Saturday, 25 Jul, 2026

ఆమెకు 118 ఏళ్ళు

బొలివియాకు చెందిన జూలియా ఫ్లోర్స్ కోల్కే 118 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ఆక్టోబర్ 28న ఆమెకు 119 ఏళ్ళు వస్తాయి. 1900 సంవత్పరం ఆక్టోబర్ 26న తేదిన జన్మించిన జూలియా తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది. ఆమె నివసించే సకాబా గ్రామంలో 300 మంది జానాభా కాస్త ఆమె కళ్ళ ముందే లక్ష75వేలు అయ్యారు. బహుశ ఈమె ప్రపంచలోనే అతి వృద్ధురాలైన మహిళగా గిన్నిస్ కి ఎక్కుబోతుంది.

బద్దకం ఎక్కువే

నేను ఎప్పుడు ఒకేలా ఉండను అంటోంది కియా అద్వానీ .అప్పుడప్పుడు క్రమ శిక్షణగా ఉంటాను. సినిమా షూటింగ్ అంటేనే తెల్లవారు జామునా లేచేస్తాను,చాలా హుషారైపోతాను. ఒక వేళ షూటింగ్ లేకపోతే అస్సలు మంచం దిగాలనే ఉండదు అంటోంది కియారా అద్వానీ. భరత్ అనే నేనులో నటించిన కియారా ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తుంది. ఎప్పుడు ఒకే రకమైన ఎనర్జీ ఎందుకు ఉండదో ఏమో . ఏమాత్రం వీలున్న నా పద్దతి మార్చుకోవాలనిపిస్తుంది. కానీ షూటింగ్ లేకపోతే […]

ఎవళ్ళూ తప్పించుకోలేరు

బాడీ షేమింగ్ విషయంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ కూడా అవహేళన ఎదుర్కొందట. ఒక మీడియా ఇంటర్యూలో మీ లైఫ్ లో మీరెప్పుడనా బరువుతో ఇబ్బంది పడ్డారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నాలుగేళ్ళ క్రితం వసీం అక్రమ్ తో నేషనల్ లెవల్ టివీ చానెల్ ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు తాను బరువు పెరిగిన విషయాన్ని ఒక ఛానల్ స్క్రోలింగ్ లో ఇప్పుడు సుస్మిత ఎలా ఉందో చూడండి అని నానా హంగామా చేశారని చెపుకొచ్చింది. ఆ […]

ఇంకా శ్రద్దగా ఉన్నా

గుర్తింపు వచ్చింది అంటే అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు కొత్తగా ప్రతిది శ్రద్దగా చూస్తున్నా ప్రాజెక్టులు ఎంపిక విషయంలో ఇంకా బాద్యతగా ఉండాలనుకుంటున్న అంటుంది రస్మికా మండన్నా. చలో సినిమాతో టాలివుడ్ కు పరిచయం అయిన ఈ కన్నడ అమ్మాయి రస్మిక గీతగోవిందంతో అందరి దృష్టిలోకి వచ్చేసింది. కన్నడలో మొదటి సినిమా కిరాక్ పార్టీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది రస్మిక. రెండో సినిమాకే స్టార్ హీరో పూనిత్ రాజ్ కుమార్ సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో […]

శ్రధ్దగా ఎంచుకొన్న

ప్రతి స్క్రిప్టూ నాకు ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ఎంతో జాగ్రత్తగా కథంతా తెలుసుకొని ఆలోచించి ఎంచుకొంటున్న అంటోంది అమీతుమీతో ప్రేక్షకుల అభిమానం సంపాదించిన ఈషారెబ్బా. నాగశౌర్యతో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా నటిస్తోందట. ఇది హామ్లీ గర్లు పాత్ర అయినా నా రూపం మోడ్రన్ గానే ఉంటుంది.నాకు పాత్ర మేనరిజమే బావుంటుంది. ప్రత్యేకంగా ,సరదాగా,వినోదంగా సాగిపోయే సినిమా ఇది. సినిమా కథ విన్నక నాకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. నటనకు అస్కారం ఉన్నా పాత్ర నాలో టాలెంట్ […]

