Wednesday, 29 Jul, 2026

అదేం తప్పుకాదు

డాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన్వి గీత శంకర్ ఎంతో మందికి ప్రేరణ. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రత్యేకత ఆమె ప్లస్ సైజ్. శరీర పరిమాణం ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా నాజూగ్గా ఉండే అమ్మాయిలే అందగత్తెలు అంటారు కానీ గీతా తన బొద్దుగా ఉండే ఆకృతిని సెలబ్రేట్ చేసుకుంది. ఊబకాయం అధిక బరువు తో ఉన్నానని ఇబ్బంది పడకండి. సన్నగా ఉన్న వారి […]

టాకింగ్ థెరపీ

సెల్ఫ్ టాకింగ్ థెరపీ నా విషయంలో చాలా వర్క్ వుట్ అయింది అంటుంది శృతిహాసన్. మనతో మనం మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనందరిలోనూ ఏవో కొన్ని ఆత్మ న్యూనతా భావాలు ఉంటాయి. వీటి గురించి ఏదో ఒక సమయంలో ఆందోళన పడతాం. మనం కొంత సమయాన్ని కేటాయించుకుని కొన్ని వాస్తవాలు చర్చించుకొని కొన్ని పరిష్కారాలు వెతికితే సమస్యలు దూరం అవుతాయి అంటోంది శృతిహాసన్.

కష్టపడి సాధించాలి

బికనీర్ కు ప్రథమ మహిళ ఎస్పీ ప్రీతి చంద్ర రాజస్థాన్ లో ఆమెను అందరూ లేడీ సింగం అంటారు. 2019 లో ప్రీతి చంద్ర ను చంబల్ లోయలోని కరోలీ జిల్లాలో ఎస్పీగా పని చేశారు. సరిగ్గా మూడు నెలల్లో పేరుమోసిన బందిపోట్లు 10 మందిని అరెస్టు చేశారు. ఆమె 2018 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. సీకార్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్ లో పని చేశారు. తల్లి నిరక్షరాస్యురాలు. నేను ఐ.పి.ఎస్ […]

అమ్మాయిలకు అవకాశాలు తక్కువే

చదువులో ఒక అడుగు ముందున్న ప్రొఫెషనల్ వృత్తుల్లో అమ్మాయిలకు దక్కే అవకాశాలు తక్కువే అంటారు పెప్సికో కంపెనీ మాజీ సి.ఇ.ఓ  ఇంద్రా నూయి ఆమె ఆత్మకథ మై లైఫ్ ఇన్ ఫుల్ లో, సంస్థల్లో రాజకీయాలను అర్థం చేసుకోండి కానీ అందులో కి వెళ్ళకుండా దూరంగా ఉండాలి అంటారు. ప్రతి మహిళకు సంపాదించే హక్కు ఉండాలి అంటారు. తన కోసం తమ పిల్లల కోసం కమ్యూనిటీ కోసం చివరకు సమాజం కోసం మహిళ స్వయం స్వాలంబన సాధించడం […]

సరికొత్త ప్రయోగం

టెక్ అన్ కార్క్ డ్ కంపెనీ సి.ఇ.ఓ మీనాక్షి వశిష్ట్. సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఇంకొక కొత్త ప్రయాణం చేయాలనుకుంది. నగరాలు, పట్టణాలు తిరిగాక ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ రంగంలో పని చేసేందుకు ఎంతో అవకాశం ఉందని తేల్చుకొంది. పవర్ ప్రాజెక్ట్ లలో తయారవుతున్న విద్యుత్ ఎంతో దుర్వినియోగానికి గురవుతోందని గ్రామాలకు విద్యుత్ అందకుండా పోతోంది అని అర్థం చేసుకుంది. ఏవన్ లాట్ అనే పరికరం తన సహోద్యోగుల తో కలసి తయారు చేసింది.స్టెబిలైజర్ వంటిది ఈ […]

వాటర్ గర్ల్

మల్కాన్‌గిరి జిల్లా బోండాఘాటీకి అనే అడవి ప్రాంతానికి చెందిన గిరిజన పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మాలతి ని వాటర్ క్వీన్ అంటారు. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్‌ చదవి మాలతి తాగేందుకు నీళ్లు దొరకని బోండాఘాట్ లో  ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత లతో కలసి తవ్వేసింది. తండ్రి ఇచ్చిన ఏడువేల రూపాయలతో మోటారు కొని బురద నీళ్లు తోడేశాక తియ్యని దాహం తీర్చే నీళ్లు వచ్చాయి. ఈమెను చూసి ఇంకో కొన్ని యువబృందాలు మరో […]

