Monday, 27 Jul, 2026

మొదటి అడుగు ఆమెదే

హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్.యు.ఎల్) లో మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ గా ఉద్యోగ ప్రస్థాను మొదలుపెట్టిన లీనా నాయర్‌ ఫ్యాక్టరీ ఫ్లోవ్ లో  తొలి మహిళ. అలాగే నైట్ షిఫ్ట్ లో పనిచేసిన తొలి మహిళగా మేనేజ్‌మెంట్ కమిటీ లో తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఫ్యాక్టరీ లో చీఫ్  హ్యూమన్ రిసోర్స్  ఆఫీసర్ గా ఉద్యోగులతో ఎంతో కలిసిమెలిసి ఉండే లీనా నాయర్‌ అక్కడ నుంచే గ్లోబల్ బ్రాంచ్ ఛానల్ సి ఈ ఓ గా ఎదిగారు. లీనా […]

కళలకి ఇది వేదిక

2011 లో సాంప్రదాయ కళలను పరిచయం చేసే ఆన్ లైన్ వేదిక క్రాఫ్ట్ విల్లా కామ్ ప్రారంభించింది మోనికా గుప్తా. గుజరాత్ లోని కచ్ ఇంటి గోడ పై ఏదో ఒక పెయింటింగ్, ఆర్ట్, కనిపిస్తూ ఉంటుంది. ఎంతో అద్భుతమైన కళాకారులు వీళ్లు వారి ఉత్పత్తులు మార్కెట్ చేయడం కోసం ఐఐటి చదువుకున్న మోనికా గుప్తా ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ 12 సంవత్సరాలలో క్రాఫ్ట్ విల్లా ఆరు వేర్వేరు వెబ్ సైట్ల […]

ఆగని పరుగు  

వాసంతి విజయన్ వెటరన్ ఛాంపియన్. వయసు 74, రేస్ ట్రాక్ పైన పరుగులు తీయడం ఆమెకు ఎంతో ఇష్టం.కేరళలోని వయనాడ్ జిల్లా చేర్యాల ప్రాంతంలో పుట్టిన వాసంతి డిస్టిలరీలో కార్మికురాలు గా పనిచేశారు. అక్కడ జరిగే క్లబ్ డే పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్న వాసంతి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న పాల్గొంటూనే ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లోను పలు దేశాల్లో జరిగిన పోటీల్లోనూ ఛాంపియన్షిప్ సాధించారు. ఈ మధ్యనే అలెప్పీలో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ […]

అదే ఈ నృత్యం

‘కాల్ ఫీల్డ్ చిల్డ్రన్ క్లాసెస్’ పేరుతో ఇక్కడ ఆడపిల్లలు మండుతున్న బొగ్గు దగ్గర చక్కని నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్ఖండ్ లోని సహనా పహాడి కి చెందిన అమ్మాయిలు వీళ్లు. ఇక్కడున్న ఓపెన్ కోల్ మైనింగ్ గనుల్లో బొగ్గు దొంగతనం చేసి కడుపు నింపుకొనే కుటుంబాల్లో ఈ బొగ్గు రంగులను చేరదీసి పినాకి రాయ్ తన భార్యతో కలిసి ఓ విదేశీ ఎన్జీవో సహాయంతో చదువు చెప్పించి పుస్తకాలు తిండి ఇస్తున్నాడు. ఉన్నత […]

ఈ గొంతు వినే ఉంటారు

2005 నుంచి ఆంధ్ర, తెలంగాణ, బీహార్, తమిళనాడుల్లో రైల్వే స్టేషన్లలో ఆలూరి గాయత్రి గొంతు వినిపిస్తోంది. రైల్వే లో అనౌన్స్మెంట్ చేసేది సీరియల్స్ లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పేది గాయత్రి నే మూడు దశాబ్దాలుగా ఆమె గొంతు ప్రతి ఇంట వినిపిస్తూనే ఉంది. 2007లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నది గాయత్రి. గజల్స్ పాడుతుంది జింగిల్స్ చేస్తుంది ఆలూరి గాయత్రి స్వరం దశాబ్దాలు గా అందరిని అలరిస్తోంది.

అరుదైన ఘనత

టి.ఎన్.ఎన్.టి.సి ఉద్యోగిగా పదవీ విరమణ చేసి,తమిళనాడు లో బస్ డ్రైవర్ గా కొనసాగుతున్న ఎం.వసంతకుమారి ఇన్నేళ్ల వ్యక్తిగత జీవితంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని డ్రైవర్ గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. తనకంటే 20 ఏళ్ల వయసులో పెద్దయిన వ్యక్తిని పెళ్లాడిన వసంత బతుకుతెరువు కోసం డ్రైవింగ్ ఎంచుకున్నది. 1993 లో ఆమె మహిళా డ్రైవర్ గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టింది. ఆమె పాతిక సంవత్సరాలు సర్వీస్ లో ఒక్క రిమార్క్ […]

అమ్మలు అంతే

ఆశా రనౌత్  ప్రముఖ నటి కంగనా రనౌత్ తల్లి వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు స్వయంగా వ్యవసాయం చేస్తుంది.సేంద్రియ కూరగాయలు పండిస్తారామె కొన్ని రోజుల క్రితం నన్ను చూసేందుకు ముంబై వచ్చింది. మా అమ్మ నా కోసం పండ్లు ప్యాక్ చేసుకొని సూట్ కేస్ లో తెచ్చింది. అవన్నీ పాడయ్యాయి, నేను తినలేక పోయాను కానీ నా మనసు నిండిపోయింది, అంటూ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది కంగనా. అమ్మ ప్రేమంటే అలాగే ఉంటుంది అన్నారు నెటిజన్లు.

