Chinna Maata
నిద్ర చాలకే ఆకలి
మెలుకువగా ఉన్నంతసేపు జీవ క్రియల రేటును ప్రభావితం చేసే ఘ్రెలిన్, లెఫ్టిన్ హార్మోన్ శరీరం విడుదల చేస్తుంది. చాలినంత నిద్ర లేకపోతే ఈ హార్మోన్లు ప్రభావితమై ఆకలిని కలిగిస్తాయి. దింతో ఎదో ఒకటి తినేస్తారు.బరువు పెరగటానికి నిద్రకు ఉన్న సంబంధం అదే. ఐదు గంటలకంటే తక్కువ తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. చాలినంత నిద్ర ఆరోగ్యం పై బరువు పై అదుపు చేస్తుంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. హార్మోన్స్ స్థాయిలు […]
వేసవి పానీయాలు
వేసవిలో శరీరానికి ఎలక్ట్రో లైట్స్ అందాలి అంటే పోటాషియం, కాల్షియం, సోడియం బై కార్బోనేట్ , సోడియం క్లోరైడ్ వంటి పానీయాలు అందాలి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రో లైట్స్ అందుతాయి. నిమ్మ,నారింజ, కమలా, ద్రాక్షా అల్లం రసం కూడా ప్రయోజనకరం. నరాలు సక్రమంగా పని చేస్తూ గుండే పదిలంగా ఉండాలి అంటే ఉప్పు కలిపిన పంచదార నీరు తక్షణ ఉపశమనం గా తాగాలి. కీర దోసలు, పొటాషియం, మంగానీస్, మెఘ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కీరదోస రసం, సబ్జా […]
రుచీ ఆరోగ్యం
ఇప్పుడు అన్ని రకాల పచ్చళ్ళు పెడతారు. అందులో గోంగూర కూడా ఒకటి. మంచి గోంగూర దొరుకుతుంది ఈ రోజుల్లో ఎంతరుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా మంచి ఐరన్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది. పొటాషియం చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తుంది. సీ విటమిన్ పాళ్ళు ఎక్కువ. ఫైబర్ కూడా ఎక్కువే గోంగూర లో దొరికే విటమిన్ సీ ప్రీ రాడికల్స్ ను హరించి […]
హీల్ మసాజ్
ఏ ఎక్సర్ సైజ్ చేసినా ముందు పాదాల నొప్పులు పట్టుకుంటాయి. నడక ,సైక్లింగ్ ,మారథన్ ఏ వ్యాయామం లోనైన ఆసక్తి చూపించే స్నేహితులు కూడా ఈ సమస్య ఎప్పుడు చెపుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం హీల్ మసాజ్ .ప్రతి రోజు ఉదయం రాత్రి నిద్ర పోయే ముందర ఈ మసాజర్ ను వాడితే నొప్పులు తగ్గుతాయి. ఈ నొప్పులు తగ్గించుకోకపోతే మొత్తం వ్యాయామం అంటేనే విరక్తి రావచ్చు అది మరీ ప్రమాదం.
మంచి కండిషనర్
కొవ్వు పెంచుతుందని భయపడతా గానీ నెయ్యి చర్మంనిగారింపుకు ,శిరోజాల సమస్యల పరిష్కారంలోనూ ముందుంటుందని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. జుట్టు ఊడటం రాలిపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నెయ్యి శిరోజాల పరిరక్షణకు బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. రెండు టీ స్పూన్లు నెయ్యి ,టీ స్ఫూన్ ఆలీవ్ ఆయిల్ తో కలిపి తలకు రాసి ఓ ఇరవై నిమిషాలు అలా వదిలేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే తలకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది అంటున్నారు.
