Saturday, 25 Jul, 2026

పూల కళ పుల్కారీ

పంజాబ్ లో జరిగే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో మహిళలు పుల్కారీ ఎంబ్రాయిడరీ దుస్తులు ధరిస్తారు.ఇది పూర్తిగా గృహ సంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్ పైన రంగు రంగుల సిల్క్ కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితం లోని జామెట్రీ లను పోలి ఉంటాయి ఈ డిజైన్లు. సంప్రదాయంగా నీలం, ఎరుపు, నలుపు, నారింజ, ఆకుపచ్చ రంగులను ఈ ఎంబ్రాయిడరీ లో వాడుతారు.  జంతువులు, పక్షులు,పూలు, నెమల్లు, స్త్రీల భావోద్వేగాలను అద్దం పడుతున్నట్లు ఉంటాయి. ఈ పుల్కా […]

చరిత్ర సృష్టించారు

బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి తమిళ సంతతి మహిళ గా చరిత్ర సృష్టించారు ఉమా కుమారన్. 36 సంవత్సరాల ఉమా పుట్టింది పెరిగింది లండన్ నగరంలో. శ్రీలంక లోని అంతర్యుద్ధం కారణంగా 42 ఏళ్ల క్రితం బ్రిటన్ కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. పబ్లిక్ పాలసీ లో మాస్టర్ చేసిన ఉమా నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొఫెషనల్ లో పనిచేశారు తర్వాత లేబర్ పార్టీలో చేరారు. పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్ గా పలు […]

ఆ హక్కు మహిళలదే

కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే జగన్నాధ రథయాత్ర ప్రపంచంలోనే పెద్ద వేడుక 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సుభద్ర దేవి రథాన్ని మహిళలే లాగుతారు.మూడు రోజులు సాగే ఈ రథయాత్రలో ఒకరోజు రథాన్ని 1975 నుంచి మహిళలే లాగే సంప్రదాయం అమల్లోకి వచ్చింది. తొలి రోజుల్లో శాస్త్రానికి 10 మంది మహిళలు చేత్తో ఈ తాడు పట్టుకుంటే మిగతా పురుషులే నిర్వహించేవారు.రాను రాను స్త్రీలే ఈ సాంప్రదాయాన్ని చేజిక్కించుకున్నారు.ప్రస్తుతం పూరి రథయాత్ర లో రెండవ […]

కళలకు ప్రోత్సాహం

ఇషా అంబానీ పిరామల్ ప్రారంభించిన ఆర్ట్ హౌస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాకారుల చిత్రాలు కొలువై ఉంటాయి. మహిళ కళాకారులు భారతీ ఖేర్, రితిక మర్చంట్, రాణా బేగమ్ వంటి వారి చిత్రాలు సేకరించి పెట్టారు ఇషా అమెరికాలోని  యేల్ యూనివర్సిటీ లో ఎం బి ఎ చదువుకున్న ఇషా తండ్రి వ్యాపార భాగస్వామి. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశీయ కళాకారుల ను ప్రోత్సహిస్తుంది ఇషా. అలాగే పేద మహిళల సాధికారత చిన్నారుల విద్య కోసం […]

అంధుల కోసం కొత్త చూపు

అక్షితా సచ్‌దేవ్ రూపొందించిన కీబో పరికరం అంధులకు కొత్త చూపు వంటిది. బెంగళూరు కేంద్రంగా ఆమె ప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ టెస్టిల్ లాబ్స్ అందులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లాబ్స్ నుంచి తయారై వచ్చిన కీబో తో పుస్తకంలో పాఠాన్ని చదువుకోవచ్చు. 60 భాషల్లో ఏ భాషలోనైనా అనువాదం అడగవచ్చు. అంధులకు ఉపయోగించే దిశగా ఆసియా ఆఫ్రికాల్లో మా సంస్థను విస్తరిస్తాం. కీబో కు మరిన్ని భాషలు జోడిస్తాం. ఏఐ సాంకేతిక […]

