Monday, 03 Aug, 2026

ఇది ఆడ పిల్లల ఆహారం

ఆడ పిల్లలు ఎదిగే క్రమంలో ప్రతి దశలోనూ కొన్ని ఒత్తిడులు ఉంటాయి. వీటిని దాటి రావాలంటే క్రమం తప్పకుండా కొన్ని ఆహారపదార్ధాలు తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పు లో ఉండే విటమిన్-బి2, విటమిన్-ఇ శరీరం లో సెరటోనిన్ ఉత్పత్తికి సాయం చేస్తాయి. ఈ సెరటోనిన్ వత్తిడి వ్యాకులత ఎదురవకుండా పోరాడుతూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కనుక ప్రతిరోజూ బాదం పప్పులు తినాలి. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ను అదుపులో ఉంటే తాజా కమల, బొప్పాయి, […]

దాదాపుగా ఔషధాలే ఇవి !

వర్షాల సమయంలో వేడిగా ఉండే సూప్ లు తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు. వేడిగా ఉండే సూప్ లు హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. వాటిలో వేసే కూరగాయల్లో ఉండే బి-విటమిన్,విటమిన్-ఎ యాంటీ ఆక్సిడెంట్లు పీచు మొదలైనవన్నీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు సాయపడతాయి. సూప్ ల్లో వాడే అల్లం వెల్లుల్లి మిరియాలు దాల్చిన చెక్క పొడి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి వచ్చే వైరస్ లు బాక్టీరియాలు వచ్చే జలుబు, జ్వరం రాకుండా […]

బరువు తగ్గుతారు

కొన్ని చిరు ధాన్యాలు బరువు తగ్గేందుకు సహాయ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులు విటమిన్-బి దొరికే జొన్నలు ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం ఉండే సజ్జలు బరువు తగ్గిస్తాయి. జొన్నలు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ 20 శాతం శరీరానికి అందుతుంది. సజ్జలతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రాగి పిండి పిల్లలకు చాలా మంచిది, ఇందులో ఉన్న ఆమెను యాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సాయపడతాయి. జుట్టు చర్మం […]

సంగీతం తో ఒత్తిడికి విముక్తి

వత్తిడి కి మందులు వాడటం కన్నా సంగీతం వినటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు. గత ఏడాది వివిధ దేశాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం నిరూపణ అయ్యింది. లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది డిప్రెషన్, యాంగ్జయిటీ, వత్తిడులకు గురయ్యారు సంగీతం వినటం వల్ల వాళ్ళు ఆ లక్షణాల నుంచి బయట పడతారు అని అధ్యయన కర్తలు చెప్పారు. సంగీతం పట్ల పెద్దగా అభిరుచి లేని వాళ్ళు కూడా మ్యూజిక్ వినటాన్ని ఇష్టపడ్డారు. సంగీతం ఒక దివ్య […]

బాగా తినాలి

తగినన్ని పోషకాలు తీసుకొని కాసేపు వ్యాయామం చేస్తేనే అందం ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . పోషకాహారం తీసుకోవటం లో వ్యాయామంలో వెనకబడినందువల్లే అమ్మాయిలు అనారోగ్యాల పాలవుతున్నారు అని చెబుతున్నారు. ఉదయం లేవగానే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఓ అరగంట వ్యాయామం తప్పనిసరి తరవాత ఓ పది నానబెట్టిన బాదం గింజలు రెండు ఖర్జూరాలు గ్లాసు పాలు లేదా ఇడ్లీ, పాలు తాగాలి. అల్పాహారానికి భోజనానికి మధ్య పళ్లరసం తాగచ్చు. ఐరన్, జింక్, క్యాల్షియం దొరికే ఆకుకూరలు, […]

జుట్టు రాలుతోందా ?

కోవిడ్ తర్వాత చాలామందికి జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. వైరస్ తో పోరాడే క్రమంలో శరీరంలో విడుదలయ్యే రసాయనాల ప్రభావం వెంట్రుకలపైన పడుతుంది దాంతో కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలడం మొదలవుతుంది కొవిడ్ సమయంలో  టెలోజెన్‌ దశలోకి ప్రవేశించిన వెంట్రుకలు కొత్త వెంట్రుకలకు చోటు కల్పించటం కోసం ఊడిపోతాయి. పోషకాలతో కూడిన ఆహారం కంటినిండా నిద్ర వ్యాయామం ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేస్తాయి.

