Gagana
ఆమె సేవకు గుర్తింపు
ఉత్తర ప్రదేశ్ లో షామిలీ జిల్లాలో ఉంటారు యాస్మిన్ ఆమె కుటుంబ సభ్యులు పదహారేళ్ళ వయస్సులో ఆమె పైన యాసిడ్ దాడి జరిగింది. చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది సంవత్సరాల తరబడి చికిత్స కొనసాగింది. యాస్మిన్ దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జామియా హమ్దార్డ్ యూనివర్సిటీ లో నర్సింగ్ చేసింది 2014లో అబ్దుల్ అహ్మద్ సెంటినరీ ఆస్పత్రిలో నర్స్ గా ఉద్యోగం దొరికింది. ఆమె సేవలకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకుంది. యాసిడ్ […]
డాక్టర్ భక్తి యాదవ్
మన దేశపు మొట్టమొదటి మహిళా ఎంబి.బి.ఎస్ డాక్టర్ భక్తి యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన గైనకాలజిస్ట్ భక్తి యాదవ్ 69 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. 1948 నుంచి 91 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎన్నో వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఏజెన్సీ ప్రాంత మహిళలకు వేల మందికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడినందుకు, ముఖ్యంగా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేసేందుకే ప్రయత్నం చేసినందుకు ఆమెకు భారత […]
డాక్టర్ వి. శాంత
అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]
బయట తిండితో అనారోగ్యం
రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]
లీనా నాయర్
మన చుట్టూ ఉన్న వారందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. దాన్ని వింటే చాలు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే నేను మాట్లాడటం కన్నా ఎక్కువ వినేందుకే ప్రాముఖ్యత ఇస్తాను అంటారు లీనా నాయర్. హిందుస్థాన్ లివర్ లో మానవ వనరుల విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నా లీనా నాయర్ ఫ్రాన్స్ కు చెందిన ఛానల్ అనే లగ్జరీ గ్రూప్ కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల,పరాగ్ అగర్వాల్ ల వరుసలో ఒక […]
మెన్స్ లో మహిళా ఉద్యోగులు
టాటా స్టీల్స్ నౌముండీ ఐరన్ మైన్ లో మొదటిసారిగా 30 మందితో కూడిన ఆల్ ఉమెన్ టీమ్, డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్ ఆపరేషన్…మొదలైన పనుల్లో విధులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 350 మంది అభ్యర్థులతో రాతపరీక్ష ఇంటర్వ్యూల ద్వారా 30 మందిని ఎంపిక చేశారు. ఇందులో చుట్టుపక్కల గిరిజన గ్రామాల వారే ఎక్కువ 2025 లోపు మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉన్న అంటున్నారు టాటా స్టీల్స్ యాజమాన్యం దీనికి తేజస్విని 2.0 అనే పేరుతో […]
షూటర్ రుబినా ఫ్రాన్సిస్
భారతదేశానికి చెందిన పిస్టల్ షూటర్ రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018 ఆసియా పారా గేమ్స్ లో పాల్గొన్నది. జబల్ పూర్ లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ లో ఈ క్రీడను సాధన చేసింది రుబీనా. అంగ వైకల్యం శాపం కాదు అని నిరూపిస్తూ మనోధైర్యంతో విజయ శిఖరాన్ని అధిరోహించింది రుబినా ఫ్రాన్సిస్.
భావినా పటేల్
12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా హస్ముఖ్ భాయ్ పటేల్ గుజరాత్‌లోని సుంధియా అనే చిన్న గ్రామం లో జన్మించింది. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్. 2020 టోక్యోలో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది.జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. ప్రపంచ క్రీడలలో భారతదేశపు ఖ్యాతిని చాటిన భావినా గొప్ప రోల్ మోడల్.
