Gagana
క్యాన్సర్ ను గెలవచ్చు
క్యాన్సర్ వస్తే మరణం దగ్గరైనట్లు కాదు అంటుంది భారతీయ సినీ అగ్రతార మనీషా కోయిరాలా. ఆమె రాసిన హీల్డ్, క్యాన్సర్ గావే మి ఎ న్యూ లైఫ్ అన్న ఆటోబయోగ్రఫీ లో తన క్యాన్సర్ ప్రయాణాన్ని విఫులంగా వివరించారామే. ఇది క్లిష్టమైనది కానీ మన ప్రాణం మనకు విలువైనదే కదా. క్యాన్సర్ తగ్గిపోయే వ్యాధి కానీ దానితో ధైర్యంగా పోరాడాలి అంటుంది మనిషా.ఈ పుస్తకం క్యాన్సర్ రోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
ఆటోమొబైల్ రంగంలో మహిళలు
మొబైల్ రంగంలో అమ్మాయిలకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి జపాన్ కు చెందిన ప్రముఖ టైర్ల కంపెనీ యోకోహామా లో వెయ్యి మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గుజరాత్ లోని దహేజ్ తమిళనాడులోని తిరునల్వేలి ఆంధ్రప్రదేశ్ లోని తిరునల్వేలి టైర్ల తయారీ ప్లాంట్స్ ఉన్నాయి.ఈ ప్లాంట్లలో మహిళలే ఎక్కువ మిషన్ ఆపరేటర్లు,టీమ్ లీడర్, టెక్నీషియన్‌లు మరియు సూపర్‌వైజర్‌లు మహిళలే ఈ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు మహిళలు ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన శిక్షణ లపై దృష్టి పెడితే మంచిది.
అక్కడ లావే అందం
అందంగా ఉండటం అంటే సన్నగా పొట్ట లేకుండా ఉంటారు కదా. మౌరిటేనియా ఆఫ్రికా లో ఆడపిలల్లో బరువుగా ఉంటేనే అందం ఇంటికి ప్రతిష్ట అనుకుంటారు. ఒకవేళ సన్నగా ఉంటే తిండి పెట్టడం లేదని పరువు పోతుందని ఆడపిల్లలను ఫ్యాట్ ఫార్మ్ లో చేర్చి మరి తిండి తినిపిస్తారు. రోజుకి 16,000 కేలరీలు తినాలి. ఆడపిల్లలు పెళ్ళయ్యాక భర్త కూడా భార్య సన్నబడకుండా సరిగ్గా పోషించటం లేదు అనుకుంటారని ఆమెను నిరంతరం తినే లాగా చూస్తారట.
తొలి మహిళ ఆమే
ఆరతి సాహా 1959 లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి ఆసియన్ మహిళగా రికార్డ్ ల కెక్కారు. ఫ్రెంచ్ నుంచి ఇంగ్లాండ్ కు 16 గంటల 20 నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించారు. 1960 లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆరతి సాహా గౌరవార్థం 1999 లో పోస్టల్ డిపార్ట్ మెంట్ స్టాంప్ విడుదల చేస్తే గూగుల్ సంస్థ ఈమె 80వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్ నే క్రియేట్ చేసింది. 1996లో […]
మొదటి బైక్ రైడర్
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోటార్ బైక్ ప్రయాణించిన తొలి భారతీయ మహిళ రోషిని శర్మ. ఉత్తర్ ప్రదేశ్ లోని నరోరా లో పుట్టిన రోషిని ఇంజనీరింగ్ చదివారు. బైక్ పైన ప్రయాణంతో ఇష్టంతో ఆమె ఒంటరిగా 11 భారతీయ రాష్ట్రాల గుండా ప్రయాణం చేసింది తన సోలో బైక్ ట్రిప్ తనకు తీర్థయాత్ర వంటిదే అంటుంది రోషిని ఇంజనీర్ గా పనిచేస్తున్న రోషిని సైక్లింగ్, మౌంటెన్ క్లైమ్బింగ్ కు వెళుతుంది. అప్రమత్తంగా ఉంటే మహిళ లైనా […]
మిస్ వరల్డ్ క్రిస్టినా
110 దేశాలకు చెందిన యువత లతో పోటీపడి మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నది క్రిస్టినా పిస్కోవా ఈమెది చెక్ రిపబ్లిక్. లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డ్యూయల్ డిగ్రీ చేసింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సాయం చేస్తోంది.దేశ విదేశాలు చూడాలనే కోరిక తో మోడలింగ్ కు కట్టాను అని చెప్పే క్రిస్టినా ధేయం.ప్రపంచంలో చదువుకొని అవకాశం లేని పిల్లలకు చదువు చెప్పించాలని ఆమె ప్రత్యేకత ఆమె అందమైన మనసే అన్నారు ప్రేక్షకులు.
