Monday, 27 Jul, 2026

సంతోష సమయం

చంద్రయాన్-3 మిషన్ లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు కల్పన కాళహస్తి. 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. ముందుగా శ్రీహరి కోటలో ఐదేళ్లు పనిచేసి బెంగళూరులోని శాటిలైట్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. గతంలో చంద్రయాన్-2 మంగళయాన్ ప్రాజెక్ట్ ల లోను కీలక బాధ్యతలను నెరవేర్చారు. కల్పనా తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం మద్రాస్ యూనివర్సిటీ లో బిటెక్ ఈ సి ఈ చదివారు. మిషన్ విజయవంతం కావడం నా జీవితంలో సంతోషభరితమైన […]

త్వరలో సూర్యుడిని కలుస్తాం

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో వివిధ విభాగాల్లో 54 మంది మహిళలు పని చేశారు.విక్రమ్ లాండర్ సురక్షితంగా చంద్రుడిపై దిగేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందం లో మానస ఒకరు. గుంటూరు జిల్లా కు చెందిన బొల్లు మానస 2014లో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరారు. చంద్రాయన్-2 కి తన సేవలు అందించారు.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సూర్యుని పైకి త్వరలో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్-1 లో పని చేస్తానని చెబుతున్నారు […]

గిల్ట్ నగలా ?

మాచింగ్ కోసం ఆర్ట్ నగలు వాడటం ఎక్కువైంది. కానీ చాలా మందికి ఈ గిల్ట్ నగలు పడవు. వీటిని ధరించే ముందర మాయిశ్చరైజర్,పౌడర్,పెట్రోలియం జెల్లి వంటివి రాస్తే సమస్య ఉండదు. అలాగే వాడాక ఈ క్రీమ్ లు పోయేలా శుభ్రం చేయాలి. లేదా నగల వెనక ప్లాటినం కోటింగ్ వంటిది వేసిన మంచిదే లేదా కలబంద గుజ్జు రాసి బాగా ఆరిపోయాక ధరిస్తే ఎలాంటి అలర్జీలు రావు.

బరువు పెరిగితే అనారోగ్యం

గర్భిణీగా ఉన్నప్పుడు తమ బిడ్డకు సరిపోయేలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. బరువు పెరుగుతూ ఉంటారు కానీ అలా బరువు పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. ఆ సమయంలో క్రేవింగ్ కారణాలుగా అతిగా తీపి పదార్థాలు తింటారని అది మధుమేహానికి దారి తీస్తుందని సరైన ఆహారం, కొంత వ్యాయామం అవసరం అంటున్నారు.

మతిమరుపుకు మందు

సువాసనలకు జ్ఞాపక శక్తి కి గాఢమైన బంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. రోజ్, ఆరెంజ్, నిమ్మ రోజ్ మేరీ లావెండర్ వంటి సువాసనలు జ్ఞాపకశక్తి పెంచుతాయంటున్నారు.డిమెన్షియా కు గురి అయిన వారికి ఈ సువాసనలు చూపిస్తూ ఉంటే వాళ్లలో జ్ఞాపకశక్తి భాషా జ్ఞానం వృద్ధి అయినట్లు గుర్తించారు.

మరిగిస్తే పరిశుభ్రం

వర్షాల్లో తాగునీరు కలుషితం అవుతాయి. ఈ నీటిలో ఈ కోలై,హెపటైటిస్-ఎ కంపిలోబాక్టర్ సాల్మొనెల్లా, టాక్సో ప్లాస్మా వంటి సూక్ష్మజీవులు చేరుకుంటాయి. ఈ ప్రమాదం రాకుండా నీటిని మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా మరిగించిన నీటిలోని లవణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాచి వడపోస్తే నలకలు,మట్టి ఇసుక పోయి నీరు శుభ్రం గా ఉంటాయి.

అందరూ మహిళలే 

హైదరాబాద్ లోని ముస్లిమ్ మెటర్నిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ 53 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.ఇందులో ప్రత్యేకత హాస్పిటల్ సి ఈ ఓ నుంచి సెక్రెటరీ సెక్యూరిటీ స్టాఫ్ వరకు అందరూ మహిళలే. 200 పడకల హాస్పిటల్ లో కులం,మతం తేడా ఉండదు.మహిళలందరికీ వైద్య సేవలు అందుతాయి. ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించిన మూడు స్కూళ్ళు, మూడు హాస్పిటల్స్ లో ఇది ఒకటి. మహిళల ఆసుపత్రి గా పిలిచే ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.ఇది టీచింగ్ హాస్పిటల్. […]

కడిగి వాడుకుంటే మేలు

వానాకాలంలో ఆకుకూరలు పెరిగే ప్రదేశంలో కలుషితమైన నీరు చేరితే వాటిలోని హానికరమైన సూక్ష్మజీవుల వల్ల జబ్బులు వస్తాయి.   అందుకే ఆకుకూరలు ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టి తర్వాత మంచి నీళ్లతో కడిగి వాడుకుంటే సూక్ష్మజీవుల ప్రమాదం ఉండదు. క్యాలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మనసు బాధ కి మందు