ఏక్తాభ్యాన్
నేనెప్పుడూ క్రీడల గురించి ఆలోచించలేదు మేధావులతో మాట్లాడేందుకు ఇష్టపడేదాన్ని నా అనారోగ్యం నన్ను రోజు వారీ పనులు కూడా చేసుకోనివ్వటంలేదు. ఫిట్ నెస్ కోసం క్రీడలు ఎంచుకొన్న. అవి నా జీవితంలో భాగం అయ్యాయి అంటుంది ఏక్తా భ్యాన్ (Ektha Bhyan ) కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్ క్లబ్ త్రో అథ్లెట్‌గా టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్నది. 2016,2017,2018 లో నేషనల్ పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ […]
అవని లేఖర్
2021 పారాలింపిక్‌లో భారత స్వర్ణ పథకాన్ని సాధించిన విజేతగా నిలిచింది అవని లేఖర్.ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డును కూడా ఆమెనే వరించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఫైనల్ ఈవెంట్‌లో 149.6 స్కోర్‌తో స్వర్ణం సాధించిన అవని పారాలింపిక్ రికార్డ్‌ను తిరగరాసింది. రాజస్థాన్‌లో లా చదువుతోంది అవని .పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదంలో నడుము కింద భాగం పక్షవాతానికి గురయ్యింది అవని ని ఆమె తండ్రి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు .
అనన్య బన్సాల్
బహ్రెయిన్‌లోని మనామాలో ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్‌లో ఎఫ్–20 విభాగం షాట్‌పుట్‌లో భారత్ నుంచి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య.మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్ అనన్య బన్సాల్.పారాలింపిక్‌లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు.వీరిందరితో పోటీపడి రాజితం సాధించిన అనన్య పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపామాలిక ప్రశంసించారు. భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి రాజితం సాధించింది అనన్య.విజయాన్ని జరుపుకోనేందుకు ఇది సరైన రోజు అన్నారు దీపా మాలిక్.
అది జీవన విధానం
ఆయుర్వేదం ఒక చికిత్స పద్ధతి కాదు. ఒక జీవన విధానం దాని ద్వారా మన పూర్వికులు ఆరోగ్యంగా జీవించారు ఆయుర్వేద మూలికలు ఆహారం వండుకునే పద్ధతిలోనే ఆరోగ్యం ఉంది అంటున్నారు గీత రమేష్. కేరళలోని పాలక్కాడ్ లో స్థాపించిన కై రాలీ సెంటర్ ఉద్దేశం ఆయుర్వేద ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావటం అంటారు గీత. ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేసిన వంటకాలు, మసాజ్ లు ఇక్కడ ప్రధాన వైద్య విధానం. అన్ని ఆరోగ్య సమస్యలకు […]
వాళ్లకే మరింత అవసరం
అకాడమీ ఆఫ్ ఐకిడో ఇండియా ద్వారా కలకత్తాలోని మురికివాడల్లో పిల్లలకు యుద్ధ కళల్లో తర్ఫీదు ఇస్తోంది సంయుక్తా రాయ్. అట్టడుగు వర్గాల వారికి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఎక్కువ. అందుకే నా విద్యను వారి దగ్గరకు తీసుకు వెళ్తున్నాను అంటారు సంయుక్త. ఆమె పుట్టింది పెరిగింది ఢిల్లీలో హస్త కళల పై ఉన్న మక్కువతో టెక్స్ టైల్స్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. 19 సంవత్సరాలు గా టెక్స్ టైల్స్ డిజైనింగ్ వ్యాపారం లో ఉన్నాను. యుద్ధ […]
వాళ్ల వస్తువులే ప్రత్యామ్నయం
ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్య పరిష్కారం లో గిరిజన సమాజాలు ప్రత్యామ్నాయాన్ని చూపించగలదు అంటారు అర్చన సోరంగ్ ఆమె ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థ ద్వారా అడవుల్లో నివసించే గిరిజన సమూహాలను సంఘాలుగా ఏర్పరిచి వారు తయారుచేసే ఆకుల ప్లేట్ల దగ్గర నుంచి దంతాలు శుభ్రం చేసుకునే పుల్లల వరకు బయోడిగ్రేడబుల్ అవన్నీ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తున్నారు అర్చన. ఒడిశా లోని టి.ఐ.ఎస్.ఎస్ అటవీ హక్కుల ‘ఆదివాసీ దృశ్యం’ అనే […]
