Saturday, 25 Jul, 2026

సన్నీ మైనపు విగ్రహం

బాలివుడ్ కి రాక ముందు సన్నిలియోన్ ఒక పోర్న్ స్టార్ అయినా ఆమె తన పైన ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్ని క్రమంగా పొగొట్టుకుంటూ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఉంది. భారీ చిత్రాల్లో నటించకపోయినా ఆమెకున్న క్రేజ్ చాలా ఎక్కువే. ఆ క్రేజ్ ఆమెను అమితాబచ్చన్,షారుక్ ఖాన్, కత్రినా,కరీనా కపూర్ వంటి అగ్రతారాల సరసన నిలబెట్టింది. ఢిల్లీలోని మేడమ్ టూస్సాడ్స్ లో ఆమె మైనపు బొమ్మ కొలువు తీరింది. తన బొమ్మను తానే ఆవిష్కరించి ఆనందించింది సన్నిలియోన్.

వాటర్ వారియర్ గర్విత

ఒక మంచి పని చేసేందుకు అనుభవం పండిపోయి ఉండక్కర్లేదు 18 ఏళ్ళ గర్విత బెంగుళూరు అమ్మాయి వై వేస్ట్ వాటర్ అనే ఉద్యమం లేవదీసింది.బెంగుళూరులోని రెస్టారెంట్స్ కు హోటల్లకు వెళ్ళి నీటిని గ్లాసుల నిండా పోసి వేస్ట్ చేయకండి కస్టమర్ రాగానే సగం గ్లాస్ నీళ్ళే ఇవ్వండి.దగ్గర్లో జగ్ ఉంచండి. నీళ్లు వృధా అవ్వకుండా ఉంటాయని ప్రచారం చేసింది.change.org ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఆలోచనలతో పరిశోధించి వారితో షేర్ చేసింది. 42 దేశాల నుంచి వెయ్యి మంది […]

నాకు అస్తమా ఉంది.

తమ గురించి గొప్పలు చెఫ్పుకునే వాళ్ళని చాలా మందిని మన చుట్టు కూడా చూస్తూ ఉంటాం. కాని ఇతరులలో ధైర్యం నింపేందుకు మన లోపాలను ఒప్పుకునేందుకు చాలా ధైర్యం కావాలి.ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కాని ప్రియాంక చోప్రా మాత్రం నే అస్తమా వ్యాధితో బాధపడుతున్నా అన్నారు. ఒక మీటింగ్ లో అస్తమా వ్యాధి గ్రస్తుల్లో ధైర్యం నింపేందుకు గాను ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రియాంక నాకు బాగా దగ్గరగా ఉన్న వారికి నేను […]

లోపాలు పోగొట్టుకుంటూ వుంటా

జీవితంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను. నాలో ఉన్న లోపాలు పోగొట్టుకునేందుకు ఎంత కష్టమైన పని అయినా చేస్తా.అంత వరకూ ఎందుకు నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఆ భయం పోగోట్టుకునేందుకు ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి రక్షణ లేకుండా దూకేస్తాను అంటుంది పూజా హెగ్డే. ఇలాంటి తింగరి పనులు ఎందుకు చేస్తావంటే ముందుగా నాలో ఉన్నా భయం పోవాలి కదా. నేను కాస్త పిరికిదాన్నె ఆ పిరికితనం పోవాలి అంటే ఇలాంటివన్ని చేసి […]

స్త్రీల ఆరోగ్యం ముఖ్యం

ప్రముఖ క్రీడాకారిణి రీత్ అబ్రహం,ఆమె తల్లి 84 సంవత్సరాల టామీ దేవయ్యతో కలిసి మైసూర్లో హెల్దీ విమెన్ ,హ్యాపీ హోమ్ పేరుతో నిర్వహించిన వాక్ థాన్ లో పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇళ్ళు సంతోషంగా ఉంటుంది.రంగు రంగుల చీరెల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వాక్ థాన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహాన పెంచుకోవటంపై అవగాహాన కలిగిచారని చెపుతున్నారు నిర్వకులు.

