Wednesday, 29 Jul, 2026

తెలంగాణ క్వీన్

మిస్ ఇండియా టైటిల్ గెలవటం లక్ష్యం గూగుల్, యూట్యూబ్ ల్లో చూసి అందాల పోటీ లకు కావలసిన అర్హతలను సొంతంగా సాధించుకున్న. ఆత్మవిశ్వాసంతో కిరీటం సాధించుకున్న అంటుంది దీప్తి శ్రీరంగం ఎలాంటి శిక్షణ లేకుండా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం లో పుట్టి దీప్తి హైదరాబాద్ టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. మోడల్, గాయిని, రేడియో జాకీ, […]

నల్లని వలయాలు

కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ  కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో […]

వందేళ్ల నాటి పోస్టర్

ఇప్పుడు మనం కరోనా గురించి భయపడుతూ ఉన్నాము కానీ 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది మరణించి ఉంటారని ఒక అంచనా. ఈ ఫ్లూ స్పెయిన్ కి సంబంధం లేకపోయినా ఈ మహమ్మారి గురించిన వార్తలు స్పెయిన్ మీడియా ఎక్కువ ప్రచురించడంతో ఇది స్పెయిన్ ఫ్లూ గా పేరు తెచ్చుకుంది. అప్పటి పోస్టర్ ఇది మాస్క్ తొడుక్కో చేతులు కడుక్కో దూరం పాటించు ముఖాన్ని ముట్టుకుంటే తదుపరి నాదే మరణం […]

మూడే నిముషాలు చాలు

గంటల కొద్దీ డెస్క్ ల ముందు కూర్చుని పనిచేస్తే శారీరక జీవ క్రియలు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రతి 30 నిమిషాలకు మూడు నిమిషాల చొప్పున అటూ ఇటూ తిరిగినా ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న చిన్న బ్రేక్స్ లో మెట్లు ఎక్కి దిగడం అటూ ఇటూ నడవడం,స్క్వాట్స్ వంటివి ఏమైనా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు అప్పుడప్పుడు మూడు నిమిషాలు బ్రేక్ తీసుకున్న పెద్ద గా […]

ఈ సేవ అపూర్వం

ఎవరికైనా డబ్బు దానం చేయటం తేలిక కానీ శారీరక శ్రమ దానం దానంత తేలిక కాదు. మనం మనిషికీ మనిషికీ మధ్య తేడాలు చూస్తారు. కానీ దేవుని దృష్టిలో మనమంతా సమానం అంటారు రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్  చైర్ పర్సన్ సుధా మూర్తి. ఆమె సంపద విలువ 2480 కోట్లు. సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరు లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో సేవ చేస్తారామె. వంటగదిలో సహాయం. కూరగాయలు కోయడం. ఆవరణ ఊడ్చటం చెత్త బుట్టలు […]

యంగ్ సి.ఈ.ఓ అవానీసింగ్

స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌ సింగ్‌ కుమార్తె అవనీసింగ్‌. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ పాలసీలో ఎమ్‌ఎస్‌ పూర్తిచేసి గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది.  కరోనా కాలంలో కేసులు పెరగటం చూసి కోవిడ్-19 టెస్టింగ్‌ రంగంలోకి దిగింది అవని.  తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్‌’ అనే ఇండిపెండెంట్‌ కంపెనీని స్టార్ట్ చేసింది. ల్యాబొరేటరీల ద్వారా ఆర్టీ–పీసీఆర్‌ టెస్ట్‌ను కేవలం 499 రూపాయలకే  అందించి సంచలనం సృష్టించింది. తర్వాతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టులవైపు మొగ్గుచూపింది.దేశవ్యాప్తంగా […]

క్యాన్సర్ బాధితులకు కొండంత అండ

క్యాన్సర్ బాధితుల కోసం ఎన్నో ఇండో బయోటిక్ పై జెనిక ను ప్రారంభించారు డాక్టర్ నుస్రత్ సంఘమిత్ర ఒడిశా లోని బాలేశ్వర జిల్లా సోరో లోని  కజిమొహల్లా లో పుట్టారు. కెమిస్ట్రీ లో పిజీ, ఐఐఎస్ సీ నుంచి పి హెచ్ డి చేశారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గేలా సాంకేతికతపై దృష్టి సాధించి. బయో మాలిక్యులర్ నానో యంత్రాలు తయారుచేసింది. ఇవి క్యాన్సర్ ఔషధాలను ప్రభావిత కణాలను అత్యంత ఖచ్చితంగా చేరవేస్తాయి. ఇందుకుగాను మాలిక్యులర్ […]

