శ్రద్ధగా ఉతకాలి
ఇంట్లో పసి పిల్లలుంటే పిల్లలకు పెట్టే భోజనం ,రాసే క్రీమ్స్ ,ఆయిల్స్ బట్టలపైన మరకలు పడతాయి. బేబీ ఫుడ్ పడి మరకలు పడ్డ వస్త్రాలు చల్లని నీటిలో పావుగంట సేపు ఉంచాలి. నీరు ఆల్కహాల్ సమపాళ్ళలో తీసుకొని మరకలపై రబ్ చేయాలి. దీనితో మరకపోతుంది లేదా వైట్ వెనిగర్ నీరు సమపాళ్ళలో తీసుకొని ఆ మరకలు పడ్డ చోట తడిపి నానబెట్టి వాష్ చేయాలి. బేబీ ఆయిల్స్ ,క్రీమ్స్ పైన టాల్కం పౌడర్ చల్లితే బట్టలపైన నూనె […]
కేన్సర్ తగ్గుతుంది
ఛత్తీస్‌గఢ్‌లో లో పండే ‘లైచా’ రకం బియ్యానికి కేన్సర్ ని నయం చేసే గుణం ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కేన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులు ,రోమ్ము కేన్సర్ సమర్థవంతంగా తగ్గించుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో మంచి కణాలకు ఎలాంటి హానీ కలగదని చెపుతున్నారు ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం జరిపిన ఈ పరిశోధనలో ‘గత్వాన్’, ‘మహారాజి’, ‘లైచా’ ఈ మూడు రకాల బియ్యాన్ని పరిశోధనలోకి తీసుకొని జరిపిన పరిశోధనల్లో ‘లైచా’ ఎక్కువ […]
అందరికీ కంఫర్టే
కాటన్ తో తయారైన సఫారీ జాకెట్లు సమ్మర్ లో కూడా ఉపయోగమే. ఇవి హవర్ గ్లాస్ ఆకృతిని హైలైట్స్ చేస్తాయి. సన్నగా ఉండే వారికి చక్కగా నప్పే డ్రెస్ వెరైటీ ఇది. శారీరక ఆకృతిని అనుసరించి బెల్ట్ ఎడ్జెస్ట్ చేసుకోవాలి. కోట్స్ జాకెట్స్ కూడా స్త్రీలకు మంచి ఎంపికే. ఫిట్ గా కంఫర్ట్ గా ఉండే ఈ సఫారీలు జాగింగ్ కు వెళ్ళినప్పుడు లాంగ్ పాకెట్స్ తో చాలా ఉపయోగపడతాయి. అయితే వీటి కింద వేసుకొనే టీషర్టులు […]
వయసు కారణం
ఇంట్లోనూ,ఆఫీస్ లో ఈ ఎండ వేళ ఎ.సి ఆన్ చేసే విషయంలో పెద్ద వాళ్ళతో సమస్య వస్తుంది. పెద్దవాళ్ళు అంత వేడిని ,చల్లదనాన్ని ఓర్చుకోలేమంటారు. ఒక వయసు దాటాక ఉష్ణోగ్రతకు సులువుగా గురవుతారు. కాస్త వేడికి ,చలికి కూడా అసాధారణంగా రియాక్టు అవుతుంటారు. పెద్దవాళ్ళంతా ఇంతే అని నిర్ణయానికి రావద్దు . చిన్న వాళ్ళకంటే టెంపరేచర్ల ప్రభావానికి ఎక్కువ గురవుతుంటారు. వయస్సు వినికిడిని, దృష్టిని, రుచిని, వాసనను, స్పర్శను ప్రభావితం చేస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్య […]
పచ్చదనంతో మేధోవికాసం
మనిషికి ప్రకృతికి మధ్యన సంబంధం విడదీయలేనిది. పచ్చదనంతో ఉండే పరిసరాలు ,పారే సెలయేళ్ళతో మనిషికి జీవన కాలబంధం. ఈ మధ్య జరిగిన పరిశోధనలు ప్రకృతికి పిల్లల మేధస్సుకీ దగ్గర సంబంధం ఉంటుందని తేల్చారు. స్పెయిన్ అధ్యయనకారులు చిన్న పిల్లలను ఎక్కువసేపు పచ్చదనంలో గడపనిస్తే వారి మెదడు ఆరోగ్యంగా ఎదగటమే కాకుండా , నేర్చుకొనే శక్తి రెట్టింపు అవుతుందంటున్నారు. భవిష్యత్ లో వారెన్నో విజయాలు సాధించేందుకు ప్రకృతికి సన్నిహితంగా వారిని గడపనివ్వమంటున్నారు.
