Gagana
హై హీల్స్ తో ఫీట్
హై హీల్స్ తో రోడ్డుపైన నడుస్తూ ఒక సారి పిల్లి మొగ్గ వేసి సంచలనం సృష్టించింది పరుల్ అరోరా పాతికేళ్ల ఈ జిమ్నాస్ట్ గత సంవత్సరం చీరె తో పిల్లిమొగ్గలు వేసి ఒక్కేరోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. తాజాగా ఆమె పాయింటెడ్ హీల్స్ తో చక్కగా వేసుకొని రోడ్డు పైన నడుస్తూ హఠాత్తుగా బండి చక్రం తిరిగినట్లు గుండ్రంగా తిరిగి మరి పిల్లి మొగ్గ వేసి తిరిగి హై హీల్ పైన నిలబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన […]
స్ట్రీట్ ఆర్టిస్ట్ స్వాతి
తెలుగు లో తొలి మహిళా స్ట్రీట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొన్నది స్వాతి.ఖమ్మం లో పుట్టిపెరిగిన స్వాతి జేఎన్‌టీయూలో ఫైన్‌ఆర్ట్స్ చదివింది.తనతో పాటు చదివే విజయ్ ను పెళ్లి చేసుకోన్నాక ఇద్దరు కలిసి వేసే బొమ్మలతో స్వాతి విజయ్ ఒక బ్రాండ్ అయ్యారు రాష్ట్రంలో తోలి స్ట్రీట్ ఆర్ట్స్ గీశాము. స్ట్రీట్ ఆర్టిస్ట్ ల ఇన్నోవేటివ్ టాలెంట్ వుండి నిజాయితీగా పని చేస్తే చాలు విజయం దక్కుతుంది అంటోంది స్వాతి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల గోడలపై […]
ఆటో చిత్ర
43 సంవత్సరాల ఆటో చిత్ర తమిళనాడులోని విల్లుపురం లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గత 22 సంవత్సరాలుగా ఆమె ఆటో నడుపుతున్నారు ఆమె పుట్టింది పెరిగింది పుదు చెర్రీ లో 1999 లో 21 ఏళ్ల వయసులో చిత్రాలు లైసెన్స్ తీసుకున్నారు పుదు చెర్రీ నుంచి విల్లుపురం వచ్చి ఆటో నడవటం మొదలు పెట్టారు. మహిళ ఆటో నడపడం మగవాళ్లకు ఎగతాళి కావచ్చు కాని మహిళలకు కాదు మహిళలు నా ఆటోలో ప్రయాణించటం భద్రం గా […]
వ్యాపార దిగ్గజం
ఉపాసన టాకు నాకు డిజిటల్ లావాదేవీల చెల్లింపు సంస్థ మొబిక్విక్ కో పౌడర్ డైరెక్టర్ పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, వంటివాటితో పోటీపడి తన సంస్థను పరుగులు పెట్టించారు ఉపాసన.జలంధర్ ఎన్.ఐ.టి లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివిన ఉపాసన మార్కెటింగ్ లో అపారమైన అనుభవం ఉంది. పేపాల్ లో సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ గా పని చేసినప్పుడు అమెరికా వంటి దేశాల్లో డిజిటల్ చెల్లింపులు ఆమెను ఆకట్టుకున్నాయి.పేపాల్ లో చేసిన అనుభవంతో మొబిక్విక్ ను ప్రారంభించారు. […]
యునికార్న్ క్లబ్ లో ప్రియాంక గిల్
ప్రారంభిస్తూనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు వ్యపారం చేసిన వారిని పరిభాషలో యూనికార్న్ ఆంత్ర ప్రెన్యూర్స్ అంటారు. ఎనిమిదేళ్ల క్రితం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ చదువుతూ స్టైలిస్తా ఫ్యాషన్ బ్లాగ్ ని ప్రారంభించారు ప్రియాంక గిల్ దాన్ని ఐదు లక్షల మంది అనుసరించేవారు. తరువాత పాప్ గ్జో అనే సౌందర్య ఉత్పత్తుల ప్లాట్ ఫామ్ ప్రారంభించారు ప్రియాంక. తన సంస్థల అన్నింటినీ కలిపి గుడ్ గ్లామ్ మర్చి దక్షిణ ఆసియాలో అతిపెద్ద సౌందర్య […]