నీటి ఎటిఎంలు

హైడ్రోటెక్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేసింది రీతూపర్ణ. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన రితుపర్ణ అపరిశుభ్రమైన తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఐ ఓ టీ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫై కేషన్ సిస్టమ్ రూపొందించింది. వీటికి ఏరోసియా వాటర్ ఎటిఎం అని పేరు పెట్టారు. లీటర్ నీరు ఒక రూపాయికే అందిస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేని చోట సోలార్ తో అనుసంధానించారు. ప్రభుత్వ సాయంతో ఉత్తరాఖాండ్ కోల్ కత్తా అగర్తల లో 250 కి పైగా […]

అపురూప చిత్రకారిణి

1907-1954 మధ్య జీవించిన చిత్రకారిణి ఫ్రిడా కాయ్లో. ఆమె పేరుతో ఫ్రిడా అనే సినిమా వచ్చింది. 1925 లో 18 ఏళ్ళ ఫ్రిడా ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శరీరం మొత్తం గాయాలే. గాయాల నుంచి కోలుకున్న జీవితాంతం విపరీతమైన నొప్పులతో బాధ పడింది ఫ్రిడా. ప్రమాదం తరువాత ఆమెకు 35 ఆపరేషన్లు చేశారు. తక్కువ కాలమే జీవించిన ఫ్రిడా గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సెల్ఫ్ పోర్ట్రెయిట్ పెయింటర్ ఆమె నేనెప్పుడూ ఊహల్ని […]

స్పూర్తి ఇచ్చే కిరీటం

ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్ ను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కేరళకు చెందిన శృతి సితార. ప్రపంచంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లో స్పూర్తిని విశ్వాసాన్ని నింపేందుకు గాను లండన్ వేదికగా ప్రతిఏటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ పోటీలు జరుపుతారు. ఆన్ లైన్ వేదిక ఈ సంవత్సరం నిర్వహించిన పోటీల్లో ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొన్న ట్రాన్స్ ఉమెన్స్ లో సితార మొదటి ప్లేస్ లో నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.

ఒక్క పాటతో పాపులర్

తెలంగాణ ఉద్యమ గీతాలు జానపద గీతాలు యూట్యూబ్ కోసం పాడేదాన్ని కానీ ఊహించని అవకాశం నా తలుపు తట్టింది. జానపద గాయని గా ఉన్నా నన్ను సామి సామి పాట తో ప్రపంచానికి పరిచయం చేశారు దేవి శ్రీ ప్రసాద్. సినిమా పాట పాడటం అంత ఈజీ కాదు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పదేళ్ల కష్టానికి ఫలితం పుష్పా సినిమా కోసం నేను పాడిన పాట అంటుంది మౌనిక యాదవ్ పుష్ప సినిమాలో పాడిన  సామి సామి […]

ఆమె ముద్దుపేరు హరికేన్

ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన లూసియానా సీనియర్ గేమ్స్ లో నమోదైన ఒక రికార్డు బద్దలు కొట్టింది 100-104 ఏళ్ళ వయసు వారికి జరిగిన 100 మీటర్ల మిషిగాన్ సీనియర్ ఒలంపిక్స్ రేస్ లో జూలియా హాకిన్స్ కేవలం 62 సెకండ్లలో ముగించింది. రన్నింగ్ ట్రాక్ పైన ఈమె పరుగు చూసి జనాలు ఆమెను ‘హరికేన్‌’ అని పిలుస్తున్నారు. జూలియా హాకిన్స్ 2019 లో 50 మీటర్ల రేస్ ను 46.07 సెకండ్లలో పూర్తి చేసిన మొదటి […]

అంజూ కు అరుదైన పురస్కారం  

భారత లాంగ్‌జంప్‌ అథ్లెట్‌దిగ్గజం అంజూ బాబీ జార్జ్ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది యువ అథ్లెట్స్ ను తీర్చి దిద్దటం తో పాటు లింగ సమానత్వం కోసం గళం వినిపించినందుకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆమె సొంతం అయింది. దీనితో డబ్ల్యూ ఏ అవార్డ్  గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అంజూ నిలిచింది. వర్చువల్ గా సాగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో 44 ఏళ్ల అంజు ఈ అవార్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

జార్ బ్రేక్ ఫాస్ట్ నా పేవరెట్

ఇంటి భోజనానికే నా మొదటి ఓటు ,యు ఆర్ వాట్ యు ఈట్ అనే మంత్రం నమ్ముతా ఆచరిస్తా అంటోంది అనుష్కా శర్మ. 33 ఏళ్ళ వయసులో ఆమె ఫిట్ నెస్ రహస్యం వివరిస్తూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇన్ ఎ జార్,తీసుకొంటూ అంటే ముప్పావు కప్పు ఒట్స్,రెండు చెంచాల సబ్జా గింజలు గుప్పెడు నాట్స్,సీడ్స్ వీటిని విడివిడి గా నాన బెట్టి అన్నింటినీ కప్పు పాలతో కలిపి ఫ్రిజ్ లో పెట్టేసి ఉదయం ఈ మిశ్రమానికి […]

