శిరోజాలకు బలం
విటమిన్-సి అధికంగా లభించే ఉసరి తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే సమస్య పోయి జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.గుప్పెడు తులసి ఆకులు టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు పోతుంది అలాగే ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ తో వేసుకున్న చుండ్రు పోతుంది. మెంతి పొడి, ఉసిరి పొడి పెరుగులో కలిపి ఒక రాత్రంతా నాననిచ్చి ఆ […]
నెలసరి శుభ్రత ప్రచారం
ఉజాస్ మెన్ స్ట్రువల్ హెల్త్ ఎక్స్ ప్రెస్ ను తీసుకువచ్చింది అద్వేతషా నెలసరి ఆరోగ్యం శుభ్రతలపై అవగాహన కల్పించేందుకు గాను ఈ వ్యాన్ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు నగరాల్లో లక్ష కిలోమీటర్లు ప్రయాణించనున్నది నెలసరి పై కొనసాగుతున్న అపోహలను తీరుస్తూ ఉచిత సానిటరీ నాప్కిన్ లు అందిస్తున్నారు.వ్యర్థాలతో తిరిగి వాడుకునేలా రూపొందించిన ఈ నాప్కిన్ లను స్వయంగా తయారు చేసి పంచుతుంది అద్వేతషా బిర్లా
రోడ్ సైడ్ లైబ్రరీలు
అరుణాచల్ సిస్టర్స్ ఎన్గురాంగ్ మీనా రీనా లు మారుమూల ప్రాంతాల్లో కృషి చేస్తున్నారు. అరుణాచల్ అక్షరాస్యతలో వెనుకబడి ఉంది నాణ్యమైన విద్యను అందించేందుకు రోడ్ సైడ్ లైబ్రరీలు ప్రారంభించారు. మొదట్లో పుస్తకాలు ప్రజలు దొంగలించే వాళ్ళు కానీ,తర్వాత ప్రజలే వాటిని కాపాడుకోవటం మొదలుపెట్టారు. అన్ని పల్లెల్లో నూ ఇలాంటి లైబ్రరీలు ఏర్పాటు చేయాలనుకున్నారు మీనా రీనా లు వీరి కృషి ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఢిల్లీ,బెంగళూరు లో ఉన్నత చదువులు చదువుకున్న ఈ అక్క చెల్లెల్లు ఎన్గురాంగ్ […]
మల్టీ టాలెంట్
సాఫ్ట్ వేర్ ఇంజనీర్, రైటర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆరతి కడవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చింది కార్గో మూవీ.ఈ ఫిలాసఫికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ముందు ఆరతి తీసిన టైమ్ మెషిన్ అన్న షార్ట్ ఫిలిం తో,పురాణాల కథలతో సినిమాలు తీయాలని లక్ష్యం ఏర్పరచుకుంది. కార్గో సినిమా తీసిన ఐదుగురు నిర్మాతల్లో ఆరతి కూడా ఒకరు.విల్ ఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది చిత్ర సీమలో కృతిమ […]
జీడిపప్పు తో ప్రమాదం
జీడిపప్పు బలం ఇస్తుందంటారు కానీ వీటివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. జీడిపప్పులో కొవ్వు ఫైబర్ ఉంటాయి. అంచేత అరుగుదల కష్టం అవుతుంది. గుప్పెడు జీడిపప్పు లో 160 క్యాలరీలు ఉంటాయి.జీడిపప్పు తిన్న వెంటనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు జీడిపప్పు తినకూడదు పచ్చి జీడిపప్పు లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్థం క్యాల్షియం ఐరన్ జింక్ వంటివి శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుంది అందువల్ల వేయించినవి లేదా నాన్న పెట్టిన జీడిపప్పునే తినాలి.
