స్త్రీల వేదనల సమాహారం
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన డాక్యుమెంటరీలు తీయాలని డైరెక్టర్ తనూజ చంద్ర ధ్యేయం టీవీ సీరియల్స్ జమీన్ ఆస్మాన్ లో డైరెక్టర్ గా వినోద రంగంలోకి అడుగు పెట్టింది తనుజ. ఇప్పుడు వెడ్డింగ్ ఖాన్ అని సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది తనుజ మ్యాట్రిమోనియల్ మసాలా ద్వారా నష్టపోయిన మహిళల కథలు ఇవి ఈ సిరీస్ ద్వారా భారత మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది తనుజ.రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ మాన్ సూన్ […]
అత్యుత్తమ నిర్మాత
పంజాబ్ కు చెందిన గునీత్ మోంగా నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డ్ లభించింది. పంజాబ్ కు చెందిన గునీత్ మోంగా 16 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టారు. డ్రైవర్ గా సేల్స్ ఏజెంట్ గా ఎన్నో పనులు చేశారు.
సమాజ సేవకు అవార్డు
ప్రఖ్యాత రచయిత్రి సమాజ సేవకురాలు సుధా మూర్తి. ఈ ఏడాది గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. మనదేశంలో ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ సుధా మూర్తి.ఈ అవార్డుకు ఇచ్చిన 50 వేల డాలర్ల బహుమానాన్ని కెనడా ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ కు దానం చేశారు సుధా మూర్తి. తన రంగంలో అద్భుతమైన ప్రతిభ, చూపించిన వారికి కెనడా ఇండియా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తుంది.
31 ఏళ్లకు జైల్లోనే
ఇరాన్ కు చెందిన నర్గీస్ మొహమ్మద్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు ఇరాన్ లో మరణ శిక్షలు హిజాబ్ ప్రభుత్వం జైలు పాలు చేసింది. ఎంతవరకు ఆమెను 13 సార్లు అరెస్ట్ చేస్తే 31 ఏళ్ల పాటు జైల్లోనే గడిపింది నర్గీస్. ఆమె ధైర్యానికి ఆమెకు నోబెల్ లభించింది.
ఆనందాలు అందుకోండి
ఆందోళన నుంచి స్వంతన పొందేందుకు చిన్న చిన్న ఆనందాలు ఆస్వాదించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయాన్నే కప్పు కాఫీతో ఇంద్రియాలను మేల్కొల్పే అనుభవాన్ని పొందవచ్చు. గోరువెచ్చని నీళ్లతో ఒక అరగంట పాటు స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే బయట గార్డెన్ లో చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. పూల చెట్ల మధ్యలో పచ్చిక లో నడవటం శరీరానికి కొత్త హుషారును ఇస్తుంది.
పిల్లలపై ఒక అదుపు
టెడెక్స్ స్పీకర్, బ్లాగర్ రిచా సింగ్ బ్లాగర్స్, ఇన్ ఫ్లూయన్స్ లను ఒక వేదిక పైకి తెచ్చేలా 2016 లో బ్లాగ్ చాటర్ ప్రారంభించింది.టీనేజర్లు చూసే ఆన్ లైన్ కంటెంట్ ను కాస్త పెద్దవాళ్ల అదుపులోకి తెచ్చేలాగా 2022 లో హాపీ నెట్జ్ ప్రారంభించింది రిచా. ఈ పరికరం ఏ ఐ మిషిన్ లెర్నింగ్ సాయంతో నాలుగు దశల్లో సైట్ ను వడ పోస్తుంది. పెద్దవాళ్ల ఫోన్ కు కనెక్ట్ అయి ఉంటుంది కనుక పిల్లలు ఏ […]
అందమైన బగ్రూ
అద్దకాలతో ఆకర్షణీయంగా కనిపించే బగ్రూ హ్యాండ్ కాటన్ ప్రింటెడ్ చీరలు లు ఎక్కువగా వాడుతున్నారు. జైపూర్ బగ్రూ కాటన్స్ 300 ఏళ్ల నాటి సాంప్రదాయ అద్దకం చీరలు ఆఫ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద ముదురు రంగు మోటిప్స్ ముద్రిస్తారు. రకరకాల పూల డిజైన్లు చీరలు ఇండిగో, నారింజ, పసుపు రంగుల్లో ఉంటాయి. ఈ చీరలు పాత కళాకృతులు పొద్దుతిరుగుడు, గులాబీ ఇతర స్థానిక పువ్వుల డిజైన్లతో ఉంటాయి. మెటల్ తో ఈ బగ్రూ కాటన్ చక్కగా […]
తొలి ఈ రిక్షా డ్రైవర్
