Thursday, 30 Jul, 2026

ఇవే కంఫర్ట్

ఏ సీజన్ అయినా ,పండుగైనా ,కాలేజీకైనా సాయంత్రం షికారైనా జీన్స్ తప్పించి అందంగా సౌకర్యంగా ఉండే డ్రస్ ఇంకొటి కనిపించదు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ వెరైటీలు ఎన్నో వస్తున్నాయి. అమ్మాయిలు మాత్రం వంటికి కాస్త అతుక్కునేలా ఉండే స్కిన్నీ జీన్స్ ను ఇష్టపడుతారు. యాంకిల్స్ పైకి ఉండే సిగరెట్ జీన్స్ కూడా ఫ్యాషనే.నడుము కింద నుంచి పాదాల వరకు ఒకే వెడల్ప్ తో ఉంటాయని మోకళ్ళ పై వరకు టైట్ గా ఉండి అక్కడ నుంచి కాస్త […]

గోరింటా పూసిందీ…

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొంటూ ఉంటారు. చక్కగా ఎర్రగా పండిన గోరింటాకుతో అరచేతులు పువ్వుల్లా ఉంటాయి. మొత్తగా గోరింటాకును రుబ్బుకొనేప్పుడుచింత పండు వేస్తారు. లేదా   రుబ్బేకా నిమ్మరసం పిండుతారు. లేదా పటిక ముక్క ,యూకలిప్టస్ నూనె కలిపినా గోరింటాకు పండితే చాలా ఎర్రగా కనిపిస్తుంది. చేతులు శుభ్రంగా కడుకొని కాస్తా యూకలిప్టస్ ఆయిల్ రాసుకొని మందంగా గోరింటాకు పెట్టుకొని ఓ నాలుగైదు గంటలు ఉంచుకొంటే చేతులు ఎర్రగా పండుతాయి. డిజైన్లు ఎన్నో ఉన్నాయి. మేహాంది డిజైన్లు ఇప్పుడు […]

చీరెకు అందం

చీరెపిన్నుల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చాయి. చక్కగా మడతపెట్టిన చీరెకొంగు భుజంపైన ఉండేందుకు బ్రూచ్ పెట్టుకోనే వాళ్ళు .ఇప్పుడీ బ్రూచ్ల్లో మేలు జాతి వజ్రాలు ,ముత్యాలు కూర్చిన ,డైమండ్స్ తో నింపినవీ ,రెండు బ్రూచ్ లు కలిపి ఒక గొలుసుతో కలినవి ఎన్నో రకాలు డిజైన్ లు వచ్చాయి. ముత్యాలు వజ్రాలు కలిసిన చిన్న బ్రూచ్ లు చక్కని సాదాపట్టుచీరెకు అద్భుతమైన అందం ఇస్తుంది. రెండు పెండెంట్లు కలిపిన బ్రూచ్ అయితే నడుము దగ్గర చీరెలోకి దూరే […]

ఒక్క ఫోన్ కాల్ తో

WooBloo-Your Very Own Personal Assistant అనే ట్యాగ్ లైన్ తో హైదరాబాద్ లో ఒక కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు శిరీషా గొండి. మా యాప్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్స్ ని అందిస్తాం అంటోంది శిరీష .యాప్ లో కాల్ సపోర్ట్ తో సర్వీస్ లు ఉంటాయి కష్టమర్లు ఫోన్ చేస్తే చాలు వెంటనే యాప్ ద్వారా కావాలిసిన సేవలు అందిస్తాం. ఇప్పటిఇకి 8వేల మంది కష్టమర్స్ ఉన్నారు. క్యాబ్స్, మూవీ, ఫుడ్ ,కిరణా సామాను […]

ఆరోగ్య ఫలం

చూసేందుకు ఎర్రగా అందంగా కనిపించే స్ట్రా బెర్రీలు ఆరోగ్యానికి అందానికీ మేలు చేస్తాయి. వీటిలోని యాసిడ్స్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ లు చర్మం పై మృత కణాలు తొలిగించటం తో పాటు మొటిమలు రావటాన్ని నివారిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి తినటం వల్ల చర్మానికి ఆల్ట్రావయేలెట్ కిరణాల నుంచి కూడా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి చర్మానికి బిగుతుగా ఉండే కొలా జెన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇందులో […]