బీట్ రూట్ బెస్ట్
వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఎండలు వచ్చాయంటే ముఖం నల్లబడటం మొటిమలు రావడం మొదలవుతుంది ఈ సమస్య కు బీట్ రూట్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసం ఒక స్పూన్, ఒక స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.మూడు స్పూన్లు బీట్ రూట్ రసం లో కాస్త నిమ్మరసం కలిపి ముఖం మెడ చుట్టూ రాస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. బీట్ రూట్ రసం తేనే మిశ్రమాన్ని ముఖం పై రాసి […]
లేజర్ షూటర్
చదువు, ఆట రెండు ముఖ్యమే అంటుంది రిథమ్ సాంగ్వాన్ లేడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రిథమ్ ను లేజర్ షూటర్ అంటారు హర్యానా కు చెందిన ఈ భారతీయ పిస్టల్ షూటర్ అంతర్జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్ ల్లో రాణించింది. గత సంవత్సరం స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్ ల్లో బెస్ట్ యంగ్ అచీవర్ గా నిలిచింది.గత ఆసియా క్రీడల్లో బృంద విభాగంలో స్వర్ణ పథకం అందుకోవటమే కాకుండా 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 29 […]
ఉత్తమ క్యూ రైటర్
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అక్కడి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు మసూమా రిజ్వీ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన మసూమా పురాతన కట్టడాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ లు ఎన్నో చేపట్టారు. రాష్ట్రపతి భవన్ మానెక్షా సెంటర్, దీన్ దయాల్ మ్యూజియం వంటివి ఆమెకు పేరు తెచ్చాయి ఇప్పుడీ విమానాశ్రయం తో బాల్యం నుంచి అయోధ్య చేరేవరకు రాముడి జీవిత ప్రయాణాన్ని కలంకారీ పట చిత్ర రాజా రవి వర్మ చిత్రాల ద్వారా తీసుకువచ్చారు దేశవ్యాప్తంగా 100 మంది కళాకారులు […]
డాన్స్ అంటే ప్రాణం
డాన్స్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం ఎంతో కృషి చేసి నృత్యం లో పరిణితి సాధిస్తారు ఎంతోమంది. అట్లా డాన్స్ పట్ల ఎంత ఇష్టం అంటే ఏకధాటిగా ఐదు రోజులు పాటు డాన్స్ చేసే అంత అంటుంది సృష్టి సుదీర్.పదహారేళ్ల వయసున్న సృష్టి నిరవధికంగా 127 గంటలపాటు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ విభాగంలో గిన్నిస్ రికార్డు సాధించింది.
అత్యంత పొడవైన జుట్టు
గిన్నిస్ బుక్ లో ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డు తో తిరగరాస్తుంటారు. అలా కేవలం తన జుట్టు విషయంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కింది స్మితా శ్రీవాస్తవ. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈమె జుట్టు పొడవు 236. 22 సెంటీమీటర్లు అంటే ఏడు అడుగుల 8 అంగుళాలు. అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా రికార్డ్ కెక్కింది స్మితా శ్రీవాస్తవ.
ప్రపంచ రికార్డ్
కొంతమంది పుట్టుకతోనే అరుదైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇదే వాళ్లకి పేరు తెచ్చి పెడుతుంది. వింటానికి తమాషాగా ఉన్నా ఇది సత్యం అందరికీ నోట్లో 32 పళ్లే ఉంటాయి. తమిళ్ అమ్మాయి కల్పన బాలన్ కు 38 దంతాలు ఉన్నాయి. పై దవడకు రెండు అదనపు పళ్ళు కింద దవడకు నాలుగు అదనపు పళ్ళు కల్పనకు ప్రపంచ రికార్డ్ తెచ్చిపెట్టాయి
పుట్టుకతోనే స్పెషల్
చాలామంది పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకతలతో పుడతారు. అదే వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన 16 సంవత్సరాల సిదాక్ దిప్ సింగ్ చాహల్ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు జుట్టు కత్తిరించుకోలేదు అది ఇప్పుడు 146 సెంటీమీటర్ల పొడవు పెరిగింది.ఈ జుట్టుతో గిన్నిస్ బుక్ లో పేరు రికార్డు అయింది.
నడవండి చాలు
ఎప్పుడూ కూర్చోవడం కంటే కదులుతూ నడుస్తూ ఉంటేనే మంచిదంటారు నిపుణులు. ఆ కూర్చునే సమయాన్ని తగ్గించి నిద్రపోయిన మంచిదేనంట లండన్ విశ్వవిద్యాలయం నిపుణులు చేసిన ఈ పరిశోధన తో కదులుతూ ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కూర్చునే సమయంలో ఒక అరగంట నడిచినా నడుము చుట్టూ కొలతతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. కూర్చునే సమయం లో పరుగు బిస్క్ వాక్, మెట్లు ఎక్కడం వంటి పనులు చేయాలని చెబుతున్నారు.
