Gagana
గణిత మేధావి
గణిత శాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది ఆ సమస్యను పరిష్కరించి 2014లో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు గణిత మేధావి నీనా గుప్తా.2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారామే. గత సంవత్సరం రామానుజన్ ప్రైజ్ కు ఎంపికైన నీనా గుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా లో ప్రొఫెసర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ 2020 జాబితాలో చోటు సంపాదించారు. గణితంలో ప్రతిభకు గాను 2020 లో […]
వైవిధ్యం తప్పనిసరి
టెక్నాలజీ సరిగ్గా ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు వ్యాపారంలో వైవిధ్యం తీసుకురావటం బిజినెస్ సక్సెస్ సీక్రెట్ అంటుంది మౌనిక హెర్నాండెజ్. మహిళలకు వ్యాపార వృద్ధి నిర్ధారించేందుకు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ డిజిటల్ సేవలు అందించే మాస్ గ్లోబల్ కన్సల్టింగ్ హెడ్ మౌనిక హెర్నాండెజ్. మహిళలు తమ వ్యాపార విధానం లో బృందాలతో సరిగ్గా వ్యవహరించే నేర్పు పెంచుకోవాలని చెబుతారు. సామాజిక బాధ్యత తో ఉంటేనే వ్యాపారం లో వృద్ధిలోకి వెళతామంటారు. వ్యాపారికి సమాజానికి ఒక బాంధవ్యం ఉండి తీరాలంటారు.
వనరులు ఉపయోగించుకోండి
ఒక సమస్యను ఎప్పుడు విభిన్న దృక్రోణాలతో చూడాలి అంటారు క్రిష్టినా సిలీ మ్యాగ్జిమమ్ గేమ్స్ సృష్టించిన క్రిష్టినా వరల్డ్ టాప్ బిజినెస్ లీడర్స్ లో ఒకరు. వీడియో గేమ్స్ తయారీలో ఒక థీమ్ సృష్టించటం కష్టం అని అనుకోవచ్చు. కానీ వీడియో గేమ్స్ మన జీవిత విధానం వంటివే వాస్తవ ప్రపంచం నైపుణ్యాలే అందులో జోడిస్తాం ఒక అపూర్వమైన పాత్ర జీవితం నుంచే వస్తుంది అంటుంది క్రిష్టినా. ఉన్న వనరులు శ్రద్ధగా ఉపయోగించుకోండి అంటుంది ఈ అద్భుతమైన […]
గుడ్లగూబల రక్షణ లక్ష్యం
వన్యప్రాణి సంరక్షణ కోసం పూణేలో వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ కన్సర్వేటివ్ సొసైటీ సంస్థను స్థాపించారు డాక్టర్ ప్రాచీ మెహతా.ఈ కృషికి గాను స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు ను అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హౌస్ సెంటర్ (ఐఓసి) వారు ఆమెకు ప్రధానం చేశారు. అడవి గుడ్లగూబల జాతి అంతరించిపోకుండా వాటి పరిరక్షణ కోసం అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారామె. మన దేశంలో ఎంతో జీవవైవిధ్యం ఉంది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత […]
మిస్ భారత్ సుమ వర్ష
అమెరికాలో జరిగిన మిస్ భారత్ యుఎస్‌ఎ జాతీయ స్థాయి అందాల పోటీల్లో విజయం సాధించింది సుమ వర్ష కుప్పిలి. హైదరాబాద్‌కు చెందిన ఆ మిస్ భారత్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేయడం కోసం 2016లో అమెరికా వెళ్ళింది. ఈ అందాల పోటీలకు మిస్ యూనివర్స్ 2021 విజేత హర్‌నాజ్ కౌర్ సంధు జడ్జిగా ఈ పోటీలకు మిస్ యూనివర్స్ 2021 విజేత హర్‌నాజ్ కౌర్ సంధు జడ్జిగా వ్యవహరించారు.మై డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ ప్రతి ఏటా […]
మిసెస్ వరల్డ్ సర్గమ్
ఈ ఏడాది మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని 32 సంవత్సరాల సర్గమ్ కౌశల్ గెలుచుకున్నారు జమ్మూ కు చెందిన కౌశల్ భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి ఇంగ్లీష్ లిటరేచర్ లో పిజి చేసిన సర్గమ్ టీచర్ గా పని చేసారు. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థ తో కలిసి పనిచేస్తారు. అమెరికా లోని వెస్ట్ గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ కాసినో లో జరిగిన పోటీలు 63 దేశాల సౌందర్య రాసుల […]
స్వర్ణం సాధించిన నిఖత్
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సొంతం చేసుకుంది ఆరో మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది మధ్యప్రదేశ్ లోని భూపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణం గెలిచి తెలంగాణ కు వాన్నే తెచ్చింది.