సొంతంగా సెంట్ తయారీ

పర్సనలైజ్ పెర్ఫ్యూమ్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు విదుషి విజయవర్గియా లాబ్స్ ఇన్ ఎ బాక్స్ పేరుతో ఆమె తనకు నచ్చిన కిట్ సాయంతో ఇంట్లోనే 20 రకాల సెంట్లు తయారు చేసుకోవచ్చు ఆ కిట్ లో ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ వాసనలు డైల్యూషన్ మెటీరియిళ్ళు వంటి 12 రకాల తయారీ పదార్థాలు ల్యాబ్ కోట్స్, ఫార్ములా షీట్స్ ఉంటాయి. సెంట్ ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా సూచనలు ఉంటాయి. అరోమాథెరపీ కోర్సు చేసిన విదుషి పెర్ఫ్యూమ్స్ వ్యాపారం […]

తొలి విశ్లేషకురాలు

దేశంలో తొలి మహిళ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ వీడియో విశ్లేషకురాలు ఎం.అంజిత. స్కూల్ రోజుల నుంచే ఫుట్ బాల్ శిక్షణ తీసుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నది. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ స్కాట్స్ అసోసియేషన్ (పి.ఎఫ్ ఎస్.ఎ)  నుంచి కోర్స్ చేసి అనాలసిస్ వైపు వచ్చింది అంజిత. గోకులం లోని మహిళ జట్టుకు విశ్లేషకురాలిగా సూచనలు ఇస్తోంది.కోచ్ కావటం నా లక్ష్యం అని చెప్పే అంజిత మహిళలను మైదానంలోకి నడిపించటం వైపే దృష్టి పెడతాను అంటుంది.

పనికిరానివే ఫ్యాషన్

అషితా సింఘాల్ ఫ్యాషన్ డిజైనింగ్ లో పిజీ చేసింది. ఢిల్లీకి చెందిన ఆషిత కు పర్యావరణం పైన ఎంతో ప్రేమ. అమెరికాలోని  లారెట్ నేషనల్ యూనివర్సిటీ నెట్ వర్క్ నిర్వహించే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్న అషితా డిజైనర్లు  నేత వాడి పడేసే వస్తా వద్దా లో నేతకారులు వాడి పడేసే వస్త్ర వృధా తో ప్యాచ్ వర్క్ చేసిన దుస్తులు రూపొందించి ప్రదర్శించింది.ఆ పోటీ లో 20 లక్షల నగదు గెలుచుకుంది. 2018 లో పైవాండ్ స్టూడియో […]

చక్కని అవకాశం

స్పోర్ట్స్ జర్నలిస్ట్ గీతికా తాలూకాదర్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ గుర్తింపు దక్కించుకొని ఒలంపిక్ గేమ్స్ ను కవర్ చేసేందుకు అధికారిక అక్రిడిటేషన్ కార్డ్ అందుకున్నది. అస్సాంలోని నల్బరీ కి చెందిన గీతిక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. నేషనల్ గేమ్స్ 2007 కామన్ వెల్త్ గేమ్స్ 2010 ఐ పి ఎల్ సిరీస్ విమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2023,2018 నాటి ఫిఫా వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ను కవర్ చేసింది. ఐ ఓ […]

ఆయన ఒక పురాతన వృక్షం

కల్కి సినిమా కు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావు.హైదరాబాద్ నిఫ్ట్ లో న్యూయార్క్ లో చదువుకున్న అర్చన కు ఆమె పేరుతో సొంత బ్రాండ్ ఉంది. దుస్తులే కాదు, ప్రోడక్ట్ డిజైనర్ కూడా. మహానటి చిత్రం కోసం 1940,1980 నాటి ఫ్యాషన్ దుస్తులు తయారు చేసి జాతీయ అవార్డ్ తీసుకొన్నది. కల్కి సినిమా కోసం మూడు రకాల ప్రపంచాలకు సరిపోయే దుస్తులు తయారు చేసింది అర్చన. మహాభారత కాలం నాటి అశ్వద్ధామ వేషంలో ఉన్న అమితాబ్ […]