ఫేస్ బుక్ వేదికగా

కాపర్ వస్తువులు ఆమ్మే ఈ కామర్స్ స్టోర్ పూణే నుంచి 2011లో రశ్మి రానడే Seemantini, Sudakshina, Chhanda and Rashmi అనే నలుగురు అమ్మాయిలు ప్రారంభంచారు .ఒక ఫేస్ బుక్ పేజీ ద్వారా దీన్నీ ప్రమోట్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రాగి ,వెండి, బ్రాస్ తో కళాత్మాక వస్తువులు తయారు చేసి కాప్రే స్టోర్ ప్రారంభించారు.ఈ సంప్రదాయ వస్తువులు కొనేందుకు ఇప్పుడు ఎంతోమంది ముందుకొచ్చారు. ఈ కాప్రే ఫేస్ బుక్ పేజీకి వేలాది మంది అభిమానులున్నారు.

చురుకుదనం ఎక్కువే

ఒక అధ్యయనంలో ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళు చాలా చురుగ్గా వేగంగా ఆలోచిస్తారనీ , త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని తేలింది. ఒక వంద మందిపై అధ్యయనం చేశారు .ప్రతి వ్యక్తి ఎదురుగా ఒక బోర్ట్ పైన వేరువేరు అక్షరాలు రాసి జత చేయమని కోరారు. ఇలాంటి పనులకు మన మెదడు గురించి ఎడమ భాగాలు రెంటినీ ఉపయోగించుకొంటుంది. కొన్ని పరికరాలతో వ్యక్తులు అక్షరాలు జత చేయటానికి తీసుకొంటున్న సమయం ,మెదడు లో కలిగే మార్పులు గుర్తిస్తే […]

చెక్కబ్యాగుల అందం

మెర్విన్ బుర్మ చాలా అందమైన ఉడెన్ ఎంబ్రాయిడరీ పర్స్ లు తయారు చేస్తుంది. ఈ బ్యాగ్ ల తయారు కోసం వాల్ నట్ ,జక్ చెక్కలు వాడుతోంది. వీటిపైన వేసిన క్రాస్ స్టిబ్ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చెక్క బ్యాగ్ లు ఆన్ లైన్ లో అమె జాన్ ,ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇస్తాంబుల్ కి చెందిన మెర్విన్ బుర్మ చేసిన ఈ అరచేతిలో ఇమిడి పోయే క్లాబ్ పర్స్ ఫ్యాషన్ […]

తేలికైన ఆభరణాలు

బంగారు నగలంటే అందరికీ ఇష్టమే .కానీ రోటిన్ గా ,దుద్దులు ,గొలుసులు బోర్ కోడితే ఫిలిగ్రీ జ్యూవెలరీ ఎంచుకొవచ్చు. లోలకులు బ్రాస్ లెట్స్ గొలుసులు ఎంతో ప్రత్యేకమైన డిజైన్ లతో చిన్న ఆకుల కంటే పల్చగా ఫిలిగ్రీ నగలు అందంగా ఉంటాయి. లీఫ్ ఇయర్ రింగ్స్ చూస్తే అచ్చంగా కొమ్మకి కోసిన ఆకులంత పల్చగా ,లైట్ వెయిట్ పిలిగ్రీ లీఫ్ లైనర్ షార్ట్ నెక్లెస్ మరింత చక్కగా ఉంది. బరువైన ఆభరణాల కంటే తేలికగా ముద్దుగా ఫిలిగ్రీ […]

బాధా నివారిణి

మందులు లేకుండా వ్యాయామం ,కాపటం పెట్టటం మర్ధన లాంటిదే ఫిజియోథెరపీ కూడా .మందులు ఇతర రకాలైన చికిత్సలు తీసుకొంటూనే ఫిజియోథెరపీని సమంతరంగా చేయించాలని చెపుతోంది ఆధునిక వైద్యం . దీర్ఘకాల నొప్పులు ,బాధాలకు గురైయ్యే వారికి ఫిజియోథెరపిస్టులు బాధ నివారిణి వ్యయామాలు ద్వారా బాధ కలిగించే భాగంపైన ప్రత్యేక దృష్టి తో స్క్రబ్బింగ్ చేయిస్తారు. కాలు ,చెయ్యి మోచేయి వంటి భాగాల నొప్పులకు ఏభాగం ఎలా కదిలించాలి ఎంత తరుచుగా చేయాలి అన్నది ఫిజియూథెరపిస్ట్ నిర్ణయిస్తారు. గుండె […]

