Gagana
మంచి పుస్తకం
‘వెస్ట్రన్ లేన్’ ఈ సంవత్సరపు బుకర్ ప్రైజ్ తుది జాబితాలో స్థానం సంపాదించుకొంది. భారతీయ మూలాలున్న బ్రిటిష్ రచయిత్రి చేతనా మారూ రాసిన పుస్తకం చాలా అద్భుతంగా ఉందని విమర్శకులు సైతం మెచ్చుకొన్నారు. గోపీ అనే 11 ఏళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ నవలను ప్రముఖ అమెరికన్ ప్రచురణ సంస్థ ఎఫ్ ఎస్ జీ ప్రచురించింది.
మాకు ప్లాస్టిక్ వద్దు
బార్టన్ బ్యాంక్ స్థాపించిన నీరు యాదవ్ ఊరు ఎంత శుభ్రంగా ఉంచవచ్చు నిరూపించారు రాజస్థాన్ లోని జూన్ జూన్ అనే పల్లెకు సర్పంచ్ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఉపయోగించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులు గ్రామం నిండా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలిగించటం నీరు యాదవ్ గమనించారు. ఆమె పెళ్లిళ్లలో వడ్డెనకు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్ అన్ని కొనేసింది. నీరు యాదవ్ గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యం జరిగిన ఇవే వాడాలని కోరా రామె. ఈ బార్టన్ […]
ఆమె చిత్రాలే స్ఫూర్తి
బిబిసి 100 విమెన్ 2023 లో క్లైమేట్ వయనార్స్ విభాగంలో స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆరతి కుమార్ రావ్ ఆమె పర్యావరణ ఫోటోగ్రాఫిర్ జీవన వైవిధ్యం క్లైమేట్ చేంజ్ అంశాలపై ఫోటోలు డాక్యుమెంటరీ లు తీశారు. భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను కళ్లకు కట్టేలా మార్జిన్ ల్యాండ్స్ ఇండియన్ ల్యాండ్ స్కేప్ ఆన్ ది బ్రింక్ అనే పుస్తకం రాశారు ఆరతి టెడెక్స్ స్పీకర్ కూడా.
ఇంగ్లీష్ టీచర్
ఇంగ్లీష్ పాఠాలు చెపుతోంది యశోదా లోధి ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా లో సిరాతు నగర్ అనే పల్లెటూర్లో ఉంటుంది యశోద. హిందీ మీడియం లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. బంగాళదుంప చేలల్లో కూలి కి వెళ్తుంది. యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. అట్లా నేర్చుకుంటూనే తన సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ పాఠాలు నేర్పటం మొదలు పెట్టింది యశోద. మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో యశోద లోధి […]
అమ్మాయిలే మెకానిక్ లు
కేరళ లో తొలి విమెన్ మెకానిక్ వర్క్ షాప్ ప్రారంభించారు బిన్సీ, మెర్సీ, బింటు అనే ముగ్గురు అమ్మాయిలు కేరళలో కాసరగోడ్ జిల్లాలోని వెస్ట్ ఎలేరి అనే చిన్న గ్రామంలో నుంచి వీరు ముగ్గురు వాహనాల రిపేర్లు మొదలుపెట్టారు. రీబిల్డ్ కేరళ పేరుతో ఆ రాష్ట్రం మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది.వారు ప్రవేశపెట్టిన కుడుంబశ్రీ ఇప్పటికే విజయం సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ముగ్గురు టూ వీలర్ రిపేరింగ్ వర్క్ షాప్ మొదలుపెట్టారు.
170 కోట్ల వితరణ
రోహిణీ నిలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య ఈ సంవత్సరం 170 కోట్ల రూపాయలు సేవా కోసం ఖర్చు చేసి దాతల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. మీరు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం అర్ఘం ఫౌండేషన్, ప్రతిభ గల విద్యార్థులకు ఎక్ స్టెప్ అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నోని అన్న కలం పేరుతో ఆమె పిల్లల కోసం ఎన్నో రచనలు చేశారు.