జస్నా సలీమ్ ఇచ్చిన కానుక

జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె […]

దివ్య గోకుల్ నాథ్

ఈ సంవత్సరం ఫోర్బ్స్ విడుదల చేసిన దేశం లో వంద మంది సంపన్నుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలబడింది దివ్య గోకుల్ నాథ్. 2015 లో బైజూస్ లెర్నింగ్ యాప్ సృష్టించింది. దివ్య, సంస్థ పనులు చూసుకుంటూనే బోధన కొనసాగించింది. ఈ యాప్ కు ఇప్పుడు ఏడున్నర కోట్ల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సహా ఎందరో ప్రముఖులు బై జూస్ లో పెట్టుబడులు పెట్టారు. ఈమె సంపద […]

మిసెస్ ఇండియా శృతి కావేరి అయ్యర్

మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకొంది శృతి కావేరీ అయ్యర్. కాహా కాపిటల్ ఇన్ వెస్ట్ మెంట్ అడ్వైజరీ ఫిర్మ్ నడుపుతున్నారామె. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు వ్యాపారం నడుపు కొంటూనే మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారు శృతి కావేరి అయ్యర్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ పట్టా పొందిన శృతి ఆ పోటిల్లోనే  బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ మిసెస్ ఇంటెలిజెన్స్ అవార్డ్ లు గెలుచుకున్నారు.

ఎడడుగుల ఎత్తు  రుమేసా గెల్గి

టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆమె నిలబడి ఉన్నప్పుడు 7 అడుగుల 0.7 అంగుళాల ఎత్తు ఉన్నారు. ప్రపంచంలో జీవించి ఉన్న అతి పొడవైన మహిళ ఈమె రుమేసా కు 18 ఏళ్ళ వయసులో మొదటి సారి టాలెస్ట్ మహిళా టీనేజర్ గా రికార్డ్ సాధించింది. అప్పుడు ఆమె ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు కాళ్లు 30.5 […]

ఇదీ ఒక అవకాశం

నలభై చిత్రాలకు పైగా పని చేసిన మహిళా కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ ఈ వృత్తిలోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలని చెబుతారు. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్‌ డైరక్టర్‌’ పదమే లేదు.దాన్ని దర్శకత్వంలో భాగం అనుకుంటారు కానీ ఈ ప్రొఫెషన్ చాలా ప్రత్యేకం అంటారు పుష్ప ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి ‘పోస్‌ పోరీస్‌’  వెబ్‌ సిరీస్‌తో నాకు పేరొచ్చింది. ఇప్పటికీ 15 వెబ్ […]

మెన్ ఫ్యాషన్ మేకర్ నిటాషా

నిఫ్ట్ లో ప్రొఫెసర్ ని అయినంత మాత్రాన ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూ యార్క్ లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో చదువుకొన్నంత మాత్రాన నాకు అవకాశాలు ఏవీ రాలేదు ఒక పుస్తకంలా హీరో ని అధ్యయనం చేస్తే అతని స్టైల్ మేకర్ కావచ్చు అంటుంది నిటాషా గౌరవ్ స్టయిలింగ్ లో ఒక రూల్ బుక్ ఉంటుంది. దాన్ని పరిధుల్లోనే చేయాలి కానీ నేను చాలాసార్లు రూల్ బుక్ వదిలేసి స్ట్రీట్ లుక్ సృష్టించాను. […]

వండర్ ఉమెన్ ఎక్షా హంగ్మా

సూపర్‌ మోడల్‌ షో కి ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ అకాడమీలో తీసుకొన్న శిక్షణ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఎలాటి పరిస్థితుల నైనా ఎదురుక్కొనే ధైర్యం,త్వరగా నేర్చుకోగలిగే నైపుణ్యం నన్ను లక్ష్యం దిశగా నడిపాయి అంటోంది ఎక్షా హంగ్మా సుబ్బా. ఈ 21 సంవత్సరాల సిక్కిం యువతి బాక్సింగ్ లో జాతీయ క్రీడాకారిణి సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ర్యాంప్‌ మీదకు వస్తే ‘మహీంద్రా గ్రూప్‌’ అధినేత ఆమెను వండర్ ఉమెన్ అని ట్విట్టర్ లో […]