కాఫీతో శక్తి

కాఫీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు కొత్త కొత్త విషయాలు చెపుతున్నారు కానీ అసలు తాగ వల్సింది బ్లాక్ కాఫీ.చక్కెర ,పాలు కలపని బ్లాక్ కాఫీనే మెగ్నిషియం,పోటాషియం శరీరంలో ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగపెట్టుకొనేలా చేస్తాయి. ఈ కాఫీ తాగి తే ఏక గ్రత కుదురుతుంది. కాఫీ తాగితే వ్యాయామాలు చాలా శక్తి వంతంగా చేయగలుతారు. కాఫీ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని రక్షిస్తాయి.కుంగుబాటు తగ్గిస్తుంది.అల్జీమర్స్ ప్రమాదం తగ్గిస్తుంది, మూడు […]

ఇంతకు మించింది లేదు

డ్రై,సెన్సిటివ్ చర్మం కోసం కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ వాడితే లాభం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చల్లని వాతావరణంలో నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ పెస్ట్ ఆయిల్ అంటారు. ఈ నూనెలో ట్రాన్ ఫ్యాట్స్ ఉండాలి. రసాయనాలు ఉపయోగించదు. క్లిష్టమైన పద్దతుల్లో ఈ నూనె తీయటం వల్ల నాణ్యత ఉంటుంది. సహాజసిద్దమైన పోషకాలు ,యాంటీ ఆక్సిడెంట్స్ ,సువాసనలు ఈనూనెల్లో పుష్కలంగా ఉంటాయి. కోల్డ్ పెస్ట్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతలు మేలు చేస్తుంది.యాంటిఆక్సిడెంట్లు […]

ముఖంపై మెరుపులు

చక్కని చర్మం రంగు ,ముక్కు మొహం అందంగా ఉన్నా చుట్టు ఉంటే వాతావరణ కాలుష్యానికి చర్మం మెరుపు పోయి మొటిమలు ,మచ్చలతో కాంతి లేకుండా తయారవుతుంది. ఒక్కసారి ఖరీదైన ఫేస్ ప్యాక్ లు కూడా ఫలితం చూపెట్టకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే సహాజమైన వస్తువులతో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ ఎంతో మంచి ఫలితం ఇవ్వగలుగుతోంది. కీర దోస ,శనగ పిండి నిమ్మ రసం పెరుగు పసుపు తేనే కలిపి మొత్తగా ఫేస్ట్ లాగా చేయాలి. చల్లని […]

జాగ్రత్త

సోషల్ మీడియాలో చాలా సార్లు ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ లు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఫేస్ బుక్ లో కూడా చాలా మంది మొహలు ఉండవు.వాళ్ళు స్త్రీలో పురుషులో అర్ధం చేసుకోవడం చాలా కష్టం.వీటి కంటే ప్రమాదం డీప్ ఫేక్ వీడియోలు. పోర్న్ స్టార్ శరీరాలను సెలబ్రిటీల మొహలకు తగిలించి ఈ వీడియోలు తయారు చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్ వేర్లతో చాలా సులువుగా వీటిని రూపొందిస్తున్నారు. వ్యక్తులకు అవమానం కలిగించే ఈ నేరాలు హింస,బ్లాక్ మెయిల్, […]

పోనీ కాఫీ గా తాగండి

బ్రూకోలీ పోషకాలకు పెట్టింది పేరు. చాలామందికి ఈ బ్రకోలి తినటం నచ్చదు. పోనీ బ్రకోలి  కాఫీ తాగండి దీనివల్ల తప్పకుండా బరువు తగ్గుతారు అంటారు డాక్టర్లు. బ్రకోలి బాగా ఎండబెట్టి పొడి చేసి సీసాలో పోసి పెట్టుకుని ఉదయాన్నే తాగా కాఫీలో ఈ పొడి కాస్త కలిపి తాగండి. ఈ కాఫీ ద్వారా శరీరానికి పోషకలు అందుతాయి అంటున్నారు.  కూరగా తినటం కన్నా ఓ రెండు స్పూన్ల బ్రకోలి పోడితో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ కాఫీ తయారు చేయటాన్ని ఆస్ట్రేలియన్ […]

