Friday, 31 Jul, 2026

వ్యాపారం మొదలెట్టండి

రోజు సరదాగా చూసే ఫేస్ బుక్ ,వాట్సాప్ ,ట్విట్టర్ లో ఎంతో చక్కగా ఒక వ్యాపారాన్ని మార్కెట్ చేస్తాయి. ఈ మద్య కాలంలో ప్రతి బిజినెస్ కు సోషల్ మీడియానే వేదిక అవుతుంది. మనలో చాలా మందికి ఎన్నో కళలపైన ఇష్టం అందులో ప్రావీణ్యత ఉంటుంది. వంటలు,డ్రెస్ డిజైనింగ్ కొన్ని వస్తువులు అమ్మటం పెయింటింగ్స్, చేత్తో చేసిన బొమ్మల అమ్మటం మొదలైనవి ఇక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి అందులోంచి అమ్మకాలు ప్రారంభం చేయవచ్చు. మన […]

జుట్టు వత్తుగా

జుట్టు వత్తుగా పెరగాలని ,ఆరోగ్యంగా మిలమిల లాడి పోతూ కనిపించాలని అందరికీ కోరికే. ఖరీదైన హెయిర్ ఆయిల్స్ ని మించినవి కొబ్బరి పాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి పాలలో సమృద్దిగా ఉండే నియాసిన్ ఫాలెట్లు వంటివి మాడుపైన రక్త ప్రసారాన్నిపెంచుతాయి. విటమిన్ ఇ వంటి కొవ్వులు జుట్టు పాడవ్వకుండా కండీషనర్ గా పనిచేస్తాయి. కొబ్బరిని మొత్తగా రుబ్బి గట్టిగా పిండి చిక్కని పాలు తీసుకోవాలి. వాటిని అప్పటికప్పుడు జుట్టుకు పట్టించి ఓ గంటసేపు అలా వదిలేసి […]

అందాన్నిచ్చే నూనెలు

మనకు ఇప్పటి వరకు కొన్ని రకాల వంట నూనెలు ,సువాసనల నూనెలు తెలుసు. కొత్తగా కొన్నీ వంటలకు ,సౌందర్య పోషణకు పనికి వచ్చే నూనెలు వస్తున్నాయి. గుమ్మడి గింజల నూనె మోనోపాజ్ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మొక్క జోన్న నూనె తలకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు , వంటికి రాసుకుంటే చర్మానికి అందం . అలాగే జీడిపప్పు నూనె చర్మం ముడతలు పడనీయదు. సలాడ్స్ పైన చల్లుకొని తింటే రుచి . ద్రాక్ష గింజల నూనె […]

నాలుగడుగులు వేస్తే

నడక ఎంత వేగంగా ఉంటే అంత మంచిది అంటున్నారు పరిశోధకులు. మామూలుగా నడిచే కంటే బాగా స్పీడుగా నడిచే వాళ్లు ఎక్కువ ఆయుష్షుతో ఉంటారంటున్నారు .ఈ వేగం ఫిట్ నెస్ పైన ఆరోగ్యంపైన ఆధారపడుతుంది.నడక బరువును నియంత్రిస్తుంది.మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది.శరీరంలో కోవ్వు శాతం తగ్గిస్తుంది.రక్తసోటు నియంత్రిస్తుంది .ఎముకలు గట్టిపడతాయి. కండరాలు సమతూలంగా ఉంటాయి .చెమటలు పట్టేంత స్ఠాయిలో నడిస్తే దాన్ని వేగంగా నడుస్తున్నారు అనవచ్చు.

ఉల్లి కాడలు

ఉల్లిపాయలు లేకపోతే ఏ కూరకు రుచిరాదు. ఉల్లి కాడలు కూడా కూరల్లో వేస్తే అంత రుచి గాను ఉంటాయి. ఉల్లి కాడల్లో ఉండే అలిసిన్ చర్మానికి ఎంతో మంచింది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా కాపాడుతోంది. వీటిలో ఉండే కెరోటనాయిడ్స్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. జలుబు వల్ల తలెత్తే నిమ్ము తగ్గిస్తాయి. ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకొంటాయి. ఉల్లి కాడల్లోని యాంటీ ఆక్సీడెంట్లు ,విటమిన్ సి ,కె ,యాంటిబాక్టిరీయల్ యాంటి ఫంగస్ సుగుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు […]

