Monday, 03 Aug, 2026

90 ఏళ్ల ఫిట్ నెస్ ట్రైయినర్

ఒక వయసోచ్చాక ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకోవటమే అనుకుంటారు. కానీ వయసు ఒక సంఖ్య మాత్రమే అని రుజువు చేసింది జపాన్ కు  చెందిన తకిమికా అన్న బామ్మ ఆమెకు ఇప్పుడు 90 ఏళ్లు కానీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తిప్పేస్తూ రకరకాల వ్యాయామాలు చేస్తోంది బోలెడన్ని ఆసనాలు వేయగలదు కూడా. ఏముంది జిమ్ కి వెళ్లే వాళ్లకి ఇదేమంత కష్టం కాదు అనుకుంటాం కానీ 90 ఏళ్ళ వయసులో ఇంత చలాకీగా శరీరాన్ని విల్లులా వంచే […]

ముస్తాబైన గ్రంథాలయం

పుస్తకాలు చదివే వాళ్ళలో ఎంతో పరిపక్వత పరిజ్ఞానం సామాజిక దృక్పథం ప్రశ్నించే తత్వం ఉంటాయంటారు విజ్ఞానులు .ఆ లక్ష్యం తోనే పుస్తకాల ఆలయాన్ని గ్రంధాలయం పేరుతో ప్రతి ఊర్లో నూ ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీ లో ఎప్పుడూ కొందరే పుస్తకప్రియులు కనిపిస్తారు. అదొక పాతకాలపు ఇల్లు లాగా కాకుండా పైకి చూస్తేనే ఆకర్షణీయంగా ఉంటే లోపలకు వెళ్లి కాసేపు చదువుకుంటారేమో నని సరికొత్త ఆలోచన చేశారు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి కొత్త […]

జంతువుల కోసం ప్రాణాలు తెగింపు

నక్క పిల్ల కోసం దిగుడు బావి లో దిగింది మొహమ్మద్ సుమ మహబూబాబాద్ కు చెందిన ఈ అమ్మాయికి  మూగజీవాల పైన అంతులేని ప్రేమ ఎక్కడ ఏ పక్షి ఏ జంతువు బాధ పడుతున్న చూడలేదు .ఇప్పటికీ 120 కి పైగా కాకులు, కోతులు, తేగ దూడలు, కొండచిలువల్ని కూడా రక్షించింది .ఎవరైనా పలాని జంతువు ఏ గోతి లోనో, కాలువ లోనో  పడిపోయిందని చెప్తే చాలు వెంటనే వాటిని రక్షించేందుకు రంగంలోకి దూకుతుంది సుమ. అమ్మ […]

తేనె ఖరీదు కిలో ఐదు లక్షలు

ప్రపంచంలో తియ్యని పదార్థాలను తేనె తో పోలుస్తారు. తేనే ఎంత మధురం అంటారు. తేనె మంచి ఆహార ఔషధం కూడా. మనం ఎప్పుడూ చూసే తేనె కంటే అద్భుతమైన ఔషధ శక్తి ఉన్న తేనె టర్కీ లో దొరుకుతుందట అక్కడి అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించే ఒక 100 గ్రాముల తేనె లో 25 మిల్లీ గ్రాములు సి-విటమిన్ ఉందట. మిగతా తేనెల్లో 100 గ్రాములకు 6.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ అంజర్ తేనె […]

ఎంత మంచి ఆలోచన

ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పాత టైర్ల తో కొత్త రూపంలోకి తెచ్చేసింది పూజా రాయ్. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఆమె చేసిన స్కూళ్ళలో  పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే లేవు .పిల్లలు ప్లేట్లతో విరిగిపోయిన బ్యాట్ల తో ఆడుకోవడం చూశాక ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. పాత  టైర్లతో వాళ్లకోసం ఆట వస్తువులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద మిలియన్ టన్నుల పాత టైర్లు వృధాగా పడేసారు. వాటిని ఆట స్థలానికి కావలసిన ఉపకరణాలుగా […]