అమీర్ ఖాన్ కూతురు ఇరా దత్త అగస్తు ఫౌండేషన్ స్థాపించి మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు వైద్యం,కౌన్సిలింగ్ థెరపీ చేయిస్తుంది. బాంద్రా  లోని పాలి విలేజ్ లో ఉన్న ఈ ఫౌండేషన్ లో సైకియాట్రిస్ట్ లు ఉంటారు. 50 రూపాయలకే మంచి వైద్యం దొరుకుతుంది.డిప్రెషన్ బారిన పడిన ఇరా దత్తా చదువు మానేసింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది.ఆ అనుభవం తో ఈ ఫౌండేషన్ ప్రారంభించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత ను ప్రారంభిస్తోంది ఇరా ఖాన్.

ఆమె బొమ్మలు ప్రత్యేకం

అను చౌహన్ మొబైల్ గేమ్ ఆర్టిస్ట్ ఇలస్ట్రేటర్ వీడియో గేమ్ ఆర్టిస్ట్ కూడా. కెనడా లో పుట్టి పెరిగిన అను చౌహాన్ యానిమేషన్ సబ్జెక్ట్  చదువుకున్నది. పిల్లల కోసం అను రూపొందించిన ‘ఏ దుపట్టా ఈజ్’ హెన్నా ఈజ్ పుస్తకాలు ఎంతో ఆదరణ పొందాయి. బొమ్మల ద్వారా  స్త్రీ సాధికారత ను ప్రచారం చేయచ్చు అంటుంది అను చౌహన్ అంతర్జాలంలో ఆమె ఆర్ట్ వర్క్ కు వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు.

అద్భుతమైన స్ఫూర్తి

వ్యవసాయ కూలి సాకే భారతి ఈ మధ్యనే పి.హెచ్ డి పట్టా తీసుకున్నది. అనంతపురానికి చెందిన భారతి ఎరుకల కులంలో శింగమానల మండలం నాగులగుడ్డం గ్రామంలో పుట్టింది. భర్త ఎరికుల శివప్రసాద్ ప్రోత్సాహంతో అనంతపురం లో ఎమ్మెస్సి చదువుకున్నది కూలి పనికి వెళుతూనే పి.హెచ్ డి చేసింది.2023 సంవత్సరానికి పట్టా పుచ్చుకుంది. డాక్టర్ భారతి ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తి.

తోటకు రక్షణ

వర్షాలకు బాల్కనీ లో ఉండే మొక్కలకు తెల్ల రామ పేను బంక వంటి కీటకాలు ఆశిస్తాయి.గాఢత తక్కువ ఉన్న లిక్విడ్ సోప్ రెండు స్పూన్లు నీటిలో కలిపి ద్రావణాన్ని మొక్కలపై పిచ్చకారీ చేయచ్చు. అలాగే వెల్లుల్లి ఉల్లి ద్రవాలు కూడా చీడలను పోగొడతాయి. మిరియాలు పొడి చేసి నీటిలో కలిపి మొక్కల పై పిచికారి చేస్తే అది సహజమైన క్రిమి సంహారిణి లాగా పనిచేస్తుంది.ఇష్టంగా పెంచుకునే తోట తెగుళ్ల తో పాడైపోకుండా ఈ సహజమైన పదార్థాలతో మొక్కల్ని […]

కఠోర సాధన  

మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన సృష్టి సుధీర్ జగ్తాప్ విరామం లేకుండా 127 గంటల పాటు నృత్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్  లో గిన్నిస్ సాధించింది. ఆమె తాతగారు స్వయంగా నాట్య గురువు గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్యం నేర్చుకుంది. ధ్యానంతో యోగా నిద్ర కూడా సాధన చేసింది సృష్టి. 16 సంవత్సరాల సృష్టి వరుసగా ఐదు రోజుల పాటు ఇచ్చిన నాట్య ప్రదర్శన తో ఆమె తల్లిదండ్రులు తాత అండగా ఉన్నారు. గిన్నిస్ […]

ఒత్తుగా కనురెప్పలు

ఒంపులు తిరిగి ఒత్తుగా ఉండే కనురెప్పలు ముఖానికి చాలా అందం. కనురెప్పలు ఒత్తుగా పెరగాలి అంటే పడుకునే ముందర ఆలివ్ ఆయిల్ గాని ఆముదం గాని రాయాలి. నిమ్మ తొక్కలను ఆలివ్ ఆయిల్ లేదా ఆమోదంలో వేసి ఆ నూనె రాసిన ప్రయోజనమే. పెట్రోలియం జెల్లి, గ్రీన్ టీ డికాషన్ కూడా కనురెప్పలను పెరిగేలా చేస్తాయి.