అద్దెకు ఫ్యాషన్ వేర్

అద్దె కు అందమైన ఖరీదైనా గౌన్లు కావాలా? హైద్రాబాద్ లో fly robe gownes on rent in hyderabad లో ఆన్ లైన్ లో ఆర్డరివ్వచ్చు బ్రాండెడ్ ,డిజైనర్ ఎంతో ఖరీదైనా వైనా రీతు కుమార్ ఆర్మాని, సవ్యసాచి ,మనీష్ మల్హోత్రా ఎవరి ఫ్యాషన్ వేర్ అయినా సరే కొనుక్కోనవసరం లేకుండా అద్దెకు తెచ్చుకోవచ్చు. ఎన్నో అన్ లైన్ స్టోర్స్ ఉన్నాయి. బాంబే ,ఢిల్లీ ,కలకత్తా ఎక్కడైనా సరే కోత్త కలక్షన్స్ ని వినియోగదారులకు అందిచటంలో […]

పొడవే అందం

పొడుగ్గా వేలాడే బుట్టలు ఎప్పడు అందంగా ఉండేవి. కానీ ఆ బుట్టలు బరువైన దిద్దులు పోయి లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. పొడుగ్గా చెతులకు వేలాడుతూ లేటెస్ట్ సూపర్ లాంగ్ ఇయర్ రింగ్స్ ,ఇయర్ కఫ్ ,ఇయర్ రింగ్ డిజైన్లు వచ్చాయి. బంగారం వజ్రాలతో మెరిసే ఈ సన్నని తీగల్లాంటి లోలాకులు చాలా అందంగా ఫ్యాషన్ గా ఉన్నాయి. ట్రెడిషనల్ ఇండియన్ జుంకీలను ఇవి వెనక్కు నెట్టేశాయి.

దానికీ ఓ పద్ధతి

నీళ్ళే కదా అని ఎలాపడితే అలా తాగకూడదు అంటున్నారు డాక్టర్స్. తాగేందుకు పద్ధతులు ఉన్నాయి. ఒకే సారీ నోట్లో ఎత్తి పోసుకొని తాగకూడదు. కొద్దీ కొద్దీగా తాగుతూ మధ్యలో శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా కూర్చోని తాగాలి. నిలబడి ,నడుస్తూ హాడవుడిగా తాగవద్దు. నిద్ర లేవగానే గోరు వెచ్చని నీళ్ళు తాగాలి కొంత మంది ఎప్పుడు చల్లని ఫ్రిజ్ నీళ్ళే తాగు తారు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి తప్ప మేలు చేయవు .అతి శీతలమైన పానీయాలు తాగితే […]

ఫ్లవరింగ్ టీ

వేడి నీళ్ళలో ఓ చిన్న మొగ్గవేస్తే అది కాస్తా కాసేపటికీ పువ్వులా విచ్చుకొంటే ,ఆ పూవుతో కాచిన టీ ఎంతో బావుంటే చామంతి,మల్లే ,గులాబీ పూవుల వాసనలోస్తే అది బ్లూమింగ్ టీ .తేయాకు తోటల నుంచి ఒకే సైజ్ ఆకులను తెచ్చి వాటిని చామంతి ,మల్లే ,గులాబీ పూవులను మాలలుగా కట్టి , అధిక ఉష్టోగ్రత వద్ద ఎండబెట్టి ,దానికీ దానిమ్మ ,ఫైనాపిల్ ,బ్లూ బెర్రీ వంటి పండ్ల రుచులను కలిపి ఎండి పోయిన మొగ్గలా చేస్తారు.ఇది […]

ఒక్క పాట చాలు

రెహమాన్ ఇండియా మ్యూజీషియన్ మాత్రమే కాదు గ్లోబల్ ఫిగర్ .ఆయనతో కలిసి పాడాలని వర్క్ చేయాలని ఉంది అంటోంది సెలీనా గోమేజ్ .పాతికేళ్ళకే పాప్ సంగీతంలో పాపులారీటీ అయినా హాలీవుడ్ పాప్ సింగర్ . ఈమెకు ఇండియాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం . ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను ఇండిన్ మ్యూజిక్ రెగ్యూలర్ గా ఫాలో అవుతాను .ఏఆర్ రెహమాన్ చాలా గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు.ఆయనతో కలిసి ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే […]

