Chinna Maata
జుట్టు మెరిసిపోతుంది
జుట్టు రాలకుండా ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలి అనుకుంటే బి విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియంతో పాటు కురులకు ఆరోగ్యం ఇచ్చే బయోటిన్ కూడా దొరుకుతుంది. పాలకూర,పప్పు ధాన్యాలు బీన్స్,బాదాం,పొద్దుతిరుగుడు గింజల్లో బి విటమిన్ ఉంటుంది.బ్రౌన్ రైస్,ఓట్స్, చేపలు వీటితో పాటు విటమిన్ సి ఉండే నిమ్మ, నారింజ పండ్లు తినాలి ఇవన్నీ రోజువారీ ఆహారంలో ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
డైట్ తో అనారోగ్యాలు
ది ఆయుర్వేదిక్ వెల్నెస్ కుక్ బుక్ రాశారు ఆయుర్వేదిక్ విలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా రమేష్ ఈ పుస్తకానికి ఆమె ప్రతిష్టాత్మక గౌర్మాండ్ అవార్డ్ అందుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో చేసిన వంట తినాలి మార్కెట్లోకి వచ్చే ఎలాంటి డైట్ లు ఫాలో అవ్వరాదు కీటో డైట్ వంటి వాటి వల్ల సమస్యలే తప్ప ప్రయోజనం ఉండదు. శరీరానికి అనవసరంగా కష్టపెట్టకూడదు అంటారు గీతా రమేష్. ముఖ్యంగా మహిళలు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి అంటారామె.
క్రూర జంతువులకు రక్ష
ఆపదలో ఉన్న వన్యప్రాణుల ప్రాణాలు కాపాడుతుంది డాక్టర్ మేఘన పెమ్మయ్య చిరుత పులులు, పక్షులు, తాబేళ్లు,పాములు,తోడేళ్లు పులులు, నక్కలు వంటివి అడవుల సమీప గ్రామాల్లో ప్రవేశించి పొరపాటున ఏ గోతుల్లోనో చిక్కుకుంటే వాటిని ఎంతో సాహసంతో కాపాడి ప్రాథమిక చికిత్స చేస్తుంది మేఘన.ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ లో ఒక్కోసారి గాయాలు తగులుతాయి. కానీ జంతువుల పట్ల నాకున్న ఇష్టంతో అవేమీ పట్టించుకోను అంటారామే.
ఉత్తమ ప్రచారకర్త
దక్షిణాఫ్రికా లోని మారుమూల గ్రామంలో పుట్టిన మూడేళ్ల లేతుకుఖాన్య మ్జాజీ అల్బానీ బ్రెడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయింది.అమ్మ వద్దన్నా ఏడ్చి మరీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే పాప మొహంలో ఆనందం చూసి ఆమె మామ లుంగీసా జాజి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గంటల్లో ఆ ఫోటో వైరల్ అయ్యి ఇంత ఆనందించే పాపను మీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోమని లక్షలమంది ట్రీట్ చేశారు దాంతో ఆ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు […]
అసలైన వ్యాపారవేత్త
కైరవి మెహతా ను స్టీల్ రంగానికి రాణి అంటుంటారు తండ్రి వి.కె ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధిపతి.దేశవ్యాప్తంగా వీరికి వేర్ హౌస్ లు ఉన్నాయి. ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవడం కోసం కైరవి మెహతా ఎంతో కష్టపడింది. మేనేజ్మెంట్ డిగ్రీ చేసింది నేరుగా సి ఈ ఓ బాధ్యతలు తీసుకోకుండా కింద స్థాయి నుంచి వర్కర్స్ తో కలిసి పనిచేసింది. డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వేగవంతం చేసేందుకు సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టింది ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కస్టమర్స్ ను పెంచి […]
బాల్కనీ మేకోవర్
చాలామందికి చిన్న బాల్కనీ వరండాలు ఉంటాయి. ఆ కాస్త ప్లేస్ అందంగా తీర్చిదిద్దొచ్చు అనుకున్నది రామా హేమలత స్వర్గ బాల్కనీ మేకోవర్ పేరుతో ఇన్ స్టా లో సరికొత్త డెకరేషన్ లతో బాల్కనీ ఫోటోలను పోస్ట్ చేసింది.ఆమె వీడియోలు పోస్ట్ లు సినిమా తారలు కూడా మెచ్చుకొని తమ బాల్కనీలు డెకరేట్ చేసి ఇవ్వమని అడిగారు. ఇప్పుడు వ్యాపారం లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇప్పుడు పార్లర్లు, విల్లాలు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తోంది రామా హేమలత.
