Thursday, 06 Aug, 2026

ఆరోగ్యాన్నిచ్చే జ్యూస్

క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటే వీట్ గ్రాస్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాగేందుకు పెద్ద రుచిగా ఉండదు కానీ ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్లు, ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి  సమృద్ధిగా ఉండి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తుంది. వరుసగా ప్రతిరోజు నెల రోజులపాటు ఈ జ్యూస్ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్త కణాల సంఖ్య […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

ఈ చల్లని వాతావరణం సూక్ష్మ క్రిములు సంచారానికి అనువైంది. అందుకే చాలా తేలికగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ప్రతిరోజు పరగడుపునే వేడి నీళ్లలో పసుపు కలిపి తాగాలి నిద్ర లేవగానే 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి. తేలికగా జీర్ణం అయ్యే వెచ్చని  పదార్థాలు తినాలి.ఉదయం అల్పాహారంలో గోధుమలు, ఓట్లు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు వేసి కషాయం తాగడం ఎంతో మంచిది. రోజంతా వేడి నీరు […]

గ్రామాల్లో వెలుగు

2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో  గ్రిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తన గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. […]

ముఖ కాంతి రెండింతలు 

ఈ వర్షపు గాలులకు చర్మం పొడిబారిపోతుంది. రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై పేరుకోన్న దుమ్ము ధూళి పోతుంది చర్మం తేమను పోకుండా రెండు గంటల కోసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.దానితో పాటు సన్ స్క్రీన్  కూడా వాడుకోవాలి.  దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగాలి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో  తయారు చేసుకునే ప్యాక్ వేసుకోవాలి. బొప్పాయి గుజ్జు, బాదం గింజల పొడి, పచ్చిపాలు, శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లని నీళ్ళతో […]

ఇది ఘాటైన వైద్యం

గొంతుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం ఏదైనా సరే మిరియాలు తిరుగులేకుండా మేలుచేస్తాయి జీర్ణం కావడానికి ఎక్కువ సేపు పట్టడం ,ఘాటయిన వాసన మిరియాలు ప్రత్యేకత.గ్రాము వేయించిన మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనె కలుపుకుని తాగితే  జలుబు, దగ్గు  తగ్గిపోతాయి. జీర్ణక్రియకు మిరియాలు మంచి మేలు చేస్తాయి.మిరియాల పొడి బాదంపప్పు కలిపి తింటే కండరాలు ,నరాల నొప్పి తగ్గిపోతాయి.మిరియాల పొడి మజ్జిగతో […]

చర్మ కాంతికి ఈ స్మూతీ  

చర్మ సౌందర్యం కోసం ఏ సౌందర్య ఉత్పత్తులు వాడినా చర్మ సౌందర్యాన్ని మెరిపించే ఈ స్మూతీని   తప్పకుండా తినండి అంటున్నారు చర్మ నిపుణురాలు గీతిక.  పెద్ద సైజు అరటిపండు, అవిసె గింజలు టేబుల్ స్పూన్ పాలు లేదా యోగర్ట్ అర కప్పు బాదం బట్టర్ లేదా  పీనట్ బట్టర్ టేబుల్ స్పూన్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూతీ చల్లగా ఉండాలి అనుకుంటే అరటిపండుని ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి.అవిసె గింజలు చర్మానికి లోపలనుంచి […]

జాగ్రత్తలు తప్పనిసరి 

కరోనా కేసులు నమోదవుతున్నాయి కానీ చిన్నచిన్న వేడుకలకు హాజరై అవుతూనే ఉన్నారు ప్రజలు. అయితే ఒక చోట కొంతమంది తో అయినా సరే కలుసుకోవటం కొంత రిస్క్ తో కూడుకున్న పనే. కనుక మాస్క్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా కూర్చోకుండా ఉండాలి. పార్టీలో డ్రింక్స్ కోసం ఒక దగ్గరగా ఉండకూడదు డిస్పోజబుల్ గ్లాస్ లు ప్లేట్ లు ఫుడ్ ఐటమ్స్ కాస్త దూరంగా ఉంచి ఒక్కళ్ళు వెళ్లి సొంతంగా సర్వ్ చేసుకునే ఏర్పాటు చేసుకుంటే మంచిది శానిటైజర్ […]

చూస్తూ ఊరుకుంటామా ?

