Wednesday, 22 Jul, 2026

బ్రేక్స్ తప్పని సరి

ఒకే పని సాయంత్రం వరకు చేసేసి పూర్తి చేయాలనుకోవటం చాలా పొరపాటు .పనుల నడుమ బ్రేక్ రావాలి అప్పుడే హుషార్ వస్తుంది. పని మీద శ్రద్ధ కూడా వస్తుంది అంటున్నారు. డెస్క్ ముందు అయినా ఇంట్లో ఏ పనులైనా సరే పని మధ్యలో స్ట్రెచింగ్ ఎక్స్ ర్ సైజ్ చేయాలి. చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేయాలి నుదురు ,మెదడు పైన మెల్లగా ,తేలిగ్గా మాసాజ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఏదైనా సంగీతం ,ఫాస్ట్ బీట్ లేదా నెమ్మదిగా […]

అందం, ఆరోగ్యం

తాగితే దాహాం తీరటమే కాదు బయట ఎండలోంచి ఇంట్లోకి వచ్చాక కొబ్బరి నీళ్ళతో మొహాం కడుక్కొంటే ఎండకి నల్లగా మారిన చర్మం తాజాగా అయిపోతుంది అంటున్నారు డాక్టర్లు. సహాజ సిద్ధంగా దొరికే కొబ్బరి నీళ్ళతో డీ హైడ్రేషన్ సమస్య ఉండదంటున్నారు. సహాజంగా దొరికే పండ్లతో జ్యూస్ తీసిన వాటిపైన క్రిమిసంహారక మందు పోయేవరకు ఉప్పు నీటిలో రెండు సార్లు నాన బెట్టి కడగాలంటున్నారు. పూదినా ఆకులు ,తేనే నిమ్మరసం కాని ,నారింజ కమలాల రసం పంచదారా ,తెనే […]

పాపాయి స్నానానికి

చిన్ని పాపాయికి నీళ్ళు పోయటం ఇవ్వాళ్టి తరం అమ్మాయిలకు కష్టమే. పెద్దవాళ్ళు కాళ్ళపైన పడుకోబెట్టుకొని పిల్లలకు స్నానం చేయించినట్లు అస్సలు చేతకాదు. వాళ్ళకోసం ప్రత్యేకంగా వచ్చాయి బ్లూమింగ్ బాత్ లోటస్ లు .పాపాయిని మెత్తగా ఇందులో పడుకొబెట్టి స్నానం చేయించ వచ్చు .లోటస్ ఫ్లవర్ ఆకారంలో మెత్తని పరుపు లాంటి ఈ బ్లూమ్ బాత్ పాడ్ లు పాపాయికి సౌకర్యంగా పడుకొనేందుకు వీలుగా ఉంటాయి. నీళ్ళు పోశాకా ఈ పరుపుల్నీ పిండి ఆరేయవచ్చు . తోందరగా తేలికగా చిన్న […]

షుగర్ ఫ్రీ అబద్దం

షుగర్ ఫ్రీ తినుబండారాలు ,డ్రింక్ లు చాలానే వస్తున్నాయి. అతి తియ్యని లడ్లు ,మైసూర్ పాక్ లు కూడా షుగర్ ఫ్రీతో అంటే కృత్రిమ తీపి ని ఉపయోగించి చేశామని చెపుతూ ఉంటాయి . మార్కెట్ లో పుష్కలంగా దోరుకుతున్నాయి కూడా ఇది తప్పంటున్నాయి పరిశోధనలు .అధిక బరువు ఉన్నావారు ,డయాబెటిక్ పెషెంట్లు మామాలు పంచదారా తింటే ఎంత అపాయమో అ షుగర్ ఫ్రీ పదార్ధాలు ,టాబ్లేట్స్ తీసుకొన్న అంతే ప్రమాదం అని నూతన పరిశోధనలు చెపుతున్నాయి. […]

పౌడర్లతో ప్రమాదం

పరిశోధనలు ఎప్పుడు సహాజమైన ఉత్పత్తులకే పెద్దపీట వేస్తాయి. వర్కవుట్స్ చేసే వారు కండలు పెంచేవారు ,శక్తి కోసం వాడే ప్రోటీన్ పౌడర్లు ,సహాజ పదార్థాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చాలా పౌడర్లలో హాని కారకమైన భారలోహాలు ఉంటాయని ,వాటిని అలాగే వాడితే మంచి చేయకపోగ దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు . ఈ ప్రోటీన్ పౌడర్స్ లో భారలోహాలతో పాటు 130 రకాల రసాయనాలు కూడా ఉంటాయన్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు . ఈ పౌడర్ల […]

