Tuesday, 28 Jul, 2026

కీలక స్థానాల్లో స్త్రీలు

ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో మహిళలను కొలువుల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. దిగ్గజ వాహన తయారీ సంస్థలు  మహేంద్రా   అండ్ మహేంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. వెల్డింగ్ రోబోటిక్స్ లోడ్ లోడింగ్ వెహికల్ అసెంబ్లింగ్ మిషన్ షాప్ వరకు అన్ని కీలక స్థానాల్లోనూ మహిళలకు స్థానం కల్పించింది. ఇందుకోసం ఐ ఐ టి ల నుంచి ఉద్యోగులను ఎంచుకుంది వారిలో ఎక్కువమంది గిరిజన ప్రాంతాల మహిళ ఐఐటి లే ఉన్నారు.

రైతులకు పాఠాలు

ఆర్గానిక్ స్కిన్ హెయిర్ కేర్ ఉత్పత్తుల కంపెనీ యామి హెర్బల్స్ వ్యవస్థాపకురాలు శైలజా ప్రదీప్. సోషల్ మీడియా మార్కెటింగ్ తరగతుల ద్వారా సేంద్రియ సాగు చేసే రైతులకు ఆదాయ మార్గాలు చూపిస్తారు. తమిళనాడు లోని శివకాశి స్వస్థలం రైతుల ఉత్పత్తుల విక్రయం కోసం ఒక వెబ్ సైట్ నడిపిస్తారు. శైలజ రూపొందించిన సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ ఒక ప్రైవేట్ సైన్స్ అండ్ ఆర్ట్ కాలేజ్ లో బోధనాంశంగా ఉంది.

మెనూ మార్చండి

బరువు తగ్గాలంటే ఆహారంలో మెనూలో మార్పులు ఉండాలి. జీడిపప్పు, బాదం, పిస్తా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి ప్రోటీన్లు అంది బరువు తగ్గొచ్చు. ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, మెనూలో ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి ప్రోటీన్స్ అధికంగా ఉండే చేపలు తినాలి. బీన్స్, ఆలు వంటివి తక్కువ నూనెతో తక్కువ తినాలి మిగతా అన్ని సరైన సమయంలో తింటూ వ్యాయామం చేయాలి.

సమాజ చైతన్యం లక్ష్యం

పద్మిని రంగరాజన్ పప్పెట్ కళాకారిణి ఫింగర్ గ్లౌ రాడ్ పప్పెట్రీ తో తెర వెనుక ఆడించే తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తారు. పెప్పెట్ థెరపీ ఆమె ప్రత్యేకత.సామాజిక చైతన్యం దిశగా రకరకాల కథ నేపథ్యాలకు బొమ్మలాటలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారత బొమ్మలాట కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటారు పద్మినీ రంగరాజన్.

ఉత్తమ కథానాయక  

‘ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్’ చిత్రంలో నటించిన సుమాదేవి  దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ కథానాయక అవార్డు అందుకుంది. ఓకే దీవిలో ఒంటరిగా జీవించే షీలా అన్న మహిళ పాత్ర ధరించిన సుమా దేవి కేరళలోని త్రిసూర్ లో పుట్టారు. సినిమాల్లో బాడీ లో ఉంది డబులింగ్ వృత్తిలో ఉంది.మొదటి సినిమాకే అవార్డు అందుకుంది సుమాదేవి.

ఫ్లేవర్డ్ వాటర్స్

ఫేస్ ప్యాక్ లకు బదులు ఫ్లేవర్డ్ వాటర్లు మార్కెట్లోకి వచ్చాయి. రైస్ వాటర్, హనీ వాటర్, కోకోనట్ రోజ్ వాటర్, లెమన్ వాటర్, జాస్మిన్ వాటర్ లు రోజ్ వాటర్ లాగే వాడుకోవచ్చు. ఈ ఫ్లేవర్డ్ వాటర్ మొహంపై చల్లుకుంటే చర్మం తేమగా తాజాగా మారుతుందని అలసట మాయం అవుతుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

టైమ్ స్క్వేర్ పై స్టార్ కిడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ప్రముఖ జ్యువెలరీ సంస్థ పి.ఎం.జె యాడ్ లో నటించింది. ఈ పాటలోను ప్రతిష్టాత్మక న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించింది. ఈ గణిత సాధించిన స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకుంది సితార. ఇన్స్టా లో  పది లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సితార కు భవిష్యత్తులో సినిమా యాక్టర్ నే అవుతానని చెప్పే సితార ఈ ఒక్క ఆడ్ కోసం కోటి రూపాయలు పారితోషికం తీసుకొంది.

