Gagana
ధైర్యంగా సోనాలి
సినిమాల్లో నవ రసాలు పండించే నటులు నిజ జీవితంలో వచ్చే ఆటు పోట్లుకు అంత ధైర్యంగా స్పందిస్తారన్న దానికి సోనాలి బింద్రే ఉదాహరణ. ఆమెకు క్యాన్సర్ సోకిన విసయం వెంటనే సోషల్ మిడియాలో అభిమానులతో పంచుకొంది .అందమైన పొడవాటి జుట్టును చికిత్స గురించి పొట్టిగా కత్తిరించి ఉంటే ఒక్క క్షణం కూడా కళ్ళని కన్నీళ్ళతో తడవనియ్యకుండా ధైర్యంగా ఉండి చుట్టు అయిన వాళ్ళు తోడుగా ఉంటే ,ప్రేమించే స్నేహితులు ధైర్యం చెపుతూ చుట్టు నిలబడితే క్యాన్సర్ ఏమిటి […]
పాపాయి కోపం
ప్రపంచాన్ని మార్చేందుకు వ్యక్తులు బాగా చదువుకుని ,మేధావులపై ఎన్నో నైపుణ్యాలతో ఉండనక్కర్లేదు. కాస్త మనసుంటే చాలు. జో క్యారూన్ అనే ఒక ఏడేళ్ళపాప అమ్మమ్మగారింటికి వెళుతూ రోడ్డుపైన కనిపించిన లైన్ మెన్ అనే బోర్డు చూసి లైన్ ఉమెన్ కూడా పనిచేస్తూన్నప్పుడు లైన్ మెన్ అని పెట్టటం ఏమిటని న్యూజిలాండ్ ట్రాన్స్ ఫోర్ట్ అథారీటీకి ఉత్తరం రాసేసింది. రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నప్పడు వాహానదారులకు అప్రమత్తం చేసేందుకు మెన్ ఎట్ వర్క్ అనే బోర్డు పెడతారు జో క్యారూన్ […]
డూప్ లు వద్దన్న
జీవితంలో ఏం చేసినా సినిమాలు మాత్రం మానను ,నేను పుట్టిందే సినిమాల కోసం అంటోంది అమలా పాల్. ఇప్పుడామె నటిస్తున్నా తమిళ చిత్రం కోసం ఫైటింగ్స్ లో డూప్ లేకుండా నటిస్తుంది అమలాపాల్. సినిమా పరంగా హీరోయిన్ ఫైటింగ్ చేయాలి. స్టంట్ సీన్స్ లో డూప్ లని పెడతారు.నాకు అది ఇష్టం లేదు. ఆ సన్నివేశాలకు అవసరమైన స్టంట్స్ నేర్చుకొన్నాను. ఇందుకోసం నా శరీరాన్ని బాగానే కష్ట పెట్టుకొన్నాను. హీరోలే ఫైట్స్ చేయాలి , హీరోయిన్స్ డాన్స్ […]
ఈ వాతవరణం నచ్చింది
చిలసౌలో నటించి వంద మార్కులు సపాదించింది రుహానిశర్మ. ఉత్తరాది నుంచి వచ్చిన దక్షిణాది వాతవరణం నచ్చదంటుంది. రుహాని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. చదువుకునే రోజుల నుంచే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలు పెట్టాను. దీపికా పడుకునే తో కూడా ఓ యాడ్లో నటించాను. ఆ యాడ్స్ చూసి నాకు తెలుగులో అవకాశం వచ్చింది. ఈ సినిమా హీరోకి ఎంత ప్రాముఖ్యం ఉందో హీరోయిన్ గా అంత ప్రాముఖ్యం ఉంది కనుక నాకెంతో పేరు వచ్చింది.మొదటి నుంచి దక్షిణాది సినిమాలంటేనే […]
వాళ్ళతో నాకో అనుభవం
ఏ సినిమా చేస్తున్నా ఆ చిత్రబృందం వాళ్ళతో నాకోక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పాడుతోంది అంటుంది కీర్తీ సురేష్ .తమిళంలో పందెం కోడి సినిమాలో నటించటం అయ్యాక ఆ చిత్రబృందానికి ప్రతి ఒక్కరికీ ఒక్కక్క బంగారు నాణెం ఇచ్చింది కీర్తి. మొదట్లో వెండి నాణేలు ఇచ్చేదాన్ని . మహానటి తర్వాత ఈ బంగారు నాణెలు ఇస్తోంది. నేను డబ్బు కోసం ఈ రంగంలోకి రాలేదు. సినిమా పట్ల నాకుండే తపన కొద్దీ వచ్చాను. ఈ రంగంలో నాపని తీరే […]
ఎవరి సలహాలు వద్దు
