Sunday, 02 Aug, 2026

సుమిత్ర గాగ్రాయ్‌

జార్ఖండ్ లోని మారుమూల పల్లెల్లో హా తెగకు చెందిన సుమిత్ర గాగ్రాయ్‌ మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. స్థానిక ఎజెక్ట్  ఎన్జీవో కోఆర్డినేటర్ గత 12 సంవత్సరాలుగా 24 మారుమూల గ్రామాల్లో 36 వేల మందికి పైగా మహిళల జీవితాల్లో వెలుగు నింపారు. మహిళల పోషక హారాల శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తా రామె. మానసిక ఆరోగ్యం పై సుమిత్ర చేసిన సేవలకు గానూ గత సంవత్సరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ […]

ఎమ్మా రదుకాను

పద్దెనిమిదేళ్ళ ఎమ్మా రదుకాను ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త సెలబ్రెటీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక గ్రాండ్‌స్లామ్‌ లో అడుగు పెట్టి టైటిల్ గెలిచి, ఎన్నో రికార్డ్ లు సాధించిన ఎమ్మా పేరు టెన్నిస్ వర్గాల్లో సుపరిచితురాలే. తొమ్మిదేళ్ళ వయసులో LTA వింటర్ నేషనల్స్ లో ఆమె విజేత. 13 ఏళ్ల వయసులో మొదటి జూనియర్ ఐ ఎఫ్ టి టైటిల్ గెలుచుకుంది. గత వారం న్యూయార్క్ లో జరిగిన యూఎస్‌ ఓపెన్ లో సాధారణ ప్రదర్శన […]

మంచి కథలోస్తే నేను సిద్ధం

అనాబెల్ హర్రర్ కామెడీ కాదు. భయపెట్టే దృశ్యాలు లేవు గనుకే ఆ సినిమా చేద్దాం అనుకున్నాను ప్రతిభావంతులైన కమెడియన్లు సేతుపతి, రాధిక వంటి నటులు ఉండటం వల్ల వాళ్ల ఎనర్జీ కి తగ్గట్టు నటించడం ఎంతో కష్టమైంది అంటోంది తాప్సీ. అనాబెల్ సేతుపతి విజయాన్ని సంతోషంగా స్వీకరించాను అంటోంది. ఇప్పుడు సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను నేను చాలా వరకు బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చేశాను. ఇప్పుడు అలాంటి తరహా కథాంశాలతో అవకాశం వస్తే […]

ఎప్పుడూ ఖండించను

నేను ఏ సినిమా ఒప్పుకొన్న శక్తి వంచన లేకుండా వంద శాతం పని చేస్తూ వస్తున్నాను. కానీ ప్రతి వాళ్ళకీ డెస్టినీ అంటూ ఉంటుంది. ఈ విషయాలన్నీ నా హార్డ్ వర్క్ వల్లే అని చెప్పలేను అది అందరి కృషి అంటోంది సమంత. 2020 లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఓట్లు పడ్డాయి. పెళ్లి నన్ను డిజైరబుల్ గా మార్చిందేమో. ఇంతకు ముందు నాకు ఇలాంటి టాగ్స్ లేవు నేను ఏ ప్రశంశలను అవార్డులను అంత […]

పగుళ్లు మాయం

పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అరటిపండుతో ఈ సమస్య పోతుంది. ఈ పండు సహజసిద్ధమైన స్కిన్ మాయిశ్చరైజర్. పాదాలు తడిలేకుండా తుడుచుకోవాలి తర్వాత అరటి పండు గుజ్జు వేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. పాదాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఓ స్పూన్ వ్యాజిలైన్ నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు […]