ఫలించిన స్వప్నం
అందాల పోటీల్లో గతంలో ఇండియా ఫైనల్స్ వరకూ వెళ్ళిన ఐశ్వర్య షెరాన్ సివిల్ సర్వెంట్ కావాలనే ఉద్దేశంతో పోటీలు పక్కనపెట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. 2019 యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ లో అఖిల భారత స్థాయిలో 93 వ రాంక్ సాధించారు. 2014లో ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ గా 2016 లో ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ లిస్ట్ గా ఎంపికయ్యారు పరీక్షల్లో విజయం సాధించి బ్యూటీ విత్ బ్రెయిన్స్ […]
అవసర సమాచారం
అలీషా లోబో సింగపూర్ కు చెందిన సంస్థలో పని చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆమె బంధువు కోసం ఎన్నో ఆస్పత్రిల్లో బెడ్ కోసం వెతక వలసి వచ్చింది. రోగి ఆసుపత్రిలో చేరి కోలుకునేందుకు ఎంతో కాలం పట్టింది. ప్రతి సౌకర్యం కోసం ఎన్నో వెతకవలసి వచ్చింది. ఈ అనుభవంతో తన స్నేహితులతో కలిసి కోవిడ్ ఆశా చాట్ బోట్ రూపొందించింది అలీషా లోబో మెడికల్ స్టార్టప్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆక్సిజన్ రీఫిల్లింగ్స్,సిలెండర్ల లభ్యత అంబులెన్స్ లు […]
శ్రీ శక్తి ఛాలెంజ్ విజేత
ముంబై కు చెందిన రోమిత ఘోష్ అడ్మైరస్, ఐహీల్ అనే హెల్త్ టెక్ సంస్థలను స్థాపించింది. ఇవి కొత్త టెక్నాలజీలను తక్కువ ఖర్చుతో దేశీ మార్కెట్‌కు అందిస్తుంటాయి.కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది రోగులు వాడే పి.పి.ఇ కిట్ లు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కావటం అవి ఎంతో ధర తో ఉండటం గమనించింది రోమితా ఘోష్. పైగా వాటిని ఒక్కసారే వాడి పారేయ వలసి ఉండటం చూసి యువీ కిరణాలతో పి పి కిట్ లు […]
గొప్ప సాయం
కోవిడ్ సమయంలో మోడీ రోబో తయారు చేసింది పాట్నా కు చెందిన ఆకాంక్ష కుమారి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆమె తయారు చేసిన మోడీ రోబో రోగి రియల్ టైం డేటాను డాక్టర్లకు చేరుస్తుంది. మందులు సరఫరా ఆహారం సరఫరా నీటిని అందించడం ఆక్సిజన్ అమర్చటం వంటివి చేస్తుంది. దీనితో రాత్రుళ్లు కూడా పని చేయగల 360 డిగ్రీల హై రిజల్యూషన్ కెమెరాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు రోగుల తో మాట్లాడవచ్చు. ఈ ఆవిష్కరణ కు […]
ఐదు రూపాయల తో మాస్క్
కరోనా సమయంలో సృజనకు మేధకు పని చెప్పి గొప్ప ఆవిష్కరణలు చేసి రోగులకు వైద్య సిబ్బందికి ఎంతో తోడ్పడ్డారు చెన్నైకు చెందిన కృష్ణ ప్రియదర్శిని. కరోనా పోరులో మాస్క్ ల అవసరాన్ని గుర్తించింది. ఇంజనీరింగ్ చదివిన కృష్ణ ప్రియదర్శిని రూపొందించిన ఇన్ స్టా మాస్క్ వెండింగ్ మిషన్ తో ఐదు రూపాయల నాణ్యం వేస్తే మాస్క్ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు ఆస్పత్రులు దీన్ని వినియోగిస్తున్నారు.