ఆరు రోజుల పాటు పరుగు

భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్ మీనల్ కోటాక్.ఈ మధ్యకాలంలో 680 పైగా కిలోమీటర్ల పరుగును ఆరు రోజుల్లో అంటే 144 రోజుల్లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది మీనల్. 2017 లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది మీనల్. 2018లో ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న రామె.ఏడాది క్రితం అమెరికా లో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగు తీసింది. ప్రణాళిక బద్ధంగా ఆహారం తీసుకోవడం నిద్రపోవటం వంటివి […]

అవి కన్నీటి కథలు

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రయాణం మొదలుపెట్టిన నాంకీ సింగ్ దృష్టి కోణం యాసిడ్ అటాక్ సర్వైవర్ ల జీవితాలను పూర్తిగా మారింది. ఢిల్లీకి చెందిన నాంకీ యాసిడ్ బాధితుల కష్టాలు ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది. జర్నీ టు ది మిర్రర్ పేరుతో వారి జీవితాలపై డాక్యుమెంటరీ చేసింది. ఆమె తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో యాసిడ్ బాధితులు పడే ఆవేదనను ప్రపంచం కళ్ళనీళ్ళ తో చూపింది. వారికి వైద్య ఆర్థిక సహాయాలు అందజేయడం కోసం […]

జీవితం ఇచ్చిన వరం

ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో భర్త పోషణ కోసం ఇళ్లలో పనిమనిషి గా పని చేసి దీపికా మహత్రే స్టాండప్ కమెడియన్ గా ఎదిగిన తీరు అద్భుతం ముంబై లోకల్ బ్రెయిన్  లో ఇమిటేషన్ జ్యువెలరీ అమ్ముతూ నవ్వుతూ నవ్వించే దీపికా గురించి ఒక రిపోర్టర్ పత్రికలో రాశారు. దాన్ని చదివి హాస్య నటుడు అదితి మిట్టల్ ఆమెను  ప్రోత్సహించారు. ఆమె హాస్య కచేరీలు వెబ్ సిరీస్ చేయడం వెనుక ఎంతో శ్రమ పట్టుదల ఉంది . స్మైల్ […]

సంప్రదాయ బగ్రు చీరలు  

హ్యాండ్ ప్రింటెడ్ బగ్రు కాటన్ చీరలు ములాలు రాజస్థాన్ లో ఉన్నాయి. ఈ సంప్రదాయ రాజస్థానీ చీర ఎన్నో తరాలుగా మహిళలు ఇష్టంగా ధరిస్తున్నారు.సహజసిద్దమైన రంగులు అద్దే ఈ బగ్రు ఆర్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు.వేసవికే పరిమితం కాక అన్ని కాలాల్లో కట్టుకునేందుకు వీలుగా ఉండే ఈ బగ్రు చీరలు తేలిక రంగులు సన్నటి బార్డర్ లతో ఉంటాయి.నీడపట్టున ఆరేసి ఇస్త్రీ చేస్తే ఎంతోకాలం మన్నికగా ఉంటాయి.