నృత్య నీరాజనం

ఆలయంలో ఒక్క దీపం అయినా వెలిగించాలని ఆశపడతారు. కానీ నా నృత్యాల వల్ల ఒక్క ఆలయానికైనా ప్రాచీన వైభవం వస్తే చాలు అంటుంది హిమాన్సీ కాట్రగడ్డ. ఈమె కూచిపూడి నృత్య కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయలు శిథిలా వస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి ‘టెంపుల్ డాన్స్’ పోస్ట్ చేస్తారు. ఒక్క తెలంగాణా లోనే వెయ్యికి పైగా శివాలయాలు ఉన్నాని అంతకుమించి శిల్పకళా ఉందని ఆ ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాని […]

ఆలియా చాలా ప్రత్యేకం

కాశ్మీర్ లో తొలి మహిళా ఫిట్ నెస్ ట్రైనర్ ఆలియా ఫారూక్. శ్రీనగర్ లోని ఖన్యార్ కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లల తల్లి హార్మోన్ల అసమతుల్యత తో జిమ్ లో చేరిన ఆలియా తానే ఫిట్ నెస్ ట్రైనర్ కావాలనుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో చేరి ఫిట్ నెస్ లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంది. 2012 నుంచి జిమ్ ఇన్స్ట్రక్టర్ గా మారింది. ఈ 9 సంవత్సరాలలో ఆలియా […]

అందానికి యాపిల్

యాపిల్ పండుతో వేసే ప్యాక్ ముఖంపై ముడతలు కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు తగ్గిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ గుజ్జు, నిమ్మరసం పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకొన్న మురికి మృతకణాలు తొలగిపోతాయి. తరచుగా ఈ ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి అలాగే యాపిల్ గుజ్జు పెరుగు నిమ్మరసం కలిపిన ప్యాక్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. చర్మం శుభ్రపడి […]

జనపనార హారాలు

సాంప్రదాయ బంగారు పతకాన్ని తగిలించిన జూట్ నెక్లెస్ లు, హారాలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. సాంప్రదాయ చీరె కట్టు కైనా, వెస్ట్రన్ డ్రెస్ కైనా ఈ జనపనార ఆభరణం అందంగా అమరిపోతుంది. విడిగా నారతో చేసిన గొలుసు లకు పెద్ద పెండెంట్లు జతచేసి అందమైన నగలు తయారవుతున్నాయి. లక్ష్మీ రూపాల దగ్గర నుంచి సిల్వర్, కలపతో చేసిన పెద్ద పెండెంట్లు జతచేసిన రంగుల జనపనార హారాలు ఇప్పటి ట్రెండ్. రంగురంగులుగా వేసుకునే దుస్తుల పైకి ఈ తరహా […]

అత్యంత శ్రీమంతురాలు

యు ఎస్వీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్‌ ‘100 రిచెస్ట్‌ ఇండియన్ జాబితాలో మహిళల్లో 3.28 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 1961 లో యు ఎస్వీ ఏర్పాటయింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో బి.కం చేసిన లీనా బోస్టన్ యూనివర్సిటీ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పుచ్చుకుంది. లీనా మంచి రచయిత్రి. తాత విట్టల్ బాలకృష్ణ గాంధీ జీవిత చరిత్ర పై ఆమె రాసిన బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ఎంతో […]

మేకప్ క్లీనింగ్

బయటకు వెలుతుంటే కాస్తయినా మేకప్ వేసుకోవటం సర్వ సాధారణం. ఆ మేకప్ ను సరిగ్గ తొలగించు కోకపోతే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి దూది ముంచి నీట్ గా తుడిచేసుకోవాలి. దీనితో మేకప్ తో పాటు చర్మంపై పేరుకొన్న మురికి కూడా పోతుంది. కీరా దోస రసం లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి […]

అందాల బొమ్మ

ఓహ్‌ రోజీ’ 22 ఏళ్ల అమ్మాయి జాగింగ్, యోగా వంటివి చేస్తూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి వర్చువల్ గర్ల్ సిడస్‌ స్టూడియో ఎక్స్‌ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. 800 కు పైగా ముఖ శరీర కదలికలను 3డి టెక్నాలజీ ద్వారా సేకరించి ఈమెను సృష్టించారు. ఈ వర్చువల్ అమ్మాయికి ఎన్నో యాడ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. 6 కోట్లకు పైగా డబ్బు రావడంతో […]