మిస్ సింగపూర్ గా నందిత

మిస్ యూనివర్స్ సింగపూర్ కిరీటాన్ని సొంతం చేసుకుంది 21 సంవత్సరాల తెలుగమ్మాయి నందిత. సింగపూర్  మేనేజ్ మెంట్ యూనివర్సిటీ లో డబల్ డిగ్రీ చేసింది. లూయిస్ విట్టన్ విమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 కి మోడల్ గా పనిచేసింది నందిత. కేర్ కార్నర్ సింగపూర్ వాలంటీర్. ఆ సంస్థ తరఫున పేద పిల్లలకు సహాయం చేస్తుంది నందిత. అందాల పోటీలు ఏకంగా ఏడుగురు ఫైనల్ లిస్ట్ లను వెనక్కు నెట్టి మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని […]

ఇవి స్టయిల్ కోట్స్

ఎప్పుడో 1200 ఏళ్ళ క్రితం రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేశారు. అవి కాస్తా ఇప్పుడు అసలైన దుస్తుల కంటే నాజూగ్గా తయారై ఫ్యాషన్ పోకడలు పోతున్నాయి. లాంగ్ రైన్ కోట్ తీసుకుంటే ప్యాంట్, షర్ట్ కుర్తి శారీ ఏదైనా అందంగా కనిపిస్తుంది. చిరుజల్లుల్లో నడిచేందుకు చక్కని ఎంపిక నడుము దగ్గర బెల్ట్ లాగా ఉండే ఫిషర్ మాన్ కోట్ స్టైలిష్ గా ఉంటుంది. వెయిస్ట్  లెంగ్స్ రెయిన్ కోట్ […]

వినీషా కు ఎర్త్‌షాట్ ప్రైజ్

14 సంవత్సరాల వినీషా ఉమాశంకర్ బ్రిటన్ యువరాజు విలియమ్స్ ప్రారంభించిన ఎర్త్‌ షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరుగా చోటు దక్కించుకుంది. పారిశ్రామిక వ్యర్థాలను రీసైక్లింగ్ థీమ్ పర్యావరణాన్ని కాపాడే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ యువరాజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తమిళనాడులోని తిరువణ్ణామలై కి చెందిన సౌరశక్తిని వినియోగిస్తూ మొబైల్ కి ఇస్త్రీ బండి కి రూపకల్పన చేసింది. 15 మంది ఫైన్ లిస్ట్ జాబితా లో వినీషా క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరిలోని లో నిలిచింది.

ఇది పింక్ వాగ్దానం

24 సంవత్సరాల శిల్ప యార్లగడ్డ తయారు చేసిన డ్యూయట్ పింక్ డైమండ్ రింగ్ ను ధరించి తాజాగా టైమ్ మాగజైన్ కవర్ ఫోటో పైన మేఘన్ మార్కెల్ తన భర్త ప్రిన్స్ హారీ తో పాటు ఎంతో అందంగా కనిపించింది. మార్కెల్ వేలికి ఉన్న పింక్ డైమండ్ రింగ్ ను ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పే పింక్ వాగ్దానం కు గుర్తుగా రూపొందించాను అని చెపుతోంది డిజైన్ చేసిన సంస్థ షిఫాన్. ఈ రింగ్ […]

మహిళా సమెలియర్ లక్షిత ఖన్నా

భారతదేశపు మొట్టమొదటి మహిళా వాటర్ సమెలియర్ లక్షిత ఖన్నా. ప్రపంచంలోనే తొలి సర్టిఫైడ్ సమెలియర్స్ మార్టిన్ రీజ్ మషాలను  చూశాక సురక్షితమైన నీళ్ల గురించి సలహా ఇచ్చే కోర్స్ చేసింది  లక్షిత. భోద్ పేరుతో సంస్థ ప్రారంభించి హిమాలయాల్లో 7300 అడుగుల ఎత్తున ఉండే పారో ప్రాంతం నుంచి సేకరించిన నీళ్లను బాటిళ్ల ద్వారా ఇస్తోంది. భోజనం చేస్తే ఎలాంటి నీళ్ళు తాగాలో చెప్పగలిగింది సమెలియర్స్ జల వనరుల రక్షణ వాటర్ రీసైక్లింగ్ గురించి విస్తృతంగా ప్రచారం […]