పరిణితి చోప్రా హెల్త్ జ్యూస్

పరిణితి చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్రీన్ జ్యూస్ ఇప్పుడో పెద్ద సంచలనం అయిపోయింది. ఈ బాలీవుడ్ బ్యూటీ తన సౌందర్య రహస్యం ఇదే నంటూ బచ్చలికూర, బీట్ రూట్, ఆరెంజ్, పుదీనా తో చేసే గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చింది. ఆరోగ్యానికి మంచిదే చర్మ సౌందర్యానికి ఇదే బెస్ట్ అని ఆమె చెబుతున్న గ్రీన్ జ్యూస్ లో ఒక్కసారి మూడు బావుంటే నిమ్మరసం కూడా కలుపు కొంటాను అని చెబుతోంది.గత మార్చి నుంచి టర్కీ […]

ఊరంతా ఉదా

ఉదా చాలా అందమైన రంగు ఎప్పటికీ మార్పులేని ఫ్యాషన్ కలర్ కూడా. ఈ రంగు లోని లావణ్యాన్ని చుట్టు చూసి ఆనందించాలి అంటే దక్షిణ కొరియా లోని పర్పుల్ ఐలాండ్ కు వెళ్ళాలి. అక్కడ రోడ్లు, భవనాలు వాహనాలు అన్నీ ఉదా రంగులోనే ఉంటాయి. బాన్వోల్ పార్క్‌జీ అనే రెండు మామూలు ద్వీపాలను పర్యాటకుల కోసం ఇలా ప్రత్యేకంగా మార్చేసింది ఇక్కడి ప్రభుత్వం రెండు ఊర్లు కలిపే ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు. ఎరుపు లోని […]

ఎన్నటికీ మారని ఫ్యాషన్

సాంప్రదాయ ఆభరణాలు కాలం తో నిమిత్తం లేకుండా తరతరాల వాళ్లు మెచ్చేలా ఉంటాయి. యాంటిక్ ఆభరణాలు అత్యంత అందమైనవీ,విలాసవంతమైనవీ కూడా ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు చాలా తేలికగా, బంగారం తో కలిపి ఆభరణాలుగా మలిస్తే అంతులేనంత అందంగా ఉంటాయి. సెలబ్రిటీ లు అనేక సందర్భాలలో స్టైల్ ని ముత్యాల ఆభరణాలతోనే మెరిపిస్తూ ఉంటారు. ఇక మొఘాలాయి కాలంనాటి జూడవ్ ఆభరణాలు ఎంతో ట్రెండీగా ఉంటాయి. ఇక చోకర్  నెక్లిస్ ల […]

అలనాటి ఆభరణాలు

ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఎదిగే వయస్సు సందర్భాన్ని బట్టి ఆభరణాలు ధరించటం సాంప్రదాయ బద్దంగా తరతరాలుగా వస్తుంది. ఎప్పటికప్పుడు ఆభరణాలు తయారీలో కొత్త పోకడలు వస్తున్న కొన్ని రకాల  ఆభరణాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హత్ ఫుల్ పేరుతో ఉన్న ఆభరణం షెషన్ బ్రాస్ లైట్ కు చేతివేళ్ల ఉంగరాలు కలిపి చేసే ఆభరణం ఇది. వజ్రాలు పొదిగిన హత్ ఫుల్ ఆభరణం నవతరం వధువులు ఇష్టంగా ధరిస్తున్నారు. అలాగే డస్ట్ బాండ్ […]

రెండు ఒకేసారి డేంజర్

డైటింగ్,ఎక్సర్ సైజు ఒకేసారి చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్. బరువు తగ్గాలని వర్క్ వుట్స్ చేస్తూ అలాగే డైట్ లో కూడా చాలా మార్పులు తీసుకొస్తారు కొందరు. అలా ఎట్టి పరిస్థితిలోనూ వద్దంటున్నారు నిపుణులు ఇది ఎముకలకు చాలా ప్రమాదం అంటున్నారు. డైటింగ్ వల్ల శరీరానికి ఇవ్వవలసిన ఆహారం తగ్గిపోతుంది అదే సమయంలో ఎక్సర్ సైజు లు చేస్తే శరీరంలో కొవ్వు తగ్గుతుంది అప్పుడు కండరాలకు ఎముకలకు కావలసిన పోషకాలు అందవు ఒకే సమయం లో […]