ఉత్తమ పురస్కారం
రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కృతి భారతి జెనివా యాల్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ అవార్డ్ తీసుకున్నారు ‘సారధి ట్రస్ట్’ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి రాజస్థాన్ లోని బాల్య వివాహాలు అడ్డుకొన్నారామె. కాలేజీ రోజుల నుంచే ఎన్నో స్వచ్ఛంద సంస్థ ల్లో పని చేసిన భారతి ఈ బాల్య వివాహాలను దేశానికి సంబంధించిన సమస్య గా భావించారు.
ఆదివాసీల స్వరం జసింత
ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణి కవయత్రి జసింత కెర్కెట్టా తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ 2022 సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలోని భెటియా గ్రామంలో జన్మించిన జసింత వృత్తిరీత్యా జర్నలిస్ట్ తన మాతృభాష అయినా వోరాన్ ఆదివాసి భాష లో ఆదివాసీల సమస్యల పై సమర్థవంతమైన రచనలు చేసింది.
తొలి మహిళ ట్రక్ డ్రైవర్
యోగితా రఘువంశీ మన దేశం లో తొలి మహిళ ట్రక్ డ్రైవర్ ఉత్తరప్రదేశ్ లో పుట్టిన యోగితా కామర్స్ చదివింది పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోతే కుటుంబ పోషణ కోసం తమ సొంత రవాణా సంస్థ లో ట్రక్ నడిపేందుకు శిక్షణ తీసుకొంది హైవేల్లో రాష్ట్రేతర ప్రాంతాలకు రాత్రి వేళ ప్రయాణం చేయడం అలవాటు చేసుకొంది ఇప్పుడు యోగిత దేశ వ్యాప్తంగా గూడ్స్ రవాణా చేస్తోంది మగవాళ్ళ మాత్రమే భారీ వాహనాలు నడుపుతారనే ఆలోచన […]
తొలి మహిళ దర్శకురాలు
1896 లో ఎలీస్ గై బ్లాష్ అనే ఫ్రెంచి మహిళ తన 22వ ఏటా సినీ నిర్మాత గోమాంట్ నిర్మించిన ‘ ది ఫెయిరీ ఆఫ్ ది క్యాబేజీ అనే సినిమాకు దర్శకత్వం వహించింది ఈమె తొలి మహిళ దర్శకురాలు 1906 లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో అధిక బడ్జెట్ తో తీసిన ది బర్త్ ది లైఫ్ అండ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాను అమెరికాలో విడుదల చేసింది ఏలీస్. […]
ఉన్నది ఒకటే జీవితం
మహిళలంటే శక్తికి ప్రతీక వాళ్లకే స్ఫూర్తి దాతవు అయ్యావు అంటే గర్వంగా ఉంటుంది అంటుంది హర్షిణి కన్వేకర్. దేశంలో తొలి మహిళ ఫైర్ ఫైటర్ అగ్ని ప్రమాదాలు, వరదలు, భవనాలు కూలిపోవడం, నదులు పొంగటం వంటి విపత్తుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న హర్షిణి మన కలలను సాధించేందుకు మనకి ఉన్నది ఇదే జీవితం. నచ్చింది చేసే విషయంలో స్త్రీ పురుషులు అన్న తేడా లేదు అంటుంది.
ఆమెకు ఆమే సాటి
యానిమేషన్ రంగ ప్రముఖురాలు హన్సా మోండల్. 2001 లో మొదటి ఆనిమేటెడ్ సిరీస్ నిర్మించారు ‘ సాఫ్టూన్స్ ‘ సంస్థ సిఇఓ ఆమె కార్టూన్ ను ఫేస్ బుక్,యూట్యూబ్ ల్లోకి వీడియోల రూపంలో తీసుకువచ్చారు. కోట్లు వీక్షణలు కలిగిన సాఫ్టూన్స్ కు డిస్నీ తోను సంబంధాలున్నాయి. పోపో మీటర్,నసీరుద్దీన్ షా పంచతంత్ర,హనిబని వంటి కార్టూన్ సిరీస్ స్థానిక భాష లన్నింటిలోకి అనువాదం అయ్యాయి. హాస్యం జోడిస్తూ సందేశం ఇచ్చే కార్టూన్ సిరీస్ నిర్మించటం హన్సా మోండల్ ప్రత్యేకత […]
జవాన్ లకు శిక్షణ
78 ఏళ్ల వయసులో యోగా టీచర్ పద్మిని జోగ్ దేశ సరిహద్దుల్లో సైనికులకు శిక్షణ ఇస్తుంది. సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తున ఉన్న సైనిక శిబిరాలకు వెళ్లి యోగా లో శిక్షణ ఇచ్చారు. సరిహద్దుల్లో రామ్ దేవ్ బాబా నేర్పిన యోగ పాఠాలు పద్మిని జోగ్ ఆమె భర్త ప్రతాప్ జోగ్ నేర్చుకున్నారు. జోగ్ ఆర్మీ ఆఫీసర్ వేలకొద్ది క్యాంప్ లు నిర్వహించి యోగా శిక్షణ ఇచ్చారు పద్మిని. ఆమె క్యాంప్ లు ఆర్మీ లో […]
ఐఓఏ అధ్యక్షురాలిగా ఉష
భారత అథ్లెటిక్స్ చరిత్ర లో ఎన్నో విజయాలు సృష్టించిన అథ్లెట్ పిటి ఉష 58 ఏళ్ల వయసులో ఇంకొక రికార్డ్ సృష్టించారు ప్రతిష్టాత్మకమైన భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ ) అధ్యక్షురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1934 లో మహారాజా మహారాజా యాదవీంద్ర సింగ్ (క్రికెట్) తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్రీడాకారిణి ఉష.