కోటింగ్ పోతుంది

ఇప్పుడు ఇళ్ళలో ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలే వాడుతున్నారు. దుస్తులు పట్ల ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటామో ఈ పాత్రల విషయంలో కూడా అలాగే ఉండాలి. వాటిని నాజుగ్గా హాండిల్ చేయాలి.నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలు బాగా వేడిగా ఉన్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలాచేస్తే కోటింగ్ పోతుంది. బాగా ఆరిపోయాక నీరు పోసినానబెట్టి అప్పుడు క్లీన్ చేయాలి.లిక్విడ్  డిష్ వాష్ లేదా  సాప్ట్ నైలాన్ స్పాంజ్ తో క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ ప్యాడ్ ,మెటల్ […]

లిఫ్ట్ చేయటం కష్టం

ఒకసారి శరీరం బరువు పెరిగితే స్తనాలు కూడా అలాగే పెరుగుతాయి. డైట్లు ,వ్యాయామాలతో బరువు తగ్గితే స్తనాలు జారి పోతాయి. ఆరవై ఏళ్ళ వయసైనా ఇదే అనుభవం .అలాగే వర్కింగ్ అవుట్స్ చేసినప్పుడు సపోర్టింగ్ బ్రా ధరించకపోయినా ఇదే సమస్య . మంచి సపోర్టు బ్రాలు అన్నీ సమయాల్లో ధరించాలి. జిమ్ లో ప్రత్యేక ట్రైనర్ సలహాతో అవసరమైన వ్యాయామాలు చేయాలి.ఒక సారి స్తనాలు జారిపోతే లిప్ట్  చేయటం సులభమైన పని కాదు. కాస్మోటిక్ ఇంప్లాంట్స్ ఒక్కటే […]

తీరుగా ఉండచ్చు

గర్భవతులుగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవటం వల్ల చాలా నష్టం అంటున్నారు డాక్టర్లు. చక్కగా డాక్టర్స్ సూచించిన ఎక్స్ ర్ సైజులు చేయవచ్చు . వాకింగ్ చాలా మంచి వ్యాయామం . తేలిక పాటి యోగా ఇన్ స్ట్రక్టర్ గైడైన్స్ తో చేయవచ్చు. అలాగే భార్యభర్తలు కలిసి చేసే విధంగా కొన్ని వ్యాయామాలు సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్ .అలాగే తేలికపాటి వ్యాయామాలతో పాటు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు చాలా ఆవసరం .గర్భం దాల్చాక పెద్ద […]

అపరిచితులతో జాగ్రత్తా

తల్లులు జాబ్ చేస్తే ,స్కూల్ వదిలాకా పిల్లలు వాళ్ళ కంటే ముందే ఇంటికి వచ్చేస్తారు. వంటరిగా తల్లులు వచ్చే వరకు గడపుతారు ఇలాంటి పరిస్థితికి వాళ్ళను ముందే అలవాటు చేయాలి. కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ నెంబర్లు వారి వద్ద ఉండాలి. అలాగే కొన్నీ హెల్స్ లైన్ నెంబర్స్ కూడా అవసరం అయితే వెంటనే కాంటాక్ట్ చేసే విధంగా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. తెలియని వారి పట్ల అలర్ట్ గా ఎలా ఉండాలో నేర్పాలి. తెలిసిన,తెలియని వాళ్ల మధ్య […]

వాసన వదలదు

ఉల్లిపాయలు బావుంటాయి కొన్నీ సలాడ్స్ కి చాలా రుచి ఇస్తాయి. కానీ తిన్నాక వాటి వాసన నోటిని వదలదు .ఉల్లి పాయల్లో సల్ఫర్ గల ఉప ఉత్పత్తులో ఉంటాయి. సల్ఫర్ వాసన ఊపిరితిత్తుల వరుకు వెళుతుంది అందుకే వాసన పోదు .కొత్తి మీర ,సోంపు వక్క వంటివి నమలడం కొంత వరకు ఉపకరిస్తుంది. ఇవి చప్పరించటం వల్ల నోటి లోని లాలా జలం స్టిమ్యూలేట్ అవుతుంది. లాలాజలం అంటే నోటిలో ఉండే డిటార్జంట్, దానిలో సహాజసిద్ధమైన బై […]

