Chinna Maata
దేశ సేవ లక్ష్యం
భోజపురి నటుడు రవి కిషన్ ముద్దుల కూతురు ఇషితా శుక్ల భారతీయ సైన్యంలో చేరింది. కేంద్ర ప్రభుత్వం యువతులను సైన్యంలో చేర్చుకునేందుకు అగ్నిపత్ ప్రవేశపెట్టింది. ఇషితా అలాగే సైన్యంలో చేరి మూడేళ్లుగా శిక్షణ పొందుతోంది.ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొన్నది ఇషితా.ఆమె వయసు 21 ఏళ్ళు. దేశానికి సేవ చేయడం నా లక్ష్యం అంటుంది ఇషితా శుక్ల.
వెజిటేబుల్ బామ్మ
కోయంబత్తూర్ దగ్గర తొప్పంపట్టి పూంగానగర్ కు చెందిన 86 ఏళ్ల నంజమ్మాళ్ ను వెజిటేబుల్ బామ్మా అంటారు. 200 కుటుంబాలు ఉన్న ఆ ఊర్లో ఓ సారి రక్త పరీక్షలు చేస్తే అందరికీ రక్తహీనతే సమస్య. అప్పుడు బామ్మ ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ కూరగాయలు, పండ్ల మొక్కలు వేసి వాటి సంరక్షణ బాధ్యత తనే తీసుకుంది. సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసి అందరి ఇండ్ల పెరట్లో చల్లుతుంది. నంజమ్మాళ్ ను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల […]
పాటలంటే శ్రద్దా !
శ్రద్దా కపూర్ చక్కని నటే కాదు మంచి గాయని కూడా చిన్నతనం నుంచి సంగీతం లో శిక్షణ తీసుకున్నది ఆషికి-2 లో సొంతంగా పాటలు పాడుకుంది. ఏక్ విలన్,హోప్ గర్ల్ ఫ్రెండ్ లో పాడిన పాటలు ఆల్ టైమ్ ఫేవరెట్స్ గా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.ఇటు నటిగా అటు గాయనిగా ఆమె ప్రయాణం విజయవంతం.
రాత్రి నిద్రే బెస్ట్
మధ్యాహ్నం నిద్ర మనం ఉబుసుపోక తినే చాక్లెట్ లా ఉండాలి .కానీ పూర్తిస్థాయి భోజనం లా కాదు అంటారు ఎక్సపర్ట్స్. ప్రతి వాళ్లకు ఎనిమిది గంటల నిద్ర అవసరం అది రాత్రి వేళల్లోనే నిద్రపోవాలి. మధ్యాహ్నం నిద్ర అలవాటును బలవంతంగా అయినా తగ్గించుకోవాలి. రాత్రి నిద్ర దేహానికి మేలు శరీరం తనువు తాను రిపేర్ చేసుకునేది ఈ రాత్రి నిద్రలోనే. నిద్ర సరిపోకనే నీరసం వస్తుంది. రాత్రి నిద్రపోయే అలవాటు చేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.
కల్తీ చాలా ప్రమాదం
ట్రీ హౌస్ పేరుతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో కొన్ని వేల మందికి సహజ రంగుల తయారీపై శిక్షణ ఇస్తోంది మన్య చెరబుద్ది. పిల్లలకు వాడే దుస్తులపై కల్తీ రంగుల వాడకం ప్రమాదం కనుక సహజ రంగులతో డై చేయమని చెబుతోంది మన్య. ఆకులు, పువ్వులు, కూరగాయలు,పండ్ల తోనే సహజమైన రంగులు ఎలా తయారు చేసుకోవాలో ట్రీ హౌస్ లో పాఠాలు చెబుతోంది. ఈ ఆన్ లైన్ వర్క్ షాప్ లో చాలా తక్కువ ఫీజు […]
వ్యాపారం కూడా ఇష్టం
మంచి భోజనాలు ఇష్టపడే నటి భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్ కూడా క్రోమ్ ఆసియా గ్రూప్ కాయ పేరుతో గోవాలో బోటిక్ హోటల్ ప్రారంభించింది ముంబై లో పుట్టిన భూమికి కళలు, పర్యావరణం చాలా ఇష్టం.పర్యావరణ సంరక్షణ అంశాలపై పని చేస్తున్న భూమి ఫోర్స్ ఇండియా 2018 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించింది. మంచి బ్రాండ్ తో కలిసి ప్రయాణం ఎంతో సంతోషంగా ఉంది. నాకు నచ్చిన వ్యాపార సూత్రం ఒకటి వ్యాపారంలో నష్టం రాకూడదు […]
వందల మందికి ఉపాధి
ఆపిల్ జోన్ పేరుతో ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించింది రమా బిష్ట్ ఉత్తరాఖండ్ కు చెందిన రామ్ ఘడ్ లో ప్రారంభమైన ఈ ఆపిల్ జోన్ లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళ బృందాలు పని చేస్తాయి. పండ్లు, మూలికలు సరఫరా చేస్తారు .మూలిక ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఆమె కృషికి గుర్తింపు గా మా నంద శక్తి సమ్మాన్ పురస్కారం ఉత్తరాయణి మేళా అవార్డు వంటివి ఎన్నో దక్కాయి. వందల మంది మహిళలు […]
నా భర్త అడుగుజాడల్లో నేను
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసింది దేబశ్రీ బెనర్జీ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న దేబశ్రీ భర్త మేజర్ సుబ్రోతో అధికారి 2022 లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనతో చెల్లించి పోయినా దేబశ్రీ వీరుడి భార్యగానే కాకుండా దేశం గర్వపడే వ్యక్తుల్లో ఒకరుగా ఉండాలనుకొన్నది. శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా విధుల్లోకి వచ్చారు దేబశ్రీ అధికారి.