అందాల సుందరి మంజు  

మంజు బెంగళూరు,మిస్ ఒరెగాన్ యు ఎస్ ఏ అందాల పోటీల్లో 2023 కిరీటాన్ని అందుకున్నది. బయో ఆస్ట్రోనాటిక్స్ లో పీజీ పూర్తి చేసిన మంజు 2015 లో ఆపరేషన్ పిరియడ్ పేరిట ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల నెలవారి ఉత్పత్తులను అందించారు.పెయింటింగ్స్ విత్ పార్కిన్ సన్ ఎన్జీవో స్థాపించి 12 కాన్వాస్ లున్న పెయింటింగ్ కిట్స్ ఉచితంగా ఇస్తోంది. సిటిజన్ స్కూల్ ప్రొడక్షన్ సిరీస్ లో నాలుగేళ్లుగా నటిస్తోంది. అంతరిక్ష శాస్త్రవేత్తగా సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలందిస్తోంది.

ఇండో పరుగుల రాణి

బ్యాంకాక్ లో జరిగిన 25వ ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో జ్యోతి యర్రాజీ  మహిళల వంద మీటర్ల హర్డిల్స్‌ రేసులో గోల్డ్ మెడల్స్ సాధించింది. 50 సంవత్సరాల ఆశ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా జ్యోతి యర్రాజీ నిలిచింది. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయా గా పనిచేస్తుంది. 2022 సెప్టెంబర్ లో గుజరాత్ లో జరిగిన […]

వందల దుస్తులకు మోడల్

లావుగా ఉంటే ఇబ్బంది అనుకుంటారు కానీ కొన్ని వందల ప్లస్ సైజ్ దుస్తులకు ఆష్నా భగవాని మోడల్. 2014 నుంచి బాడీ పాజిటివిటీ పై వీడియోలు చేస్తున్నా ఆష్నా కు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అధిక బరువుతో వచ్చే ఇబ్బందుల గురించి చక్కగా మాట్లాడుతుంది. ఆష్నా సామాజిక మధ్యమల వల్లే ఇంత పబ్లిసిటీ వచ్చింది అంటుంది ఆష్నా.

ఐదు గిన్నిస్ రికార్డ్ లు

స్కేటింగ్ లో ఐదు గిన్నిస్ రికార్డ్ లు సాధించింది సృష్టి ధర్మేంద్ర శర్మ. 18 సంవత్సరాల సృష్టి మహారాష్ట్ర లోని ఒక చిన్న పల్లెలో పుట్టింది. 11 ఏళ్ల వయసులో తొలి గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఈమెను క్వీన్ ఆఫ్ లింబో స్కేటింగ్ అంటారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం కు సృష్టి అంబాసిడర్ కూడా. రెండు కాళ్ళను వెడల్పుగా చాచి శరీరాన్ని పూర్తిగా ముందుకు వంచి ఇనుప చువ్వల కింద నుంచి దూసుకుపోయే ఆటనే […]

హృదయమూ సుందరమే

పోలాండ్ వేదికగా 67 దేశాల అందగత్తెల తో పోటీపడి సూపర్ నేషనల్ 2023 ఆసియా కిరీటం సాధించింది ప్రజ్ఞ అయ్యగారి. మహిళ సాధికారత కోసం మా శక్తి ఎన్జీవో తో పని చేస్తుంది. పుట్టి పెరిగింది హైదరాబాద్. ఐ ఎన్ ఐ ఎఫ్ డి లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. శాస్త్రీయ నృత్యకారిణి, పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్న సముద్ర తీర ప్రాంతాల వ్యర్థాలను తొలగించటం ఆమెకు ఇష్టమైన పని.

కొండపల్లి బొమ్మలకు ప్రోత్సాహం

చేతివృత్తుల కళాకారులు జీవనోపాధి సహజ రంగుల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కూడా అభిహార సామాజిక సంస్థ కృషి చేస్తోంది  సుధా రాణి ముళ్లపూడి ఐఎఎస్ సిసి  కో ఫౌండర్ చిత్ర సూర్ లో బొమ్మల తయారీకి ముడి సరుకు ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి, డిజైన్లు ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా కొండపల్లి బొమ్మలకు సహజ రంగులు అద్దెలా కృషి చేస్తున్నారు. అలాగే చీరలు తయారీలోనూ సహజ రంగులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు.