విశ్వ సుందరి హర్నాజ్ సంధు
మీరు మీకే ప్రత్యేకం అని నమ్మండి ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి మీ గురించి మీరే మాట్లాడండి, మీ జీవితానికి మీరే లీడర్. నన్ను నేను నమ్మాను అందుకే ఈరోజు ఈ వేదిక మీద నిల్చో గలిగాను అంటుంది విశ్వసుందరి హర్నాజ్ సంధు.ఇజ్రాయిల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 21 సంవత్సరాల తర్వాత సుస్మితాసేన్,లారాదత్తా తర్వాత మిస్ యూనివర్స్ గా నిలిచిన మూడో భారతీయ యువతి 17 ఏళ్లకే […]
మెహందీ గురు
పెళ్లి కూతుళ్ళకు అందమైన మెహందీ డిజైన్స్ వేయటంలో స్పెషలిస్ట్ వీణా నాగాదా బ్రైడల్,అరబిక్ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటీనటులకు ఆమే మెహందీ పెడతారు తోలి సెలబ్రిటీ పూనమ్ ధిల్లాన్ కత్రినా కైఫ్ వరకు మంచి అందమైన డిజైన్ లతో అలంకరించారు వీణా కరిష్మా కపూర్, దీపికా పదుకొనే ,టీనా అంబానీ,నీతా అంబానీ వంటి ఎందరో సెలబ్రెటీలకు ఆమె మెహందీ వేశారు. మంబై లో ఉంటున్న వీణా ఇక్కడే ఒక ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తూ మెహందీ కోర్స్ నేర్పిస్తున్నారు. […]
రెడ్ క్రాస్ కు తోలి అధ్యక్షురాలు
రెడ్ క్రాస్ సంస్థ కు అంతర్జాతీయ అధ్యక్షురాలిగా దౌత్యవేత్త మిర్జానా స్పొల్జారిక్ ఎగ్గర్ బాధ్యతలు చేపట్టనున్నారు. 160 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సంస్థ రెడ్ క్రాస్ 100 కు పైగా దేశాల్లో విస్తరించి ఉంది. 20,000 మంది శాశ్వత వాలంటీర్స్ ఉన్నారు. ఈ సంస్థ అధ్యక్ష పదవిలోకి ఒక మహిళ రావటం ఇదే ప్రథమం మిర్జానా ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (USDP) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుంది.
ఫోర్బ్స్ లిస్ట్ లో అపర్ణ పూరోహిత్
అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ ఇండియన్ ఒరిజినల్స్ హెడ్ గా పని చేస్తోంది ( Aparna Purohit ) అపర్ణా పూరోహిత్ ది ఫర్‌గాటెన్ ఆర్మీ, బ్రీత్, కామిక్‌స్థాన్, ఇన్‌సైడ్ ఎడ్జ్,మీర్జాపూర్ అండ్ మేడ్ ఇన్ హెవెన్’…వంటి ఇండియన్ కంటెంట్ బ్లాక్ బస్టర్ సిరీస్ నిర్మాణం లో చోటు సంపాదించారు అపర్ణ పురోహిత్ స్వస్థలం ఢిల్లీ. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, యూటీవీ మోషన్ పిక్చర్స్ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు.
లక్ష్యం గురి తప్పదు
రిచా కార్ జీవమే కంపెనీ డైరెక్టర్. ఈ బ్రాండ్ లో దుస్తులంటే అమ్మాయిలకు క్రేజ్ . 2011 లో రిచా ఆమె భర్త కపిల్ కారేకర్ లు జీవామే 5000 స్టయిల్స్ 50 బ్రాండ్స్ 100 రకాల లో దుస్తుల సైజులతో అన్ని వయసుల స్త్రీలను ఆకర్షిస్తోంది. ఆమె ఆన్ లైన్ స్టోర్ ను నెలకు ఐదు మిలియన్ల మంది విజిటర్స్ చూస్తారు. దేన్నయినా సాదించాలి అన్న ఆశయం వుంటే ఆ పని ఇష్టంగా చేస్తే అనుకున్నది […]
సాహసానికి పురస్కారం
ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఐ.ఎం.ఎఫ్ (IMF)కి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు డాక్టర్ హర్షవంతి బిష్త్.1958లో ఏర్పాటైన పర్వతారోహణ కు చెందిన అత్యున్నత సంస్థ ఐ.ఎం.ఎఫ్ కు అర్జున్ పురస్కారం పొందిన హర్షవంతి బిష్త్.1981లో నందాదేవి పర్వత శిఖరాన్ని,1984 లో ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించి ఎన్నో సహస యాత్రల్లో భాగస్వామిగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని సుకాయ్ ఆమె సొంత ఊరు నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో పర్వతారోహణలో కోర్స్ పూర్తిచేశారు హర్షవంతి బిష్త్.