మతిమరుపే రాదు
50 ఏళ్లు రాకముందే చాలా మందికి మతిమరుపు వస్తోంది. వృద్ధాప్యంలో ఇది మరింత సమస్య అవుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ నిపుణులు వందల మంది పై పరిశీలన చేసి ప్రతి వాళ్లు టీవీ చూడటం,సంగీతం వినటం, చిత్రలేఖనం, పజిల్స్ కంప్యూటర్ వాడకం వంటి వ్యాపకాలు అలవాటు చేసుకుంటే మతిమరుపు రాదంటున్నారు. కంప్యూటర్ వాడే వాళ్ళలో తక్కువ మతిమరుపు లక్షణాలున్నాయట.సృజనాత్మకమైన హాబీలు ఉన్నవాళ్ళలో మతిమరుపు సమస్య లేదట.
చీరలే ఇష్టం
చీరలు అంటే నాకు మహా ఇష్టం అంటారు ఉషా ఉతుప్. పట్టుచీర నుదుట పెద్ద బట్టు చేతులకు గాజులతో కనిపించే ఈ పాప్ గాయని తన దగ్గర 600 పట్టు చీరలు ఉన్నాయంటున్నారు. బంగారు హంసల మోటిఫ్ లతో ఉండే కాంచీపురం చీరలు పేస్టల్ షేడ్స్ తెలుపు రంగుల్లో ఉండే అందమైన చీరల్లో వేదికపై పాడే ఉషా ఉతుప్ దక్షిణ భారతదేశపు సాంప్రదాయపు ప్రతీకలా అనిపిస్తారు.
రెడీ టు మిక్స్
మంగమ్మ ఫుడ్స్ పేరుతో కోట్ల వ్యాపారం చేస్తున్నారు ప్రతిమ విశ్వనాథ్ దోష పిండి, నెయ్యి, చిరు తిండ్లు భిన్న రకాల చపాతీ, పూరీలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు చెన్నై లోని వెయ్యి స్టోర్స్ ఈ కామర్స్ సంస్థల్లో దొరుకుతాయి. వందమంది ఉద్యోగులున్న ఈ సంస్థ ఎన్నో రెడీ టు మిక్స్ ఆహారాలకు ప్రసిద్ధి.
పక్షుల గ్రంథాలయం
డిజిటల్ ఫెదర్ లైబ్రరీ. కామ్ పేరుతో మన దేశానికి చెందిన 1300 రకాల పక్షి జాతుల వివరాలు అందించారు ఈషా మున్షీ. ఈమె ఆర్కిటెక్ట్ కూడా ఈ వెబ్ సైట్ శాస్త్రవేత్తలకు అటవీశాఖ అధికారులకు పక్షి ప్రేమికులకు ఎంతో ఉపయోగపడుతుంది. పక్షుల గురించి ఎలాంటి సమాచారం అయినా ఈ వెబ్ సైట్ లో దొరుకుతుంది. దేశంలోనే తొలి డిజిటల్ ఫెదర్ లైబ్రరీ ఇది.
అందంగా గోళ్ళు
నెయిల్ ఆర్ట్ డిజైన్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు అమ్మాయిలు. వేడుకల్లో, తగిన డ్రెస్ లు వేసుకున్నట్టుగా,నెయిల్స్ మ్యాచింగ్ పట్ల శ్రద్ధ చూపించినట్లుగా, నెయిల్స్ కూడా తీర్చిదిద్దు కుంటున్నారు. ఫ్రెండ్ షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్,కృష్ణాష్టమి ల వంటి వేడుకలకు నెయిల్ ఆర్ట్ డిజైన్లు చాలా ప్రత్యేకమైనవి సృష్టించారు.అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు చేతులకు పెడిక్యూర్ చేయించుకునే సమయంలో గోళ్లు చక్కగా కట్ చేయించుకుని ప్రతిరోజు కొబ్బరి నూనె మర్దన చేసుకోవాలి. అవసరం అయితే ఆర్టిఫీషియల్ […]
వంట క్లాసులే ఉద్యోగం
ఉదయపూర్ కు చెందిన శశికళ విదేశీ యాత్రికులకు వంట నేర్పుతోంది. ఆర్థికంగా చితికిపోయిన దశలో చిన్నతనం నుంచి శ్రద్ధగా చేసే వంటనే వృత్తిగా చేసుకున్నది. శశి కుకింగ్ క్లాసెస్ లో వెయ్యి మందికి పైగా వంట నేర్చుకున్నారు. మాతృభాష తప్ప ఇంకేమీ రాని శశికళ విదేశీ భాషలు నేర్చుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విదేశీయులకు తప్పనిసరిగా చెప్తూ ఉంటారామే.
లైఫ్ స్టయిల్ మార్చుకోన్న
బెస్ట్ ఉమెన్ అచీవర్ అవార్డ్,మిసెస్ హైదరాబాద్ టైటిల్ ను అందుకున్నారు అరుణ రాజ్ వర్మ మూడేళ్ల క్రితం 125 కేజీల బరువు ఉన్న ఆమె వర్క్ వుట్స్ హెల్తీ డైట్ తో బరువు తగ్గిన విధానాన్ని యూట్యూబ్ లో లైవ్ ఇచ్చారు. ఆహారం విషయంలో శ్రద్ధ గా ఉండటం ప్రతిరోజు వర్క్ వుట్స్ చేయడం జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా నే బరువు తగ్గి పోయాను అంటుంది అరుణ రాజ్ వర్మ.