సోడియం ఎక్కువే

ఈ మధ్య ప్రచారసరుకుల్లో సూప్స్ పాకెట్స్ చోటుచేసుకుంటూ ఉన్నాయి. రెడీమెడ్ సూప్స్ తయారీ ఈజీ. ఈ సూప్స్ లు కాస్ట్ ,వ్యాక్యూమ్ రకాలున్నాయి. టోమోటో ,చికెన్ ,న్యూడిల్స్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాల కంటే ప్రత్యేకమైనవి ఎంచుకొవచ్చు.  రెగ్యులర్ సూప్స్ లో అధిక సోడియం ఉంటుంది. బౌన్ సూప్ లో పీచు ఎక్కువ మిగతా వెజిటెబుల్ సూప్స్ మాదిరిగా కాకుండా బౌన్స్ క్యాచింగ్ ప్రకియలు రుచి టెక్టర్ పోగోట్టతాయి . అలాగే నూడిల్స్ సూప్ లు కూడా పూర్తి […]

గాజువే వాడండి

ప్లాస్టిట్ పాల సీసాలు నిజంగా చూసేందుకు చాలా బావుంటాయి పిల్లలకు బరువు లేకుండా అమరిపోతాయి కూడా .కానీ పరిశోధనలు మాత్రం పాలసీసాల్లో మాత్రం బిపిఎస్ అంటే బిస్ ఫినాల్ అనే పదార్థం పాల ద్వారా పిల్లల శారీరాల్లో జొరబడి తీవ్ర ప్రభావం చూపెడుతోంది అంటున్నారు .పిల్లలకు తల్లి పాలు చాలక పాలు పట్టవలసి వస్తే గాజు లేదా స్టీల్ సీసాలు వాడుకొమ్మని చెపుతున్నారు ప్లాస్టిక్ సీసాల వల్ల కలిగే నష్టం అప్పటికప్పుడు చూపేట్టకపోయినా భవిష్యత్త్ లో వారు […]

చల్లదనం ఇచ్చే ముంజలు

మామిడి పండ్లతో పాటు వేసవిలో మాత్రమే దోరుకుతాయి తాటిముంజలు . ఈ చిన్న ముంజల్లో తియ్యని నీరుంటుంది. దాహాం తీర్చీ శరీరానికి చల్లదనం అందించే తాటిముంజల్లో విటమిన్ బి, ఐరన్ ,కాల్షియం ఉంటాయి. ముఖానికి తాటిముంజల గుజ్జు ప్యాక్ లాగా చేసి ఐదు నిమిషాలు ఆగి కడిగేస్తే మొహాం మెరుపుతో ఉంటుంది. నీటిశాతం అధికం. తేలికగా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. జీర్ణక్రియలో మెరుగుపరుస్తాయి ఈ తాటి ముంజలు వడదెబ్బ తగలనివ్వవు. తాటి ముంజల గుజ్జు కాలిన గాయాలకు […]

వేసవికి మంచి ఎంపిక

ఎలాంటి వేడుకలో అయినా ఆడంబరంగా కనిపించాలి అంటే లెహాంగానే సరైన ఎంపిక. ఈ కాలంలో తేలికగా ఉండేలా షఫాన్ జార్జెంట్ ఆర్గాంజా వంటి వస్త్రశ్రేణి ఎంచుకొని వీటిని లేయర్లుగా కుట్టించుకొని అసౌకర్యం లేకుండా ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. దుపట్టాని లెహాంగాతో కలిపి కుట్టిస్తే ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. చక్కని ప్రింటున్న వస్త్రాలు ఎంచుకొని సాదాబ్లౌజ్ వేసుకొంటే ఎంత బావుంటుంది. అలాగే లేయర్లు ఒకే పోడవుగా కాకుండా కొన్నీ పోడుగ్గా కొన్ని పొట్టిగా తేలికగా ఉండే మత్ […]

నూనెతో వండాలి

కూరల్లో నూనె తక్కువగా వేసి తినటం ఇవ్వాళ్టి ఆరోగ్యవంతమైన పద్ధతి. వేపుళ్ళు పూర్తిగా వద్ధనే అంటాం కదా .కానీ అమెరికన్ జర్నల్ క్లినికల్  న్యూట్రీషన్ లో కూరల్లో నూనె ఎక్కువ? తక్కువ అన్నా పరిశోధనలో భాగంగా చేసిన రిసెర్చ్ ఫలితాల్లో కూరగాయాలు నూనె ఎక్కువ వేసి వండితేనే మంచిదంటున్నారు . కూరల్లో నూనె ఎక్కువగా వేనస్తేనే వాటిల్లోని పోషకాలు ఎక్కువగా శరీరం గ్రహిస్తుంది అంటున్నారు. నూనె ఎక్కువగా వేసిన పదార్థాలు తిన్న తర్వాత రక్తంటో విటమిన్ లు […]