ఇవ్వాళ్టి ట్రెండ్

ఫోన్ ఫిట్ నెస్ కు శ్రీకారం చుట్టారు ఆర్తీ పాండే. బిహాఫాగ్ ,నతి కోలీ ,గిధా ఇలా ఎన్నో రాష్టాలకు చెందిన జానపద నృత్యాలకు ,వ్యాయామాలు జత చేసి ఫోన్ ఫిట్ నెస్ ఎక్సైర్ సైజులు సృష్టించింది ఆర్తీ పాండే.ఈ ఫోన్ ఫిట్ నెస్ లో కోలి మహారాష్ట నృత్యంతో పొట్ట పై భాగం బలంగా అయిపోతాయి. భాంగ్రా డాన్స్ బుజాలు తోడ కండరాలకు ఎక్సర్ సైజ్ .గర్భ బుజాలు చేతులు ధృడంగా అయిపోతాయి .ఈ ఎక్సర్ […]

ప్రతి పాత్రకి కష్టపడతా

నటన విషయంలో నా పై విమర్శలోస్తే నేను చాలా సిరీయస్ గా తీసుకుంటా. ఇలాంటి పాత్రల్లో సమంత నటించగలదా? ఆమె న్యాయం చేయగలదా అంటూ కొన్ని అభిప్రాయాల్ని వింటూ ఉంటా కదా …వెంటనే నాకు పట్టుదల వస్తోంది.వాటిని ఓ సవాల్ గా తీసుకొని చాలా కష్టపడతా అంటోంది సమంత. ఇప్పడు నడుస్తున్న ఈ దశ నటిగా నాకు చాలా సంతృప్తి ఇస్తోంది. చక్కని కథలు వస్తున్నాయి. నా అభిరుచికి తగ్గవి ఎంచుకొంటున్న ఇక అందులో నా పాత్ర […]

ఆకాంక్ష ఉంటేనే లైఫ్

జీవితంలో కెరీర్ చాలా ఇంపార్టెంట్.కష్టపడి అత్యున్నత స్థాయి వరకు ఎదగాలని అందరికీ ఉంటుంది.కానీ ఒక చోటికి చేరుకున్నాక కొందరు అలా ఎదగటం మానేస్తారు.అలా మానేయకుండా ఉండాలంటే మనలో ఒక బలమైన కాంక్ష పనిచేస్తూ ఉండాలి. దానికి మన చుట్టు ఉన్న పరిస్థితులు తోడ్పడాలి అంటోంది రాశిఖన్నా. మనచుట్టు ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటే మన ఎదుగుదల స్పీడ్ గా ఉంటుంది.ఎవరో పట్టించుకొనే వాళ్ళు లేకపోయినా థ్రిల్ ఉండదు. ప్రశంసలతో పాటు విమర్శలూ మనల్ని ముందుకు నడిపిస్తాయి అంటోంది […]

అందాల దేవత

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్ప్ లో 50 మీటర్ల మహిళ బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్ లో ఇప్పటి వరకు ఉన్నా 27 సెకన్ల ప్రపంచ రికార్డును 26.39 సెకండ్లలో బ్రేకప్ చేసింది చైనా కు చెందిన 21 సంవత్పరాల ల్యూజియాంగ్ .ఈమెకు ప్రపంచటాప్ మోడల్స్ లో ఒకరైన చైనా సౌందర్యవతి ల్యూవెన్ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఆమెను కాస్త స్విమ్మింగ్ గాడెస్ అని పొగడ్తలతో ముంచెత్తారు చైనా యువకులు. బంగారు పతకం సాధించిన […]

తెరపై మెరిసేదెవరో

ఇవి బయోపిక్ లకు డిమాండ్ ఉన్న రోజులు పురిచ్చి తలైవి గా ప్రఖ్యాతి చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం ఎప్పటి నుంచో సిద్దంగా ఉంది. త్రిష ,నయనతార ,కీర్తీ సురేష్ అందరూ మేం సిద్దం అంటున్నారు. మరి జయలలిత ఎం.జి.ఆర్ సన్నిహితురాలు సహనటి పురుషాధిక్యతకు పేరు పడ్డ రాజకీయాల్లో గెలిచి, మెరిసన ధీర …పేదల మనసు దోచుకున్న మమతల తల్లి స్నేహానికి ప్రాణమిచ్చిన నిచ్చెలి అసెంబ్లీలో భంగపడి ప్రతిజ్ఞ చేసి మరీ పంతం […]