ఎండలు జాగ్రత్తా
ఈ సీజన్ లోనే ప్రయాణాలు తప్పనిసరి .మండుటెండల్లో ప్రయాణాలు చేసేప్పుడు వీలైనంత వరకు రోడ్ ట్రిప్ లు వద్దు . వాతావరణం సంగతి చూసుకునే పిల్లల్నీ,వృద్ధులు బయలుదేరాలి. పిల్లలుంటే పాక్స్ ల వంటివి ఎంచుకొవాలి. ఎండ వేడిని ఆకర్షించే దుస్తులు అవతలపెట్టాలి. చాలా తేలికైన రంగులు ఎంచుకొని ముందుగా చెవులు,ముక్కు ,నోరు కవరు చేసేవి తోడుక్కొవాలి. ఉదయాన్నే చూడవలసిన ప్రదేశాలు చూసేసి 11 గంటలు దాటకుండా వసతి గృహానికి వచ్చేయటం మేలు. మధ్యాహ్నం ఏ షాపింగ్ మాల్స్ […]
గాఢమైన వాసనలు మాయం
ఫ్రెండ్స్ కి ఏదైన స్పెషల్ గిప్ట్ ఇవ్వాలనుకుంటే అది చాలా ఉపయోగపడేది ,ఆశ్చర్య పరిచేదిలా ఉండాలి అనుకంటే స్టెయిన్ లెన్ స్టీల్ సోప్ ఇవ్వచ్చు . ఇప్పుడు మర్కెట్లో దోరికే ఈ సబ్బుకు ప్రత్యకత ఉంది. చేతులకు అంటిన ఉల్లి,వెల్లుల్లి ,అల్లం వంటి గాఢమైన వాసనలను పోగొట్టేస్తుంది. సందర్భాలు రానే అక్కర్లేదు ప్రేమగా ఇవ్వలంటే ఈ సబ్బు గిప్ట్ గా ఇవ్వచ్చు . ధర కూడా చాలా తక్కవే . అమెజాన్ లో ఆర్డరిస్తే 929 రూపాయలకే […]
డాన్స్ స్టెప్సే ఔషధం
దీర్ఘకాలం బాధించే అనారోగ్యాలకు ఒక అరుదైనా పరిష్కారం కనగొన్నారు శాస్త్రవేత్తలు . ఒక మంచి పాట వింటున్నపుడు యధాలాపంగా కూడా కాళ్ళు చేతులు కదులుతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే మెదడు స్పందిస్తుంది కదా ఇదే పరిష్కారం అంటున్నారు వైద్యులు. పార్నిన్సన్ తో బాధపడుతున్న రోగులపైన దీర్ఘకాలం చేసిన ఈ పరిశోధనలు వాళ్ళతో పాటలకు స్టెప్స్ వేయిస్తే దాన్నీ గుర్తుపెట్టుకున్నారు. ఆ పాటలకు స్పందించారు దాన్నీ జ్ఞాపకంలో నిలుపుకున్నారు. ఇదే కాకుండా షుగర్ ,బీపీ వ్యాధిగ్రస్తులు కూడా ఈ […]
ఎందుకు ఇవి దండగా
టీ.వీలో వచ్చే యాడ్స్ చూస్తూ పిల్లలు ఎనర్జీ డ్రింక్ కోసం అడుగుతూనే ఉంటారు. ముందుగా వాళ్ళకు ఆ బాటిల్ పై రాసి ఉన్న జాగ్రత్తలను చూపించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిన్న పిల్లలకు గర్భిణీలకు మంచివి కావని వాటిపైన చిన్న అక్షరాలతో రాసే ఉంటుంది. వీటిల్లో కేఫిన్ పాళ్ళు చాలా ఎక్కువ .ఎంత ఎక్కువ అంటే ఈ డ్రింక్ ల్లో వాడే ఇన్గ్రారియింట్స్ లో 38.5 mg అని 72 mg అని రాసి ఉంటుంది. వీటి […]
కొప్పు పెట్టేయనా
ఈ వేసవిలో జుట్టు భుజాలపైకి జారుతుంటే విసుగ్గానే ఉంటుంది. ముడి వేసుకుంటే వయసు మీదపడ్డట్టు ఉంటుందేమో నన్న భయం అమ్మాయిల్లో ఉంటుంది. సింపుల్ గా ఫ్యాషన్ గా అనిపించే కొప్పుని అంటి పెట్టుకోనే నాజుకైనా ఆభరణాలు వచ్చాయి. ప్లాస్టిక్ పువ్వుల దండలతో ఆర్టిఫిషియల్ వజ్రాలు వచ్చాయి లేదా హెయిర్ పిన్ కి మల్లెలు గుచ్చి జుట్టుతో అలంకరించినాచాలు. గట్టిగా ముడినిలిచేలా ఉండేందుకు దువ్వెన పళ్ళవంటి క్లిప్స్ వచ్చాయి. ముడి లోపలకి పిన్ గుచ్చిన పైకి అందమైన పిన్ […]
కలిపి వేసుకుంటే తప్పే
ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తగా ఉంటె శరీరం మనకు సహకరిస్తుందంటున్నారు వైద్యులు. సాధారణంగా ఏదైన అనారోగ్యం వస్తే కొన్ని మందులు రాస్తారు వైద్యులు. ఆ మందుల్ని ఎలా వాడమన్నారో అలానే వాడాలి. ఇవి ఉదయం వేసుకుని ఇవి రాత్రిళ్ళు వేసుకునేవి అంటూ నాలుగైదు కలిపేసి ఒకేసారి గొంతులో వేసుకుంటే అనారోగ్యం తగ్గకపోగా ఇతర సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఉదాహరణకు నొప్పి నివారణ మాత్రలు,నిద్రకోసం ఇచ్చేవి కలిపి ఒకేసారి వేసుకుంటే ఆస్పత్రులు చుట్టు తిరగవలిసివస్తుందని చెపుతున్నారు. ఏ టాబ్లెట్ […]
కొవ్వులు అవసరమే
నెయ్యి,కొబ్బరి నూనెలను ప్రతిరోజు భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు వైద్యులు, కొవ్వులు మన శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని ఈ మార్పుతో జీర్ణక్రియ వేగవంతం అవుతుందంటున్నారు. అధిక కోవ్వు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల 24 గంటల్లోనే చిన్న ప్రేవుల్లో బాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని రిపోర్ట్. నిజానికి ఇలాంటి కొవ్వులున్న భోజనం తోనే శరీరం బరువు కూడా తగ్గుతుందని చెపుతున్నారు.
ఆహరమే పరిష్కారం
మోనోపాజ్ దశలో ఆరోగ్యంలో వచ్చే మార్పులను తగ్గించుకోవాలంటే సరైన ఆహారం ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. ఈ దశలో శరీరంలోలో తగ్గే ఈస్ట్రోజన్ హార్మోన్ ను సహజమైన ఆహారం ద్వార పొందవచ్చు. సోయ ఉత్పత్తులు, కాల్షీయం పుష్కలంగా ఉండే పాలు , పాల ఆధారిత పదార్ధాలు, ఆకుకురలు, నట్స్, నూనె గింజలు, చిరు ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, నారింజ వర్ణంలో ఉండే కూరగాయలు , పండ్లు, నిమ్మ,జామ విటమిన్ ఇ దోరికే వంటనూనెలు , నువ్వులు, పల్లీలు, […]
స్ట్రెస్ తగ్గించే డూడుల్ ఆర్ట్
డూడుల్ ఆర్ట్ మానసిక ఆనందానికి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అంటారు వైద్యులు. పెన్సిల్ పట్టుకున్నా చేయి పైకి లేపకుండా అద్భుతమైన పెయింటింగో,బోమ్మనో తీర్చిదిద్దటాన్ని డూడుల్ ఆర్ట్ అంటారు. కళల ద్వారా మానసిక ఆరోగ్యాన్ని తగ్గించే దిశగా ఈ డూడుల్ గురించి కొంత చర్చ జరిగింది. పిల్లలు ఈ బొమ్మలు వేయటం స్వేచ్చగా రంగులు ఉపయోగించటం వాళ్ళకు కళల పైన ఇంట్రస్ట్ కలిగేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ గాడమైన రంగులతో వేయగలిగే డూడుల్ ఆర్ట్ కోసం ఆన్ […]
ప్యాకేజింగ్ తో ప్రమాదం
ప్యాకెట్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్యాలు అని ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ప్యాకెజింగ్ కు వాడే పదార్ధాల కారణంగా పోషకాలు వంటబట్టకుండా పోతున్నాయని బర్మింగ్ హాట్ మన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇంకో కొత్త విషయాన్ని చెపుతున్నారు. ప్యాకెట్ల లైనింగ్ లో జంక్ ఆక్సైడ్ వాడతారు. బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ద్వారా ఆహారం పాడవకుండా ఈ జంక్ ఆక్సైడ్ అడ్డుకుంటుంది. అయితే ఇది నానో స్థాయి ఆహారంలో చేరుతుందని ఈ కారణంగా పేగుల్లో కణాలు సక్రమంగా పని […]
నాన బెడితే మంచిది