తొందరగా నేర్చుకొంటా

కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ తో సినిమాల్లోకి వచ్చింది నభా నటేష్. ఇప్పుడు తాజాగా సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. 2013 ఫెమినా మిస్ ఇండియా ఇంటెలెక్ట్యువల్ గా ఎంపికైన నభా నృత్యం,పెయింటింగ్లో నిష్ణాతురాలు.బి.ఇ పూర్తి చేసిన రఘుబాబు సినిమా అదిగో తో తెలుగు సినిమాల వైపు వచ్చింది నభా నటీష్.నన్ను దోచుకొందువటే చిత్రం గురించి చెబుతూ ఈ చిత్రంలో నా పేరు సిరి .బోలెడన్నీ గొప్పలు చెప్పుకొంటుంది. హుషారుగా ఉంటుంది. […]

నారీ- 2018

వందలాది స్త్రీలు కన్నుల పండుగలాగా రంగు రంగుల చీరెలతో పాల్గొన్న నారీ-2018కార్యక్రమం సింగపూర్ లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించారు. తెలుగు వారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరెలకు ప్రత్యేకత ఎప్పటికి తగ్గదు అని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు.

స్ట్రీట్ ఫుడ్ ట్రక్

కావ్వ కిషన్. స్ట్రీట్ బార్బెక్యూ పేరుతో రాయల్ ఎన్ ఫీల్డ్ కు చిన్న కిచెన్ గ్రిల్ ఏర్పాటు చేసి లైవ్ కిచెన్ ద్వారా ఫుడ్ అందిస్తోంది. వివేక్ ,దీపిక ఆమె వ్యాపార బాగస్వాములు.స్ట్రీట్ బార్బెక్యూ ద్వారా పెళ్ళిళ్ళు ,పుట్టిన రోజులు,కిట్టీ పార్టీల్లో లైవ్ కిచెన్ ఏర్పాటు చేస్తారు. ఈ బైక్ కిచెన్ కొత్త రకంగా ఉండటంతో అందరినీ ఆకర్షిస్తోంది. ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నా ఈ కిచెన్ ను నడుపుతున్న పర్లేదు ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాం అంటోంది కావ్య […]

వేధింపులు పెరిగాయి

వర్క్ ప్లెస్ లో స్త్రీల పైన జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయనీ ,బాధితుల నుంచి సిటీ పోలీసులకు నెలకు 40 వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా అందులో కనీసం నెలకు మూడైనా పని చేసే చోట ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించే ఫిర్యాదులు ఉంటున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ చెపుతున్నారు.ఇదే విషయాన్ని షీ టీమ్ ఏసిపి నర్మద మాట్లాడుతూ ఫిర్యాదులు చాలా తక్కువే వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఫిర్యాదు […]

అధికారం వల్లనే ఈ అహంకారం

హాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలై ఇంతకాలం గడిచినా ఆ స్పూర్తితో ఒక్కళ్ళయినా ఈవ్వాల్టికీ  నోరు తెరవలేని బోలెడన్ని విమర్శలు వస్తున్నాయనీ,   కాని భాదితులకు మద్దతు ఇచ్చేవారు లేకనే ఈ ఉద్యమం ముందుకు వెళ్లడం లేదంటుంది రాధికా ఆప్టే. ఇండియా టుడే మైండ్ రాక్స్ 218 కార్యక్రమంలో పాల్గొన్న రాధిక తాను ఈ మధ్య ఒక స్టార్ హోటల్ లిఫ్ట్ లో సహనటుడి ప్రవర్తనతో తనెలా హర్ట్ అయిందో చెపుతూ ఏ రంగంలో నైనా కాస్త అధికారంలో […]