మామ్స్ ఆఫ్ వడోదర

ఐదేళ్ల క్రితం ప్రియాంకపూర్ మమ్స్ ఆఫ్ వడోదర పేరుతో ఒక ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్రారంభించారు. ఐదు వేల మందికి పైగా సభ్యులు ఉన్న ఈ గ్రూప్ లో గర్భ ధారణ ప్రసవాల పిల్లల సంరక్షణ వీటివల్ల ఎదురయ్యే వత్తిళ్లు ఫిట్‌నెస్ గురించిన వర్క్ షాప్ లు జరుగుతాయి ఫిట్‌నెస్ గురించి ఏడాది పొడవునా ఈవెంట్స్ ఉంటాయి. మెన్ స్ట్రువల్ హైజీన్ ప్రోత్సహించే  ‘రెడ్ శారీ రన్’ జరుగుతోంది.

ఎల్.ఈ.డి క్లినిక్

పాడైపోయిన ఎల్ ఈ డి బాల్బలు మళ్లీ వెలిగిస్తాము అంటున్నారు డ్రీమ్ లైట్ ఎల్.ఈ.డి క్లినిక్ స్థాపించిన ఐదుగురు మహిళలు దీప అనిత ప్రమోద్, దీపా బాబు, రాధా వేణుగోపాల్, సౌమ్య రతీష్, ప్రమీల గిరీష్ లు భాగస్వాములుగా ఉన్నాయి ప్రాజెక్ట్ లు పాడైన బల్బ్ రిపేర్ చేసి కొత్త వాటిలా వెలిగేలా చేస్తారు. వీధి దీపాలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాడైన వాటిని బాగు చేస్తారు ఎడక్కట్టువాయల్ లోని కంజిరమట్టం రైల్వే స్టేషన్‌కు దగ్గర ఉండే […]

అనితర సాధ్యం

కన్నడ నటి కొరియోగ్రాఫర్ క్లాసికల్ డాన్సర్ రుక్మిణి విజయ్ కుమార్ ఎంతో సులువుగా చీరకట్టుతో జమున స్టిక్స్ విన్యాసాలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షించింది. స్వీట్ బ్యాక్ ఫ్లిప్స్ హోల్ స్టాంట్స్ ఇతరత అన్ని స్టాంట్స్ చీరతోనే చేసి చూపెట్టింది ఆమె రాధా కల్ప డాన్స్ కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా.

మంచుకొండల్లో

మంచులో దూసుకుపోయే స్కీయింగ్ చేయడం అంత తేలిక కాదు. అలాంటి సాహస క్రీడ చీరను ఎంచుకుంది దివ్య మయ్యా. అమెరికాలో ఉండే దివ్య మయ్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్. అంతకు ముందు లెహంగా స్కర్ట్ తో చేసిన భారతీయ సంప్రదాయాన్ని  ప్రతిఫలించే చీరకట్టుతో స్కీయింగ్ చేసింది.

చీర కట్టు ప్రచారం

పూనే కు చెందిన 27 సంవత్సరాల రమాబాయి లత్‌పటే భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రచారం చేస్తూ మహారాష్ట్ర ‘సవారి’ చీరతో ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరింది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సోలో వరల్డ్ టూర్ ప్రారంభించిన రమాబాయి ఒక సంవత్సరం పాటు వివిధ దేశాల్లో పర్యటించి 2024 మార్చి 8న తిరిగి రానున్నది రమాబాయి వ్యాపారవేత్త పైలట్ కూడా.

అంతా ఈజీ

ఫిట్‌నెస్‌ కోచ్ రీనాసింగ్ ఏరోబిక్స్, పుషప్స్, పూలాప్స్ వంటి ఎన్నో రకాల వ్యాయమాలు చీర కట్టుతోనే చేస్తుంది. ఇన్‌స్టా లో ఆమె వ్యాయామాలకు ఎంతోమంది ఫాలోవర్స్. చీరకట్టు చాలా అందం అలాగే వ్యాయామాలు ఎంతో ఆరోగ్యం. ఆ రెండిటి కాంబినేషన్ నా స్టైలే అంటుంది రీనా సింగ్ స్వహతగా ఆమె అన్ని వ్యాయామాలు చీరతోనే చేస్తూ ఉంటుంది.

చీర కట్టుతో మారథాన్

చక్కగా సంబల్‌పురి చేనేత చీర కట్టుకొని మారథాన్ లో పాల్గొన్నది యు.కె లో ఉండే మధు స్మిత జెన్. స్వస్థలం ఒడిశా స్థిరపడింది. యు.కె లో వృత్తి రీత్యా టీచర్ 42.5 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల ఐదు నిమిషాల్లో పూర్తి చేసి చీరకట్టుతో మారథాన్ పూర్తి చేసింది. ఇదేం అసాధ్యం కాదు చీరతోనే చాలా కంఫర్ట్ అన్నది మధుస్మిత.