బాడి షేమింగ్ గురించి ప్రస్తావన వస్తే మనిషి స్వరూపం గురించి ప్రసక్తి ఎందుకు వ్యక్తుల్లో ప్రతిభ ముఖ్యం.దాన్ని పక్కన బెట్టి రంగు,ఎత్తు,లావు వీటి గురించి మాట్లాడటం ఎంతో దారుణం అంటుంది సోనాక్షి సిన్హా.నన్ను ఇతరులతో పోల్చి చాలా మంది చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు నేనసలు పట్టించుకోను చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఆ ఆకారం గురించి పట్టింపే లేదు.కానీ ఎంత మంది ఎన్నో సలహాలతో నన్ను విసిగించేవారు.నేను ఎంత బరువు తగ్గాలో తగ్గితే ఎలా […]
మంచి పాత్రలు రావాలి
మల్టీ స్టారర్ సినిమాలంటే నాకు ఎంతో గౌరవం కథ డిమాండ్ చేస్తే ఎంతో మంది ప్రతిభావంతులైన వాళ్ళు కలిసి నటిస్తే ఆ కిక్కే గొప్పగా ఉంటుంది అంటుంది శృతి హాసన్. హిందిలో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది ఆమె. సినిమా పరిశ్రమలోకి కొత్తగా వస్తే ఇక్కడే అన్ని నేర్చుకోవటం వేరు కాని నేను సినిమాల్లోనే పుట్టి పెరిగాను అందుకే నాకు ఈ రంగం స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమల సక్సెస్ వెనక గొప్ప కథ […]
ఇప్పుడీ చీరె గొప్ప బ్రాండ్
ప్రత్యేకంగా ఉంటే పది మంది మెచ్చితే అవి బ్రాండ్ అయిపోతాయి. గొల్ల్బామ చీరెల్లాగ చీరాల,గుంటూరు,ఉప్పాడ,పోచంపల్లి ఇవన్ని బ్రాండ్స్. అలాగే తెలంగాణలోని సిద్దిపేటలో తయారయ్యే గొల్లభామ చీరెలు కూడా ఇప్పుడు బ్రాండే. ఎప్పుడో 70 ఏళ్ళ నాడు చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య,రచ్చ నర్సయ్యలు తల పైన పాలకూర, చేతిలో పెరుగు పట్టుకుని వీధిలో నడిచిపోతున్న ఓ మహిళ నీడను చూసి ఆ డిజైన్ లో ఇప్పుడు పట్టు,చేనేత,గొల్ల భామ చీరెళు దేశ విదేశాల్లో సందడి చేస్తున్నాయి.
విమానాలు అద్దెకు
టెక్నాలజీ ఆధారంగా స్టర్టప్ లు పెట్టేసి సక్సెస్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. సొంత ఉత్పత్తులు తయారీ కేంద్రాలు లేకుండానే చక్కని పాఠాలు సృష్టిస్తున్నాయి.అలా చార్టర్డ్ విమానాలు ,హెలి కాఫ్టర్లు అద్దెకిచ్చే జెట్ సెట్ గో రూపోందించింది కనిక టేక్రివాల్. సొంత విమానాలు హెలికాఫ్టర్లు ఉన్న వాళ్ళలో నెట్ వర్క్ రూపొందించి వాటిని అద్దెకు కావాలనుకున్న వాళ్ళతో అనుసంధానం చేయడం ఈ జెట్ సెట్ గో పని. విమాన రంగంలో మహిళలు రాణించలేరు అనే ఎందరు వెనక్కి […]
నేను సౌకర్యంగా ఉంటే చాలు
సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడమే నా అందం రహస్యం అంటుంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్థుతం హలో గురూ ప్రేమ కోసమే లో నటిస్తున్న అనుపమ తనకు ఫ్యాషన్ విషయం ముందే ఉండాలని పట్టింపులేవు అంటుంది. నేను ఇవ్వాల్టి తరం అమ్మాయిని డైరక్టర్ ఒక పాత్ర గురించి చెప్పగానే అందులో ఎలా కనిపిస్తే బావుంటుందో ఊహించేస్తాను. అందం అంటే స్లీవ్ లెసుల్లో ఉండదు.పాత్రోచితంగా పాత్ర ని బట్టి అర్ధం చేసుకుని అలా కనిపించాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా […]