ఇవి చాలు

చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో ఖరీదైన ఆహారపదార్ధాలు ఎంతో శుభ్రత తో శ్రద్దగా తాయారు చేసి ఇచ్చినా వాళ్ళు తరచుగా అనారోగ్యల పాలవుతూనే ఉంటారు. ఖరీదైన ఆహారపదార్ధాలలో అవసరమైన పోషకాలు లేకపోవటం వల్లనే ఈ సమస్య అంటరు డాక్టర్లు. శక్తి కోసం పప్పు,ఆకు కూరలు కాల్షీయం కోసం నువ్వుల లడ్డులు పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఇవ్వండి.ఇవే ఆరోగ్యం అంటున్నాయి అధ్యాయనాలు. పీచు కోసం దోస,బీరకాయ,కీర,సిట్రస్ పండ్లు,బీట్ రూట్,క్యాబేజ్,క్యారెట్ ఇవ్వండి అంటున్నారు. తప్పని సరిగా పాలు […]

కాస్త శ్రద్దతో

ఎప్పుడేనా హడావిడిగా ఏ పార్టికో వెళ్ళాలంటే అప్పటికప్పుడు గోళ్ళ రంగు వేసుకుని వెంటనే ఆరిపోవాలంటే రెండు నిమిషాలు ఐస్ నీళ్ళలో చేతులు ముంచితే చాలు. గోళ్ళరంగు సీసాను షేక్ చేయలి అనిపిస్తే రెండు చేతుల మధ్య ఉంచుకుని గుండ్రంగా తిప్పాలి. అప్పుడు సీసాలో బుడగలు రాకుండా ఉంటాయి. గాలి కూడా లోపలికి చేరడు. గ్లిట్టర్ నెయిల్ పాలిష్ తొలగించాలంటే రిమూవర్ లో ముంచిన దూదిని గోళ్ళ పై కాసేపు ఉంచి గట్టిగా తుడవాలి.అలా రంగు తొలిగించాక గోళ్ళు […]

రంగుల్లో అందం

చల్లగా హాయిగా వర్షపు జల్లులో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో కాంతి వంతమైన రంగులు బావుంటాయి. ఏ వస్త్ర శ్రేణి అయినా గులాబీ,ఆకుపచ్చ,ఆరెంజ్ వంటి అందమైనవి, కాస్త పొడుగ్గా లావుగా ఉండే ముదురు రంగులు బావుంటాయి. చిన్న ప్రింట్ లలో గులాబీ,ఆకుపచ్చ రంగుల దుస్తులు చాలా అందం ఇస్తాయి. ఎరుపు వెచ్చదనానికి సంకేతం. ఈ కాలంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇక మబ్బుపట్టిన వాతావరణాన్ని ఉత్సహంగా మార్చేయాలి అనుకుంటే సూర్య కాంతి ప్రతిబింభించే పసుపు రంగు […]

ఫంగస్ వచ్చేస్తుంది

వర్షంలో చేతుల్ల్లో ఉన్న బ్యాగ్ లు,సెల్ ఫోన్ కవర్లు,వ్యాలెట్ లు తడిసిపోతూ ఉంటాయి. తడి సరిగ్గా ఆరకపోతే వాసన రావడం ఫంగస్ ఏర్పడటం మాములే. వర్షంలో తడిసి ఇంటికి రాగానే లెదర్ వస్తువులను తుడిచి వాటి మధ్యలో పేపర్లు ఉంచాలి.నీడనే గాలి తగిలేలా ఉంఛాలి. నేరుగా ఎండబెట్టకూడదు. వీటి పైన బురద మరకలు పడితే పాత బ్రష్ తో రుద్ది మెత్తని బట్టతో తుడిస్తే సరిపోతుంది. ఈ లెదర్ వస్తువుల పైన కరిగిన మైనం పూత పూసి […]

ఆల్శండ్స్ పళ్ళే

ఇవ్వల్టి రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్దే. తాజా పరిశోధనలో మహిళలు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినేందుకు ఇష్టపడుతున్నారని ముఖ్యంగా ఆల్మండ్స్ ,తాజా పండ్లు మాత్రమే వీళ్ళు స్నాక్స్ గా తింటున్నారని తేలింది. ఇరవై నుంచి నలభై ఏళ్ళ లోపు 3 వేల మంది మహిళలపై చేసిన పరిశోధనలో సహాజసిద్ధమైన ,ఆరోగ్యవంతమైన ఆహారం ఇష్టపడుతున్నారని ,ఎక్కువ మంది మహిళలు తమ బ్యాగ్స్ లో ఆల్మండ్స్ ,కొన్ని నట్స్ మాత్రమే వెంట తీసుకువెళుతున్నారని ఇది గొప్ప ఆరోగ్యవంతమైన మార్పుగా పరిశోధకులు […]