తియ్యనివి తినాలి

డయాబెటిస్ అయినా స్వీట్లు తినవచ్చు అంటున్నారు న్యూట్రిషనిష్టులు .అసలు ఏ ఆహారన్నాయినా మరీ ఎక్కువగా ,మరీ తక్కువగా కాకుండా ఒక కొలమానం మేరకు తీసుకోవచ్చు . ప్రతి ఆహారం గ్లూకోజ్ కొంత అందిస్తుంది. పండ్లతో తీయదనంతో పాటు పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ చేకుర్చే పోషకాలు ఉంటాయి. బెల్లంలో కాల్షియం ,ఐరన్ పోటాషియం ఉంటాయి. తేనేలో రెండు మూడు రకాల షుగర్స్ ఉంటాయి. కనుక ఏదైనా తినాలి కానీ చాలా మితంగా తినే ఆహారంలో ఏ కాలరీలు ,షుగర్ […]

గాజుల సోయగం

కొన్నీ సంప్రదాయ సందర్భాల్లో పట్టు చీరెలు ,నగలు పూల జడలతో పాటు మట్టి గాజులు కూడా ప్రత్యేక శోభ ఇస్తాయి. ఎరుపు బంగారం ,ఆకుపచ్చ గాజులు కలిపి వేసుకోవటం కూడా శభ సూచకంగా భావిస్తారు. ఈ మట్టి గాజులు సాదాసీదా రంగులేకాదు ,కుందన్లు,రంగురాళ్ళు అద్దుకొని డిజైనర్ గాజులుగా వచ్చేస్తున్నాయి. రకరకాల చెక్కళ్ళతో సప్త వర్ణాల కలగలిపిన గాజులు ఫ్యాషన్ ,అదృష్టానికి గుర్తుగా కూడా ఉంటున్నాయి. లక్క,ప్లాస్టిక్ గాజులు కూడా పూసలు ,రంగురాళ్ళు ,కుందన్ లు కలుపుకొని ప్యాషన్ […]

నొప్పి తగ్గుతుంది

జర్మనీకి చెందిన ఛారీటీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు లూనా అనే ఒక యాప్ ని సృస్టించారు. చైనా సంప్రదాయ వైద్యంలోని ఆణ్య ప్రెషర్ ద్వారా మహిళల్లో వల్డ్ నెలసరి నొప్పిని తగ్గించవచ్చు అంటున్నారు . సూదులతో కాకుండా ,వేళ్ళతో చేత్తో నొక్కుతూ శరీరంలో కొన్ని భాగాలపైన ప్రెషర్ కల్పిస్తే నెలసరి నొప్పి తగ్గుతుందని ఈ యాప్ లో ఆ విధానాన్ని వివరంగా చూపించారట. ఒక్కసారి ఫోన్ లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని చూస్తే […]

అతిగా చేస్తే

ఇల్లు నీటిగా సినిమా సెట్టింగులాగా అద్భుతంగా ఉండాలని అందరు కోరుకుంటారు. ఏదో ఒక క్లీనింగ్ ఎయిడ్ తో ఇరవై నాలుగు గంటలు ఇంటి శుభ్రతలో మునిగి తేలతారు ,కానీ అతి శుభ్రత వల్ల కూడా నష్టమే అంటారు ఎక్స్ పర్ట్స్. మచ్చల్ని ,మురికిని తొలగించగల యాసిడ్స్ ప్రధానంగా ఉండే ద్రావాణాలు ,డిటర్జెంట్స్, ఇతర క్లీనింగ్ ద్రావకాల్లో ఉండే గాఢత ,వాటి ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది అంటున్నారు . క్లీనింగ్ ఎయిర్స్ తో ముందుగా గుండెకు ,ఊపిరితిత్తులకు సంబంధించిన […]

పాపాయికి ఒత్తిడే

గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఆమె పైన అపరిమితమైన శ్రద్ద చూపించాలి అంటున్నారు డాక్టర్లు. గర్భిణిగా స్త్రీల మానసిక ఆందోళన పుట్టే బిడ్డల పై తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఎలాంటి ఆందోళన ఒత్తిడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఆమె ప్రసవం జరగాలంటున్నారు. కడుపులో ఉన్నప్పుడే ఆందోళనకు గురైతే పిల్లల ప్రవర్తనలో తేడాలోస్తాయి. పుట్టిన మూడేళ్ళకే ఈ విషయం గమనించవచ్చంటున్నారు. చదువులో వెనకబడటం ప్రవర్తనతో విసిగించటం ప్రతిదానికి పెద్దవాళ్ళతో ఉద్రేకపడటం వంటి లక్షణాలను పిల్లలలో గమనించవచ్చు అంటున్నారు డాక్టర్లు. పిల్లల […]