నిండుగా పోషకాలు

ఎర్రగా నిగనిగలాడే క్యాప్సికం లో ఎ,సి,కె వంటి ముఖ్యమైన విటమిన్లు పీచు రోగనిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కంటికి, చర్మానికి మేలు చేసే పోషకాలున్న ఈ క్యాప్సికం ఆకర్షణీయమైన ఆకుపచ్చ, నారింజ, పసుపు ఇంకా ఎన్నో రంగుల్లో వస్తున్నాయి. వీటిని సలాడ్ల లో పచ్చిగానే వాడొచ్చు. దోరగా వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మనకు దొరికే కాయగూరలు అన్నింటిలో కంటే విటమిన్ సి వీటిలోనే ఎక్కువ.

ట్రెండీ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్ అంటే ధరించే దుస్తులే కాదు నగలు ట్రెండీగా ఉండాలి. స్టైలిష్ గా ట్రెండీగా ఉండటం కోసం అమ్మాయిలు ఫుడ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడుతున్నారు. బిస్కెట్లు, వైన్ కుకీస్, లాలిపాప్, బర్గర్, పీస్ క్రీమ్, ఆమ్లెట్లు అన్ని రకాల తిండి పదార్థాలు స్టైలిష్ ఇయర్ రింగ్స్ గా  అందుబాటులో కొచ్చాయి. గమ్మత్తైన ఫుడ్ ఫ్యాషన్ కాంబో ఇప్పుడు చాలా క్రేజీ.

వళ్లు వేడిగా ఉంటే !

వర్షాకాలంలో కూడా వేడి ఇంకా తగ్గలేదు. గర్భిణీలుగా ఉండే వాళ్లకు ఈ వేడి కూడా సమస్య. ఎండవేడికి తల తిరిగి వికారం, కాళ్లు పట్టేయడం, పాదాల్లో నీరు చేరడం, ఎసిడిటీ వంటి వి బాధిస్తాయి.శరీర ఉష్ణోగ్రత పెరగకుండా తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువ ఉండే కీర దోస, పుచ్చకాయ, కర్పూజ తినాలి. స్నానం చేసే నీళ్లు మరి చల్లగా మరి వేడిగా వద్దు. వీలైనంత విశ్రాంతిగా ఉంటే శరీరం మెదడు […]

తెల్లగా లేనన్నారు

మిస్ ఇండియా గా నిలిచిన మోడలింగ్ అంటే అందాల బొమ్మలే తప్ప నటనకు పనికిరారు అనుకుంటారు చాలామంది. మొదట్లో నా మొహాన్నే నీకు యాక్షన్ ఏమి వచ్చు అనే వాళ్ళు, కానీ నాకున్న మార్గాలన్నీ వెతుక్కుంటూ నడిస్తే ఇవ్వాల్టికి గుర్తింపు వచ్చింది అంటుంది శోభిత ధూళిపాళ్ల. నేను డాన్సర్ కూడా అయినా తెల్లగా లేనని మోడల్స్ కు నటన రాదని అన్నారు. కానీ నేనెప్పుడూ నిరాశ పడలేదు పెద్ద సినిమాలే కావాలనుకోలేదు తిరస్కారం పట్టించుకోకుండా నిలబడ్డాను. పనిచేస్తూ […]

పేషెంట్లకు అన్నం పొట్లం

కేరళ లోని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డి.వై.ఎఫ్.ఐ) హృదయపూర్వం పేరుతో ఇంటింటి నుంచి అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే రోగులకు వారిని కనిపెట్టుకొని ఉండే బంధువులకు ఇస్తారు. కేరళలోని చాలా ఇళ్లలో ఇల్లాలు ఈ భోజనం పొట్లాలు ఇస్తారు. 300 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాళ 40000 మంది దాతలతో ఈ అన్నదానం కొనసాగుతోంది.

భద్రతా వలయంలో

అతిలోక సుందరి నర్తకి గాయని ప్రసిద్ధ నటి జెన్నిఫర్ లోపెజ్ తన భద్రత సిబ్బంది కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఆమె ఆస్తి 400 మిలియన్ డాలర్లు. 2004 నుంచి ఫోర్బ్స్ జాబితాలో ఆమె స్థానం పొందుతూనే ఉంది. ఏడాదికి ఆమె సంపాదన 40 డాలర్లు. 54 ఏళ్ల వయసులోనూ దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఆమెను చుట్టూ ముట్టేస్తూ ఉంటారు.రక్షణ కోసం ఆమె భద్రతా వలయం లో ఉండాల్సిందే.

శక్తి నిచ్చే పొంగలి

బెల్లం మిరియాలతో చేసే పొంగలి లో శక్తినిచ్చే క్యాలరీలు విటమిన్లు, ఖనిజాలు శక్తినిచ్చే క్యాలరీలు అన్నీ ఉంటాయి. పొంగలి లో వాడే బియ్యం పప్పు కలిపి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఎమైనో యాసిడ్ల కంప్లీట్ గా మారి శరీరంలోకి తేలికగా సంగ్రహించబడతాయి. పొంగలి లో వేసే నెయ్యిలో అత్యంత శక్తి ఉంటుంది. జీడిపప్పు బాదం పిస్తా కలిపి చేసే ఈ పొంగలి వారానికి ఒకసారి పిల్లలకు బాక్స్ లో ఇస్తే చాలా శక్తినిస్తుంది.