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా భాదర్వ టౌన్ కు చెందిన మీనాక్షి దేవి చీనాబ్ లోయ లోనే తొలి ఈ రిక్ష డ్రైవర్ గా నిలిచింది. ఆనారోగ్యం తో పని చేయలేని భర్త,ఇద్దరు పిల్లలను బతికించుకునేందుకు మీనాక్షి డ్రైవర్ వృత్తి ని ఎంచుకొంది సబ్సిడీ తో ఆటో కొనుక్కొని నడపడం మొదలు పెట్టింది తొలి సారి ఆటో డ్రైవర్ గా బస్ స్టాండ్ లో అడుగుపెట్టడం కాస్త విచిత్రంగా చూశారు కానీ ఇప్పుడు అంత అలవాటై […]
టాప్ టెన్ లో కియారా
గూగుల్ ట్రెండ్స్ విడుదల చేసిన టాప్ టెన్ జాబితా లో కియారా అద్వానీ పేరు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం భారతీయులు ఈమెను తెగ వెతికారు. అలాగే ఈ మధ్య కియారా ను పెళ్లాడిన నటుడు సిద్ధార్థ మల్హోత్రా కూడా టాప్ టెన్ లో ఉన్నాడు. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అర్జున్ రెడ్డి మేక్ కబీర్ సింగ్ తో ఆకాశంలోకి దూసుకు పోయింది. ఇన్ స్టా లో 3. 3 కోట్ల […]
గర్భాకు యునెస్కో గుర్తింపు
దేశ విదేశాల్లో లయాత్మకంగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న గుజరాతి సంప్రదాయ నృత్యం గర్బా కు యునెస్కో అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఇంపాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ విభాగంలో గర్భా నృత్యాన్ని చేర్చింది.జీవన మరణాల నృత్యంలో సాగుతుందనే జీవిత సత్యం తెలియజేసే గుజరాతి సాంప్రదాయ నృత్య రీతి ఇది. శక్తి స్వరూపిణి అయినా దుర్గాదేవి ముందు దీపం వెలిగించి చుట్టూ సాంప్రదాయబద్ధంగా నృత్యం చేయడమే గర్భా ఇది స్త్రీ శక్తిని పూజించి కీర్తించే నృత్యం.
నిండుగా పోషకాలు
రేగి పండ్లు ఆకుపచ్చ లేదా ఎరుపు ముదురు ఎరుపు రంగుల్లో దొరుకుతున్నాయి. లేత ఆకుపచ్చ గా ఉంటే పెద్ద రేగి పండు లో పిండి పదార్థం ఎక్కువ. అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణ మందులలో దీన్ని వాడతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ అధికం ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి కొలెస్ట్రాల్ […]
మంచి కథలు ఎంచుకొంటా
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి బలగం సినిమా తో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ స్థాపించి ఏటీఎమ్ వెబ్ సిరీస్ నిర్మించింది హన్షితా రెడ్డి. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఫిమేల్ ప్రొడ్యూసర్స్ లో హన్షితా కు మంచి పేరు దక్కింది.50 సినిమాలు నిర్మించి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు చేసిన నిర్మాత గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కుమార్తె గా హన్షితా అర్థవంతమైన కథలనే ఎంచుకుంటాను […]
రోజు సోయా పాలు
ప్రతిరోజు ఒక కప్పు సోయా పాలు మంచివే అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆవు, గేదె పాలు కు ప్రత్యామ్నాయంగా ఇవి మామూలు పాలలాగే ప్రోటీన్ పిండి, పీచు పదార్థాలు సోయా పాలలో ఉంటాయి. విటమిన్ కె థయామిన్ ఫోలేట్ లాంటి విటమిన్లు కాపర్,ఫాస్పరస్,మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు సోయాలో పుష్కలం. చక్కెర కలపని సోయా పాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చీరె తో వర్క్ వుట్స్
ఉదయపు నడకలో లేదా జిమ్ ఆ వ్యాయామాలకు ఉపయోగపడే డ్రెస్ లే అవసరం అనుకుంటారు కొందరు. డ్రెస్ ధరించేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసం వ్యాయామం పైన అవగాహన కల్పించడం కోసం చీర కట్టుతో వర్క్ వుట్స్ చేసి చూపించింది పూనే కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఇనామ్ దార్ జిమ్ లో చీరతో వర్క్ వుట్స్ చేస్తున్న ఆమె ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.మహిళలు తమ ఆరోగ్యం పైన దాన్ని మెరుగుపరుచుకునేందుకు […]
అమ్మో ఇన్ని శబ్దాలా ?