బహుముఖ ప్రజ్ఞ
యాక్టర్, రైటర్,బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్,సోషల్ యాక్టివిస్ట్ గా తన ప్రత్యేకత నిరూపించుకుంది మలయాళ మంజు వారియర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్టు కుటుంబ శ్రీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపించింది.కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెండర్ పార్క్ ప్లాట్ ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మంజు క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తోంది. దేశం లోనే అద్భుతమైన భరతనాట్య కళాకారిణి కూడా ‘సల్లాపం’ […]
అత్యంత సాహసి
అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికే అశోక చక్ర పురస్కారం ఇస్తారు భారత ప్రభుత్వం అందించిన అశోక చక్ర నీరజా బానోత్ కు ఆమె మరణానంతరం పొందింది.1981 లో హైజక్ కు గురైన పాన్ ఎ ఎం 73 అనే విమానంలో ప్రయాణికులను కాపాడే క్రమంలో ఆమె తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు అతి చిన్న వయసులో అవార్డు పొందిన మహిళ కూడా నీరజా బానోత్ .
ఎర్త్ ఛాంపియన్
ఉమా మణి సోనీ బిబిసి ఎర్త్ ఛాంపియన్ గా ప్రకటించింది. పెయింటింగ్ ఇష్టపడే ఉమా పగడపు దిబ్బలను చిత్రించేది కానీ కాలుష్యంతో సముద్రంలోని పగడపు దిబ్బలు క్షీణించి పోతున్నాయని తెలుసుకొని డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుని సముద్రపు వాతావరణం స్వయంగా చూసి చిత్రాలు గీసి ప్రచారం చేసింది. ఆమె పై కోరల్ ఉమెన్ పేరుతో డాక్యుమెంటరీ వచ్చింది. ఆమె కదా పుస్తక రూపంలో వచ్చింది. మెరైన్ కన్జర్వేషన్ సంస్థతో కలిసి కృతిమ పగడపు దిబ్బలు నిర్మిస్తోంది ఉమా […]
నీళ్ల చక్రాలు
నీళ్ల కోసం ఆడవాళ్లు చంకన పిల్లల్ని ఎత్తుకొని మైళ్ళ కొద్దీ నడుస్తూ కొండలెక్కి దిగుతూ నెత్తి పైన కుండలు మోయటం చూసి చలించిపోయింది సింథియా కోయినిగ్ ఇందుకు పరిష్కారం గా తేలిగ్గా దొర్లించుకుపోయే నీళ్ల చక్రాలని ఆవిష్కరించింది. ఈమె తయారు చేసిన వాటర్ వీల్ పేరు వెల్లో.ప్రస్తుతం అనేక దేశాలకు ఈ నీళ్ల చక్రాలు పంపిస్తోంది.
మెకానికల్ ఏనుగు మహాదేవ
నటి ప్రియమణి పెటా తో కలిసి కుర్చీలోనే త్రిక్కయిల్ మహాదేవ గుడికి మెకానికల్ ఏనుగు మహాదేవ ను బహుకరించారు. కేరళ లో జరిగే ఎన్నో ఉత్సవాలలో ఏనుగులు పాల్గొంటాయి. వాటిని మాట వినేలా చేసేందుకు మావటి తో వాటిని ఇనుప చువ్వలతో గుచ్చటం తిండి పెట్టకుండా మాడ్చటం వంటి శిక్షలతో అదుపు చేస్తారు ఈ హింస నుంచి ఏనుగులను రక్షించేందుకు ఈ మెకానికల్ ఏనుగు ను బహుకరించింది ప్రియమణి.మూగజీవాలను హింసించకుండా సాంకేతికత సాయంతో సంస్కృతి సంప్రదాయాలు ముందుకు […]
ఆల్ రౌండర్ దీప్తి శర్మ
దీప్తి శర్మ భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.2014 లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ తో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఐసీసీ మహిళా వన్డే కప్ ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ 5 లో నిలిచింది.ఐసిసి టి20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ […]
విహారాలు ఇష్టం
నటి హన్సిక మోత్వానీ ని ‘ట్రావెల్ బీ’ అంటారు ఎక్కువగా టూర్ లు చేసే వాళ్లలో ను ఈమె కూడా ఉంటుంది. యాత్రలు ఇండిపెండెంట్ గా మారుస్తాయి ఒంటరి ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసేందుకు నేను ఎంచుకున్న మార్గం ఇది అంటుంది హన్సిక. ‘నేను హన్సిక’ పేరుతో ఆమె నడిపే యూట్యూబ్ ఛానల్ కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. తన ట్రావెల్ ఫ్యాషన్ ను ఈ యూట్యూబ్ […]
మొదటి పి.హెచ్.డి ఈమెకే
కమలా సొహోనీ భారతదేశానికి చెందిన జీవ రసాయన శాస్త్రవేత్త ఈమె శాస్త్రీయ రంగాలలో పి.హెచ్.డి పొందిన మొట్టమొదటి మహిళ ఆహార పదార్థాలలోని మాంసకృతుల పై పరిశోధనలు చేశారు.నీరా పానీయం పై ఆమె చేసిన పరిశోధనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.రాయిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు మొదటి మహిళా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.1912 లో జన్మించిన కమలా సొహోనీ 1998 లో 86 ఏళ్ల వయసులో మరణించారు.