పెళ్లి జంటకు వింత కట్టుబాటు

పెళ్లి వేడుక పూర్తికాగానే వధూవరులు వరుడి ఇంటికి వెళ్తారు అది సాంప్రదాయం కొత్త కోడలి రాకతో ఆ ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంచి జిల్లా లోని అమ్ని లోకి పూర్ లో ఒక పెళ్లి జంట ఊరు లోకి అడుగుపెడితే ఊరంతా పండగ. ఆ పెళ్లి జంట అక్కడ ఒక మొక్క నాటితే గాని అత్తారింట్లో అడుగు పెట్టనివ్వరు పైగా ఆ మొక్క పెరిగే వరకు దాని సంరక్షణ […]

నిజాయతీకి ఇది నిదర్శనం

మనుషుల్లో వుండే నిజాయతీకి నిదర్శనం ఈ ఊరి షాపులు. మిజోరాం లోని సెలింగ్ పట్టణం లో ఉన్న ఈ హైవే మార్గంలో కొండలు అడవులు వరి పంటలే కనిపిస్తాయి. ఆ దార్లో అక్కడక్కడా కూరగాయలు పండ్లు. పండ్ల రసాల బాటిల్ తో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను అమ్మే చిన్న దుకాణాలు ఉంటాయి.కానీ ఆ షాపుల్లోఅమ్మే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు అన్ని వస్తువుల పైన వాటి ధర ఒక అట్టముక్క పైన రాసి ఉంటుంది. వాహనాల్లో అటు […]

ఈ పూల లోయ ఒక అద్భుతం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాల ప్రాంతం లడక్ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ బౌద్ధం ప్రధాన మతం.లడక్ లోని పువ్వుల లోయలు చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. లడక్ లోని షీలా కాంగ్ ప్రాంతంలోని లోయ ఒక ప్రత్యేకం సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తైన చుట్టూ మంచు పర్వతాలు కరిగిన నీళ్ళతో ఏర్పడిన సెలయేళ్ళు. ఆ సెలయేళ్లు అంచున ఎన్నో రంగురంగుల పువ్వులు ఒక పువ్వు కి ఒక ప్రత్యేకమైన అందం నీలి, గులాబీ, […]

ఒకే చెట్టుకు 22 రకాల పండ్లు

ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి పండ్లు పండించే ఉత్తమ రైతు గా గుర్తింపు పొందారు కాకా సాహెబ్ సావంత్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లోని ఓ చిన్న గ్రామం అంట్రాల్ గ్రామానికి చెందిన సావంత్ ఓ ఆటోమొబైల్ కంపెనీ లో మెకానిక్ గా పని చేసేవారు. పూణే లో ఉద్యోగం చేసే సావంత్ కు వేరే ఊరు బదిలీ అయింది. ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లే బదులు సొంత ఊరు వచ్చేసి ఉన్న 20 […]

యవ్వన రహస్యం యోగ

వయస్సు దాటిన యూత్ ఫుల్ గా కనిపించాలంటే బాలెన్స్ డ్ జీవిత విధానం అవసరం అంటుంది శిల్పాశెట్టి .వయసు 46 ఏళ్లు ఇప్పటికీ ఆమె చేస్తున్న యోగ వీడియోలు చూస్తే ఆమెకు అంత వయసు ఉందా అనిపిస్తుంది .ముఖం కాంతివంతంగా ముడుతలు పడకుండా ఉండాలి అనుకుంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి అంటుంది శిల్పా .తనకు కావలసిన కాయగూరలు స్వయంగా పెంచుతుంది కూడా .ఆమెతో పాటు ఆమె కొడుకు వియాన్ కూడా ఆమె పెరటి తోటలో పని […]