అది స్త్రీ లకే సాధ్యం

పైలట్, మోటార్‌ కార్‌ రేసర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ గా శిక్షణ షనా పరమేశ్వర్ సాహస ప్రపంచంలో ఒక కొత్త వెలుగు. యుకె లో 2017లో జరిగిన మోడ్‌బాల్‌ ర్యాలీలో పాల్గొన్న తొలి ఇండియన్‌ షన. ఇప్పటివరకు ఆ ర్యాలీ లో మన దేశానికి చెందిన మగవాళ్లు ఎవ్వరూ పాల్గొనలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మోటార్‌ స్పోర్ట్స్‌ షనా పోటీల్లో పాల్గొన్నది. వాహనాల రంగంలో ఆమె అందరికీ సుపరిచితురాలు ఆటోమొబైల్ పరిశ్రమ లో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తోంది. […]

ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక యోహని

మాణికె మాగె హితే పాటను వంద మిలియన్ల వ్యూస్ తో ప్రపంచమంతా నెటిజన్లు చూశారు. ఈ సింహళ గీతాన్ని పాడింది 28 ఏళ్ల యోహని ఇన్‌స్ట్రాగామ్‌ యూట్యూబ్ వివిధ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెల్‌బోర్న్‌ వెళ్లి క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసిన యోహని. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్‌ పాటతో సింగర్ గా గుర్తింపు వచ్చింది. ర్యాప్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. 1993లో కొలంబో లో జన్మించిన యోహని. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్‌ […]

మా పాప నాకు అపురూపం

భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో పానీపూరీలు అమ్మే 28 ఏళ్ల అంచల్ గుప్తా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అతనికి అమ్మాయి పుట్టింది. అయ్యో అమ్మాయా ? అని బంధువులు మిత్రులు అంటుంటే కోపం వచ్చింది. అతనికి తనకు కూతురు పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పేందుకు పాణి పూరి లతో విందు చేశాడు అంచల్ గుప్తా. కోలార్ ప్రాంతంలో భీమ్ కుండ్ రోడ్డు లో మూడు స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు పానీ పూరి ఫ్రీ […]

రోజూ తినాలి

బాదం వాల్ నట్స్ మొదలైన డ్రై ఫ్రూట్స్ తో పోల్చుకుంటే జీడిపప్పులో కొవ్వులు కేలరీలు చాలా తక్కువ ప్రతిరోజు జీడి పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి అంటున్నారు డాక్టర్స్. జీడిపప్పు తో చెడు కొలెస్ట్రాల్ అదుపులోకి రావడం తో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెకు రక్షణ ఇచ్చే మెనో అన్ శాచ్యురేటెడ్ పాలీ అన్  శాచ్యురేటెడ్స్ జీడిపప్పులో సమృద్ధిగా ఉంటాయి. వ్యాధులు ఇన్ ఫ్లమేషన్ లు దగ్గరకు రానివ్వవు జీడిపప్పు […]

సౌందర్యానికి రక్షణ కూడా

కరోనా రోజుల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రతివారు శానిటైజర్లు వాడుతున్నారు. ఈ శానిటైజర్ ను చర్మానికి నప్పుతుందో లేదో ఒకసారి టెస్ట్  చూసుకొని దాన్ని చర్మ సంరక్షణకు వాడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . శానిటైజర్ దీప్ క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు. కాటన్ పైన శానిటైజర్ వేసి ముఖం తుడిస్తే ముఖం పైన మురికి పోతుంది ఫేస్ పౌడర్ అందుబాటులో లేకపోతే హ్యాండ్ శానిటైజర్ తో ముఖం తుడిస్తే చాలు మొహం క్యూటీ లుక్ తో మెరుస్తుంది. మొహం […]