బొట్టు మచ్చ సమస్యా ?
బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఒక్కసారి దురద, వాపు, మచ్చలు వస్తాయి. అక్కడ చర్మం పొడిబారడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ప్రతిరోజు రాత్రివేళ కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసుకోవాలి. అలోవెరా జెల్ రాసి మర్దన చేసిన నలుపు, మచ్చలు పోతాయి. బొట్టు బిళ్ళలు గ్లూ గమ్ తక్కువగా ఉండేలా ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందర వాటిని తీసేసి మాయిశ్చరైజర్ రాసుకుంటే దురదలు వాపులు రాకుండా ఉంటాయి.
అంతర్జాతీయ గుర్తింపు
2007లో అన్వర్ చిత్రంలో బాలీవుడ్ లో నటించిన రసికా దుగల్ ఓటీటీ సీరియల్స్ లో టాప్ యాక్టర్ మిర్జాపూర్, ఢిల్లీ క్రైమ్ వంటి వెబ్ సిరీస్ లో హమీద్ మాంటో వంటి చిత్రాలతో రసిక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఢిల్లీలో బ్యాచిలర్ సైన్స్ చదువుకొన్న రసిక పోషించిన పాత్రలు బలమైనవీ, బలహీనమైనవీ, గొప్పవీ మనసుని బాధపెట్టేవి అంటారు విమర్శకులు. 15 సంవత్సరాలుగా బాలీవుడ్ లో నటిస్తున్న రసిక ఓటీటీ సిరీస్ లో మొదటి వరుసలో నిలబడింది.
వాటిలోనే పోషకాలు
కొన్ని రకాల పండ్లు కూరగాయల తొక్కల్లోనే పోషకాలు ఉన్నాయి అంటారు ఎక్సపర్ట్స్. ఉడికించిన తర్వాత బంగాళాదుంప, చిలకడ దుంప పొట్టు తీసేయవద్దు వాటిలో ఫైబర్ బి.సి విటమిన్లు పొటాషియం, కాల్షియం, ఐరన్ ఉంటాయి. క్యారెట్ గుజ్జులో కంటే పొట్టు లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అలాగే ఆపిల్ గుజ్జులో కంటే పై తొక్కలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడుతాయి.
సౌందర్యం ఇచ్చే బొప్పాయి
జిడ్డు చర్మం గలవారికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి గుజ్జులో రెండు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం పై జిడ్డు,మురికి పోతాయి. అలాగే బొప్పాయి ముక్కల్ని ఫ్రిడ్జ్ లో ఉంచి వాటితో ముఖం మసాజ్ చేసుకుంటే ఎండలో నిలబడినా చర్మం మెరిసిపోతుంది. బొప్పాయి గుజ్జులో తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే జిడ్డు పోతుంది.
టాప్ లో అక్షిత
టాప్ మోడల్స్ తో పోటీపడి అద్భుతమైన దుస్తులు వేసుకున్న వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో ఉన్నది అక్షిత మూర్తి. ఫ్యాషన్ డిజైనర్ గా ఆమెకు ఆధునిక వస్త్ర ఆదరణ లో అవగాహన ఉన్నది. ఓ పాఠశాలలో నిర్వహించిన ఓ రన్ కోసం అక్షిత 60,218 వేల విలువైన చెప్పుల్ని వేసుకున్నది. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ డిజైనర్ గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొన్న అక్షిత మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె బ్రిటన్ ప్రధాని […]
47 మిలియన్ల వ్యూస్
మిస్ కేరళ 2017 అయిన ప్రియాంక షెనాయ్ చేసిన అందమైన వీడియో ఇన్స్టా లో పోస్ట్ చేస్తే 4.7 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. రజనీకాంత్ జైలర్ సినిమాలో తమన్నా భాటియా ‘నువ్వు కావాలయ్యా’ పాటకు చేసిన స్టెప్స్ అనుకరిస్తూ ప్రియాంక మీనన్ చేసిన వీడియో వైరల్ అయిపోయింది అనిరుధ్ రవిచందర్ పాటకు స్వరాలు సమకూర్చి శిల్ప రావు తో కలిసి పాడారు.
మొదటి అడుగు ఆమెదే
హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్.యు.ఎల్) లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ గా ఉద్యోగ ప్రస్థాను మొదలుపెట్టిన లీనా నాయర్ ఫ్యాక్టరీ ఫ్లోవ్ లో తొలి మహిళ. అలాగే నైట్ షిఫ్ట్ లో పనిచేసిన తొలి మహిళగా మేనేజ్మెంట్ కమిటీ లో తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఫ్యాక్టరీ లో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గా ఉద్యోగులతో ఎంతో కలిసిమెలిసి ఉండే లీనా నాయర్ అక్కడ నుంచే గ్లోబల్ బ్రాంచ్ ఛానల్ సి ఈ ఓ గా ఎదిగారు. లీనా […]