కల నిజమాయనే

ఇదినా పదిహేనేళ్ళ కథ. తలైవా పక్కన నటించాలన్న కల ఇప్పుడు నిజమైంది. ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కలలు మనం నిద్ర లేచినా కలలోనే ఉన్నట్లుగా అనిపిస్తాయి.ఈ వార్త నాకు అలాంటిదే అంటుంది త్రిష.కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ సరసన త్రిష నటించబోతుంది. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్నారు. దక్షిణాదిన అగ్రనాయకులందరితో త్రిష నటించింది. కానీ రజనీ కాంత్ తో ఆమెకు అవకాశం రాలేదు.అయిన పక్కన నటించాలని నేను కలలు కంటున్నాను. అది నిజమైంది […]

షేర్ చేయడంలో తృప్తి

మన దగ్గర పవర్ ఉందనుకో దేవుడు మనకి ఆ తర్వాత పవర్ ఉండే పొజిషన్ ఇచ్చినట్లే.మన ద్వారా ఎంతో మందికి మంచి చేయాలన్నది ఆయన అభిమతం కావచ్చు. ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటంలోనే మన దగ్గర ఉన్న పవర్ కు సరైన అర్ధం చెప్పినట్లు అంటుంది అనుష్కశర్మ. సక్సెస్,డబ్బు,ఫేమ్,పవర్ ఇవన్ని మన కష్టంతో వచ్చేవే. అందులో మిగిలిన వన్ని మన కోసం ఏమో కాని పవర్ మాత్రం కచ్చితంగా పనులకు ఉపయోగించటం కోసమే అంటుంది అనుష్క శర్మ.నా […]

కోపిష్ఠిని

ఆ.ఆ లో నేను నటించిన నాగవల్లి క్యారెక్టర్ లాగే కోపం వస్తే మారిపోతా …మనం కరెక్ట్ గా అన్ని పనులు చేస్తాం,ఇతరులు చేయకపోతే అందరికీ నష్టం కదా.అలాంటప్పుడు నాకు విపరితమైన కోపం వస్తుంది.ఇంకెందుకు చెప్పటం. నిజానికి ఆ కోపమే నా మైనస్ అంటోంది అనుపమ పరమేశ్వరన్ . నేను చాలా సెన్సిటివ్ చాలా కూల్ గా ఉంటాను .ఎవ్వరినీ పల్లెత్తు మాట అని బాధపెట్టటం నిజంగా ఇష్టం లేదు. కానీ ఒక్కోసారి కోపం ఇవన్ని డామినేట్ చేస్తుంది. […]

అపురూపమైన నగలు

ఎన్నో అందమైన నగలోస్తున్నాయి. కానీ ఇంకో అధ్భుతమైన నగ మార్కెట్లోకి వచ్చింది . అది బిఎమ్ జ్యువెలరీ. తెలుగులో తల్లిపాలతో చేసే ఆభరణం సహాజంగా ఒక సెంటిమెంట్ ఈ ఆభరణాన్ని ఒకే అనమంటుంది.ఆర్డర్ ఇచ్చిన అమ్మ దగ్గర నుంచి పాలు సేకరిస్తారు. వాటిని టెస్ట్ ట్యూబ్ లో సిరప్ బాటిల్స్ లో పంపుతారు.పాలను స్టెరిలైజ్ చేసి వారం రోజుల పాటు ఆటోక్లేవ్ లో భద్రపరుస్తారు. పాలు ముద్దగా అవుతాయి. అందులోంచి కొవ్వు తీసేసి కొన్ని కెమికల్స్ కలిపి […]

అసాధ్యం కాదు

లారీగురూ …లారీలకు లారీలను లోడ్ కోసం బుక్ చేసుకోనే ఒక సంస్థ తిరుపతికి చెందిన ఎ.ఆర్ మంజూష ఈ లారీ ట్రాన్స్ ఫోర్ట్ వ్యాపారం చేస్తోంది. ఆన్ లైన్ లో కిరాయి లారీలను బుక్ చేసేందుకు మంజూరష లారీ గురు పేరుతో వెబ్ సైట్ ఓపెన్ చేసింది. డ్రైవర్లు ,లారీ యజమానుల వివరాలు ఇందులో ఉంటాయి. చిత్తూరు జిల్లా నగరిలో ఆఫీస్,కాల్ సెంటర్ నడుస్తుంది. 20 వేల మంది లారీ యజమానులు ఈ వెబ్ సైట్ లో […]