2020 bbc 100 ఉమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు బిల్కినో భానో దీదీ  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సువర్ణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి వరకు దేశ రాజధాని  షాహీన్ బాగ్ లో కొనసాగిన ఆందోళనలో పాల్గొన్నారు బిల్కినో భానో దీదీ షహీన్  బాగ్  దీదీ గా అందరికీ గుర్తుండిపోయారు. మేము రైతు బిడ్డలం రైతులు కష్టాల్లో ఉండి నిరసన తెలుపుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం ప్రజలందరూ వారికి మద్దతు తెలపాలని […]

వికలాంగుల హక్కుల గేయం  

టైమ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ 2020 బిబిసి 100 మంది ఉమెన్ ఆఫ్ 2020లో జాబితాలో చోటు చేసుకుంది మానసి గిరీష్ చంద్ర జోషి.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మానసి ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది ఆమెకు ప్రోసైటిక్  కాలు  అమర్చారు.  శరీరం మళ్లీ మామూలు స్థితికి రావడం కోసం బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టి 2015లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పోటీలలో పతకం సాధించింది. 2019లో స్విజర్లాండ్ లో జరిగిన పోటీల్లో  […]

ఇది ట్రెండీ లుక్  

పట్టు చీరె కట్టుకొని మోడ్రన్ లుక్ తో కనిపించటం కూడా ఇవ్వాట్టి  అమ్మాయిలకే చెల్లింది. వాళ్ళ కోసం అందమైన బనారస్ చీరెలు సిల్క్ డిజైనర్ శారీస్ ధోతి ప్యాంట్ రూపంలోకి తీసుకువచ్చారు స్టైలిస్ట్ లు శారీ ప్యాంట్లు కూడా వచ్చాయి అందమైన చీరెలు ప్లాంట్లలో మేచ్ చేయటంవల్ల అడక్కు కంఫర్ట్ చీరకట్టు చెదరనట్లు ఉంటుంది కుచ్చుళ్ళు పోసి కట్టే చీరకట్టు ప్యాంటు   ధోతి లో కి చక్కగా ఒదిగిపోయింది.

మిట్టీ కేఫ్ 

2017 లో మిట్టీ కేఫ్ ప్రారంభించింది అలీనా ఆలమ్ హుబ్బళ్ళి  లోని బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఉన్న ఈ మీటింగ్ దివ్యాంగుల సంక్షేమ కోసం ఏర్పాటయింది. ప్రస్తుతం 116 మంది దివ్యాంగులు పనిచేస్తున్నారు. హుబ్బళ్ళి బెంగళూరు, కోల్కతా భువనేశ్వర్ లలో మొత్తం 12 శాఖలున్నాయి. ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ తో పాటు కేఫ్ మేనేజర్ గా పని చేసే కీర్తి నడవలేదు,చేత్తో వస్తువు పట్టుకోలేదు మరుగుజ్జులు భైరపు, రూప ఇద్దరు ఈ […]

అన్నీ నేనే చేస్తా 

ఒకసారి ఫ్రెండ్స్ తో మాల్ కి వెళ్తే చీజ్ టార్ట్స్ చేస్తున్న వాసన వచ్చింది. అలాంటి రుచి నేను ఇంట్లో ఎన్నో ప్రయోగాలు చేశాను. చాలా బాగా చేయగలగాను  ఈ ఏడాది జూన్ లో లైఫ్ ఆఫ్ పై పేరుతో ఒక బేకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను.బేకింగ్ నుంచి ఆర్డర్లు ప్యాక్ చేయటం వరకు నేనే చేస్తున్న ఇది స్టార్టప్ కదా అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. కొన్నాళ్ళ క్రితం సేవ్ శక్తి పేరుతో ఒక సంస్థ […]

Manusangada (తమిళం) (2018)

ప్రస్తుత భారత దేశంలో దళిత పోరాటాలు  రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిందీ  సినిమా మేము మనుషులమే అర్థం తో ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అవార్డులు గెలుచుకుంది దళితుడైన కోలప్పన్ తండ్రి  చనిపోతాడు ఆ వూరి ప్రధాన మార్గం ద్వారా దళితులు మృతదేహాలను తీసుకుపోయేందుకు అగ్రకులాల అంగీకారం లేదు ప్రభుత్వం ఇచ్చిన రహదారిలో మాకు నడిచే హక్కు ఉందని కోలప్పన్ కోర్టుకు వెళ్తాడు వివాదం జరుగుతున్న మూడు రోజులుగా కోలప్పన్ తండ్రి శవంఅతని ఇంటి వాకిట్లోనే ఉంది. […]

బరువు పెరగటం ఖాయం 

అలవాటుగా చేసే ఈ ఆరు పనులు బరువు పెరిగేలా చేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా కప్పు కాఫీతో ఉదయం మొదలవుతుంది. కానీ పాలు పంచదార, బరువు పెంచేవే.లేస్తూనే అప్డేట్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్  చేసే మనకు తెలియకుండానే తినటం ఎక్కువ, నమలటం తక్కువ అయిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైనవి తప్ప హై ప్రోటీన్స్ తీసుకోవటం కూడా బరువు పెంచేదే.ఉదయాన్నే గ్లాసుడు నీళ్లు త్రాగటం మరిచిపోతే కూడా కష్టమే.హైడ్రేటెడ్ గా ఉండకపోతే క్యాలరీస్ కరగవు ముఖ్యంగా నిద్ర […]

