ఎడారిలో పూల సందడి
సృష్టిలో చాలా అందమైన పువ్వులు గులాబీ మొదటి వరుసలో ఉంటుంది. వందల రకాల గులాబీలు చూశాం కానీ ఎడారుల్లో ఇసుక నేల పైన విరిసే రోజ్ రాక్ ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓక్లహోమా ఎడారిలో విరిసే గులాబీలు చూస్తుంటే సృష్టి విచిత్రం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇసుక నేల పైన అందాల గులాబీలు ఎలా వచ్చాయి అంటే మాత్రం సైన్స్ పాఠం లా చెప్పాలి. ఖనిజాలాన్ని నేలమాళిగల్లో గూడుకట్టుకుని రత్నాల్లా క్రిష్టల్స్ లా […]
60 ఏళ్లుగా సిలిండర్ తో జీవితం
పాల్ అలెగ్జాండర్ రాసిన పుస్తకం త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్ మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లాంగ్ ,ఒక సంచలనం. 60 ఏళ్లుగా ఒక ఇనుప యంత్రం సాయంతో బతుకుతున్న పాల్ జీవిత కథ ఇది. అమెరికాలోని డల్లాస్ కు చెందిన అలెగ్జాండర్ కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆరేళ్ల వయసులో సోకిన ఒక వింత పోలియో అతన్ని ఇలా ఒక ఇనుప చట్రం లో బిగించింది. 1916 నుంచి అమెరికాలో ప్రతి వేసవిలోనూ […]
సాంప్రదాయానికి ఆధునిక రూపం
పవిత్రమైన పూజగదిని అందంగా అలంకరించుకోవడం భక్తులకు ఎప్పుడూ ఇష్టం. అక్కడే ఉండే ప్రతి వస్తువు అందంగా ఉండాలనుకొంటారు . హారతి పళ్లేలు కుంకుమ భరణి లు ఎన్నో డిజైన్ల లో వచ్చేశాయి .ఇప్పుడు అగరబత్తి స్టాండ్ లు కూడా రకరకాలు డిజైన్ లలో అందుబాటులోకి వచ్చేసాయి. చూసేందుకు అమ్మాయిల మెడలో పెండెంట్స్ లాగా భగవంతుని ప్రతిమ లాగా కనిపించే ఫినిషింగ్ స్టాండ్లు దొరుకుతున్నాయి. ముందు వైపు చిన్న విగ్రహం అందమైన ప్రతిమ ఉన్నట్లు కనిపించే వీటికి వెనకవైపు […]
బ్రాండ్ బై గార్డెన్ సిటీ అనే తోటలో ఊరు
భవనాల మధ్యలో అందం కోసం చక్కని పూలతోటలు,పార్క్ లు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఏకంగా తోటలోనే ఊరు కడితే ఎలా ఉంటుంది.డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ దగ్గర లో ఉన్న బ్రాండ్ బై గార్డెన్ సిటీ గ్రామాన్ని చూస్తే పచ్చని చెట్లతో అసలా ఊరే పెద్ద ముగ్గులా ఉంటుంది. పదుల సంఖ్యలో బండి చక్రాల్లా పరచుకొన్న తోటలు ఆ మధ్యలో ఎంతో అందంగా తీరుగా నిర్మించిన ఇల్లు ఎంతో అద్భుతం అనిపిస్తుందీ గార్డెన్ సిటీ .ఎంత అందంగా […]
బీ వాటర్ మై ఫ్రెండ్
ఎంటర్ ది డ్రాగన్ సినిమా తో బ్రూస్లీ ప్రేక్షకులకు ఒక తుఫాన్ లాగా పరిచయం అయ్యాడు కుంగ్ ఫూ,మార్షల్ ఆర్ట్స్ తో బ్రూస్లీ చేసిన సాహసాలతో ఒక అర వీర బయంకరుడైన కరాటే వీరుడిని ప్రేక్షకులు ఆదరించారు. క్రమశిక్షణ,కఠిన శ్రమతో శరీరాన్ని ఉక్కులా మార్చుకున్న బ్రూస్లీ గురించి అయన కూతురు షానన్ లీ బీ వాటర్ మై ఫ్రెండ్ పేరు తో ఒక పుస్తకం రాసింది. బ్రూస్లీ గురించి ప్రపంచానికి తెలియని అనేక కొత్త విషయాలు వెలుగులోకి […]
హీరోకి ఫిట్ నెస్ ముఖ్యం
నాకు బరువు పెరగటం తగ్గటం కొత్త కాదు సినిమాల్లోకి రాకముందు 125 కిలోలు ఉండేవాడిని. 2007 లో నా వి.ఎఫ్.ఎక్స్ సంస్థ అమ్మేసి పూర్తి స్థాయిలో సినిమాలు చేయాలనుకొన్న. హీరో అవ్వాలంటే ఫిట్ నెస్ ముఖ్యం కదా. హీరో పొట్టతో కనబతే ప్రేక్షకులు మెచ్చుతారా ? అందుకోసం ఎనిమిది నెలల్లో 20 కిలోలు తగ్గాను వారంలో ఆరురోజుల స్ట్రిక్ట్ డైట్ అంటారు రాణా. బాహుబలిలో బల్లాలుడి గా భారీ ఆకారంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రాణా తరువాత […]
జీవితం అతి పెద్ద పోరాటం
బాలీవుడ్ లో అగ్రశ్రేణి స్టంట్ ఉమెన్ గీతా టండన్ చిన్న వయసులోనే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లి అయిన గీత భర్త వేధింపులు తట్టుకోలేక ఇల్లు వదిలి పిల్లలతో బయటకు వచ్చేసింది. ఉపాధి మార్గంగా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ పని ఎంచుకుంది. యాక్షన్ స్టంట్స్ లో మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిశాక అటువైపుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది గీత . ఈ వృత్తిలో చాలా సవాళ్లు ఉంటాయి కేబుల్ వైర్ల పైనా వేలాడటం, ఎత్తైన భవనాల […]
అలా వెళ్లొద్దామా ?