నిషేధాలు అంతరిస్తున్నాయి

ప్రపంచం చాలా మారిపోయింది. మహిళలపై సమాజం విధించిన ఎన్నో నిషేధాలు చెదిరిపోతున్నాయి. ఈ విషయం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కర్మకాండాల సందర్భంగా ప్రపంచం అన్ని టీవీల్లో వాజ్ పేయి పెంపుడు కూతురు నమిత కౌల్ భట్టాఛార్య ఆయిన చితికి నిప్పు పెట్టటం, తర్వాత ఆయన అస్థికలు నిమజ్జనం చేయటం అందరూ చూశారు. సామాజిక పోకడల పరిశోధకులు దీన్ని గొప్ప మార్పుగా అభివర్ణించారు. తల కొరివిపెట్టటం, స్మశానానికి వెళ్ళటం ఇతర క్రియలు ఏవి […]

ఇదోక వేడుక

షేస్ బుక్ లో ఎన్నో చిత్రమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. గ్రూప్ లు ఉండటం ,ఎన్నో విషయాలు ఫేర్ చేయటం వల్ల కొన్ని విశేషాలు కూడా బయటకు వస్తాయి.యూఎస్ లోని అరిజోనా రాష్ట్రంలోని మెసాపట్టణంలో బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్ ఐసియులో సేవలు అందిస్తున్నా మొత్తం 16 మంది నర్సులు గర్భిణులే నన్నా సంగతి ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా బయటకి వచ్చింది. నర్స్ లు ఒకరికోకరు షేర్ చేసుకొంటున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది […]

ఈ పరుగుల రాణి వయసు 102

ఆమెకు 102 సంవత్సరాలు. పేరు మన్ కౌర్ కెనడాలోని వాంకోవర్ నగరంలో వంద మీటర్ల రన్నింగ్ ట్రాక్ లో ఒకటిన్నర నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారామే. ఆమె తో పాటు పోటీ పడిన వాళ్ళు డెబ్బై ,ఎనభై ఏళ్ళ వాళ్ళున్నారు. అందులో నూరేళ్ళు దాటిన మనిషి మన్ కౌర్ ఒక్కరు. ఆమె కొడుకు గురుదేవ్ సింగ్ కు 78 ఏళ్ళు .గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఆమె పేరు నమోదు అయింది.తల్లీ […]

అంత టైమ్ ఇవ్వలేను

హాలీవుడ్ లో నటించమనే ఆఫర్లు ఎఫ్పుడు ఉన్నాయి కానీ అక్కడ బల్క్ డేట్స్ ఇవ్వాలి. రెండు మూడు నెలల పాటు కాల్షీట్లు మొత్తం ఇవ్వాలి.అవి ఒప్పుకుంటె ఇక్కడ చిత్రాలు చేయలేను. అందుకే ఆ సినిమాలకు దూరంగా ఉన్నా అంటుంది ఐశ్వర్య రాయ్.చాలా విషయాల్లో నేను అదృష్టవంతురాలిని మంచి పారితోషికం చక్కని సినిమాలు నన్ను చాలా త్వరగా ఫీల్డ్ లో నిలబెట్టాయి.మోడలింగ్ రోజుల నుంచి పారితోషికం విషయంలో నాకు ఎలాంటి సమస్య రాలేదు. నేను పెద్దగా జిమ్ కి […]

ఆమె పేరు నిలబెడతా

మానవత్వం కరుణ దయా వంటి మంచి భావనలతో మంచి వ్యక్తిగా ఉన్నవాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారు.వినయం,కృతజ్ణత మనల్ని ఎదిగేలా చేస్తాయి అనేది అమ్మ. ఆ మాటాలను ఎప్పుడు నేను మరిచిపోను అంటుంది జాన్వీ కపూర్. ధడక్ సక్సెస్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తబ్త్ లో నటిస్తుంది ఆమె. మా అమ్మ గొప్ప సెలబ్రిటీ అయినా తను మా కోసం ఎన్నో పనులు మాములు గృహిణి లాగ అమ్మలాగా చేసేది. మాకు జుట్టుకు నూనె మసాజ్ లు […]