పాపం ఆకలేమో

ఐదారు నెలలు దాటిన పసి పిల్లలు ఊరికూరికే లేచి అమ్మను నిద్ర లేకుండా చేస్తున్నారు అంటే పాపం వాళ్ళకి కడుపు నిండలేదేమో చూసుకోండి అంటున్నారు డాక్టర్స్. ఆరు నెలలు వస్తుంటే ఘనాహారం పెట్టాలి.పోత పాలు తాగే పిల్లలు అంతకు ముందే కాస్త కాస్తగా ఏ సెరిలాక్ వంటివో అలవాటు చేయాలి. పాలు ,కాస్త ఘనాహారం తిన్న పిల్లలు కడుపునిండిపోయి హాయిగా పడుకొంటారు .మరీ నిద్ర పోకుండా ఏడుస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఆకలేసే అంటారు డాక్టర్లు.

కాస్త తగ్గించండి

ఒక తాజా అధ్యయనం రిపోర్ట్ ఏం చెపుతోంది అంటే మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో ధార్మికత పిల్లల జ్ఞాపక శక్తి పైన దుష్ర్పభావం చూపెడుతోంది. 16 ఏళ్ళ వయసులోని 700 మందిపై ఈ అధ్యయనం చేశారు.కుడి చెవికి దగ్గరగా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ,రేడియో తరంగాల ద్వారా ఏర్పాడే విద్యుదయస్కాంత క్షేత్రం మొదడుకు దగ్గరగా వచ్చి వాళ్ళలో ఫిగరల్ మెమొరీ తగ్గేందుకు కారణం అవుతోందట. ఎన్ని అధ్యయనాలు వచ్చినా ఫోన్ వాడకం కాస్తా తగ్గించమనే […]

అద్భుత సృష్టి

మ్యూరల్ పెయింటింగ్ దక్షిణ భారత దేశంలో ప్రత్యేక కళ. ఇందులో కేరళ మ్యూరల్స్ కి ప్రత్యేక శైలి. ప్రిన్స్ తొన్నక్కల్ కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్ర కారుడు ,ఆయన శిష్యురాళ్లు 35మంది మహాభారతాన్ని కుడ్య చిత్రాలుగా రూపొందించారు. ముందుగా మహాభారత ఘట్టాలను సహజమైన పంచవర్ణ రంగులతో చిత్రించి మొత్తం మహాభారతాన్ని మ్యూరల్ థీమ్ గా తీసుకువచ్చేందుకు నాలుగేళ్లు కష్టపడ్డారు. ఈ బృందం 113 కుడ్య చిత్రాలతో మహా భారతాన్ని తీర్చీదిద్దారు.

బాబోయ్ బగ్గులు

దేన్నైనా వద్దంటే ,బాగోలేదంటే ,ఆ మాట చెవిన పడితే చాలు యువతకు ఇంట్రెస్ట్ పుట్టుకురావటానికి ఈగలు,సాలీళ్ళు,మిణుగురులు ,తేనే టీగేలు ,సమస్తమైన పురుగులు,బగ్ ఫ్యాషన్ పేరుతో అమ్మాయిల ఆభరణాలు ,డ్రెస్ లుగా మారిపోతున్నాయి. బ్యాగులు,డ్రెస్ లపైన అన్నీ రకాల పురుగులు అతుక్కుని బాబోయ్ ఫ్యాషన్ అంటే ఇదా అనిపిస్తున్నాయి. పురుగుల్నీ ,నగలుగా మలిచిన ఫ్యాషన్ మంత్రం మాత్రం అమ్మాయిల హాట్ ఫేవరేట్ అయిపోయింది.

సంచీల్లో మొక్కలు

పర్యావరణం ,పచ్చదనం కాన్సెప్ట్ అందిరికీ చేరినట్లే వీధులూ,ఇళ్ళు పచ్చ పచ్చగా పూలు ,చెట్లతో కళకళలాడుతున్నాయి. చోటు లేదనుకోకుండా ఉన్నా ఇరుకు వాకిట్లోనే రెండు మొక్కలు పెంచాలంటే గ్రో బ్యాగ్స్ కొనుక్కోవచ్చు. రీసైక్లింగ్ చేసిన పలుచని ప్లాస్టిక్ దారాలకు మందంగా ఉన్నా మామూలు దారాలు కలిపి ఈ గ్రో బ్యాగ్స్ చేస్తారు. ఈ సంచి కుండీల్లో రంధ్రాలు ,చక్కగా గాలీ నీరు,వెలుగు మొక్కలకు ఇచ్చి అవి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. రంగురంగులా పూలు ,మీనియేచర్ మొక్కలు ,కూరలు అన్నీ […]