స్పీడ్ ఈటర్ డోనట్స్

నా జీవితంలో అత్యంత అద్భుతం అనే అనుకునేది 20కి పైగా గిన్నిస్ రికార్డ్ లు బద్దలు కొట్టటం అంటుంది స్పీడ్ ఈటర్ పేరుపొందిన లేహ్ షట్కేవర్ .వయస్సు 28, చక్కగా సన్నగా కనిపిస్తుంది కానీ తిండి కార్యక్రమం మొదలు పెట్టిందీ అంటే మూడు నిమిషాల్లో 10 జామ్ డోనట్స్ లు 6 వేడివేడి రొట్టెలు తినగలదు. లీటర్ గ్రేవి 1.49 నిమిషాల్లో తాగేయగలదు. స్ప్రింగ్ రోల్స్ దేన్నైనా నిమిషంలో తినేస్తుంది సాధారణంగా మగవాళ్లే ఇలా తిండిపోటీల్లో ఉంటారు. […]

ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్

పూజా దింగ్రా  రాసిన ‘ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్’  పుస్తకం ప్రపంచ గౌరమండ్ కుక్ బుక్ అవార్డ్ ల కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచింది.మ్యాక్రాన్ క్రీన్ అని పిలుస్తారు. ఇండియా లో తొలి మ్యాక్రాన్ స్టోర్సే ప్రారంభించి ఫ్రెంచ్ రుచులను మనదేశంలో అందిస్తూ 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్ షిప్ గా ఎదిగి ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచింది.ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటుచేసుకుంది పూజా  ముంబాయి లో పుట్టి పెరిగిన అమ్మాయి స్విజర్లాండ్ లో […]

కేవలం వ్యాయామమే సాయం

సహజమైన పోషక విలువలు పోకుండా ఆహారంలో మార్పులు తెచ్చి పరిమాణాన్ని ఏమీ తగ్గించకుండా తిని వ్యాయామం యోగ తోనే  శారీరకంగా మానసికంగా ఫిట్ గా తయారయ్యాను అంటుంది స్మృతి ఇరాని. బుల్లితెరపై పేరు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ 45 ఏళ్లకే బరువు బాగా పెరిగింది. ఇటీవల బరువు తగ్గి నాజూకుగా అయిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఒకవేళ ఆపరేషన్ల ద్వారా తగ్గారా అని […]

పారేయకండి పనికొస్తాయి

సౌందర్య ఉత్పత్తులు గడువు దాటితే చెత్తబుట్టలో పారేస్తూ ఉంటారు. కానీ వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫుట్ మ్యాట్ లు మురికి పడితే గోరువెచ్చని నీటిలో గడువు దాటిన ఫేస్ వాష్ వేసి నానబెట్టి కాస్త బ్రష్ వేస్తే కొత్తవి లాగా మెరుస్తాయి. మగ్గులో నీళ్లు ఫేస్ వాష్ షాంపు కలిపి వాహనాలు తుడిస్తే మురికిపోయి మెరుస్తాయి. పెద్ద స్పూన్ నిండా ఉప్పు వంటసోడా ఫేస్ వాష్ కలిపి ఈ మిశ్రమం తో మురికిగా ఉన్న కిచెన్, బాత్ […]

స్త్రీలకు ప్రత్యేకం

నాటక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ ఏర్పాటు చేశారు జ్ఞానం బాలసుబ్రమణియన్  ఈ ఆల్ విమెన్ డ్రామా గ్రూపు నుంచి కాలక్షేప నాటకాలు రావు కనువిప్పు కలిగించే ఇతివృత్తాలతో నాటకాన్ని మలుస్తారు స్టేజీ ఎక్కేముందర ఒక నాటకం ముప్పై సార్లు రిహార్సల్స్ వేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఈ నాటకం గ్రూప్ నుంచి ‘ఎందరో మహానుభావులు’ నాటకం తొలిసారిగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ నాటకాన్ని మూడు […]

దివ్యాంగులకు అండ

మస్కులర్ డిజార్డర్ వల్ల వీల్ చైర్ కు పరిమితమైన స్వర్ణలత గాయనిగా రచయితగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందింది. ఆమె స్థాపించిన స్వర్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తోంది. ఆమె ఫౌండేషన్ తరఫున సారధి పేర తయారు చేసిన ఒక వాహనంలోకి దివ్యాంగులు తమ వీల్ చైర్ తో పాటు ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయచ్చు. సోఫా, బెడ్, వేడి నీళ్లు, టాయిలెట్ […]