స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే

మిస్ అమెరికా అందాల పోటీ చరిత్రలో తొలి సారిగా స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలు నడిచాయి. గత 98 ఏళ్ళుగా కాంపిటెషన్ లో స్విమ్ సూట్ రౌండ్ ని ముఖ్యమైనదిగా పరిగణించారు. ఈ స్విమ్ సూట్ లేని పోటీలు జరగటం వల్ల సర్వత్రా హార్షం వ్యక్తం అవుతుంటే ,ఈ పోటీలను చూసేవారి సంఖ్య పది లక్షలకు పైగా పడి పోయిందని నీల్సన్ సర్వే ఫలితాలు చెపుతున్నాయి.అలాగే అందాల పోటీల్లో పాల్గొనదలిచే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్లు […]

80కోట్ల ఆస్థి ఇచ్చేశా

ఎయిర్ హోస్టెస్ గా జీవితం మొదలుపెట్టి తారా పథంలో దూసుకుపోయి ఒక్క క్షణంలో ఆ జీవితం వదిలేసి ఆధ్యాత్యిక మార్గంలోకి ప్రయాణం చేశారు కాంచన.ఎన్నో ఏళ్ళ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో మోడ్రన్ నాయనమ్మ పాత్రలో మళ్ళీ వెండితెరపైకి మెరిసిన కాంచన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళటం,ప్రతి విషయంలో దైవత్వాన్ని చూడటం కూడా అలవాటు చేసుకొంటే అలవాడేదే అంటుంది. జీవితంలో ఎత్తు పల్లాలు అన్నీ చూశాను .ఆస్థిపోయింది. మళ్ళీ కలిసి వచ్చింది. వచ్చిన 80 కోట్ల రూపాయల విలువైన […]

అద్దెకు టూ వీలర్స్

హైదరాబాద్ మొదలుకొని 152 నగరాల్లో ,విదేశాల్లో కూడా వెయ్యి రకాల బైకుల్ని అద్దెకిస్తోంది మోక్షా శ్రీ వాత్సావ. ఆమె నెలకొల్పిన సంస్థ పేరు వీల్ స్ట్రీట్ వాహానాలు అద్దెకు ఇచ్చే వారికీ ,వినియోగ దారుడికీ మధ్య వారాధిలాగా పనిచేస్తుంది ఈ కంపెనీ . ఢిల్లీ ఐఐఎంలో పీజీ పూర్తీ చేసిన మోక్షా వీల్ స్ట్రీట్ యాప్ ని తయారు చేసి వ్యాపారం మొదలుపెట్టింది. బైక్ అద్దెకు కావాలంటే అ యాప్ డౌన్ లోడ్ చేసుకొని తీసుకోవచ్చు.మార్కెట్ లోకి […]

ఈ కంపెనీకి జాక్వెలిన్ పార్టనర్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రా ప్రజరీ అనే స్టార్టప్ కు పెట్టుబడి పెట్టింది. ఒక సెలబ్రెటీ పండ్ల రసాల కంపెనీకి పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. అనుజ్ రాక్వెన్ కోల్డ్ ప్రెస్ట్ పండ్లరసాలను తయారు చేసే స్టార్టప్ మొదలు పెట్టడం ,ఆపిల్ ,జామ,కమలా,మామిడి,దానిమ్మ పండ్ల రసాలు.ఇవన్ని కలిపిన ఒక మిశ్రమ రసం ఆ కంపెనీలో తయారవుతాయి. క్వారెట్ ,బీట్ రూట్ ,అల్లం ,నిమ్మ ,ఆపిల్ మిశ్రమాలు ,కీరాదోస ,అలోవెరా కొబ్బరి నీళ్ళు ,లెమన్ గ్రాస్ మిశ్రమాలు […]