చుట్టూ ఉన్న శబ్ద కాలుష్యం నుండి ఎలాగో విముక్తి ఉండదు కనుక కనీసం ఇంట్లో అయినా కొన్ని శబ్దాలకు కాస్త దూరంగా ఉండండి. బిపి పెరిగి అలసిపోకుండా ఉంటారు అని చెప్తున్నారు. మిక్సీ వాడెప్పుడూ గోడకు అడుగున్నర దూరంలో పెట్టాలి. టీవీ మ్యూజిక్ సిస్టం సౌండ్ తక్కువ ఉండాలి. చెవులను కప్పి ఉంచే మఫ్స్ వాడటం చాలా మంచిది. చెట్ల వల్ల ధ్వని తగ్గుతుంది కనుక ఇంటి పరిసరాల్లో ఎక్కువ చెట్లు ఉండేలా చూసుకోవాలి.. ఎక్కువ చప్పుళ్ళు […]
స్వేత సౌధం లో ప్రదర్శన
విభా జానకిరామన్ చెన్నైలో పుట్టి పెరిగింది. సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకొని బ్యాచిలర్స్ చేస్తుంది.సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం ఈమెది. ఆర్కెస్ట్రాల్ చాంబర్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శనలు ఇచ్చి స్కాలర్షిప్ అందుకుంది.ప్రధాని మోదీ, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సమక్షంలో కూడా పాడి వారి మెప్పు ను పొందింది జానకి రామన్. ఈ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు.
అంతర్జాతీయ పురస్కారం
కర్ణాటక హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పాడటంతో పాటు ఎన్నో వాయిద్యాలు వాయించగలదు ఎన్ జె జననీ. మూడేళ్లకే సంగీత సాధన ప్రారంభించిన జననీ సినిమాలతో పాటు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది.పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లో కలిసి ప్యారిస్ లో జుగల్ బందీ చేసింది. కాంటినెంటల్ మ్యూజిక్ అవార్డ్స్ నుంచి పాప్ విభాగంలో బెస్ట్ ఆఫ్ ఆసియా పురస్కారం అందుకున్నది జనని ఈసారి జానపద విభాగంలో కూడా ఆమెకు పురస్కారం లభించింది.
ఉత్తమ డి.జె
ప్రపంచం లోనే 100 మంది ఉత్తమ డి.జె లో స్నేహల్ షా ఒకరు ఆమె సింగర్ రీమిక్సర్ కూడా డి.జె రింక్ పేరుతో ముంబాయి ఎంతో పాపులర్. ఈ ఏడాది ఆసియాలోనే టాప్ 50 డి.జె ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.రికార్డ్ లేబుల్ పేరుతో డి.జె స్కూల్ నిర్వహిస్తోంది. ఐ.పి.ఎల్ కు పనిచేసింది స్నేహల్ షా గుజరాత్ లో పుట్టి పెరిగిన స్నేహల్ ప్రముఖ డి.జె ల వద్ద శిక్షణ తీసుకుంది. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ […]
ఫిట్ నెస్ ట్రాకర్
కొత్త సంవత్సరం లేదా ఇతర పండుగలకు ఆత్మీయులకు బహుమతులు ఇస్తాం. సాధారణంగా కొత్త సంవత్సరం అమ్మాయిలు తీసుకునే తీర్మానాల్లో ముందుండేది బరువు తగ్గాలి అనే కదా. అల్లా స్నేహితుల్లో ఫిట్ నెస్ అభిమానులు ఉంటే వాళ్ల కోసం మెటల్ చైన్ ఫిట్ నెస్ ట్రాకర్ బహుమతి గా ఇవ్వచ్చు. స్టైల్ గా అనిపించే ఈ ట్రాకర్ వ్యాయామానికి సంబంధించిన అన్ని వివరాలు అందిస్తుంది.
సైగలతోనే గెలుపు
పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న దీక్ష దాగర్ కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. తండ్రి నరీందర్ గోల్ఫ్ కోచ్. ఆయన శిక్షణలో 2015 లో లేడీస్ గోల్ఫర్ పోటీల్లో గుర్తింపు తెచ్చుకుంది. రెండు డెఫెలింపిక్స్ లో పోటీపడి రజిత బంగారు పతకాలు పొందింది.ఒలింపిక్స్ లో పోటీపడి తొలి గోల్ఫ్ ఫర్ చరిత్ర కెక్కింది దీక్ష దాగర్. హియరింగ్ ఎయిడ్ తో కొంచెం ఎనగలిగిన దీక్ష కేవలం సైగల సాయంతో ఇంత విజయం సాధించింది.