లేడీ బస్ డ్రైవర్
అంతర్రాష్ట్ర సర్వీసుల్ని నడుపుతున్న తొలి మహిళా డ్రైవర్ సీమ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ టి సి లో ఆమె పనిచేస్తుంద. సిమ్లా నుంచి చండీగఢ్ వరకు నడిచే జ్వాలా బస్ డ్రైవర్ సీమ. 2016 లో ఆర్టీసీ సిబ్బంది కోసం టాక్సీ నడిపే పనితో ఆర్టీసీ లో అడుగు పెట్టింది సీమ. తరువాత బస్ స్టీరింగ్ సీమ చేతికి వచ్చింది. రూల్స్ పాటించడం అతివేగంతో నడపకపోవడం యాక్సిలేటర్ మీద బ్రేక్స్ పైన నియంత్రణ తో ఉండటం […]
వెల్లుల్లి పొడి
ఇప్పుడు మార్కెట్లో వెల్లుల్లి పౌడర్ కూడా దొరుకుతుంది. దీన్ని ఇంట్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఒక అరకిలో వెల్లుల్లి రెబ్బలు వలచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు బొంబాయిరవ్వ బాండలి లో వేడెక్కే దాకా వేయించి అందులో వెల్లుల్లి ముక్కలు వేయించాలి.ముక్కలు బంగారు రంగు వచ్చేదాకా వేయించి జల్లిస్తే బొంబాయి రవ్వ తీసేయాలి. వేయించిన ముక్కల్ని మిక్సీ జార్ లో వేసి పొడిగా చేసుకొని ఆరనిచ్చి సీసాలో నిల్వ చేసుకోవచ్చు. చాలా కాలం […]
సౌకర్యం ముఖ్యం
సౌకర్యవంతమైన దుస్తులు ఉంటే యోగా సాధన సులువు అంటున్నారు ఎక్సపర్ట్స్. బ్యూటీ షార్ట్స్ వైడ్ లెగ్ ప్యాంట్లు యోగ స్వెట్ ప్యాంట్స్, క్రాప్డ్ లెగ్గింగ్స్, రన్నింగ్ పాంట్స్ ఇలా యోగ కోసం లెక్కలేనన్ని రకాలున్నాయి. కటి ప్రాంతంలో అదనపు ఫ్యాబ్రిక్ కుట్టి ఉండేలా చూసుకోవాలి. యోగా సాధన ఆధారంగా ప్యాంట్ పొడవు ఎంచుకోవాలి. నైలాన్, పాలిస్టర్, కాటన్ బ్లెండ్, లైకా వూల్ వంటి సాగే గుణం ఉన్న ఫ్యాబ్రిక్ కలిగిన మెటీరియల్ సౌకర్యంగా ఉంటాయి. మృదువుగా ఉండే […]
తేలికగా పాఠాలు
పిల్లలకు సరళమైన మార్గం లో విద్య నేర్పేందుకు ఎందరో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. జార్ఖండ్ ధన్ బాద్ కి చెందిన రోష్ని ముఖర్జీ ఫిజిక్స్,బయాలజీ కాన్సెప్ట్ లు సులభతరం చేసి పాఠాలు చెబుతూ కొన్ని వేల పాఠాలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారామె. పాఠశాలల్లో చెప్పే విద్య తేలికగా అర్థమయ్యేలా 9 నుంచి 12, 5 వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ఈ పాఠాలు చెబుతోంది. కొన్ని వేల మంది విద్యార్థులకు ఈమె విద్యాదాత.
