కగా నిలవుంటాయి.

వంటల్లో తామరాకులు

తామర పువ్వుల అందమే అందం. కానీ ఆ ఆకులలో పుష్కలంగా ఉండే ఫ్లేవనాయిడ్లు ఎంతో ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్రాచీన మూలికా వైద్యంలో ఈ ఆకులను వడదెబ్బ, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలకు మందుగా వాడేవారు. తామరాకులలో ఆహారం ఉంచి ఆవిరిపై ఉడికిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్నిచోట్ల తామరాకులతో చేసిన టీ కూడా తాగుతారు. అరటి ఆకులకు ప్రత్యామ్నాయంగా భోజనాలు చేసేందుకు ఏదైనా పదార్థాలు ప్యాక్ చేసేందుకు వాడుతారు.

అలా తింటే ఆరోగ్యం

బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న గ్రిల్ పై కాల్చిన చికెన్ తింటే అనారోగ్యం అంటున్నారు మేరీ ల్యాండ్  కోలరారో శాస్త్రజ్ఞులు అధిక ఉష్ణోగ్రత దగ్గర ఆహారంలోని డి.ఎన్.ఎ  మారుతుంది అలాగే ఆహారాన్ని పదేపదే వేడి చేయటం కూడా మంచిది కాదంటున్నారు  అందుకే తాజాగా తక్కువ సెగ పైన తయారు చేసిన ఆహారం తినమంటున్నారు.

ఎవ్వర్ గ్రీన్

ఫ్లోరల్, మల్టీ కలర్స్ ఎప్పుడు స్టైల్ గానే ఉంటాయి. ఏ సీజన్ లో అయినా ఇండో వెస్ట్రన్ లుక్ తో టాప్ టు బాటమ్ ఎవ్వర్ గ్రీన్ లెహంగా శారీ, లాంగ్ కోట్,గౌన్,కుర్తా ఏవైనా ఒకే కలర్ కాంబినేషన్ ఎంచుకుంటే ఈ పువ్వుల డిజైన్లు  చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అచ్చంగా పూల రంగుల్లో నిజం పూవుల ప్రింట్ తో ఏ పార్టీలో అయినా సరిగ్గా సరిపోతాయి. డిజైనర్లు ఈ ప్రింట్ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్ […]

రికార్డ్ బ్రేక్

యంగెస్ట్ కమర్షియల్ పైలట్ రికార్డ్ సాధించింది సాక్షి కొచ్చర్. ఆమెకు 19 సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ పర్వానూ లో పుట్టిన సాక్షి అమెరికాలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకుంది. సోలో ఫ్లయిట్ నడిపింది. చదువు పూర్తయ్యాక పైలట్ ఉద్యోగం చేస్తానంటుంది సాక్షి.

ఉపేక్షించేది లేదు

ఒలంపిక్ లో మల్ల యుద్ధ విజేత సాక్షి మల్లిక్.రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులపై రెజ్లర్ల ఉద్యమం చేపట్టింది .ఇప్పటికే ఆయన పైన ఎన్నో లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి.తోటి క్రీడాకారులైన బజరంగ్ పూనియా వివేక్ పోగల్ లతో  కలిసి సాక్షి మాలిక్ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఆమె సేవకు ఎన్ని మార్కులు

దివ్యాంగుల కోసం కలం పట్టుకొనే వీలు లేని కండరాల సమస్య ఉన్న వారి కోసం 35 ఏళ్ల పుష్ప ఎన్.ఎం ఇప్పటికీ 1086 పరీక్షలు రాసింది దివ్యాంగులకు, అందులకు సెరిబ్రల్ పాల్సీ ఉన్నవాళ్లకు పరీక్షలు రాయాలంటే వాళ్లకు లేకరాలుగా ఉండాలంటే ఓపిక కావాలి. ఒక ప్రశ్న 30,40 సార్లు వివరంగా చదివి చెప్పాలి. పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి బ్యాంక్ పరీక్షలు రాసింది పుష్ప. 2019 లో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం […]

సైక్లింగ్ బెస్ట్

నడవడం కష్టమైతే వయసు సహకరించకపోతే సైకిల్ తొక్కండి అంటున్నారు ఎక్సపర్ట్స్.శరీరానికి బ్యాలెన్స్ అవుతుంది. అరికాళ్ళు  మోకాలు గట్టిగా, కండరాలు యాక్టివేట్ అవుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలో టాక్సిన్స్ కరిగి ఫిట్ నెస్ పెరుగుతుంది .

స్త్రీలకు సాయం

రూబీ సిన్హా డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభించారు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేతలకు ఇదో జ్ఞాన కేంద్రం. మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఈ ఫ్లాట్ ఫామ్ పరిష్కారాలు సూచిస్తుంది.ఈ సేవకు గాను రూబీ సిన్హా బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియమకం అయ్యింది.

బరువుకు చెక్

ఆకుకూరలు ఆరోగ్యవంతమైనవి అయినప్పటికీ తోటకూర ఆరోగ్యంతో పాటు అదనపు బరువు తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు సిఫారస్ చేస్తున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు కప్పు తోటకూర వండుకొని తినాలని చెబుతున్నారు. కొవ్వును తగ్గించి తక్షణ శక్తిని ఇచ్చే తోటకూర లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచుతుంది.

నీరే ఔషధం

స్త్రీలు బ్లాడర్ ఇన్ఫెక్షన్లు రాకుండా ప్రతిరోజు అదనంగా ఒకటిన్నర లీటర్లు నీరు తాగాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ బ్యాక్టీరియా తగ్గేందుకు బ్లాడర్ ను బ్యాక్టీరియా అంటిపెట్టుకొని ఉండే సామర్ధ్యాన్ని తగ్గించేందుకు సహకరిస్తాయని చెప్పారు. యాంటీ  బయోటిక్స్ వాడకం కంటే ద్రవాలు నీటితోనే ఇన్ఫెక్షన్లు పోతాయని చెబుతున్నారు.

మధ్యాహ్నపు నిద్ర..

ఒక్క 30 నిమిషాలు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోగలిగితే శరీరం బడలిక తీరిపోయి మెదడు పనిచేసే వేగం పెరుగుతుంది అంటున్నారు వైద్యులు.అదే నిద్ర ఎక్కువైతే స్థూలకాయం, రక్తపోటు, నడుము చుట్టూ కొవ్వు చేరడం వంటి పరిమాణాలు ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం పెరగడం జరుగుతాయి. కానీ చిన్నపాటి  కునుకు మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎంతో ఆరోగ్యం

మునగాకు లో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు వైద్యులు.లేత మునగాకు పప్పు కూరల్లో ఉడికించుకొని సాధారణ ఆకుకూర గా ఉపయోగించుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసిన మునగాకు చాలా కాలం నిల్వ ఉంటుంది. పోషక విలువల్లో ఎలాంటి తేడా ఉండదు. మునగాకు లో ఉండే ప్రోటీన్లు,గుడ్లు పాలలో వుండే ప్రోటీన్లతో సమానమైన ఆరోగ్యం ఇస్తాయి.