Gagana
ఇదే తొలిసారి
105 సంవత్సరాల రైల్వే శాఖ చరిత్రలో రైల్వే బోర్డు చైర్మన్ గా ఎంపికై రికార్డ్ సృష్టించింది జయ వర్మ సిన్హా ఇప్పటివరకు మగవాళ్లే బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ లో చదువుకున్న జయవర్మ. 1988 లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. వివిధ హోదాల్లో పని చేశాక ఆమెకు ఈ గౌరవం దక్కింది.
గణేష్ శిల్పి రేష్మా
ముంబై లోని భారీ గణేష్ విగ్రహాలు సగం వరకు రేష్మా ఖాతు తయారు చేసినవే.ఆమె నంబర్ వన్ గణేష్ శిల్పి. ఆమె తండ్రి విజయ ఖాతు. వారసత్వంగా రేష్మా విగ్రహాల తయారీ తన చేతిలోకి తీసుకున్నది. నేను శిల్పి కూతురిని శిల్పం తయారీ నా జీన్స్ లోనే ఉంది అంటుంది రేష్మా.
దీదీ కేఫ్
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్వయం సహాయక సంఘాల చేత ప్రారంభం చేత ప్రోత్సాహం ఇచ్చింది. ఈ అవుట్ లెట్ లు పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. కాఫీ తో పాటు ఎన్నో రకాల స్నాక్స్ ఈ గ్రామీణ మహిళలు నిర్వహించే క్యాంటీన్లలో లభిస్తున్నాయి. యుపి ప్రభుత్వం ట్రయిల్ ప్రాజెక్ట్ వారణాసి లో ప్రారంభించిన ఈ దీదీ కేఫ్ విజయవంతం అయింది. బీహార్ లో దీదీ కి రసోయి, కేరళాలో కుడుంబా శ్రీ పేరుతో మహిళలు నిర్వహించే కేఫ్ […]
చిరుధాన్య రైతు
గిరిజన రైతు సుభాస మెహంత ఉత్తమ రైతు గా రాష్ట్ర జాతీయ పురస్కారం అందుకున్నది. ఒడిశా లోని సింగార్ పూర్ అనే పల్లెకు చెందిన సుభాస రాగి పంట పండిస్తోంది.45 ఏళ్ల సుభాస కు చుట్టుపక్కల ప్రజలు ‘మండియామ’ అంటూ పిలుస్తారు. ఈ ఏడాది గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ జీ 20 సదస్సులో పాల్గొని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నది.
ఐదు రూపాయలే భోజనం
రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి శృంగి ‘ముస్కాన్ కి రసోయ్’ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతుంది. రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి 114 మంది వాలంటీర్ల తో కలిసి స్థానికుల ప్రోత్సాహంతో రోజుకు 1000 మందికి భోజనం పెడుతుంది. ఆ నగరం లోని మూడు ప్రాంతాల కౌంటర్లలో ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు స్వాతి పెట్టే ఐదు రూపాయల భోజనం చేస్తారు.
తొలి గిరిజన పైలట్
నీలగిరి కొండల్లోని బడుగర్ తెగ నుంచి వచ్చిన ఎం.ఎం జయశ్రీ తొలి గిరిజన పైలట్ గా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా లోని ఉల్కన్ ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన జయశ్రీ ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందింది. శిక్షణ కాలం లోనే 70 గంటలు ఆకాశంలో ప్రయాణం చేసిన జయ శ్రీ తానుండే కొండ ప్రాంతాల పిల్లలకు చదువు చెప్పేందుకు ఇష్టపడుతుంది.
వెలుగు నిచ్చింది
ఐ.పి.ఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ అనుకోకుండా చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచింది. ‘పోలీస్ చౌపాల్’ సమావేశంలో వృద్ధురాలు నూర్జహాన్ తాను సంవత్సరాల తరబడి కరెంట్ లేక చీకట్లో బ్రతుకుతున్నానని వయసు మీరిన తర్వాత తనకు ఇప్పుడు ఏమీ కనిపించని స్థితి వచ్చిందని తన ఇబ్బంది చెప్పుకొంది. ఆమె కోరిన నెరవేర్చేందుకు ప్రభుత్వ సాయం కోరే అవకాశం లేక అనుకృతి స్వయంగా నూర్జహాన్ ఇంటికి కరెంట్ సదుపాయం కల్పించారు. ఈ ఇంట్లో వెలిగిన బల్బ్ ని నూర్జహాన్ […]
అడవులు కాపాడండి
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తారు జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమత ప్రియదర్శి. ప్రకృతి ప్రాముఖ్యత కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీ లు తయారు చేశారు. 347 గ్రామాలు స్కూళ్లలో లక్షల మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడివిలో బ్రతికే మూగజీవాలకు ఇబ్బంది కలిగించకుండా సర్దుకు పోవాలని అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రచారం కోసం ఎల్ ఈ డి స్క్రీన్ లో ఏర్పాటు చేశారు.
