Gagana
వాళ్ళు మనకే తెలుసు
‘కన్నా మూచి’ అనే సినిమా తీస్తున్నా. ప్రపంచంలో ధైర్యవంతులైన మహిళలున్నారు.వారు మనకు తెలుసు అలాంటి వాళ్ళు మన లోనే ఉన్నారు.మనతోనే ఉన్నారు అలాంటి వాళ్ల గురించి బలంగా చెప్పాలనుకున్నాను అంటూ పోస్ట్ చేసింది వరలక్ష్మి సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె గా మాత్రమే వార్తల్లో నిలవాలని అనుకోకుండా నాయకిగా,ప్రతినాయకగా కూడా తన శక్తిని నిరూపించుకుంది వరలక్ష్మి. నా చేతికి వచ్చిన అవకాశాలు నేనెప్పుడూ మిస్ అవ్వలేదు. ప్రతిసారీ నాయిక పాత్ర నే నా ప్రాధాన్యత ల్లో […]
అంతులేనన్ని ప్రశంసలు
ఆకాశమే నీ హద్దురా సినిమాలో కాటుక కనులే..పాట పాడింది దీక్షిత వెంకటేషం ‘దీ’ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. పుట్టింది ఆస్ట్రేలియాలో తల్లి మీనాక్షిసుందరం కర్ణాటక సంగీత కళాకారిణి తండ్రి సంతోష్ నారాయణన్ ప్రముఖ సంగీత దర్శకుడు శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీతం లోనూ శిక్షణ తీసుకుంది దీక్షిత.14 సంవత్సరాల వయసులోనే సినిమా లో పడేసింది పిజ్జా- 2 లో ఆమె పాడిన పాటకు సంగీతం సమకూర్చింది తండ్రి సంతోష్ నారాయణన్ తాజాగా పాడిన కాటుక […]
సుస్వరాల మాలిక సుశీల
సినిమా రంగంలో 50 ఏళ్ల నుంచి పి. సుశీల పాడుతూనే ఉన్నారు.19 వేల పాటలు రికార్డుల్లో చూపించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచారు.తెలుగు తమిళం మలయాళం కూడా ఆమె ఆధ్యాత్మక గీతాల కు పెట్టింది పేరు.1955లో మిస్సమ్మ సినిమాలో ఆమె స్టార్‌డమ్ లోకి వచ్చారు. సినీ సంగీతం లో ఉండే అన్ని రకాల భావాలు సుసీల గారి గొంతులో పలికాయి. తెలుగు భాషా సౌందర్యం ఉచ్చారణ ద్వారా వచ్చే సొగసు సుశీల గారి పాటలో కనిపిస్తాయి. […]
రాళ్ళల్లో నీరు
నేను ఎంఏ చదివే రోజుల్లో నార్వే జాయిన్ నాటకం ఎడాల్స్ హౌస్ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింద. ఎప్పటికైనా దాన్ని తెరకెక్కించాలని అనుకున్నాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు దాన్ని స్క్రిప్ట్ చేశాను ‘రాళ్ళల్లో నీరు’ పేరుతో ఆ సినిమా వస్తోంది అంటోంది కిరణ్మయి ఇంద్రగంటి.ఎన్నో డాక్యుమెంటరీలు ఎన్నో రచనలు చేసిన అనువాదంతో ఆమె ఇప్పుడు దర్శకురాలిగా పరిచయం అవుతోంది ఐదు పాత్రలలో మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాలను భావోద్వేగాలను విడిసి పెట్టేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను […]
ఇవి ఎంతో ప్రత్యేకం
కవిత నాగ్ వ్లోగ్స్ పేరుతో నాగలక్ష్మి ఆమె వదిన కవిత చేసే వంటకాల వీడియో లను లక్షలకొద్దీ వీక్షించారు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే నాగలక్ష్మి కి చూపు లేదు స్పర్శతోనే చక్కగా వంట చేయగలదు కవిత వదినగా వచ్చాక ఈ ఛానల్ మొదలు పెట్టారు తొలి వీడియోనే వైరల్ అయింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన నాగలక్ష్మి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటే ఎలాంటి ఘనకార్యాలు అయినా సాధించవచ్చునని […]