అది నా బాధ్యత
మనసుకు తోచినట్లు ముక్కుసూటిగా మాట్లాడటం కంగనా రనౌత్ కే చెల్లుతుంది. దేశ సమస్యలపైన మీరు ఎందుకు స్పందిచరు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఒకళ్ళని వేలేత్తి చూపించకుండా సమస్యపై గళం విప్పటం ఒక పౌరుడిగా అది అందరి బాధ్యత . విజయాలతో దూసుకు పోయే మమ్మల్ని కెమెరాల్లో బంధించేందుకు క్లిక్కుల వర్షం కురుస్తుంది. అలాంటి తారలు దేశంలోని సామాజిక సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధిస్తున్నా విజయాలకు అర్ధం లేదు. స్టార్ డమ్ అనేది ప్రేక్షకులు […]
13ఏళ్ళు పోరాడిన అమ్మ
పండగకు తనకు తల్లికే కొత్త బట్టలు కొనేందుకు వెళ్ళిన ఉదయ్ కుమార్ ను పోలీస్ లు దొంగతనం కేసులో అనుమానం తో అరెస్ట్ ,అతను కష్టపడి సంపాదించిన డబ్బు దొంగసొమ్మేనని ఆరోపించి తిరిగబడిన ఉదయ్ కుమార్ ని కొట్టి చంపేశారు .అతని తల్లి పద్మవతమ్మ కేరళలోని తిరువనంతపురంలో నివసిస్తుంది.బట్టలు తెచ్చెందుకు వెళ్ళిన కొడుకు శవమై తిరిగొచ్చాడు. పద్మవతమ్మ ఏడ్చి ఉరుకోలేదు. పోలీసులు కె.జితాకుమార్ .ఎస్వీ శ్రీ కుమార్ పైన కేస్ పెట్టింది. 13 సంవత్సరాల పాటు కోర్టుల […]
వాళ్ళ కష్టమే ఎక్కవ
‘ఆయుష్మాన్ భవ’ సినిమా తో తెలుగు తెరపైకి వచ్చింది బెంగళూర్ అమ్మాయి. రన్యా రావ్. కన్నడ ,తమిళ సినిమాల్లో నటించిన రన్యా రావ్ ఇంజనీరింగ్ చదువుతూ వాఘా తమిళ సినిమాతో వెండితెర పైన అడుగుపెట్టింది.నాకు పళ్లియా టైల్స్ ,పరిచల్ యోగా చాలా ఇష్టం. నా పర్సనాలిటీ షేప్ చేసింది అవే. వాఘా సినిమానే నా గుర్తింపు కాశ్మీర్ లో మైనస్ 15 డిగ్రీల్లో షూటింగ్ చేశాను . హై అల్టిట్యూడ్ లో షూటింగ్ కోసం బ్రెక్ చేశాను. […]
అందరూ స్త్రీలే
రీమా కాగ్తీ తీసిన గోల్డ్ సినిమా రాబోతుంది జాతీయ హాకీ క్రీడలో మొదటి గోల్డ్ మెడల్ సంపాదించిన అంశం ఈ సినిమా స్టోరీ .ఒక ఉమెన్ డైరక్టర్ స్పోర్ట్ ఫిలిం డైరక్ట్ చేయటం కూడా ఇదే మొదలు .అక్షయ్ కుమార్ ఇందులో హీరో.ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా కాస్టింక్ డైరెక్టర్ మహిళే ,ఇమె నందిని శ్రీకాంత్, శైలజా శర్మ ప్రొడక్షన్ డిజైన్ చేసింది. కాస్ట్యూమ్స్ పాయల్ సలూజా, సెట్ డెకోరేటర్స్ నికితా జైన్, యాస్మిన్ సేథి.ప్రొడక్షన్ కో […]
ఎంజాయ్ చేశారు
అప్పట్లో ఒకడుండేవాడు,పటేల్ సార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాన్యా హోప్ తన కొత్త సినిమాలో మోటర్ క్వీన్ బైకర్ గా కనబడుతుంది.ఇందుకోసం తాన్యా శిక్షణ తీసుకుంటుంది. మిస్ ఇండియా ఫైనలిస్టుగా మెరిసిన తాన్యా ఈ ట్రెయినింగ్ లో కొత్త రూపంలో కనిపించబోతుందట. మొదట్లో ఈ పాత్ర నేను చేయగలనా లేదా అని భయం వేసింది. నాకు రైడ్ అస్సలు రాదు. రోజుకు రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేసి పర్ ఫెక్ట్ అయ్యాను. కష్టమైన సరే […]
నాకో ప్రత్యేకత కావాలి