హంగింగ్ రోప్స్

తాజా పండ్లు, ఉల్లిపాయలు దుంపలు ఫ్రిజ్ లో కంటే హ్యాంగింగ్స్ రోప్స్ లో గోడకు వేలాడదీస్తే పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఫ్రిజ్ లో చల్లదనానికే అవి సాధారణంగా పాడైపోతాయి. అలాటప్పుడు మార్కెట్లో దొరికే ఉయ్యాల వంటి క్రోషెట్స్ లో వీటిని గోడకు వేలాడదీయవచ్చు. రెండు వైపులా ఉన్న రింగులను గోడకు మేకులు కొట్టి వేలాడదీస్తే పండ్లు, దుంపలు వంటివి ఎక్కువ రోజులు నిలవుంటాయి.

తొలి మహిళా డ్రైవర్

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నాసిక్ డివిజన్ 75 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా డ్రైవర్ గా 34 ఏళ్ల మాధవి సాల్వే ప్రశంసలు అందుకొంటున్నది.పూణే సమీపం లోని మారుమూల గ్రామంలో పుట్టిన మాధవి మెకానిక్ అయిన తండ్రి ప్రోత్సాహంతో స్కూల్ కు వెళ్లే రోజుల్లోనే ద్విచక్ర వాహనాలు, కారు నడపటం నేర్చుకుంది. అలాగే బైకులు,టెంపోల మరమ్మతులు నేర్చుకున్నది. నాసిక్ డివిజన్ లో స్టీరింగ్ పట్టుకున్న తొలి మహిళ ఆమెనే.

వర్షాలు వస్తున్నాయ్

వర్షాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దోమలు కుట్టకుండా దొంతరలు వాడాలి. జలుబు, దగ్గు రాకుండా గోరువెచ్చని నీళ్లనే తాగాలి. మొలకెత్తిన గింజలు, నారింజ తాజా కూరగాయలు పండ్లు తినాలి. ఇంట్లో ఒకే చోట తడి బట్టలు కుప్పగా వేయకూడదు దోమల సమస్యతో పాటు బ్యాక్టీరియా సమస్య కూడా వస్తుంది పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి. వర్క్ వుట్స్ చెయ్యాలి. కూల్ డ్రింక్స్ బదులు హెర్బల్ టీ తాగాలి. తడి బట్టలు తడి షూస్ […]

జీవజాతుల పరిరక్షణ ధ్యేయం

సివిల్ ఇంజనీర్ కీర్తి సెల్వరాజ్ తమిళనాడు ప్రభుత్వం తరఫున కాలుష్య నివారణ బోర్డ్ ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డ్  పురస్కారం అందుకుంది. పర్యావరణ పక్షి జాతుల సంరక్షణ కోసం కృషి చేసేందుకు కీర్తిని సత్కరించింది ప్రభుత్వం. పక్షుల పై పరిశోధన చేస్తూ 155 పక్షి జాతుల ను రికార్డ్ చేసి వివరాలు ఇబర్ట్ అనే అంతర్జాతీయ సర్వే ఫ్లాట్ ఫార్మ్ లో నమోదు చేశారామె. స్వయంగా వెయ్యికి పైగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా […]

పాలి బ్యాగ్స్

గుజరాత్ లోని కచ్ అనే మారుమూల గ్రామంలో నివసించే పాబిబెన్ పేరే ఒక బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా పాలీ బ్యాగ్ అనే పేరుతో ఆమె తయారు చేసే ఎంబ్రాయిడరీ బ్యాగ్ ఎంతో మంది మహిళలకు ఉపాధి. గుజరాత్ లో సాంప్రదాయంగా వివాహ వేడుకల్లో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజులు దుప్పట్ల ను అల్లడంలో ప్రావీణ్యం సంపాదించుకొని, ఆ నైపుణ్యంతో పాలీ బ్యాగ్ రూపకల్పన చేసింది. ఈ హస్త కళాకారుని రూపొందించిన పాలి బ్యాగ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయి.

చినుకు పడితే

వర్షాలు మొదలయితే రెయిన్ కోట్ అవసరం అయిపోతుంది.మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్ గా స్టైల్ గా కనిపించే రెయిన్ కోట్స్ దొరుకుతున్నాయి. తేలికగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని క్యారీ చేసే ట్రాన్స్ పరెంట్ రైన్ కోట్ లు ఆకర్షణీయమైన రంగులో వాటర్ ప్రూఫ్ రెయిన్ జాకెట్లు యూనిఫామ్ సైజులో కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన పాంచో స్టైల్ లో వాటర్ ప్రూఫ్ పాలిస్టర్ రెయిన్ కోట్ హై క్వాలిటీ మెటీరియల్ వస్తోంది. తల నుంచి పాదాల వరకు […]