ఇక స్పేస్ షిప్ లో ప్రయాణం మొదలు

అంతరిక్షంలో ప్రయాణం అనగానే వ్యోమ గ్రాములు కళ్ళముందు కనిపిస్తారు. సామాన్యులకు వాళ్లని చూసే అవకాశం ఉండనే ఉండదు. కానీ కెల్లీ గెరార్డి అనే టిక్ టాకార్ స్పేస్ షిప్ లో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకుంది వచ్చిన గెలాక్టివ్ అనే అంతరిక్ష టూరిజం సంస్థ వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి సిద్ధం చేస్తోంది. ఆదిశగా పరిశోధనలు మొదలయ్యాయి. ఇందుకోసం కెల్లీ గెరార్డి ని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌ […]

ఎంత అపురూపం ఈ పెళ్లి గౌన్

పెళ్లిని మరువలేని జ్ఞాపకంగా మలచుకోవాలి అనుకుంది ఫ్యాషన్ డిజైనర్ Esther Andrews ఈమె టిక్ టాకర్ కూడా. ఆమె పెళ్ళికి తొమ్మిది నెలల సమయం ఉంది. తను ఫ్యాషన్ డిజైనర్ కనుక తన పెళ్లి డ్రస్సు,వరుడి డ్రస్సు చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉండాలనుకొంది. వెడ్డింగ్ థీమ్ ని ముందే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా పెళ్ళి గౌన్ తయారీ మొదలు పెట్టింది. నాణ్యమైన నూలు దారం తో నాలుగు మైళ్ల పొడవైన […]

వర్క్ వుట్స్ కు శారీ బెస్ట్

ఏ పనికి చీరె అడ్డంకి కాదు ముఖ్యంగా యోగా చేసేందుకు అంటుంది పుణేకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఈ 37 సంవత్సరాల ఫిట్నెస్ ఫ్రీక్ రోజు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్, పుషప్స్ వంటి వర్క్ వుట్స్ చేస్తుంది. నా దగ్గరకు ఆరోగ్య సలహా కోసం వచ్చే ఎంతోమందికి నేను వ్యాయామం గురించి చెబుతాను ఎంత చెప్పినా సాంప్రదాయ చీరకట్టుతో వ్యాయామం కష్టం అంటారు. పోనీ జిమ్ డ్రెస్ వేసుకోండి అంటే అలవాటు లేదంటారు .సాంప్రదాయ […]

ఆహార వ్యర్ధాలతో ఫ్యాబ్రిక్

ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఇప్పుడూ ప్రకృతి ఆరాధనలో మునిగిపోయినట్లు ఉంది. ఫ్యాషన్ డిజైనర్ మధురిమా సింగ్  డ్రెస్ డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ ను చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అరటి, మొక్కజొన్న, సోయా పాలు తామర, ఆరెంజ్ బాంబు యూకలిప్ట్ స్  వంటి సహజ ఫైబర్ లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్ను తయారు చేసింది మాధురిమా సింగ్. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ‘ధురీ’  పేరుతో ఫ్యాషన్ లేబుల్ ద్వారా సహజ ఫైబర్ తో […]

ఇసుక ఎడారిలో చల్లని బడి

దేశం లో అతి తక్కువ మహిళ అక్షరాస్యత నమోదైన రాష్ట్రం రాజస్థాన్. అక్కడి స్త్రీల అక్షరాస్యత 32 శాతానికి మించి లేదు దీనికి కారణం పేదరికం, నీటికొరత,బాల్యవివాహాలు,బ్రాహ్మణ హత్యలు ఇలా ఎన్నో కారణాలు. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిస్తేనే చంపేస్తారు. ఈ కారణాలు అధ్యయనం చేసిన సిటా అన్న ఎన్జీవో ఈ సమస్యలకు పరిష్కారం ఆడపిల్ల చదివే అని తేల్చుకొని 2018 లో ఇక్కడో స్కూలు నిర్మించింది. రాజస్థాన్ రాష్ట్రం, జైసల్మేర్ జిల్లా కానోయ్ గ్రామంలో, ది […]