కథ డీల్ చేసేది రచయితే
మీట్ క్యూట్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయటం తీసిన మొదటి ప్రాజెక్టు సక్సెస్ రేట్ సాధించటం నాకు ఈ రంగంలో నిలబడాలనే స్ఫూర్తి ఇచ్చింది. హీరో నాని అక్కగానే కాను ఒక దర్శకురాలిగా నాకు పేరు రావడం నాకు గర్వంగా ఉంది దీప్తి గంట.తొలి ప్రయత్నం లోనే అభిరుచి గల దర్శకురాలిగా అభినందనలు అందుకున్న దీప్తి అమెరికాలో ఇంజనీరింగ్ ఇన్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు. డేటా మేనేజర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు. రాయటం వస్తే కథలో […]
ఎక్కువ శ్రద్ధ అవసరం
ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే అబ్బాయిల కన్నా ఎక్కువ స్థిరత్వం, సహనం, ధైర్యం ఉండాలి. అప్పుడు నచ్చిన రంగంలో కృషి చేసి గెలవచ్చు అంటుంది ఫ్యాషన్ డిజైనర్ గౌరీ నాయుడు.ఇంజనీరింగ్ చదివిన గౌరీ నాయుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నారు చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పూజా హెగ్డే వంటి స్టార్స్ కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. నటీనటులకు దుస్తులు డిజైన్ చేయాలంటే ఫ్యాషన్ ధోరణలు తెలియాలి. పాత్రకి అద్దం పట్టేలా దుస్తులు ఉండాలి. ముఖ్యంగా అభిమానులకు […]
తొలి రైల్వే గేట్ ఉమెన్
భారత దేశపు తొలి మహిళ గేట్ ఉమెన్ గా రైల్వే శాఖ లో 2013 లో చేరింది సల్మా లక్నో కి అనుకోని ఉన్న మాల్వార్ స్టేషన్ లో ఆమె పనిచేసింది రైలు వచ్చే ముందు గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుపక చక్రం తిప్పాలి. ఆ పని సమర్ధవంతంగా చేస్తూ గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసింది సల్మా ఉత్తర ప్రదేశ్ కు చెందిన సల్మా గేట్ ఉమెన్ గా నియమితురాలైనపుడు గేట్ […]
లైంగిక వేధింపులపై పోరాటం
రెడ్ డాట్ ఫౌండేషన్ ప్రారంభించారు ఎల్సామేరీ డిసిల్వా ఎయిర్ లైన్స్ లో పనిచేశారమే లైంగిక వేధింపులు ఎదురుకొనే ఆన్ లైన్ వేదికను రూపొందించారు 2017 లో అమెరికాలో ప్రారంభించిన ఈ వేదికను మలేషియా,అర్జెంటీనా, దక్షణాఫ్రికా, నైజీరియా,కామెరూన్,నేపాల్,ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి. యు.ఎస్,యుకె లతో సహా మరెన్నో దేశాల్లో సేఫ్ సిటీ ఆండ్రాయిడ్ ఐఓస్ లు ఉపయోగిస్తున్న వారెందరో హిందీ తో సహా అనేక భాషల్లో ఈ సేవలు ఉపయోగిస్తూన్నారు ఈ సేవకు గుర్తింపు గా గ్లోబల్ లీడర్ షిప్ […]
ఉత్తమ వ్యాపార వేత్త
భువనేశ్వర్ కు చెందిన సోమా మండల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ట్రెయినీ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు తొలి మహిళ చైర్ పర్సన్ గా చరిత్ర సృష్టించింది సోమా మండల్. అవకాశం అన్నది మీ తలుపు తట్టక పోతే కొత్త తలుపు తయారు చేసుకోండి అంటుంది సోమా.ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమా […]