అందానికి వడ్ల ఊక

వందల సంవత్సరాల నుంచి తమ పాల వర్ణపు ఛాయని రక్షించుకునేందుకు జపాన్ అమ్మాయిలు వడ్ల ఊక వాడుతున్నారు యాంటీ-ఆక్సిడెంట్స్ పోషకాలు పుష్కలంగా ఉండే వడ్ల ఊక పొడిని ముఖానికి స్క్రబ్బింగ్ కోసం వాడతారు. అలాగే రాజ్మా గింజల పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకొంటారు. ఈ గింజల్లోని సపోనిస్ చర్మ రంధ్రాల్లో మురికిని పోగొడుతుంది. మొహంపై మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది ఈ రెండు లేపనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వృద్ధాప్య ఛాయలు రానివ్వవు.

అప్పుడే మనసు ప్రశాంతం

అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఫిట్ నెస్ అవసరం అంటుంది కియారా అద్వానీ నేను ప్రతిరోజు జిమ్ లో గడపను వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం స్క్యాట్స్ రన్నింగ్ బరువులు ఎత్తటం డాన్స్ ఈత క్విక్ బాక్సింగ్ వంటివి నిత్యం కొత్తగా ఉండేలా ఎంచుకుంటాను అండర్ సి స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం నీళ్ళ కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్ కు వెళ్తాను ఇవన్నీ […]

కాఫీ తాగచ్చు

ఈ మధ్య కాలంలో ఎంతోమంది 16 గంటలు ఉత్సాహం తో కూడుకొని ఉండే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఏడు గంటల ఆహార వ్యవధి ఉంటుంది. మిగతా సమయం ఆహారం జోలికి వెళ్ళకూడదు. అయితే ఈ ఉపవాస సమయంలో కాఫీ టీ వంటి పానీయాలు తాగచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర పాలు తేనె కలపని గ్రీన్ టీ కాఫీ తాగచ్చు ఇందులో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు కూడా వేసుకోకూడదు. కాఫీలో ఉన్న మంచి ప్రయోజనం […]

ఉమెన్ సైక్లింగ్ లో స్వర్ణం

ఒలంపిక్స్ లో ఉమెన్ సైకిలింగ్ లో బంగారు పతకం గెలుచుకున్నారు అన్నా కీసన్‌హోఫర్ ఆమె మాథ్స్ ప్రొఫెసర్ ఆస్ట్రియాకు చెందిన 30 ఏళ్ల అన్నా కీసన్‌హోఫర్ వియన్నా లోని టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ పూర్తిచేశారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో ఎంఎస్సీ చేశారు. ప్రస్తుతం స్విజర్లాండ్ లో మాథ్స్ పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు పరుగు పందెంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత రన్నింగ్ వదలి సైక్లింగ్ వైపు వచ్చారు. టోక్యో ఒలింపిక్స్ […]

వందన కటారియా

హాకీ ప్లేయర్ వందన కటారియా తమ రాష్ట్ర బేటీబచావో కాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ సి.ఎం పుష్కర్ సింగ్ ధామి వందన కటారియా హరి ద్వారా జిల్లాలోని రోష్నాబాద్ లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీ లో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలంపిక్స్ లో హ్యాట్రిక్ చేసి ఆ రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్ ఆమెను తమ మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా […]

ఒంటరి ప్రయాణాలు ఇష్టం

చండీఘర్ కు చెందిన 73 ఏళ్ల గురు దీప్ కౌర్ ను సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాలి. సొంతంగా కారు నడుపుకుంటూ వంటరిగా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్ళిపోతారామె. 1994 లో తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ చేశారు. 2013 నుంచి ఒంటరిగా కారులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది ఉత్తరాఖండ్ చుట్టేశారు. ప్రపంచం తెలుసుకోవాలనే ప్రయాణం చేయమంటుంది. మనకు ఇల్లు ఎంత అపురూపమైనదో ప్రపంచ కూడా అంతే దీనికి మనం జీవితంలో చోటు ఇవ్వాలి […]