పురాణాలు ఎంతో ఇష్టం
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జోత్స్నా ఆసియా బుక్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన జ్యోత్స్న యూట్యూబ్ లో చూసిన స్టెన్సిల్ ఆర్ట్ నచ్చడంతో ఆ కళ పైన నెలల తరబడి సాధన చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆమె చిత్రించిన రామ పట్టాభిషేకం, శ్రీకృష్ణుని విశ్వరూపం, ద్రౌపతి వస్త్రాపహరణం వంటి ఘట్టాలు ఆమెకు ఎంతో కీర్తి తెచ్చాయి. అలాగే అవార్డులు తెచ్చిపెట్టాయి. పురాణాలు అంటే ఎంతో ఇష్టం అంటున్న జ్యోత్స్న చిత్రించిన పెయింటింగ్స్ […]
మహిళల సౌకర్యం ధ్యేయం
స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు మహిళలకు నెలసరి ఇబ్బందులకు గానూ ఏడాదికి 12 రోజులు సెలవు ప్రకటించారు. అయితే బై జూస్ సంస్థ ఇంకో అడుగు ముందుకు వేస్తూ సెలవులకు పిల్లల సంరక్షణ సెలవులను కూడా జోడించింది మహిళలకు 12 పీరియడ్ లీవ్స్ తో పాటు 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి ఏడు అదనపు సెలవులను కూడా ఇవ్వనున్నది. అంతేకాకుండా 26 వారాల జీతంతో కూడిన మాతృత్వ సెలవులకు అదనంగా 13 వారాలు జోడించారు.ఈ పదమూడు […]
మాటే తూటా
2021లో మెరిసిన శక్తివంతమైన మీరు మెరుపుల్లో స్నేహ దూబే (28) ఒకరు. భారతదేశపు మొదటి కార్యదర్శి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో ఆమె చేసిన ప్రసంగం, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటోంది. మళ్లీ ఆ మంటలు తానే ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది అంటూ స్నేహ దూబే గర్జన తూటాల కంటే శక్తిమంతమైనవి. గోవా లో పుట్టి పెరిగిన స్నేహ 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ […]
జింజర్ నిర్మాణంలో స్త్రీలు
ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముంబైలోని శాంతా క్రూజ్ లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్ ఆల్ ఉమెన్స్ ఇంజనీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తోంది. నిర్మాణ రంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇదో గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు 371 గదుల తో నిర్మాణం కానున్న జింజర్ లో అందరూ స్త్రీలకే అవకాశం కల్పించటం,నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఇతర అవకాశాలు వెతుక్కునేందుకు ఎందరో మహిళలకు స్ఫూర్తి అనటం లో సందేహం […]
అంతరిక్ష యానం
ఈ సంవత్సరం తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామిగా నిలిచింది బండ్ల శిరీష. ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ వర్జిన్ గెలాక్టిక్ అధినేత తో కలిసి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష తల్లిదండ్రులతో అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసింది. 2015 లో వర్జిన్ గెలాక్టిక్ లో చేరి అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శిరీష […]
సంకల్ప బలం
గడచిన సంవత్సరం లో తన సేవలతో ప్రజలను ప్రభావితులను చేసినందుకు గాను భారత్ లోని అత్యంత శక్తివంతమైన ప్రభావ పూర్వకమైన 21 మంది లో ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021లో పేరుతెచ్చుకుంది మెటిల్డా కుల్లు ఒడిస్సా సుందర్‌ఘర్ జిల్లాలోని గార్దభహల్ గ్రామానికి చెందిన ఆశ వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి తో ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో కోవిడ్ కిట్లు ఇతర సామాగ్రి తో కొండ కోనల్లో లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్ పై […]
మోడలింగ్ నా ఫ్యూచర్
మిస్ యూనివర్స్ గా ఎంపికైన హర్నాజ్ సంధూ నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరివీ భారతీయ మూలాలే గత 35 ఏళ్లలో సింగపూర్ కు చెందిన ఏ అమ్మాయి మిస్ యూనివర్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్లలేదు. జడ్జి అడిగిన ఎన్నో ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానాలు చెప్పాను ఆ నిజాయితీ నన్ను సెమీ ఫైనల్స్ కు తీసుకు వెళ్ళింది అంటుంది నందితా బన్నీ. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే నందిత నేను పుట్టి పెరిగింది సింగపూర్ లో, ఆ దేశపు […]
లింగ వివక్షకు చెక్
కేరళ లోని బాలు శర్రీ (Balu serry ) ప్రభుత్వ పాఠశాలలో తాజాగా విద్యార్థులందరికీ ఒకేలాంటి యూనిఫామ్ కేటాయించి లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో అందరూ ప్యాంట్ షర్ట్ ధరించాలనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. గతంలో విద్యార్థినీలు చుడిదార్ లేదా స్కర్ట్ ధరించే వాళ్ళు ఇటువంటి గొప్ప నిర్ణయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కేరళలో మిగతా పాఠశాలలూ ఈ ఫాంట్ షర్ట్ విధానాన్ని […]
ఈ మార్పు మంచిదే
2021 సంవత్సరం మహిళలకు బ్రహ్మాండమైన స్ఫూర్తిని శక్తి నిరూపించుకునే అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వధువు వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక మంచి మార్పు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది. చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల ప్రసవానంతర మరణాలు నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వేలు చెప్పటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 21 ఏళ్ల […]
గ్రామాల అభివృద్ధి లక్ష్యం
భూపాల్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల జాగ్రతి అవస్థి యు పి ఎస్ సీ పరీక్షల్లో దేశంలోనే రెండవ ర్యాంకర్ గా నిలిచింది మహిళల్లో ఆమెదే ఫస్ట్ ర్యాంక్ మౌలనా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017 లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రతిష్టాకరమైన గేట్ పరీక్ష లోను మంచి ర్యాంకు సాధించింది. ముందుగా బి హెచ్ ఈ ఎల్ లో ఇంజనీర్ గా పనిచేసిన అవస్థి ఇంటి దగ్గర శ్రద్ధగా చదివి పరీక్షలు […]