రాత్రిళ్ళూ తినవచ్చు
పగలంతా ఎడతెరిపి లేని పని, ఇటు ఇల్లు, ఉద్యోగంతో ఆడవాళ్ళకు భోజనం చేయటం కుదరక పోవచ్చు . ఒక్కొసారి రాత్రి వేళ ఆకలనిపిస్తే తినకూడదని ఊరుకొంటు ఉంటారు. రాత్రి వేళ ఆకలేస్తే హాయిగా తినవచ్చు. మన శరీరం 24 గంటల గడియారానికి అనుసంధానమై ఉంటుంది. రోజు పూర్తైయ్యేసరికి చాలా భాగం కాలరీలు ఖర్చైపోతాయి. రాత్రి వేళ ఆకలనిపిస్తే పాలు,పండ్లు ,నట్స్ ,పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు తీసుకోవచ్చును. చీజ్ మంచిది కూడా దీనిలోని ప్రోటీన్ అధికంగా ఉండి […]
నక్షత్రంలా మెరుస్తుంది
రత్నాల్లో స్టార్ స్టోన్స్ చాలా అరుదుగా దొరుకుతాయి ముఖ్యంగా నక్షత్ర కెంపులు… గనుల్లో తవ్వేప్పుడు వంద కెంపులు దొరికితే అందులో రెండో మూడో నక్షత్ర కెంపులు అవుతాయి. ఇంత అరుదైనవి అందరికీ దొరకాలికదా. ఈ మధ్య కాలంలో సహజ జాతి రత్నాల్లోకి టైటానియం డయాక్సైడ్ చొప్పించి స్టార్ స్టోన్స్ తయారు చేస్తున్నారు. సహజ నక్షత్ర కెంపులు కాకపోయినా ఇవీ చక్కగానే ఉంటాయి. ఈ కృత్రిమ రత్నాల నగలు పొదిగిన చెవి దిమ్మలు, బ్రాస్ లెట్స్,లాకెట్లు ఆన్ లైన్లో […]
క్లీనింగ్ ముఖ్యం
వంట విషయంలో ఎంతో భద్రంగా ఉంటారు సరే కాని వంట ఇల్లు పరిశుభ్రత విషయంలో శుభ్రత పాటించకపోతే అనారోగ్యమే. చేతులు కడగటం ఒకటే వంటగదిలో బ్యాక్టిరియా, మలినాలు తొలగించదు. డిష్ క్లాత్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజు పని పూర్తి చేశాక వేడి నీటిలో ఉతకాలి. మాంసాహారం వండుతుంటే పాత్రలో చాక్ లు, ఫోర్క్ లు బాగా నీటిలో కడగాలి. వేడి సబ్బు నీటిలో కడిగితేనే ఇన్ఫెక్షన్లు ఉండవు. ఇక కటింగ్ […]
ఇక మొదలు
వేసవిలో హాయిగా ఆహ్లాదంగా ఉండాలంటే కొన్ని ఇంటిచిట్కాలు చక్కటి పరిష్కారం. ఈ సీజన్ వస్తూనే కర్బూజా,పుచ్చకాయ వంటి వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది కనుక ఈ పండ్లు తింటే అతి దాహం ఉండదు. పెరుగు,తేనె, పండ్లు కలిపి తింటే దాహాం తీరుతుంది. కర్భూజా పండ్ల ముక్కల పై కొంత ఉప్పు చల్లి తింటే శరీరంలో కోల్పోయిన లవణాలు భర్తీ అవుతాయి. కొబ్బరి నీళ్ళు, అలాగే రాగి మాల్ట్ ఎంతో మంచిది. రాగి మల్ట్ లో నిమ్మరసం, ఉప్పు […]
పోషకాలతో నిద్ర
జీవితంలో నిద్ర అంతర్భాగం, ఇది నేరుగా పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందుకు ఎన్నో పోషకాలు సహకరిస్తాయి. మెగ్నీషియం చాలా ముఖ్యమైన పోషకం గింజలు, నట్స్ , క్యారెట్స్, చిలకడ దుంపలు, ఆకు కురలు, చేపలు, పూర్తి స్థాయి ధాన్యాలు, డార్క్ చాక్లేట్లు, అరటిపండ్లు మెగ్నీషియంకు ఆధారం. పెరుగు,కీరా ,ఓట్స్ ,చేపలు పోటాషియంకు ఆధారం. కాల్షియం శరీరానికి విశ్రాంతి ఇవ్వగల అతి ముఖ్యమైన పోషకం. ప్రోటీన్లు నిద్ర క్వాలిటీని పెంచుతాయి. […]
శక్తినిచ్చే బార్లీ