మంచి సినిమా అరువి

అరువి వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి క్రితం సంవత్పరం విడుదలైన ఈ సినిమా యూట్యూబ్ లో చూడవచ్చు. తమిళంలో వచ్చిన ఈ సినిమా దర్శకుడు ప్రభుపురుషోత్తమన్ కు ఇదే మొదటి సినిమా .హీరోయిన్ అదితి బాలన్ కు కూడా ఇదే తొలి సినిమా .ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయి రోడ్డుపక్కన పండుకొయించి తింటుంది. పండు కోస్తూ వేలుకోసుకొని ఆ రక్తం ఆ పండుపై కారితే దాన్నీ తుడిచేసి అలా ఇచ్చేస్తాడు షాపు యజమాని. ఆ రక్తం […]

వెంబనాడ్ ను చుట్టేసింది

కేరళలోని అతిపెద్ద వెంబనాడ్ ను ఈదేసి చరిత్ర సృష్టించింది మాలు షయిబా. చిన్నప్పటి నుంచి స్వతత్రంగానే పెరిగింది. డ్రైవింగ్ నేర్చుకుని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసేది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. ఆమెకు స్విమ్మింగ్ అంటె ఇష్టం. చాలా త్వరగా అందులో నిష్ణాతురాలైంది. భారతదేశంలో అతి పెద్ద సరస్సైన వెంబనాడ్ చుట్టు తొమ్మిది కిలోమీటర్లను చుట్టేసి వెంబనాడ్ ఈదీన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. నటుడు మమ్ముట్టి ఆమెను […]

ఫుల్ గా ఎంజాయ్ చేశా

నటన వరకే ఆపేస్తారా అంటె మేం అన్ని రంగాల్లో ముందే ఉంటాం అంటారు హీరోయిన్లు. యుద్ద విద్యలు నేరుస్తారు. మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేస్తారు. ఈ మధ్య హీరోయిన్ భూమిక స్కూబా డైవింగ్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మధ్య నే ఈ స్కూబా డైవింగ్ ఎక్స్ పిరియన్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశాను అంటుంది భూమిక  నాగ చైతన్య హీరోగా చేస్తున్న సవ్యసాచి, సమంత లీడ్ రోల్ చేసిన […]

భయటకు రావాలంటే భయం

ఏ పని అయినా నలుగురి సహకారం అవసరం. ఒంటరిగా ఏమి చేయలేం. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం పరిస్థితి నిష్టూరంగా అనిపించినా అలానే ఉంది అంటుంది స్లమ్ డాగ్ మిలియనియర్ లో నటించిన ఫ్రీదా పింటో.  కాస్టింగ్ కౌచ్ పేరుతో హాలీవుడ్ లో తొలిసారిగా మీటూ పేరుతో క్యాపెయిన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  లైంగిక వేదింపులకు గురైన ఎంతో మంది తమ గళం విప్పి అనుభవాలు పంచుకున్నారు. కాని ఇండియాలో ఆ పరిస్థితి లేదు అంటుంది […]

ఆ మెరుపు నా సంతోషం

నా జీవితంలో సినిమాలు ఒక్కటే కాదు ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఇష్టమైన పని చేసేటప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుంది. నాకు నచ్చిన పాత్రాలు వేసేటప్పుడు మనసులో కలిగిన సంతోషం నా ముఖంపై అందరూ చూస్తారు. నా కళ్ళలో ఉండే మెరుపు నా సంతోషం. అది సహజంగా నా మనసులో నుంచి వస్తుంది.  అందులో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది అంటుంది నిత్యామీనన్. రెండు నెలల విరామం తర్వాత గీతాగోవిందం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నిత్యామీనన్. ఇక […]

నాకు తప్పలేదు

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాని మొహమాటం లేకుండా చెప్పేసింది యామిని భాస్కర్.నర్తనశాల సినిమాలో సత్యభామ గా నటించింది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవనడం చాలా అన్యాయం. పాత్రకు సరిపోతారు అనిపిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటుంది యామిని. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు మనకు పోటీదార్లు అనే అనుకుంటాను. ఎఫ్పుడు తెలుగు అమ్మాయిలను డామినేట్ చేస్తారు అని నాకు అనిపించదు అంటుంది యామిని.