ఉత్తమం ఈ ఎరీ పట్టు
ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకున్న ఇబా మలై 2016 లో కినిహో పేరుతో ఒక ఏకో బ్రాండ్ ప్రారంభించింది మేఘాలయ లోని రిబోయ్ జిల్లా వుమ్డెన్ అన్న పల్లెలో పుట్టిన ఇబా తన ఊరి వాళ్లకు పట్టుపురుగుల పెంపకం లో ప్రోత్సహించింది ఇక్కడి గిరిజన తెగలు తయారు చేసే పట్టుని వన్య పట్టు లేదా అహింసా పట్టు అంటున్నారు. పట్టుపురుగులను చంపకుండా తీసే ఈ పట్టు ఎంతో మెత్తగా బరువుగా ఉంటుంది. ఈ తయారుచేసే ఏకో ఫ్యాషన్ వేర్ […]
అత్యంత సాహసి
హర్ ప్రీత్ చాంది ని అత్యంత సాహసకురాలుగా చెప్పుకోవచ్చు ఆమె ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్ గా పని చేశారు ఇప్పుడో సాహసం చేశారు అంటార్కిటికా లోని హెర్క్యులెస్ ఇన్ లెట్ నుంచి దక్షిత దృవం వరకు అంటే సుమారు 1130 కిలోమీటర్ల దూరాన్ని 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో నడిచి ఒంటరిగా అత్యంత వేగంగా స్కీయింగ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సాధించారు.2022 లో ఉమెన్ ఇన్ రిఫ్లెక్స్ అవార్డు తోనూ అలాగే ఉమెన్ ఆఫ్ […]
విశేష ఆదరణ
‘టు కిల్ ఎ టైగర్’ విశేష ఆదరణ డాక్యుమెంటరీ రచయిత,దర్శకురాలు నిషా పహుజా. ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది కెనాడియన్ మినీ నిర్మాతలైన జాన్ వాకర్, అలీ కాజిమి తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించింది.2012 లో ఆవిడ రూపొందించిన ది వరల్డ్ బిఫోర్ హర్ డాక్యుమెంటరీ గా గుర్తింపు పొందింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన టు కిల్ ఏ టైగర్ లో 13 ఏళ్ల బాధితురాలు కిరణ్ ఆత్మకథను ఆమె న్యాయ పోరాటాన్ని […]
మళ్లీ ట్రాక్ లో మాలాంబిక
44 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ మాలాంబిక మిశ్రా పాతికేళ్ల పాటు కుటుంబ బాధ్యతల్లో మునిగాక, మళ్ళీ బరిలోకి దిగి పతకాల పంట పండిస్తున్నారు. 1992 నుంచి 1998 మధ్యలో రాష్ట్ర జాతీయస్థాయిలో 52 పథకాలు పొందారు.20 ఏళ్ల పాటు ఉద్యోగం కుటుంబ బాధ్యతల్లో ఉండిపోయి 20 ఏళ్ల తర్వాత మళ్లీ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో పాల్గొన్నారు బంగారు పతకాలు సాధించారు. జీవితంలో ఎప్పుడు అన్ని ముగిసిపోయాయి అనుకోకూడదు మనకోసం అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మనం ప్రయత్నించాలి […]
సరికొత్త రికార్డ్
కేరళ కు చెందిన 71 ఏళ్ల రాధా మణి 1984లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు.ఇప్పటి వరకు 11 హెవీ వాహనాల లైసెన్స్ లు పొందారామే.ఆమె కృషికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం ఇచ్చింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఏ టు జడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించారు రాధా. ఇప్పుడు ఇంజనీరింగ్ డిప్లొమా కోసం చదువుకుంటుంది […]
అపురూప ఆభరణం
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ నిర్వహించిన 71 వ ప్రపంచ సుందరి పోటీలు హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న నీతా అంబానీ ధరించిన చేతి వంకి ఖరీదు 200 కోట్లు. పురుషులు తలకు అలంకరించుకునే సర్పెచ్ ఆభరణాన్ని నీతా అంబానీ వంకీగా మలుచుకున్నారు. ఈ ఆభరణం మొగల్ సామ్రాజ్యానికి చెందినది షాజహాన్ ఇబ్న్, జహంగీర్ షా 1049 అని ఉర్దూ లో చేక్కిన అక్షరాలు ఈ నగకు వేలాడే ఎరుపు రంగు జాతి రాళ్లు పైన కనిపిస్తాయి.పచ్చలు, కెంపులు […]