హస్తకళలకు సాయం

చోళుల కాలం నుంచి వస్తున్న కసూతి డిజైన్స్ ప్రపంచానికి మళ్లీ పరిచయం చేసింది ఆరతి హిరేమఠ్ ఆలయాలు, రథాలు, పల్లకీలు తామర పువ్వులు వస్త్రానికి రెండు వైపులా కనిపించేలా నేసే ఈ కసూతి డిజైన్స్ వందల ఏళ్ళనాటి సాంప్రదాయ కళ.ఈ కళాకారులు ధార్వాడ్ హుబ్లీల్లో ఉన్నారు. ఆర్తీ క్రాఫ్ట్స్ పేరుతో ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రారంభించింది. ఆర్తి బెంగళూరు చుట్టుపక్కల గ్రామ మహిళలకు శిక్షణ కూడా ఇస్తుంది. ఆన్ లైన్ లో ఇప్పుడు ఈ చీరలు కెనడా, […]

వ్యాపారం కూడా ఇష్టమే

న్యూయార్క్ లోని సోనా ఇన్ న్యూయార్క్ రెస్టారెంట్ లో భారతీయ రుచులు ఉంటాయి.దోసకాయ తో చేసిన వంటకాలు కూడా ఇక్కడ ఫేమస్ అంటుంది ప్రియాంక చోప్రా న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ నా హృదయంలో ఒక భాగం అంటుంది ప్రియాంక. బాలీవుడ్ లో హాలీవుడ్ లో నటనా రంగం లోనే కాదు వ్యాపార రంగం లోనూ తన సత్తా చాటుతోంది ప్రియాంక.ఇప్పటికే ఆమె సొంత హెయిర్ కేర్ బ్రాండ్ ‘అనోమోలీ’ ప్రొడక్షన్ హౌస్ పర్పుల్ పెబల్ […]

వ్యాయామం చాలా ముఖ్యం

50 ఏళ్లు దాటాక ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిది అంటున్నారు నిపుణులు.స్త్రీ, పురుషులన్నా సమస్య లేకుండా కండరాల పరిమాణం, దృఢత్వం తగ్గిపోతుంది.కండరాల కదలిక వల్లే జీవక్రియలు పెరిగి క్యాలరీలు కరుగుతాయి. కండరాల్లో పట్టు తగ్గుతే బరువు తగ్గుతారు. అందుకే 50 దాటిన తర్వాత బరువులు ఎత్తడం, స్పీడ్ వాక్,నడక, తాడాట ఆడడం వంటివి చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయంటున్నారు.

ఫ్లోర్ శుభ్రం

ఇళ్లలో ఎన్నో రకాల మరకలు కనిపిస్తాయి రసాయనాలు లేకుండా వాటిని క్లీన్ చేయచ్చు. ఫ్లోర్ పైన కాఫీ టీ మరకల్ని నీళ్లలో వెనిగర్ వేసి శుభ్రం చేయచ్చు. టైల్స్ పైన మరకల్ని నిమ్మరసంతో పోగొట్టవచ్చు. మార్బుల్స్ ని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. బండల పైన నూనె ఉంటే ముందుగా కార్న్ ఫ్లోర్ వేస్తే అది నూనె పీల్చేస్తుంది.తర్వాత సబ్బు నీళ్లతో శుభ్రం చేయచ్చు. బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు. టైల్స్ పైన మరకలను […]

పాలిచ్చే తల్లులకు 

బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదు.పాలు సమృద్ధిగా ఉండాలంటే తల్లులకు కొన్ని పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఓట్స్ లో, బ్రౌన్ రైస్ గుడ్డు లో ఎన్నో పోషకాలున్నాయి. ఓట్స్ పాలతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకుంటే చక్కగా పాలు పడతాయి. ఓట్స్ బిస్కెట్స్ తిన్న ప్రయోజనమే.రోజుకు రెండు గుడ్లు,జీడిపప్పు, వాల్ నట్స్, బాదం పప్పులు పాలిచ్చే తల్లులకు మంచి ఆహారం.

సమస్య పరిష్కారం

బ్లూ సర్కిల్ డయాబెటిస్ ఫౌండేషన్ నుంచి మధుమేహం ఉన్నవారికి సాయం చేస్తోంది నుపుర్ లాల్వాని.ఎనిమిదేళ్ల వయసు లోనే ఆమెకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యం బాగాలేక పోయిన బాగా చదువుకోంది నుపుర్.ఎంబిఎ  చేసింది ఆతిధ్య రంగంలో స్థిరపడింది.డయాబెటిస్ తో తాను పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బ్లూ సర్కిల్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఇషా ల ద్వారా నిరుపేదలైన మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులు ఆర్థిక సాయం మార్గదర్శకత్వం అందిస్తోంది.200 పైగా వర్క్ షాప్ లు […]