ఉపాధి మార్గం
పది రూపాయల ఖరీదు తో పసుపు సంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చారు ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రియ సాకు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాక తమిళనాడు లో పసుపు సంచుల తయారీ ని ప్రోత్సాహించారు సుప్రియ.ఎక్కడ చూసినా పసుపు సంచి దొరికే వెండింగ్ మిషన్ లు స్థాపించారు. పది రూపాయలు వేస్తే సంచి బయటకు వస్తుంది. ‘మీడుం మంజాపై’ పేరుతో ఈ పసుపు సంచుల ప్రచారం తమిళనాడు లో సక్సెస్ అయింది. వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
జానపద కళలకు కొత్త వెలుగు
జానపద కళలకు పూర్వ వైభవం ఇవ్వటం కోసం మిమెరాకి సంస్థ స్థాపించాను అంటుంది యోషా ఆమె స్థాపించిన స్టార్టప్ బాందిని అప్లిక్, బని, పట్టచిత్ర, బికనేర్ వంటి కళారూపాలకు కొత్త వెలుగు వచ్చింది.హ్యాండ్ బాగ్స్ పైన అందమైన కళారూపాలకు చిత్రించటం తో వాటికి అద్భుతమైన మార్కెట్ వచ్చింది. ఈమె మార్కెట్ చేసే బ్యాగ్ లు అమెరికా, యు.కె, ఆస్ట్రేలియా,హాంగ్ కాంగ్, సింగపూర్, దుబాయ్ లో అమ్ముడు పోతాయి. వందల మంది కళాకారులకు స్థిరమైన ఆదాయం వస్తోంది.
ఇది అవసరమైన బ్రేక్
డోపమై ఫాస్టింగ్ పేరుతో పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే. ఆమె చెబుతున్న ప్రకారం మన చుట్టూ ప్రపంచంలో ఉండే ఎన్నో ఎక్కువ సౌకర్యాలు ఒత్తిడి పెంచుతాయి.వీటి తో మెదడులో డోపమైన్ పెరుగుతుంది. అందుకే జీవితంలో ఒక బ్రేక్ తీసుకోవాలి. అధిక నిద్ర తిండి అదేవిధంగా అదేపనిగా సోషల్ మీడియాలో తలదూర్చే ఎన్నో అలవాట్లు తగ్గించమని డిజిటల్ ప్రపంచం నుంచి కొద్ది రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యం అంటున్నారు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం కాదు […]
ఉడిపి చీరకు కొత్త వెలుగు
‘కడికె ట్రస్ట్’ పేరుతో ఉడిపి నేత చీరలకు గొప్ప మార్కెట్ తెచ్చిపెట్టారు మమతా రాయ్.దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలోని నేత కళాకారులకు ఉడిపి చీరల నేత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సౌకర్యంగా కళాత్మకంగా కనిపించే ఈ ఉడిపి నేత చీర ఆదరణ తగ్గి కనుమరుగైపోయింది. పర్యావరణ హాని లేని సహజమైన రంగులద్ది తయారు చేసే ఈ నేత చీరలకు ఆన్లైన్ లో అమ్మకాలు పెంచి కళాకారులకు బతుకు తెరువు చూపారు మమత. కడికె ట్రస్ట్ ద్వారా […]
సిలంబం యుద్ధ కళ గ్రేట్
ప్రాచీన యుద్ధ కళ సిలంబం నేర్చుకొని చీర కట్టు తో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఐశ్వర్య మణి వన్నన్ తమిళనాడు కు చెందిన ఈ యుద్ధ కళ ను ఏరికోరి నేర్చుకొన్నది ఐశ్వర్య కర్రలు,కత్తులు,దివిటీలు,లేడి కొమ్ముల వంటి ఆయుధాలని ఈ విద్య లో ప్రయోగిస్తారు. ఈ యుద్ధ కళ లో మహిళలకు శిక్షణ ఇవ్వడం కోసం మాయిషా స్టూడియో స్థాపించి పాఠశాల కళాశాల విద్యార్థినులను ప్రోత్సహిస్తోంది ఐశ్వర్య. 70 ఏళ్ళ వయసులో కూడా ఈ కళను […]
ప్రపంచ స్థాయి ప్రభావం
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ఫిట్నెస్ ఐకాన్స్ యోగ ఇన్ ఫ్లూయెన్సర్ లలో ఒకరు గా ఉంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో ఆమె తీరైన శరీరాకృతి ఎందరికో స్ఫూర్తి.ఆమె వ్యాయామం చేసే విధానం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎన్నో డివిడిలు రిలీజ్ చేసింది శిల్ప. ఆమె యూట్యూబ్ ఛానల్ కు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లున్నారు. మనసు, శరీరం, ఆత్మ పై యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతోంది శిల్పా శెట్టి.