దీపాల వేడుక
మన దేశంలో కార్తీక పౌర్ణమి రోజున నీళ్లలో దీపాలు వదులుతూ పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఆచారాలు ప్రతి దేశం లోనూ ఉన్నాయి వియత్నాంలోని నుయ్ రివర్ లో ప్రతి పౌర్ణమి కి అమ్మాయిలు ప్రత్యేక దుస్తుల్లో తయారై పడవ తీసుకొని నదిలోకి వెళతారు. రాబోయే రోజులు ఆనందంగా గడపాలని కోరుకుంటూ దీపాన్ని వరుసగా నీళ్లలో వదులుతారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సాంప్రదాయ వేడుకలు చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. నిండు పున్నమి వేల వెన్నెల్లో దీపాలు చాలా […]
బిల్కినో కి అండగా
రేవతి లాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫిలిమ్ మేకర్ యాక్టివిస్ట్ కూడా పిల్లల సంక్షేమం కోసం పనిచేసే తార హోమ్స్ అనే ఎన్జీవో కి వ్యవస్థాపక సభ్యురాలు రేవతి ఎన్ డి టివి తెహల్కా వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. 2002 గుజరాత్ లో అల్లర్ల నిందితుల దుశ్చర్యలపై ‘ది అనాటమీ ఆఫ్ హేట్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. సామూహిక అత్యాచారానికి గురైన బిల్కినో భాను విషయంలో కేసు దాఖలా చేసింది రేవతి. అప్పటి నుంచి […]
నిస్సహాయులకు అండ
రూప్ రేఖా వర్మ లక్నో యూనివర్సిటీ మాజీ యాక్టింగ్ వైస్ ఛాన్సలర్,ప్రొఫెసర్ అనేక కీలక పదవుల్లో బాధ్యతలు వహించారు. సామాజిక కార్యకర్త మహిళలపై అత్యాచారాలు మతపరమైన హింస సంఘటనల్లో బాధితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు రూప్ రేఖా వర్మ. వాటిలో ముఖ్యంగా చట్ట వ్యతిరేకత కార్య కలాపాల నివారణ చట్టం (ఉపా) తో 2020 లో అరెస్టయిన జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కోసం ఆమె చేసిన పోరాటం ఎనలేనిది లాంగ్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పనిచేసే […]
మూడు లక్షల మందికి పాఠాలు
యశోద లోధి ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది ప్రభుత్వ పాఠశాలలో హిందీ మధ్యమంగా చదువుకున్నది ఇంగ్లీష్ పైన పట్టు సాధించి డిగ్రీ పూర్తి చేసింది.పెళ్లయ్యాక భర్తకు ప్రమాదం జరిగి కష్టాలు వచ్చాయి దాంతో కూలి పనులకు వెళ్లే యశోద నెమ్మదిగా 2021 లో ఇంగ్లీష్ విత్ దేహతి మేడమ్ గా యూట్యూబ్ లోకి వచ్చింది. తేలికైన ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పే యశోదకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెటెక్స్ జోష్ టాక్ […]
ఇంగ్లీష్ విత్ మెర్లిన్
ఇంగ్లీష్ విత్ మెర్లిన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ నేర్పుతారు 80 ఏళ్ల మెర్లిన్ పుట్టింది మయన్మార్. బాగా చదువుకొని పిల్లలకు మ్యాథ్స్,ఇంగ్లీష్ పాఠాలు చెప్పేది. పెళ్లయ్యాక చెన్నైలో స్థిరపడిన తర్వాత అయినవాళ్లు ఒకరి తరువాత ఒకరు చనిపోవడంతో ఒంటరై 80 ఏళ్ల వయసులో భిక్షాటన మొదలుపెట్టింది.ఈమె గురించి విని వృద్ధాశ్రమంలో చేర్చాడు ఒక కుర్రాడు. ఆమె కథ నెట్ లో అయింది. ఎంతోమంది మాకు ఇంగ్లీష్ నేర్పు అని అడిగారు. ఇప్పుడామె రోజువారి కార్యకలాపాల గురించి సులువుగా […]
బలే వ్యాపారం
పుట్టినరోజులు పెళ్లి రోజుల కోసం చక్కని కానుక అనిపించేంత అందంగా ఉంటాయి అదితి ఖండేల్వాల్ పెంచే ట్రే గార్డెన్స్. ఈమె సొంత ఊరు జైపూర్ ఎం బి ఏ చదివింది. ఆమెకు అలంకరణ మొక్కలంటే ఇష్టం చిన్నచిన్న పళ్ళేలలో రకరకాల అలంకరణ మొక్కల్ని పెంచి వాటిని అమ్మడం మొదలు పెట్టింది. వాటికి ఎంతో ఆదరణ ఉండటంతో ఫ్లోరా ఫ్రెంజ్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసింది.ఈ ట్రే గార్డెన్ లకు ఎంతో గిరాకీ ఉంది.
సైక్లింగ్ తో హెల్త్
ఫిట్ నెస్ కు దగ్గర దారి సైక్లింగ్ అంటున్నారు ఎక్సపర్ట్స్. బరువును తగ్గించి రిఫ్రెష్ ఒత్తిడి ఆందోళనలను దగ్గరకు రానివ్వదు అని చెబుతున్నారు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టాటిక్ సైకిల్ అంటే జిమ్ ల్లో ఉండే కదలని సైకిల్ తొక్కాలి మధుమేహం ఉంటే సైకిల్ తొక్కాలి అనుకుంటే ఎక్కువ నీళ్లు తాగాలి. సైక్లింగ్ వల్ల కాళ్ళ పిక్కలు తొడలు పిరుదులు చక్కటి ఆకృతి సంతరించుకుంటాయి. చలికాలంలో పట్టుకు పోయే కండరాల కీళ్లు కదలవ్వాలంటే సైక్లింగ్ చేయాలి.