పొడిబారుతుంది జాగ్రత్త 

చలిరోజుల్లో చర్మం సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు.చర్మం పొడిబారకుండా స్నానానికి చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు వాడాలి.బొప్పాయి గుజ్జు లో నిమ్మచెక్క పిండి పేస్ట్ లా చేసి చర్మానికి రాసుకుంటే స్కిన్ తాజాగా ఉంటుంది.బయటకు వెళ్ళే ముందర చర్మానికి సన్ స్క్రీన్  రాసుకోవాలి రోజులో ఎన్నోసార్లు మాయిశ్చరైజర్ చేసుకున్న మంచిదే చలిరోజుల్లో పెదవులు పొడిబారి పగిలి పోతుంటాయి లిప్ బామ్ రాసుకుంటే ఆ సమస్య ఉండదు చర్మాన్ని తేమ తగ్గకుండా కాపాడుకోవాలి.

దేవతలు మెచ్చిన  లోహం 

రాగి దేవతలు మెచ్చిన లోహం అంటారు ఆరోగ్య పరిరక్షణకు రాగి లోహం మంచిదని ఋషులు అర్చనకు రాగి పాత్ర రాగి చెంబు రాగి అరివేణం దేవతలకు ఇష్టమన్నారు.దేవాలయ ధ్వజస్తంభానికి రాగి తొడుగు వేయాలన్నారు.భక్తులు శిరసు భూమికి తాకించినప్పుడు ఆ అయస్కాంత శక్తి వారికి లభించాలని రుషుల భావన.ఉత్సవ విగ్రహం రూపంలో  ఊరేగుతున్నప్పుడు కూడా రాగి లోహం తోనే కనిపిస్తాడు భగవంతుడు. రాగి సర్వ శ్రేష్టమని ప్రచారం చేసేందుకు ఇదంతా.దేవుడి కాగడాలు రాగి వే భక్తులకు తీర్థ ఇచ్చేది […]

యువ మేయర్

మా తిరువనంతపురం చాలా అందమైన నగరం.వ్యర్ధాలు మా నగరపు అందాన్ని దెబ్బతీయకుండా చూస్తాను అందరికీ ఆరోగ్యం నా లక్ష్యం. అలాగే నా చదువును కొనసాగిస్తాను అంటోంది ఆర్య రాజేంద్రన్. 21 సంవత్సరాల వయస్సు.డిగ్రీ రెండో సంవత్సరం చదువు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతుంది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదావన్ ముకుల్  వార్డు కు సిపియం అభ్యర్థిగా పోటీ చేసింది రెండు వేలకు పైగా ఓట్లు […]

Iam kalam (హిందీ) (2011) 

 Smile foundation నిర్మించిన అయామ్  కలామ్  నిస్సందేహంగా గొప్ప స్ఫూర్తిదాయక చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం చోటు అనే బాలుడి కథ. చోటు నీ తల్లి తీసుకువచ్చి ఒక హోటల్ పనిలో వెడుతుంది. రాజస్థాన్ లోని బికనీర్ రాజ వంశస్థులు ఉండే రాజ సౌధానికి దగ్గర్లో ఒక చిన్న టీ కొట్టు లో పనిచేసే చోటు కి కలాం ఆదర్శం చక్కగా చదువుకోవాలని కలలు కంటాడు. రాజకుటుంబానికి చెందిన బాలుడితో స్నేహం ఏర్పడుతుంది రహస్యంగా […]

చెప్పటం తేలికే !

సలహా ఇవ్వటం చాలా తేలిక పాటించడమే కష్టం గాంధీజీ చెప్పారు అంటున్న ఒక కథ చాలా బావుంటుంది ఒక తల్లి గాంధీజీ దగ్గరకు తన అయిదు ఏళ్ళ పిల్లవాడిని తీసుకు పోయి ,బాపు వీడు అస్తమానం బెల్లం తింటున్నాడు వద్దంటే వినడు మీరు చెపితే తప్పనిసరిగా వింటాడు తినద్దని వీడికి సలహా ఇవ్వండి అని అడిగింది. బాపు వచ్చేవారం చెబుతానన్నాడు తరవాత వారం తల్లి వచ్చింది ఇంకో రెండు వారాల తర్వాత అన్నారు బాపు చివరికి మూడు […]

సారా గిల్బర్ట్ 

బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల పైనే ప్రపంచం అందరి దృష్టి ఉంది. ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా తో కలిసి ఆక్స్ ఫర్డ్  యునివర్సిటీ చేస్తున్న పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తుంది సారా గిల్బర్ట్. ఆక్స్ ఫర్డ్ లో వ్యాక్సినాలజీ  ప్రొఫెసర్ వ్యక్సిటెక్  సహా వ్యవస్థాపకురాలైన్ ఆమె ఇన్ ఫ్లూయాంజీ   వైరల్ వ్యాధి కారక క్రిముల పై పోరాడే వ్యాక్సిన్ ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.