గీతగోవిందం సినిమతో రాబోతుంది రస్మికామండన్న. తెలుగు తమిళ సినిమాలలో ఎంతో బిజీగా ఉండి రస్మికా, పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్దగా ఉండాలనుకుంటాను చేసే పాత్ర సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవ్వాలి. నటనకు కాస్తయిన ఆస్కారం ఉండాలి. కేవలం పాటలు, డ్యాన్స్ లు అయితే నాకు నిరాశగా ఉంటుంది. కేవలం డబ్బు కోసమే నటించడం నాకు నచ్చదు. అట్లా అని నా పాత్ర చుట్టు సినిమా మొత్తం తిరగాలని కూడా కాదు. నేను కూడ సినిమాలో […]
సహాసానికి సిద్దం
నటులకు మంచి పాత్ర దొరికితే ఎంత అదృష్టం. మొదట్లో పాత్రల గురించి ఎంత ఆలోచించే దాన్నో బాక్సాఫిస్ ఫలితాల గురించి అంతగానే దిగులుపడేదాన్ని. ఇప్పుడు ఆ తీరు మార్చుకున్నాను. కాస్త మంచి పాత్ర వస్తే ఎన్ని సవాళ్ళకైన సిద్దం కావాలనుకున్నాను. ఫలితాల గురించి ఎదురయ్యే సవాళ్ళ గురించి మనసులో ప్రశ్నలు తీసేశాను అంటుంది కాజల్. నా మనసు సహాసాన్ని కోరుకుంటుంది. దర్శకులు నా కోసం పాత్రలు ఉన్నాయని చెపుతూ ఉన్నంత కాలం నా ప్రయాణం కొనసాగుతుంది. పాత్రల […]
చీరెతో సాహసం
పూణెకి చెందిన శీతల్ రాణే మహాజన్ చీరెకట్టి స్కై డైవింగ్ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర నవారీ చీరె కట్టి థాయ్ లాండ్ లో 13వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి కిందకు దూకిన మహిళగా సరికొత్త రికార్డు దక్కించుకుంది.తొమ్మిది గజాల పొడవున్న ఆ భారీ చీరెను కట్టుకునేందుకు తాను భారీ కసరత్తు చేయల్సి వచ్చిందని చెబుతుంది శీతల్. ఈ స్కై డైవింగ్ తో కలిపి ఆమె ఇప్పటిదాక 18 జాతీయ రికార్డులు 6 అంతర్జాతీయ […]
అత్యున్నత పురస్కారం
నాలుగు దశాబ్దాలుగా కూచిపుడి నృత్య సాధన చేస్తున్న దీపికా రెడ్డి 2011వ సంవత్సరానికి గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు.ఆమె తల్లి రాధికా రెడ్డి నృత్య వారసత్వమే తాను అందిపుచ్చుకున్నదంటారు దీపికారెడ్డి.ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు అందుకున్నారు.2016లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందింది. తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం అందుకున్నారు,విదేశాల్లో మొత్తం 30 దేశాల్లో ప్రదర్శన లిచ్చారు. వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు ఆమె.
నేర్చుకుని పాడారు
బెంగళూరు విశ్వ విద్యాలయంలో సంగీతంలో స్నాత కోత్తర విద్య పూర్తి చేసిన ఎం.ఎస్ షీల కేంద్ర సంగీత నాటిక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. అమె తల్లి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కన్నడ దేశంలో పుట్టిన తెలుగంటే మక్కువతో చక్కగా తెలుగు నేర్చుకుని త్యాగరాజు,శ్యామ శాస్త్రీ వంటి వాగ్గేయకారుల సాహిత్యాన్ని అర్దం చేసుకుని నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగునాట ఎన్నో కచేరీలు చేశారు షీలా. శాస్త్రీయ సంగీతానికి ఇవి మంచి రోజులంటారు షీల.