ఆల్మండ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమెగా, ఒమెగా 6, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షీయం, మెగ్నీషియం, జింక్ లు సహజంగానే శరీరానికి మేలు చేస్తాయి. బాదం నూనె శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతకాదు. బాదం పప్పులు శరీరానికి వేడిని, శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియకు సాయం చేస్తాయి. పోషకాహారనిపుణులు వేసవిలో బాదం పప్పును నానబెట్టి తినమంటున్నారు. అవి తెలిగ్గా జీర్ణం అవుతాయి. పై పొట్టు తీయకుండా నానిన బాదం పప్పు తింటే అందులో విటమిన్ […]
వంటింటి గమ్మత్తు
వంటిల్లే చిన్నపాటి ఔషదాలకు నిలయం. చిన్ని చిన్ని అనారోగ్యాలకు వంటింట్లోనే మందులు దొరుకుతాయి. చిన్న అల్లం ముక్క వేడి చేసి ఉప్పు అద్ది పరగడుపునే నమలాలి. ఇలా తింటే జీర్ణకోశ సంబంధిత అనారోగ్యాలు రావు. గొంతు ఇన్ ఫెక్షన్లు రావు, నిమ్మ రసంలో ఉప్పు కలిపి అల్లం ముక్కలు నానాబెట్టి ఒక వారం బాగా ఉంచాక ఎండబెట్టి వాటిని నిల్వచేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటో రెండో ముక్కలు చప్పరిస్తే జీర్ణక్రియ ఇబ్బందులు పోతాయి. అలగే కరివేపాకు రసం డయాబెటీస్ […]
అన్ని సర్ధుకోండి
సెలవుల్లో తప్పనిసరిగా పిల్లలతో ప్రయాణం పెట్టుకుంటారు. సరిగా ప్లాన్ చేసుకుని ముందే లిస్ట్ ప్రకారం అన్ని సర్దుకుంటే పిల్లలతో ప్రయాణాలు చాలా సరదా ఇస్తాయి. టూర్ ప్లాన్ లో పిల్లలు ఎంజాయ్ చేసే ప్లే జోన్స్, ఫుడ్ జోన్స్ ముందుగానే వెతికి పెట్టుకోవాలి. చారిత్రక ప్రదేశాలు థీమ్ పార్క్ లకు వెళితే ముందే పిల్లలకు వాటి గురించి చెప్పి వాళ్ళు ఏమి చూడబోతున్నారో ప్రిపేర్ చేస్తే వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం కావలిసినన్ని స్నాక్స్ ముందే రెడీ […]
ఇడ్లీ,దోసెలే బెస్ట్
ఢిల్లీలో జరిగిన ఒక ఫుడ్ వర్క్ షాప్ లో మనం తినే ఆహారంలోని రిఫైన్డ్ ,ఫ్రాసెస్డ్ పదార్థాలు కడుపులో ఉండే బాక్టీరియాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. చక్కని జీర్ణవ్యవస్థకి,వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకొనేందుకు మంచి బ్యాక్టీరియా అవసరం . ఈ బ్యాక్టీరియాను రక్షించుకోవటం కోసం పూర్తి స్థాయి పోషకాహారంతో పాటు డైట్ లో పులియబెట్టిన పదార్థాలను భాగం చేసుకోమన్నారు. మంచి బ్యాక్టీరియా కడుపులో ఉండాలంటే ఇడ్లీ,దోసె, ఊతప్ప వంటివి అల్పాహారాల్లో తప్పని సరిగా ఉండాలి.
ఏవి మంచివి
తాజా పండ్లు తినాలా ? డ్రై ఫ్రూట్స్ మంచివా? ఈ సందేహాం చాలా మందికి ఉంటుంది. తాజా ఎండు పండ్లు రెండెంటిలోనూ పీచు, పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు విటమిన్లు ఉంటాయి. అయితే ప్రాసెస్ సమయంలో ఎండు పండ్లలో కొంత విటమిన్ సి పోతుంది. అలాగే నీటి శాతం 80 వరకు తగ్గిపోతుంది. ఎండు పండులో క్యాలరీలు చక్కెర స్థాయిలు ఎక్కువే ఉంటాయి. పీచు ఎక్కువే . గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని […]