ఫోర్బ్స్ జాబితా కబిత

ఫోర్బ్స్ క్రియేటర్ జాబితాలో స్థానం సంపాదించింది కబిత సింగ్. పది నిమిషాల్లో సాంప్రదాయ వంటలను క్షణాల్లో స్ట్రీట్ ఛాట్స్ ని వండగల కబిత స్వస్థలం పూణే. 2014లో కబితాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తక్కువ వ్యవధి లో  చేసే వంటల తో పాపులర్ అయిన కబిత ను 1. 39 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టా లో ఆమెకు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈ ఏడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్రియేటర్ అవార్డ్ […]

వినికిడి తో ఆడేస్తోంది

గాలిలో వస్తున్న బంతి వేగాన్ని నేలపై అది కదిలే శబ్దాన్ని అంచనా వేస్తూ సులభంగా ఫుట్ బాల్ ఆడేయగలదు 26 సంవత్సరాల నిర్మా మనుభాయ్‌ ఠాకర్దా. పుట్టుకతోనే అంధురాలు మనుభాయ్‌. గుజరాత్ సబర్‌కాంత జిల్లా లోని రెహదా గ్రామ లో పేద కుటుంబంలో పుట్టిన మనుభాయ్‌ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అన్న సేవా సంస్థ సహకారంతో చదువుకుంది. కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్ చేసింది. ది ఇంటర్ నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్ […]

ఫ్యాషన్ స్టయిలిస్ట్ ఆలియా

ఫ్యాషన్ స్టయిలిస్ట్ అలియా అల్ రుఫాయ్.ముంబై లో ఎం బి ఎ  చేసిన ఆలియా మధుర్ బండార్కర్ తీస్తున్న ఫ్యాషన్స్ సినిమా స్టయిలిస్ట్ గా ఉన్నా రీటా ధోడి కి అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టింది. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా లతో పనిచేసిన అనుభవం తో ఆమె ప్రయాణం ముందుకు సాగింది. అనుష్క శర్మ కు పర్సనల్ స్టయిలిస్ట్ గా పని చేస్తుంది. ఎన్నో ఫ్యాషన్ షోలకు పనిచేస్తుంది. సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ పైన […]

నిద్ర సలహాదారు మోనిక

హరియాణాకు చెందిన డాక్టర్ మోనికా శర్మ స్లీప్ అడ్వైజర్ బిహేవియర్ స్లీప్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. క్రీడాకారులకు నిద్రపోయేందుకు కావలసిన సలహాలు ఇస్తారు.నిద్ర గురించిన అవగాహన కోసం స్లీప్ 4 హర్ అనే ప్రోగ్రాం నిర్వహించారు. కార్పొరేట్ సంస్థల కోసం స్లీప్ స్ట్రాటజీ లు రూపొందిస్తారు మోనికా శర్మ. ఒలంపిక్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్లీపింగ్ పాడ్ లు, కిట్ లు తయారు చేసి ఇస్తున్నారామె ప్రభుత్వం నియమించిన స్లీప్ అడ్వైజర్ మోనికా శర్మ.

కృత్రిమ కాళ్ళ తో యోగా శిక్షణ

హైదరాబాద్ కు చెందిన అర్పిత రాయ్ కుత్రిమ కాళ్ళతోనే యోగా శిక్షణ ఇస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని బరాక్‌పూర్ కు చెందిన అర్పితా ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ గా రాణించాలనుకునే  అర్పిత జరిగిన ప్రమాదంలో ఆ ఆశ నిరాశ కాగా కనీసం తను ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కోరిక తో యోగా సాధన మొదలు పెట్టింది. ఉపాధ్యాయ కోర్సులు చేశాక యోగ టీచర్ గా హైదరాబాద్ లో స్థిరపడింది ఓ కార్పొరేట్ కంపెనీలో […]

సాయంత్రం బెస్ట్

మధుమేహం ఉంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటారు. ఆ వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది అన్న సందేహం క్లియర్ చేశారు శాస్త్రవేత్తలు. సాయంత్రం వేళ షుగర్ ఉన్నవాళ్లు వ్యాయామం చేయాలి. ఎన్నో ఏళ్లు పరిశోదించాక ఉదయం కన్నా సాయంత్రం  వ్యాయామం చేసే వాళ్ళలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు తేలింది. అలా సాయంత్రం వ్యాయామం చేస్తే తర్వాత రోజు కూడా గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చెబుతున్నాయి.