వర్షాకాలంలో ఆహారం

వర్షంల్లో జలుబు,దగ్గు,గొంతు పొడిబారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలోని మార్పుల వల్లనే ఇలా జరుగుతుంది. వీటికి దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి వెరైటీ టి తాగాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని హానికర బాక్టీరియాను తొలగిస్తాయి. డ్రై ఫుట్స్ శరీరానికి శక్తిని ఇచ్చి. వ్యాధులకు కారణం అయ్యే వైరస్ లను నియంత్రిస్తాయి జీడిపప్పు, ఖర్జురం, బాదం,వాల్ నట్స్ మొదలైనవి ఎంతో ప్రయోజనకరం. పసుపు,మిరియాలు,దాల్చిన చెక్క వంటివి ఆహారంలో భాగంగా ప్రతి రోజు తీసుకొంటే మంచిది.

టీకానే అద్భుత ఆయుధం..అవగాహన కోసం యువతి సాహసం

కరోనా  మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కొండి ప్రియాంక బైక్‌ రైడ్‌ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..గతేడాది అక్టోబరులో హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ […]

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ?

జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్‏లో ఎక్కువగా జుటు రాలిపోతుంటుంది. దీంతో ఎన్నో రకాల సప్లిమెంట్స్, కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కొన్ని లక్షణాలను బట్టి శరీరంలోని ఏ లోపం వలన జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలి. వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో ఉంటే అధిక తేమ […]

హారం వెనక్కి..ఇప్పుడిదే ఫ్యాషన్

హారాలు, గొలుసులు, నెక్‌లెస్‌లు ఇలా నగలన్నీ మెడలో వేసుకుని మురిసిపోతాం. అయితే అవన్నీ గుండెలమీదుగా వేలాడేవే. కానీ ఇప్పుడు ట్రెండ్‌…బ్యాక్‌స్టైల్‌ జ్యూయలరీదే. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ జ్యూయలరీ డీప్‌నెక్‌ బ్లవుజులు, గౌనులు, క్రాప్‌టాప్‌లు…ఇలా అన్నింటిమీదకూ నప్పేస్తుంది.

ఇలా వండుకుంటే పోషకాలు ఫుల్

మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. కొన్ని ఆహార పదార్థాలు పచ్చిగా తీసుకోవడం కంటే వండుకొని తింటేనే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే సులభంగా జీర్ణమవుతాయి కూడా! అదే కాయగూరలు ఉడికించడం, డీప్‌ ఫ్రై చేయడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంది..దుంప […]

చింపాంజితో మహిళ ప్రేమాయణం..

కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్‌మన్స్‌ జంతు ప్రేమికురాలు. తరచూ ఆమె  ‘యాంట్‌వెర్ప్‌ జూ’కు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న […]

చీరె తో మ్యాచింగ్ నగలు

చీరె కట్టాలంటే మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి అంటారు అమ్మాయిలు చీరె కు సరిగ్గా సరిపోయే ఆభరణాలు వెతకటం పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఏకంగా చీరెతోపాటు మ్యాచింగ్ ఫంకీ నగలు వచ్చేశాయి. కాటన్, రాసిల్క్ ,లెనిన్ తరహా ఫ్యాన్సీ చీరెలకు మ్యాచింగ్ గా వస్తున్నా నగల సెట్ అచ్చంగా చీరె రంగులో ఉండే సిల్క్ దారాలతో నో, చెక్క లేదా టెర్రికోట పూసలు కలిపి చీరెకొంగు కో, బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా రూపొందిస్తున్నారు . లెనిన్ […]

ఇవి అందాల సరస్సులు

నెలవంకల్లా ఒంపులు తిరిగిన ఇసుక తిన్నెల మధ్యలో ఆకుపచ్చగా ప్రతిబింబించే నీటి కొలనులు. ఇంత అందమైన ప్రకృతి ప్రసాదం బ్రెజిల్ లోని నేషనల్ పార్క్ లెంకోయిస్ మారనేన్సిస్ లో ఉంది. ఇది నిజానికి ఎడారి. అయితే వర్షం నీరు ని ఇసుక మధ్యని చోటు చేసుకొంటుంది. పోలాల్లో చిన్న వంపుల్లా కనిపించే ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు. వర్షాకాలంలో వేల మంది పర్యాటకులు ఈ అందాల సరస్సుల్లో జలకాలాడేందుకు వస్తారు.