మేకలకు ఆశ్రయం
Leanne Lauricella (లియాన్నే లారిసెల్లా ) గోట్స్ ఆఫ్ అనార్క పేరుతో ఒక శాంక్చ్యురీనీ తన ఇంట్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ. అంగవైకల్యం ఉన్న మేకలకు ఆదరణ లభిస్తుంది. న్యూ జెర్సీ లో ఉన్న ఇల్లు,ఇంటి వెనక గార్డెన్ ను ఫామ్ గా మార్చేసి,మేకలు,కొన్ని ఇతర జంతువులకు ఆశ్రయం కల్పిస్తోంది లియాన్నే. కళ్ళు లేని మేకలకు దాతల సాయంతో ప్రత్యేక వీల్ ఛైర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘గోట్స్ ఆఫ్ అనార్క’ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లకు […]
‘కమల చాలా ప్రత్యేకం’
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన కమలా హ్యారిస్ మనస్తత్వం ఆమె పవర్ ఫుల్ డ్రెస్సింగ్ తోనే వ్యక్తమవుతోంది అంటారు ప్రముఖ డిజైనర్ ప్రియా కటారియా పూరి.గత 34 సంవత్సరాలుగా కమల మెడలో ముత్యాల ధరిస్తూ ఉన్నారు ముత్యాలు నమ్మకం విశ్వాసాలకు ప్రతీక వీటిని ధరించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.అదే సమయంలో స్నీకర్స్ ధరిస్తూ తన సిగ్నేచర్ స్టయిల్ కు అదనపు విలువ జోడించారు.నలుపు, గ్రే, నావీ బ్లూ రంగుల సూట్లు స్కర్టులు నేచురల్ మేకప్ ఆమెకు హుందా […]
పద్మ కుప్ప
తాజా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికాలోని రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు. భిలాయ్ లో పుట్టిన పద్మ కుప్ప.వరంగల్ ఎస్ ఐ టి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.అమెరికాలో ఫోర్డ్ క్రిస్లర్ కార్స్ వంటి సంస్థల్లో పని చేసింది. 2018 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున మిచిగన్ రాష్ట్రంలో 41 డిస్ట్రిక్ట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది.ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థి పైన 5611 ఓట్ల మెజారిటీతో […]
ఈ ఆసనం తో కండరాలు దృఢం
ఫిట్ నెస్ కోసం నటరాజాసనం చేసి చూపిస్తున్నారు మలైకా అరోరా.ఈ ఆసనం తో తొడ తుంటి భాగంలోని కండరాలు వెన్నుముక కండరాలు దృఢంగా మారుతాయి.ఈ వీడియో లక్షల మంది చూశారు ముందుగా నేలపై నిటారుగా నిల్చోవాలి. పొడవైన కర్రను చేతిలో పట్టుకోవాలి ఇప్పుడు శ్వాస తీసుకొని ఎడమ మోకాలు వెనక్కు వంచాలి.శ్వాస వదులుతూ ఎడమ చేతిలో ఎడమ కాలు పట్టుకుని పైకి లేపాలి ఎడమ పాదం సీలింగ్ వైపు చూస్తున్నట్లు ఉండాలి. మోకాలు తో శరీరంపైన వ్యతిరేక […]
వర్షా దేశ్ పాండే
‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ పేరుతో మహా రాష్ట్రలోని నతారా కు చెందిన వర్షా దేశ్ పాండే ఆడ పిల్లల ప్రాణాలు కాపాడుతున్నారు లేక్ లడ్ కీ అభిమాన ఉద్యమం పేరుతో స్టింగ్ ఆపరేషన్లు చేపట్టి గర్భ విచ్చిత్తికి పాల్పడే వైద్య కేంద్రాలను మూయించారు. 2011 లో మహారాష్ట్రలో బీడ్ జిల్లా లో ఆడపిల్లల నిష్పత్తి 807 కు పడిపోయింది.పరీక్షలు చేసి ఆడపిల్లని నిర్ధారణ కాగానే అబార్షన్ లు జరిగేవి.ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయే ఆడపిల్లలను జీవించేలా […]