బార్లీ అంటే అదేదో అనారోగ్య ఔషధంలా మొహం పెడతారు. కాని బార్లీ ఎంతో శక్తినిచ్చేది, త్వరగా అరిగిపోయే ఆహారం కూడా. ఇది లో ఫ్యాటీ డైట్ గా చెపుతారు డిటీషియన్స్. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ప్రీ డయాబెటిక్ స్థాయికి వెళ్లిన గ్లూకోజ్ నిల్వలను సాధారణ స్థాయికి తీసుకురాగలుగుతుంది. మధుమేహంతో బాధపడే వాళ్ళు బార్లీని ఆహారంలో తీసుకోమంటారు డాక్టర్లు. బార్లీలో ఉండే ప్రత్యేకమైన పీచు పదార్ధం బార్లీని శుద్ది చేసినా అలగే ఉంటుంది. బార్లీ జావలో కూరగాయల […]
అన్నీ అపోహలే
వ్యయామానికి అలవాటుపడదాం అనుకునే వాళ్ళకు చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. మధ్యలో ఆపేస్తే వాళ్ళు పెరిగిపోతారని అయితే అది నిజంగా అపోహే. వ్యయామం మనేసినంత మాత్రానా బరువు పెరిగిపోవటం అపోహ. తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వుంటే వోళ్ళు పెరిగిపోతుంది. వ్యయామం చేస్తూ తగినంత భోజనం చేసేవాళ్ళు వ్యయామం ఆపేశాక అదనపు భోజనం ఆపేయాలి. అలగే గంటల తరబడి వ్యయామం చేస్తేనే లాభం ఉంటుందనుకుంటే పొరపాటే. సమయం దోరకటం కోసం ఆలోచించాలి. పదేసి నిమిషాలపాటు […]
చూసి ఊరుకోండి
వంటల తయారీ చానల్స్ చూడటం చాలా మందికి ఇష్టం, కొత్త రుచుల కోసం వెతికే వాళ్ళే వీళ్ళు. అయితే చానల్స్ చూడటం కళ్ళకు విందే కాని నడుము కొలతలు మాత్రం మారిపోతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఊరించి చూస్తే నాలుక ఆరుచి కోరుకుంటుంది. ఎక్స్ పర్మెంట్ పేరుతో ఆవంట వంటింట్లోకి ఆ పైన కడుపులోకి పోతుంది. ఇదే కొంప ముంచేస్తుంది అంటున్నారు నిపుణులు. పదర్దాల తయారీ విధానాన్ని నోట్ చేసుకుని ఎప్పుడైన ఫ్రెండ్స్ ,బంధువుల కోసం […]
ఇందుకే ఆలస్యం
స్త్రీ, పురుషుల్లో ఆసక్తుల గురించి చేసిన సర్వేలో ఒక చిత్రమైన విషయం తెలిసింది. ఒక అమెరికా సంస్థ చేసిన సర్వేలో స్త్రీలకు షాపింగ్ లో ఉండే ఓపిక ఇంకో విషయంలో ఉండదు, అదే పురుషులు క్రీడల పై చూపిన ఆసక్తి షాపింగ్ పైన చూపించరు. పైగా షాప్ లో అడుగుపెట్టిన 29 నిమిషాల్లో ఏం కొనాలో నిర్ణయించుకుంటారని తేలింది. క్వాలిటీ చూస్తారు కాని కలర్స్ చూడరు. పైగా రెండో సారి వచ్చి చూద్దాం అనుకోకుండా ఆ పనిని […]
బీర్ తో కాలేయ ముప్పు
ఇప్పుడు టీనేజర్స్ కుడా అదో ఫ్యాషన్ లా బీర్ తాగుతున్నారు. ఒక పరిశోధన కోసం టీనేజ్ లో బీర్ తాగే అలవాటున్న వాళ్ళని నలభై వేల మందిని సెలక్ట్ చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పరిశోధన సాగింది. అందరికి మధ్య వయసు వచ్చేసరికి వెయ్యిలో 383 మందికి కాలేయ సమస్యలు వచ్చాయి, కొందరికి 39 ఏళ్లకే కాలేయం చెడిపోయింది. సిరోసిస్ వచ్చిన వారు కాలేయం పని చేయక చనిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. ఈ […]
జ్ణాపక శక్తిని పెంచే పసుపు