సౌందర్య పోషణకు చాక్లెట్

ఎవ్వరి కైనా ఫేవరెట్ చాక్లెట్. అది తినేందుకే కాదు సౌందర్య పోషణలోనూ ముందుంటుంది. చాక్లెట్ తో చక్కని ప్యాక్ వేసుకోవచ్చు ముందుగా చాక్లెట్ ని కరిగించాలి. అందులో స్పూన్ తేనె, కోడిగుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం వేసి బాగా గిలక్కొట్టాలి మొహం మెడ చేతులకు ప్యాక్ లాగా వేసుకోవాలి. పావుగంట ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే చాక్లెట్ లో కోడిగుడ్డు, తెల్లసొన ఐదారు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం […]

వ్యాలీ ఫంక్

వ్యోమనౌక న్యూ షెపర్డ్ లో ప్రయాణం చేసింది 82 ఏళ్ల వ్యాలీ ఫంక్. 60 ఏళ్ల నుంచి స్పేస్ లో ఎగరాలని కలలు కంటోంది వ్యాలీ ఫంక్. ఆరిజిన్‌ లో ఎయిర్ లైన్ కెప్టెన్ గా పనిచేస్తున్న వ్యాలీ ఫంక్. వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. శిక్షణ ఇచ్చే విమానానికి కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ ఆమె 2000 సంవత్సరంలో రెండు లక్షల డాలర్లతో టికెట్ కొనుక్కుని బెన్ జోసఫ్ వ్యోమనౌక షెపర్డ్ లో 18 సంవత్సరాల […]

కాట్నం వెంకటేశ్వరి

11 సంవత్సరాలు నా భర్త రోడ్డు పైన గుంతలు పూడుస్తూ తిరిగాడు. ఎవ్వరు ప్రమాదాల బారిన పడకూడదని ఆయన ఆశయం రోడ్ డాక్టర్ కాట్నం గంగాధర్ అనే వారు ఆయనను. ఆయన కష్టం లో నాకు భాగం ఉంది. ఆయన కోసం నేను భోజనం వండుకొని వెంటనే ఉండేదాన్ని ఇప్పటికీ ఆ పని కొనసాగించాలని ఉంది. అంటుంది కాట్నం వెంకటేశ్వరి. రైల్వే ఉద్యోగం చేసిన గంగాధర్ గారు రోడ్ల పైన గుంతలు ఉంటే ఎవరి ప్రాణాసికైనా ప్రమాదం […]

నగలకు శుభ్రత అవసరం

రాళ్లున్న దుద్దులు ఉంగరాలు రోజు ధరించే బంగారు ఆభరణాలు శుభ్రంగా కడితేనే వాటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో బయటకు వేసుకోన్న నగల్ని వెనిగర్ తో శుభ్రం చేయాలి. ఒక గ్లాస్ లో కప్పు వెనిగర్ రెండు మూడు చుక్కల టిట్రీ ఆయిల్ వేసి నగలు గ్లాసులో వేసి రెండు మూడు గంటలు అవతల పెట్టాలి. తరువాత ఆ నగల్ని బయటకు తీసి కాస్త వంటసోడా చల్లి మృదువైన బ్రష్  రుద్ధి నీటితో కడిగేస్తే సూక్ష్మజీవులు […]

ఆరోగ్యానికి గ్రీన్ కాఫీ

గ్రీన్ కాఫీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే క్లోరో జెనిక్ యాసిడ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ కాఫీ కోసం పూర్తిగా పచ్చగా ఉండే కాఫీ గింజలను తీసుకొని వేయించకుండా పొడి చేస్తారు. అయితే ఈ కాఫీ మామూలు కాఫీ రుచి ఉండదు. హెర్బల్ టీ లాగా ఉంటుంది కాఫీ విత్తనాల మూలాలు ఒకటే అయినా ఈ గ్రీన్ కాఫీ గింజల్లోని రసాయన […]