మహిళల కోసం గోబర్ దియా
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్ పాల్ గ్రామీణ మహిళల కోసం గోబర్ దియా ప్రారంభించారు. ఆవుపేడతో దీపాలు చేయడం మహిళలకు శిక్షణ ఇప్పించారు. గేదెలు, ఆవులు పేడతో పిడకలు చేసి ఎండనిచ్చి పొడిచేసి బంకమన్ను కలిపి చేసే దీపాలు ఉపయోగించిన తర్వాత వ్యర్ధంగా ఏమి మిగలదు ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు గ్రామాల్లో ఉండే మహిళలు.
ఎనిమిదేళ్లకే గుర్తింపు
మణిపూర్ లోని బషిఖోంగ్ లో పుట్టిన లసిప్రియా కంగుజం ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల పర్యావరణ వేత్త గా గుర్తింపు పొందింది.తన ఐదేళ్ల వయసు గల పర్యావరణ రక్షణ. నిరక్షరాస్యత వంటి సమస్యల పై మాట్లాడటం మొదలు పెట్టింది. 2019 లో స్పెయిన్ లో జరిగిన ఐరాస్ సదస్సులో ప్రసంగించే అవకాశం సంపాదించింది.ఈ చిన్నారికి వర్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ది ఇండియా పీస్ ప్రైజ్ అబ్దుల్ కలాం అవార్డులు వచ్చాయి.
ప్రధానిపై పి.హెచ్.డి
ప్రధాని మోదీ పి.హెచ్.డి చేసిన మొదటి మహిళ స్కాలర్ గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. బనారస్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చదివిన పర్వీన్ పి.హెచ్.డి కోసం ‘నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్ షిప్ యాన్ అనలిటికల్ స్టడీ’ అన్న అంశాన్ని ఎంచుకొంది.8 సంవత్సరాల అధ్యయనం చేసి నజ్మా ఈ పి.హెచ్.డి పూర్తి చేసింది.
ఆక్సా చాలా ప్రత్యేకం
అతిపిన్న వయస్కురాలైన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్ గా గుర్తింపు సాధించింది. 11 సంవత్సరాల అక్సా మస్రత్ ‘వాట్ అక్సా సే’ పేరుతో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసింది. ఆక్సా చేసిన వీడియోల్లో పేద రైతులకు క్రీడాకారులు రకరకాల వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉంటాయి.
అద్భుత ప్రతిభ
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన తనిష్క భూపతి రాజు ఆరేళ్ళ వయసు లోనే విల్లు ఎక్కుపెట్టి ఆసియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్లలో 100 బాణాలు లక్ష్యాన్ని తాకేలా వేసి ఆర్చరీ లో తన ప్రతిభను చాటింది.
కృషికి గుర్తింపు
అమెరికా లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ ఈ అవార్డు ఈ సంవత్సరం ఏక్తా కపూర్ కు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా 1995 లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఏక్తా ఇప్పటి కి 134 సీరియల్స్ తీసింది. 17000 గంటల టెలివిజన్ కంటెంట్ అందించింది.45 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
మంచి ఉపాధి
గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి చూపెడుతుంది. ఈ గేమింగ్ లో తన వ్యాపార రక్షత చూపెట్టింది ముంబైకి చెందిన లక్ష్మీ కావోల్కర్ ఇంటరాక్టివ్ ఇ లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్ డిజైన్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. సొంతంగా గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అపార్ గేమ్స్ ప్రారంభించింది.
నాకు నేను తెలుసు
సింపుల్ లైఫ్ స్టయిల్ నా సూత్రం జీవన శైలిలో ఆకస్మిక మార్పులు చేయను. నటన నా ఫ్యాషన్ ప్రేక్షకులకు సంతోషం ఇవ్వటం నాకున్న విలువైన పని అంటుంది సాయి పల్లవి. విభిన్నమైన పాత్రలతో తనకు ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న సాయి పల్లవి మెటీరియల్ అంశాలకు నేను కనెక్ట్ కాలేను. ఏది తప్పు, ఏది ఒప్పు అని తేల్చి జడ్జిమెంట్ లు ఇవ్వలేను కానీ నాకు ఏది ఉత్తమంగా ఉంటుందో నాకు తెలుసు అంటుంది డాక్టరమ్మ.