తాజా పరిశోధనల్లో మనిషి మూడ్ మార్చగలిగే శక్తి పసుపులో ఉందని తేల్చారు పరిశోధకులు. పసుపులో కిర్క్ మన్ అనే మూలకానికి యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దినీ ప్రభావం జ్ణాపకశక్తి ఇబ్బందులు మొదలవుతున్న వారి పైన ఎలా ఉంటుంది అనే విషయం పై పరిశోధన జరిగింది. రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున 18 నెలలపాటు పసుపును ఆహరంలో భాగంగా ఇచ్చారు. జ్ణాపకశక్తి కి ఇబ్బంది కలిగించే అల్జీమర్స్ సంబంధం ఉన్న ప్రోటీన్ స్థాయిని గమనిస్తే పసుపు తీసుకున్న […]
నడుం కొలత చూసుకోండి
నూటికి 90 మందికి శరీరం ఫీట్ గా ఉంటేనే ఇష్టం. ఎన్నో వ్యయామాలు చేసి తినే పదర్ధాలు పైన ఆంక్షలు పెట్టుకుని శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని చూస్తారు. కాని ఫిట్ గా ఉండటం ఏమిటి? ఎలా తెలుస్తుంది అంటే దానికి ఏ టెస్ట్ అవసరం లేదు. అద్దం ముందు నిలబడి నడుం చుట్టు కొలత చూసుకుంటే అది చేతికి పట్టుకుంటే అందేలా ఉంటే ఓకే, పెరిగి వేలడుతుంటే ఫిట్ గా లేనట్లే , దాని వల్ల […]
కలర్ పుల్ బ్రెడ్స్
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ,ముడి ధాన్యాలు ,చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్ ల వాడకం మనకు తెలిసిందే. ఇప్పుడు బ్రెడ్ లో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండేలా రంగుల కాయగూరలను ,పండ్లనీ జోడించి తయారు చేస్తున్నారు సింగపూర్ కు చెందిన నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు .నల్ల ద్రాక్ష, నల్ల బియ్యం ,బ్లూ బెర్రీలు,వంగరంగు చిలకడ దుంపలు,ఊదరాంగు కాలీఫ్లవర్లు కలిపి వాటి నుంచి కలర్ ఆంథోసైనిన్లను వెలికి తీసి వాటితో కలర్ బ్రెడ్ తయారు […]
డిజైనర్ జడలు
ఇది వరకు పూలజడ అంటేనే మల్లేపూలు లేదా నక్షత్ర చామంతులతో జడ కుట్టే వాళ్ళు. ఘుమఘుమలాడి పోయోలా మొగలి రేకులు పూవ్వులతో అలంకారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ జడలు నేసే వాళ్ళు ఎక్కడున్నారు. హెయిర్ స్టైయిలిస్టులే జడ కుట్టాలి. పూల జడల్లో మల్లెలు, గులాబీ, కనకాంబరాలు కాకుండా నారింజ పసుపు గులాబీ పీచు రంగుల్లో వచ్చే ఆర్కిడ్స్ తో డిజైన్ చేసిన జడలు లేటెస్ట్ ఫ్యాషన్. ముత్యాలు రాళ్ళు పెట్టి అందంగా డిజైన్ చేసిన ఆర్కిడ్స్ తో […]
మెట్లెక్కండి
ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల కలిగే అన్నీరకాల లాభాలు మెట్లు ఎక్కడం వల్ల కూడా కలుగుతాయి . కండరాలు బలపడతాయి. కీళ్ళ ఇబ్బందులు తగ్గిపోతాయి. సాధారణంగా ఇక ఎండలొస్తుంటే గ్రౌండ్ వరకు నడిచి వెళ్ళడం లేదా ఒక్కొసారి వాకింగ్ చేయాలనిపిస్తే చిరాగ్గా ఉంటుంది.ఇక అప్పుడు మెట్లు ఎక్కి దిగే ఎక్సర్ సైజ్ లు మొదలు పెట్టండి హైబీపీ కూడా పనిలో పనిగా తగ్గిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలు మోనోపాజ్ వయసుకు వచ్చే ముందరే మెట్లు ఎక్కిదిగటం […]