ప్రయాణం అనగానే హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు స్టేషన్ కు సామాన్లు సర్దుకుని వెళ్లే రోజులకి ఇక తెర పడినట్లే అందమైన ప్రయాణానికి కదిలే ఇళ్ళు లాంటి క్యార్ వాన్ లు వచ్చేసాయి కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా క్యార్ వాన్ లోనే భోజనాలు, స్నానాలు, నిద్ర అన్నీ ప్రశాంతంగా జరిగిపోతూ, ఏకంగా హిమాలయ పర్వత సానువుల్లో విహరించవచ్చు. సముద్రపు అలలతో కబుర్లు చెప్పచ్చు. ఏడాదిలో వెన్నెల రాత్రుల్లు గడపవచ్చు. ఇప్పటికే క్యార్ వాన్ ట్రావెల్స్ కి […]
బ్లెస్సింగ్ హట్
బ్లెస్సింగ్ హట్ ఎందరో నిరుపేదల అవసరాలు తీరుస్తోంది అస్సాంలోని డిమా హసావో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఈ బ్లెస్సింగ్ హట్ ఏర్పాటు చేశారు. ఇది నూటన్ లీకుల్ గ్రామంలో ఉంది సాయం చేయాలి అనుకున్న వారు తమ ప్రాంతంలో పండిన కూరగాయలు వండిన ఆహారం, నిత్యవసర వస్తువులు, స్టేషనరీ కాలక్షేపం కోసం చదువుకునే పుస్తకాలు ఏవైనా ఇవ్వచ్చు కోవిడ్ సమయంలో అధికంగా చితికిపోయిన నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడ్డాయని యువకులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ […]
టీకా అక్కడే ఎందుకు ?
కరోనా వ్యాక్సిన్ భుజం దగ్గరే వేస్తుంటారు పోలియో తప్ప దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్ లను భుజం కండరానికి వేస్తారు. ఇతర ఇంజక్షన్లు మాదిరిగా రక్తనాళానికి ఎక్కించారు. ఎందుకంటే పై భాగంలో ఉండే డెల్టాయిట్ కండరాల్లో రోగనిరోధక శక్తి కారక డెంట్రిటిక్ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్ లోని యాంటీ జెన్లను వెంటనే గుర్తించి శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రీమైనా లింఫ్ నాడ్స్ కు చేరవేస్తాయి అక్కడున్న టిబి కణాలు అంతే త్వరగా స్పందించి యాంటీ బాడీలు […]
పువ్వుల సందేశం
పువ్వులు పిల్లల నవ్వులు లేని ప్రపంచాన్ని ఊహించలేము అన్నాడో కవి అందమైన పూల తోటలు తలచుకుంటే ఊటీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.1948 లో 55 ఎకరాల్లో ఏర్పడ్డ ఈ గార్డెన్ వేలాది పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. గత సంవత్సరం అక్టోబర్ లో 124 వ ఫ్లవర్ షో ఉత్సవం జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కానీ అప్పటికే గార్డెన్ […]
లక్షలు ఖరీదు చేసే కర్భూజాలు
రెండు పండ్లు..18 లక్షల రూపాయలు. మీరు సరిగ్గానే విన్నారు జపాన్ లో పండిన యుబరి కింగ్ మెలన్ పండ్లను పోకో సప్పోరో ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ అక్షరాల 18 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ లోని యుబరి అనే ప్రాంతంలో ఈ పండ్లు పండిస్తారు. ఈ పండ్లకు బ్రాండింగ్ తేవటం లో యుబరి రైతులు వందేళ్ళ కష్టం ఉంది.రైతులు అమెరికన్ వంగడానికీ యూరోపియన్ వంగడాన్ని కలిపి కొత్త రకమైన కర్జూజ ను […]
ఇమ్యూనిటీ పెంచేద్దాం
పిల్లలకు కరోనా రాదు అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది .కరోనా కు పెద్ద చిన్న తేడా లేదని తేలిపోయింది. కరోనా కోరల్లోంచి బయటపడిన పిల్లలను ఇమ్యూనిటీ పెంచే ఆహారంఇవ్వాలంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు విటమిన్-డి ముఖ్యం ఉదయం పూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. పుట్టగొడుగులు గుడ్డులోని పచ్చ సొన లో కూడా విటమిన్-డి దొరుకుతుంది. అరటి, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు […]
మెడ నల్లగా ఉందా ?