ఉపాధినిచ్చిన మట్టికళ

హేమ బాలకృష్ణన్ ఒక సారి అందమైన ఎర్రమట్టితో చేసిన ఒక ఆభరణాన్ని కలర్ ది ఎర్త్ పేరుతో బొటెక్ లో పెట్టారు. ఆ ఆభరణం చక్కగా ఉండటం చూసి చాలా మంది కొనేందుకు వచ్చారు. ఇలాంటి వ్యాపారం విస్తరింపజేస్తే బావుంటుందని చిన్న చిన్న రిటైల్ షాపులు ఏర్పాటు చేసి కలర్ ది ఎర్త్ పేరుతో 2013లో ఇ-కామర్స్ స్టోర్ ఏర్పాటు చేశారు. ఈ కలర్ ది ఎర్త్ ద్వారా టెర్రికోటా కళాకారులు 200మంది ఉపాధి పొందుతున్నారు. ఈ […]

ఎన్నెన్ని వర్ణాలు

లెనిన్ వస్త్ర శ్రేణి లో ఇప్పుడు అందమైన చీరెలు వస్తున్నాయి. ఈ చీరెలు కాస్త ఖరీదు ఎక్కువే కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద పూల ప్రింట్లు,మొఘల్ డిజైన్,డిజిటల్ ప్రింట్స్ ,అందమైన రంగుల కాంబినేషన్స్ తో ,ఎంతో తేలికగా ఉన్నా లెనిన్ చీరెలు ఏ పంక్షన్ కైనా ,రెగ్యూలర్ గా ఆఫీస్ లకు ,పార్టీలకైనా చాలా అందంగా ఉంటాయి. ఆధునికమైన డిజైన్లు అందమైన వర్ణాలు లినెన్ చీరెల ప్రత్యేకత.

పూల జడలు

ఫేస్ బుక్ ద్వారా ప్రమోట్ చేసిన వ్యాపారంకు ఈ పెళ్ళి పూల జడ కాన్సెప్ట్. ఈ ఆన్ లైన్ సంస్థని కల్పనా రాజేష్ నిర్వహిస్తుంది. పూలజడలు కాస్తా ఫ్లోరల్ డేకరేషన్ దాకా ముందుకెళ్ళాయి. 2012లో ప్రారంభం అయిన ఈ వ్యాపారంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా 36 బ్రాంచులలో 200మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తోంది.ఎన్నో ఆర్డర్స్ తో ఈ వ్యాపారం మూడు పూవ్వులు ,ఆరు జడలుగా సాగుతుంది. మంచి ఐడియా వస్తే అది వ్యాపారం అవటం ఎంతసేపు.

కొత్త ప్రయోగం

మహిళల మాల్ . మహిళలే అమ్మేది,కొనేది. కేరళలో ఆగస్ట్ లో ఓనం పండుగా కోసం ప్రారంభం అవుతోంది.కేరళ జనం చేతి వృత్తులు ,హాస్తకళలతో చిన్న చిన్న వృత్తులతో జీవించే మహిళలు కొన్ని పండుగల్లోనే కాస్త ఎక్కువ అమ్మకాలు చేస్తారు. కేరళలో కుటుంబశ్రీ నెట్ వర్క్ పేదరిక నిర్మూలణ లక్ష్యంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కు అనుబంధంగా ఈ మహిళ మాల్ రాబోతుంది. దేశంలోనే ఇది మొదదటి ప్రయోగం కావచ్చు.

సజ్జల్లో శక్తి

ఆరోగ్యపూరితమైన పంథాలో బరువు తగ్గాలి అనుకొంటే నెమ్మదిగా చిరుధాన్యాలు అలవాటు చేసుకోవటం మంచిది. సజ్జలు పోషకాలకు నిలయం. సజ్జలతో చేసిన తియ్యని బూరెలు చాలా బావుంటాయి. సజ్జల్లో ఐరన్ ,మెగ్నిషియం ,పోటాషియం ,కాల్షియం ,కాపర్ జింక్ మాంగనీస్ వంటివి ఉంటాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి.సజ్జలు కండరాలను శక్తి వంతంగా మార్చి ,రక్తంలోని ట్రైగ్లిజరాయిడ్స్ ను తగ్గించి గుండె జబ్బుల్నినివారింస్తుంది. వీటిల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్వవస్థకు మేలు చేస్తాయి. మహిళలల్లో […]