కళాకారులకు ఉపాధి
దక్షిణ కర్ణాటక లోని మల్లూరు అనే గ్రామంలో వూరి మీదుగా ప్రవహించే ‘నుగు’ అనే నది పేరుతో నుగు హ్యాండీ క్రాఫ్ట్ ప్రారంభించారు సోనాలి శర్మ. భారతదేశంలోని హోటళ్ళు, రెస్టారెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన సిరామిక్ హ్యాండ్ క్రాఫ్ట్ వేర్ టేబుల్ వేర్ తయారు చేశారు.గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసే ఈ పింగాణి పళ్లేలు, కప్పులు, గ్లాసులకు ఎంతో పెద్ద మార్కెట్ ఉంది.100 శాతం రీసైకిల్ చేయగల మెటీరియల్ తో వీటిని రూపొందిస్తారు వందల మంది […]
భలే సర్పంచ్
90 ఏళ్ల వయసులోనూ గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూనే ఉంది వీరమ్మాళ్ అమ్మ. తమిళనాడు మదురై ప్రాంతంలోని అరిట్టపట్టి గ్రామానికి సర్పంచ్ అయినా ఆమె రోడ్లు, త్రాగునీరు,పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి సకల సౌకర్యాలు ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె చేసిన మంచి పనుల వల్ల ఆ గ్రామానికి జీవవైవిద్య వారసత్వ ప్రదేశం గా గుర్తింపు వచ్చింది ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. వీరమ్మాళ్ ఇప్పటికీ ఉదయం లేచి తన ఇంటి పనులు పొలం పనులు చేసుకుని తర్వాత […]
ఇదే తొలిసారి
105 సంవత్సరాల రైల్వే శాఖ చరిత్రలో రైల్వే బోర్డు చైర్మన్ గా ఎంపికై రికార్డ్ సృష్టించింది జయ వర్మ సిన్హా ఇప్పటివరకు మగవాళ్లే బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ లో చదువుకున్న జయవర్మ. 1988 లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. వివిధ హోదాల్లో పని చేశాక ఆమెకు ఈ గౌరవం దక్కింది.
వాళ్లను నిద్రపోనివ్వండి
పసి పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోవాలంటారు ఎక్సపర్ట్స్. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల కార్యకలాపాలతో వచ్చే శబ్దం ముఖ్యంగా టీవీలు, ఫోన్ లు పిల్లల్ని చాలా విసిగిస్తాయి. వాళ్లను ముద్దు చేస్తూ ఎత్తుకోవటం చుట్టూ కూర్చొని మాట్లాడుకోవడం మానేసి వాళ్లకు ప్రశాంతమైన చోటు కల్పించాలని వాళ్లు పడుకున్న గదిలో ఎక్కువ వెలుతురు లేకుండా చూడాలని చెబుతున్నారు.పిల్లల తో పాటు తల్లి కూడా పడుకుంటే వాళ్లకు రక్షణగా అనిపిస్తుందని చెబుతున్నారు.
గణేష్ శిల్పి రేష్మా
ముంబై లోని భారీ గణేష్ విగ్రహాలు సగం వరకు రేష్మా ఖాతు తయారు చేసినవే.ఆమె నంబర్ వన్ గణేష్ శిల్పి. ఆమె తండ్రి విజయ ఖాతు. వారసత్వంగా రేష్మా విగ్రహాల తయారీ తన చేతిలోకి తీసుకున్నది. నేను శిల్పి కూతురిని శిల్పం తయారీ నా జీన్స్ లోనే ఉంది అంటుంది రేష్మా.
దీదీ కేఫ్
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్వయం సహాయక సంఘాల చేత ప్రారంభం చేత ప్రోత్సాహం ఇచ్చింది. ఈ అవుట్ లెట్ లు పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. కాఫీ తో పాటు ఎన్నో రకాల స్నాక్స్ ఈ గ్రామీణ మహిళలు నిర్వహించే క్యాంటీన్లలో లభిస్తున్నాయి. యుపి ప్రభుత్వం ట్రయిల్ ప్రాజెక్ట్ వారణాసి లో ప్రారంభించిన ఈ దీదీ కేఫ్ విజయవంతం అయింది. బీహార్ లో దీదీ కి రసోయి, కేరళాలో కుడుంబా శ్రీ పేరుతో మహిళలు నిర్వహించే కేఫ్ […]
చిరుధాన్య రైతు
గిరిజన రైతు సుభాస మెహంత ఉత్తమ రైతు గా రాష్ట్ర జాతీయ పురస్కారం అందుకున్నది. ఒడిశా లోని సింగార్ పూర్ అనే పల్లెకు చెందిన సుభాస రాగి పంట పండిస్తోంది.45 ఏళ్ల సుభాస కు చుట్టుపక్కల ప్రజలు ‘మండియామ’ అంటూ పిలుస్తారు. ఈ ఏడాది గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ జీ 20 సదస్సులో పాల్గొని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నది.
స్వచ్ఛత కోసం మొక్కలు
ఇంట్లో ఆఫీసుల్లో కూడా ఎన్నో రేడియేషన్ విడుదల చేసే పరికరాలు ఉంటాయి. వీటి తీవ్రత తగ్గించుకోవాలంటే ఇంట్లో కాక్టస్ మొక్కలు పెంచుకోవాలి. పొడవైన ఆకులు ఉండే స్నేక్ ప్లాంట్ కలబంద వంటివి కుండీల్లో పెంచుకుంటే ఇళ్లలో రేడియేషన్ తగ్గిపోతుంది.