మొహం కంటే మెడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు బాదం పప్పులు రాత్రివేళ నానబెట్టి పొద్దుటే మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి దాని మెడ చుట్టూ రాసి ఆరిపోయాక కడిగేయాలి. అలాగే కీర చర్మకణాలను రిపేర్ చేస్తుంది కనుక తురిమిన కీర ను మెడకు పట్టించి మృదువుగా మర్దన చేస్తే చాలు అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేయాలి. అలోవెరా జెల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నీళ్లలో […]
కోవిడ్ ను రానివ్వదు ?
గ్రీన్ టీ తో కోవిడ్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధం లా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెపుతోంది. గ్రీన్ టీ లో వుండే గలోకాటెచిన్ అనే సమ్మెళనం కనుగొన్న శాస్త్రవేత్తలు అది స్పార్స్ కోవ్-2 ను ఎదురుక్కోగల ఔషధ అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని స్వాన్సియా యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనంలో గ్రీన్ టీ ప్రతి రోజు తాగమని రికమెండ్ చేస్తున్నామని కోవిడ్ తో పోరాడగలిగే గుణాలు ఇందులో […]
ప్లాస్టిక్ బౌల్ వాడద్దు
అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్లో ఆహారం వడ్డించడం పిల్లలకు స్కూళ్ళకు ఇవ్వటం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ మెలనిన్ అనే ప్లాస్టిక్ తో తయారవుతాయి వేడివేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్ లోని మెలనిన్ ఆహారంతోపాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలో చేరే ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితం అయింది. మెలనిన్ ఉన్న బౌల్ లో ఏ […]
పూర్తిగా మారాను
నా లైఫ్ స్టయిల్ పూర్తిగా మార్చుకున్నాను ముఖ్యంగా మాంసాహారం మానేశాను హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా ఆర్గానిక్ ఆహారం స్వయంగా పండించుకుంటున్నాను. పాల పదార్థాలు కూడా ముట్టుకోవటం లేదు అంటోంది సమంతా. కెరియర్ లో తిరుగులేని హిట్స్ అందుకున్నా సమంత ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని చెబుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆమెను సూపర్ స్టార్ ని చేసింది ఇక భవిష్యత్తులో హీరోలు ఆమెతో పోటీపడి నటించవలసి వస్తుంది. ఇక ఆమె కోసం కొత్త కథలు […]
బీట్ బాక్సర్ ఆర్ద్ర
కేరళ ప్రథమ మహిళ బీట్ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది ఆర్ద్ర సాజన్.దుబాయ్ లోని షార్జా స్కూల్లో చదువుకుంది మిమిక్రీ అభిమాని విషయం సొంతంగా సాధన చేసే మిమిక్రీ ని బీట్ బాక్సింగ్ లో కలిపి ప్రయోగాలు చేసింది ఆర్ద్ర. టిక్ టాక్ లో ఆ ఆర్ద్ర వీడియోలకు లక్షలకొద్దీ వ్యూయర్స్ ఉన్నారు. సంగీత ప్రపంచంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తి గా పేరుతెచ్చుకుంది. ఎలక్ట్రానిక్ సంగీతం తో పాటు వేణువు తో సహా అన్ని రకాల […]
కష్టానికి ఫలితం
భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో విద్యార్థిగా చేరి అక్కడ టీచర్ అయ్యారు దివ్య 2015 లో ఆన్ లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చే యాప్ ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ సమయంలో యాప్ 35 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. ఇక […]
ఔషధ గుణాలున్న వెల్లుల్లి
వెల్లుల్లిని యాంటీ బయోటిక్స్ తో పోలుస్తారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు శ్వాస సమస్యలకు వెల్లుల్లి మందు వంటిదే .వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ అనే అమైనో యాసిడ్ కు ఔషధ గుణాలు ఎక్కువ. వెల్లుల్లి లో ఉండే విటమిన్ సి సెలీనియం వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి రక్తనాళాలు పనితీరు మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తింటే […]