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉపాధి
ప్లాస్టిక్ వ్యర్థాలతో వస్తువులు తయారు చేస్తారు రాజీబెన్ వాన్కర్ హ్యాండ్ బ్యాగ్ లు, షాపింగ్ బ్యాగ్లు, యోగా మ్యాట్లు, మొబైల్ కవర్లు, పర్సులు, కాలిపట్టలు, చాపలు ఇట్లా ఎన్నో రకాల వస్తువులు ప్లాస్టిక్ వ్యర్థాలతో తీసిన దారాలతో తయారుచేస్తారు. ఈ తయారీని మహారాష్ట్రలోని 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు రాజీబెన్ రాష్ట్రపతి అవార్డ్ తో సహా స్వచ్ఛ సుజాల్ శక్తి సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు ఈ వస్తువుల తయారీ ద్వారా వందల మంది గ్రామీణ […]
అరకోటి మందికి సాయం
మళ్ళీ బడికి (తిరికే స్కూలిల్) పేరుతో 50 లక్షల మంది మహిళలకు ఆర్థిక పాఠాలు చెప్పారు కేరళలోని కుడుంబాశ్రీ మహిళ స్వయం సహాయక బృందం కేరళలోని 14 జిల్లాల్లోని రెండువేల స్కూళ్లలో మహిళలకు ఆర్థిక ప్రణాళిక మైక్రో ఫైనాన్స్ డిజిటల్ లిటరసీ వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణతో ఎంతోమంది మహిళలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టి ఆదాయం పొందుతున్నారు.
పక్షుల సంరక్షణ ఒక బాధ్యత
వందల జాతుల పక్షులకు సంబంధించి పక్షి జల పేరుతో చక్కని పుస్తకం రాశారు శుభ బట్ బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి క్యాంపస్ లో వచ్చి వాలే వందలాది పక్షులను చూస్తూ వాటి జీవితాలను అధ్యయనం చేశారు శుభ బట్.పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఇంటి ముందు నీళ్లతో నిండిన మట్టి పాత్రలు ఉంచండి అంటారు శుభ బట్.అంతరించిపోతున్న అనేక పక్షి జాతులను కాపాడుకోమని పిలుపునిస్తున్నారు శుభ బట్.
పిల్లల కోసం వోబుల్ పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ ల తోనే ఆడటం చూసి దాని పరిష్కారం గా 2022 లో ‘వోబుల్’ వ్యాపారం మొదలు పెట్టాం నేహా శర్మ సౌమ్య జగన్నాథ్, పిల్లల కోసం ఒక కిట్ తయారు చేశారు. అందులో టాస్క్ లతో కూడిన కథలు, రంగుల పుస్తకాలు, చెవులకు హాని కలిగించని హెడ్ సెట్ లు ఉంటాయి. డబ్బు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి ప్రతి వారం వందల్లో కథలు టాస్క్ లు […]
విద్య వైద్యానికి సాయం
సుస్మితా బాగ్చి ఒడియా రచయిత్రి ఢిల్లీ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా పనిచేశారు. భర్తతో కలిసి మైండ్ ట్రీ స్థాపించారు. తమ సంపాదనలో కొంత విద్య,వైద్యం కోసం ఖర్చు చేయాలని ఈ భార్యాభర్తలు ఆలోచన. భువనేశ్వర్ లో 750 పడకల క్యాన్సర్ ఆస్పత్రి పాలియేటివ్ కేర్ కోసం తమ 20 ఎకరాల భూమిని రాసి ఇచ్చారు. బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి కి 832 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 425 కోట్ల విరాళం ఇచ్చారు.2023 […]
గొప్ప పుస్తకం
ప్రొఫెసర్ నందిని దాస్ రాసిన కోర్డింగ్ ఇండియా ఇంగ్లాండ్. మేఘాల ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ పుస్తకం ప్రతిష్టాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 గెలుచుకుంది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ లో నందిని దాస్ ప్రొఫెసర్ యూరోపియన్ల హింస ధోరణి గురించి చెప్పిన కోర్టు ఇండియా పుస్తకాన్ని ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్ గా విశ్లేషకులు కీర్తించారు.