సర్వర్ నుంచి సి ఈ ఓ వరకు
హబ్ స్పాట్ సిఈఓ యామిని రంగన్ ఇంజనీరింగ్ చదువుకున్న యామిని ఎం.ఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లి సర్వర్ గా జాబ్ మొదలుపెట్టింది. చదువయ్యాక ఉద్యోగంలో చేరిన యామిని డ్రాప్ బాక్స్ వర్క్ డే వంటి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో పని చేశారు. తరువాత హబ్ స్పాట్ సి ఈ ఓ అయ్యారు. బిజినెస్ టైమ్స్ ఈమెను అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించింది. యామిని వెంచర్ క్యాపిటలిస్ట్ గా అనేక కంపెనీ లో బోర్డ్ సభ్యురాలిగా […]
అమ్మాయిలకు కొత్త కోర్స్
కేరళ మలప్పురానికి చెందిన రిన్షా పట్టకల్ తొలి మహిళ డ్రోన్ పైలట్ గా చరిత్ర సృష్టించింది. మనదేశంలో ఏరియల్ సర్వైలైన్స్,అగ్రికల్చర్, వెదర్ మానిటరింగ్ వంటి డ్రోన్ ఆపరేషన్స్ కోసం డిజిపిఎ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈ లైసెన్స్ దొరికిన తొలి కేరళ మహిళా డ్రోన్ పైలట్ గా సర్టిఫికెట్ అందుకున్న 18 సంవత్సరాల రిన్షా పట్టకల్ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి.
రాకెట్ ఉమెన్
అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతు కరిధాల్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో పుట్టారు. రీతు. 1997 లో ఇస్రో లో అడుగు పెట్టారు మిషన్ ఎనాలసిస్ డివిజన్ లో ఉద్యోగి గా పనిచేశారు. మంగళయాన్ మిషన్ లో డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్ గా చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ గా ఉన్నారు.ఇక చంద్రయాన్-3 విజయం తనలో అంతులేని విశ్వాసాన్ని నింపిందని చెబుతున్నారు రీతు. నా విజయం మాత్రం టైమ్ మేనేజ్మెంట్ అంటారామె.
మహిళలకు ప్రోత్సాహం
పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ స్వతంత్ర మైక్రోఫిన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోంది. స్వతంత్ర స్టార్టప్ కు ‘గోల్డ్ అవార్డ్’ వచ్చింది. 2016 నుంచి గ్లోబల్ లగ్జరీ ఇన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇ కై ఏషియా కు సి ఈ ఓ గా బాధ్యతలు తీసుకున్నది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకున్నది.
సంతోష సమయం
చంద్రయాన్-3 మిషన్ లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు కల్పన కాళహస్తి. 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. ముందుగా శ్రీహరి కోటలో ఐదేళ్లు పనిచేసి బెంగళూరులోని శాటిలైట్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. గతంలో చంద్రయాన్-2 మంగళయాన్ ప్రాజెక్ట్ ల లోను కీలక బాధ్యతలను నెరవేర్చారు. కల్పనా తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం మద్రాస్ యూనివర్సిటీ లో బిటెక్ ఈ సి ఈ చదివారు. మిషన్ విజయవంతం కావడం నా జీవితంలో సంతోషభరితమైన […]
త్వరలో సూర్యుడిని కలుస్తాం
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో వివిధ విభాగాల్లో 54 మంది మహిళలు పని చేశారు.విక్రమ్ లాండర్ సురక్షితంగా చంద్రుడిపై దిగేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందం లో మానస ఒకరు. గుంటూరు జిల్లా కు చెందిన బొల్లు మానస 2014లో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరారు. చంద్రాయన్-2 కి తన సేవలు అందించారు.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సూర్యుని పైకి త్వరలో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్-1 లో పని చేస్తానని చెబుతున్నారు […]