పిల్లలకు పాఠాలు చెప్పే ఆరుషి
అన్‌నోన్ 16 కు శ్రీకారం చుట్టింది ఆరుషి అగర్వాల్.ఆమె సొంత రాష్ట్రం హరియాణా, తర్వాత బెంగుళూరు లో చదువుకుంది ప్రస్తుతం న్యూజెర్సీలోని వెస్ట్ విండ్సర్-ప్లెయిన్స్ బోరో హై స్కూల్ లో 11 తరగతి చదువుతోంది.రోబోటిక్స్ లో నైపుణ్యం సంపాదించింది అమెరికాలో చదువుకుంటూ వారాంతాల్లో బీహార్ లోని పేద పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు చెబుతోంది పాఠ్యాంశాలు, నైపుణ్య శిక్షణ లకు సంబంధించిన ప్రోగ్రామింగ్ అభివృద్ధి చేసింది.వాటిని ఎన్జీవోలకు అందిస్తుంది బీహార్ లోని ‘లహంతి క్లబ్’ ప్రతినిధుల వారి […]
ఇది వారసత్వ నైపుణ్యం
మిర్జాపూర్ హస్తకళలకు పెట్టింది పేరు.వారసత్వ నైపుణ్యం తో నిండిన అందమైన మీర్జాపూర్ తివాచీలు రగ్గులు. ఫ్లోర్ మ్యాట్స్ ఇకపై ప్రపంచ వేదిక పైన తమ గొప్పతనం చాటనున్నాయి మిర్జాపూర్ లోని ‘గరీబ్ ప్రేరణ స్వయం సహాయ సమూహ్ ,తివాచీలు గోడలకు అలంకారంగా వేలాడ దీసే పట్టాలు తయారుచేస్తారు. ఈ బృందానికి నాయకత్వం వహిస్తుంది డైరెక్టర్ అఫ్సానా బేగం. వచ్చే ఏడాది జపాన్ లో ఏర్పాటయ్యే జపాన్ కార్పెట్ ఫెయిర్ లో ఈ బృందం తయారు చేసిన ఉత్పత్తులు […]
ఇప్పుడు నేను సింగర్ కనకవ్వ
పండ్ల గంప ఎత్తుకొని వాడ వాడలా తిరుగుతూ ఆ బరువు తెలియకుండా ఉండేందుకు పాటలు పాడుకుంటూ పండ్లు అమ్మే దాన్ని నా చిన్నతనంలో అమ్మ పాట వినేదాన్ని బతుకమ్మల దగ్గర మా అమ్మ పాడకపోతే ఆట ఆగేది. అక్కడే నేను నేర్చుకున్నా అంటోంది సింగర్ కనకవ్వ కూలీ పనులు చేసి పిల్లలను పెంచుకున్న కనకవ్వ పాటలు ఆమె పిల్లల యూట్యూబ్ లో పెడితే అవి కాస్త వైరలై ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. నాకు చదువు రాదు […]
అదే నా కర్తవ్యం
సమాజాన్ని కదలించే నృత్య రూపకాలు రూపొందించటం నా లక్ష్యం ముఖ్యంగా ఆడవాళ్ల పై హింసకు వ్యతిరేకంగా నృత్యరూపకాలు ప్రదర్శించటంతో నాకొక ఆత్మ సంతృప్తి ఉంటుంది అంటున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి లలితా సింధూరి చిన్నారి ఆసిఫా పై జరిగిన అత్యాచార సంఘటన గురించి వినగానే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచించిన ‘చిన్నాన్ చిరు కెలియె’ పాటతో బాధితురాలి తల్లిదండ్రులు కడుపుకోతను ఇతివృత్తంగా నృత్యరూపకం రూపొందించాను.కుంతీ విలాపం పుష్ప విలాపం వంటి మరెన్నో గీతాలను నృత్యం కంపోజ్ […]
పదేళ్ల కష్టం ఇది
అప్పటికీ ఇంకా గూగుల్ మ్యాప్ లు రాని రోజుల్లో ‘మ్యాప్ మై ఇండియా’ సంస్థ ప్రారంభించాం వీధివీధి తిరిగి సర్వేలు చేసి ఆయా ప్రాంతాలు వీధులు పేర్లు నమోదు చేసుకునేవాళ్ళం.రెండు కోట్ల డేటా సంపాదించాక త్రీడీ విజువలైజేషన్ ను జోడించి ఇప్పుడు మీరు చూస్తున్న ఆధునిక నావిగేషన్ సిస్టమ్ ని రూపొందించాం అంటున్నారు ఈ సంస్థ స్థాపించిన రష్మీ వర్మ.మేము తయారు చేసిన ఇన్ బిల్ట్ డిజిటల్ మ్యాప్ సొల్యూషన్స్ కు టచ్ స్క్రీన్ యంత్రాలనీ,ఆటోమొబైల్ రంగంలో […]
నిర్మాణ రంగంలోకి మమతా
నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా కల నిజం అవుతోంది.ఈ పరిశ్రమకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఆలోచనలో ఈ నిర్మాణ సంస్థను ఆరంభించాను నా పేరు తోనే నా నిర్మాణ సంస్థ కొనసాగుతోంది.అంటూ తన కొత్త బిజినెస్ గురించి చెబుతోంది మమతా మోహన్ దాస్. మలయాళం కన్నడ తెలుగు చిత్రాల్లో నటించిన మమతా భారతీయ చిత్రాల్లో ప్రశంసలు పొందిన ప్లే బ్యాక్ సింగర్. తెలుగు చిత్రం రాఖీ లో టైటిల్ సాంగ్ […]
సినిమాలు వదిలేయాలనుకొన్న
మద్రాస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పని చేస్తూ ఉన్నప్పుడు మిత్ర్ మై ఫ్రెండ్ సినిమా కోసం రేవతి గారితో స్క్రిప్ట్ రాసేందుకు చేరిపోయాను.అప్పటికే పెళ్లయింది.పెళ్లయిన తరవాతే నా కెరీర్ మొదలైంది.ఆ తర్వాత మణిరత్నం గారి దగ్గర ఆరున్నర ఏళ్ళపాటు కలిసి పనిచేసే అవకాశం దక్కింది.తర్వాత గురు తీశాను అది నా మొదటి సక్సెస్ మొదటి సినిమా ద్రోహి అపజయం పాలయ్యాయిక నిజానికి ఈ రంగాన్ని వదిలేసి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నా. ఈలోపు మాధవన్ కలిశాను.డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత […]
ఈ ఫీల్డ్ నచ్చింది
గత పదిహేను సంవత్సరాల్లో 350 యాడ్స్ లో నటించింది మహిమ మెహతా. సెయింట్ జూనియర్ కాలేజ్ లో అడ్వర్టైజింగ్ విభాగంలో డిప్లమా చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.బిగ్ బాస్కెట్, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ అలియాంజ్ ,కోల్గేట్ ,జెల్ ,టాటా స్కై ,వంటి యాడ్స్ నటించింది.షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్,ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్,సుస్మితాసేన్,ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో కలిసి యాడ్స్ చేయటం విశేషం.పది సెకన్ల యాడ్ లో విభిన్న పాత్రల్లో […]
మేం ఒప్పుకోం
సెంటిమెంట్స్ జోలికి వస్తే ఎప్పుడు ఒప్పుకోరు నెటిజన్లు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే ఎంతో త్వరగా ఇష్టపడతారు అవమానిస్తే అంతగా హర్ట్ అవుతారు (Cardi B) ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బి అలా హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరుకోవలసివచ్చింది రీబాక్ సంస్థ లో ఉన్నప్పుడు బృందంలో భాగంగా కార్డీ బి ఫోటో ఒకటి నవంబర్ నెల కు సంబంధించిన ఫుట్ వేర్ న్యూస్ మ్యాగజైన్ లో కవర్ ఫోటో గా వచ్చింది. ఆ […]
ఈ షో నాకో ఎక్స్ టెన్షన్
కరోనా లాక్ డౌన్ వల్ల 7 నెలలు ఇంటికే పరిమితం కావడం వల్ల చీకటి గదిలో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు ఆహా కోసం చేయబోతున్న సామ్ జాన్ షో నాకో రిలీఫ్. వాస్తవానికి షో కన్న యాక్టింగ్ ఈజీ ఇది నాకు ఒక ఎక్స్ టెన్షన్ అంటోంది సమంత. నేను ఢీ లాంటి రియాల్టీ షో లు కూడా చేశాను కానీ ఈ షో విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది అంటోంది దర్శకురాలు నందిని రెడ్డి.ఈ టాక్ […]
